సాలెగూడు స్ఫూర్తితో..

Spider web inspired implantable "string" could control diabetes - Sakshi

టైప్‌–1 మధుమేహానికి చికిత్సను ఆవిష్కరించారు చైనా శాస్త్రవేత్తలు. సాలెగూడు స్ఫూర్తిగా తయారుచేసిన ఓ పోగులో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే ఐస్‌లెట్‌ కణాలు వేలకువేలు ఉంచి.. శరీరంలో అమర్చడం ఈ పద్ధతిలో కీలకమైన అంశం. ఈ రకమైన మధుమేహంలో శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ స్వయంగా క్లోమగ్రంథిలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలను నాశనం చేస్తుందన్నది తెలిసిన విషయమే. ఫలితంగా టైప్‌–1 మధుమేహం బారిన పడినవారు తరచు ఇన్సులిన్‌ను ఎక్కించుకోవలసి వస్తుంది.

ఎప్పటికప్పుడు కొత్త ఐస్‌లెట్‌ కణాలను శరీరంలోకి చొప్పించడం ద్వారా వ్యాధిని నియంత్రించేందుకు శాస్త్రవేత్తలు ఇప్పటిరవకూ బోలెడు ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. శరీరం ఈ కొత్త కణాలను నిరోధించే సమస్యను ఎదుర్కొనేందుకు మరిన్ని మందులు వాడవలసి రావడం దీనికి ఒక కారణం. ఈ నేపథ్యంలో చైనా శాస్త్రవేత్తలు నానో స్థాయిలో అతి సూక్ష్మమైన రంధ్రాలున్న ఓ పోగును తయారుచేసి అందులో ఈ ఐస్‌లెట్‌ కణాలను ఉంచారు. సాలెగూడు పోగంత పలుచగా ఉండటమే కాకుండా... కణాలను తనలో దాచుకోగలగడం వీటి ప్రత్యేకత. అవసరమైనప్పుడు దీన్ని సులువుగా తీసేసే అవకాశమూ ఉంటుంది. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో ఒక అంగుళం పొడవైన పోగును రెండు రోజుల పాటు ఇన్సులిన్‌ అవసరం లేకుండా చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top