
బహుమతి పన్నును ఎప్పుడు ప్రవేశ పెట్టారు?
రణాళికా యుగంలో పన్ను రాబడిలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన నివసించే ప్రజల శాతం ఎక్కువగా ఉండడంతో ప్రత్యక్ష పన్నుల బేస్ తక్కువగా ఉంది. వ్యవసాయ ఆదాయంపై పన్నును విధించే చట్టబద్ధమైన అధికారాలు రాష్ర్ట ప్రభుత్వాలకు ఉన్నాయి
ఇండియన్ ఎకానమీ
భారత పన్నుల వ్యవస్థ
ప్రణాళికా యుగంలో పన్ను రాబడిలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన నివసించే ప్రజల శాతం ఎక్కువగా ఉండడంతో ప్రత్యక్ష పన్నుల బేస్ తక్కువగా ఉంది. వ్యవసాయ ఆదాయంపై పన్నును విధించే చట్టబద్ధమైన అధికారాలు రాష్ర్ట ప్రభుత్వాలకు ఉన్నాయి. అయినప్పటికీ ఈ పన్ను విధింపునకు రాష్ట్రాలు ఆసక్తి చూపలేదు. ప్రణాళికా యుగంలో గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద రైతుల ఆదాయాలు పెరిగి నప్పటికీ రాష్ర్ట ప్రభుత్వాలు వ్యవసాయాదాయంపై పన్ను విధించడం లేదు. మరోవైపు దేశంలో నల్లధనం పెరుగుతోంది. భారతస్థూల దేశీయోత్పత్తిలో నల్లధనం 40 శాతం వరకు ఉండొచ్చని అంచనా.
స్వాతంత్య్రానంతరం కేంద్ర ప్రభుత్వం, రాష్ర్ట ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు విధించే పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో పెరుగుదల నమోదైంది. 1950-51లో మొత్తం పన్నుల రాబడి *672 కోట్లు కాగా 2013-14 బడ్జెట్‌లో స్థూల పన్నుల రాబడి *12,35,870 కోట్లుగా ప్రతిపాదించారు. ఈ మొత్తంలో కేంద్ర ప్రభుత్వ నికరపన్ను రాబడి *8,84,078 కోట్లుగా అంచనా వేశారు. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా పన్నుల సంస్కరణలపై ఏర్పాటైన కమిటీలకు సంబంధించి సిఫార్సుల అమలు కారణంగా భారతదేశ పన్నుల వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి.
పన్నుల సంస్కరణలు -రాజా చెల్లయ్య కమిటీ
ఆర్థిక సంస్కరణల్లో భాగంగా పన్నుల సంస్కరణలకు సంబంధించి డాక్టర్ రాజా జె. చెల్లయ్య కమిటీని 1991 ఆగస్టులో ఏర్పాటు చేశారు. ఈ కమిటీ తన తాత్కాలిక నివేదికను 1991 డిసెంబర్‌లో, తుది నివేదికను 1992 ఆగస్టులో ప్రభుత్వానికి సమర్పించింది.
సిఫార్సులు
{పత్యక్ష పన్ను రేట్లను తగ్గించడం ద్వారా, గరిష్ట, కనిష్ట పన్నుల మధ్య వ్యత్యాసం తక్కువగా ఉండాలి.
వ్యవసాయాదాయం*25,000కు మించి నప్పుడు దాన్ని వ్యవసాయేతర ఆదాయం తో కలిపి ఆదాయపు పన్ను నిర్ణయించాలి.
దేశీయ కంపెనీలకు, విదేశీ కంపెనీలకు పన్ను రేట్లలో తేడా 10 శాతానికి మించరాదు.
{పవాస భారతీయులు చెల్లించవలసిన పన్ను, వారికి కల్పించే పన్ను రాయితీలకు సంబంధించి త్వరితంగా నిర్ణయాలు తీసుకోవాలి.
దేవాదాయ, ధర్మాదాయ సంస్థలకు వచ్చే ఆదాయంపై పన్నుల విధింపును హేతుబద్ధం చేయాలి.
పార్లమెంట్/ శాసనసభ్యుల సమావేశాల భత్యాలపై పన్ను విధించాలి.
బహుమతి పన్ను పరిమితిని రూ.30 వేల కు పెంచాలి.
బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలపై విధించే ఇంట్రెస్ట్ ట్యాక్స్‌ను తొలగించాలి.
హైకోర్టుల అనుమతి మేరకు కంపెనీల పునర్నిర్మాణం, విలీనాలు జరిగే సమయం లో మూలధన రాబడి పన్ను, బహుమతి పన్ను విధించరాదు.
పన్ను విధింపు కోసం ప్రతి కంపెనీని ప్రత్యేక సంస్థగా గుర్తించాలి. విదేశీ కంపెనీలకు విదేశీ కరెన్సీల్లో చేసే చెల్లింపులు, రాయల్టీల విషయంలో ఏర్పడిన సందిగ్ధ పరిస్థితులను తొలగించాలి.
సర్వీసులను పన్ను పరిధిలోకి తీసుకురావాలి.
ఎక్సైజ్ సుంకం విషయంలో మూడు విధాలైన శ్లాబ్‌లు.. అంటే 10, 15, 20 శాతంగా నిర్ణయించాలి.
{పస్తుత ఎక్సైజ్ విధానాన్ని క్రమంగా వ్యాట్ కిందికి తీసుకురావాలి.
పన్ను సంస్కరణలపై విజయ్ కేల్కర్ కమిటీ
పన్నుల వ్యవస్థ సంస్కరణలపై ప్రభుత్వం 2002 జూన్‌లో విజయ్ కేల్కర్ అధ్యక్షతన ఒక టాస్క్‌ఫోర్‌సను ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 2002 డిసెంబర్‌లో తన నివేదికను సమర్పించింది. కేల్కర్ కమిటీ ప్రత్యక్ష, పరోక్ష పన్నులు రెండింటికీ సంబంధించిన సిఫార్సులను చేసింది. ఈ సిఫార్సుల వల్ల పన్ను జీడీపీ నిష్ప త్తి పెరుగుతుందని కమిటీ భావించింది.
సిఫార్సులు
ఆదాయపు పన్ను పరిమితిని రూ.లక్షకు పెంచాలి.
వృద్ధులు, వితంతువులకు ఆదాయపు పన్ను పరిమితిని రూ.లక్షన్నరగా నిర్ణయించాలి.
రాబోయే మూడేళ్లలో దేశీయ, విదేశీ కంపెనీలపై కార్పొరేషన్ పన్ను రేట్లను తగ్గించాలి. దేశీయ కంపెనీలపై కార్పొరేషన్ పన్నును 30 శాతానికి, విదేశీ కంపెనీలపై 35 శాతానికి తగ్గించాలి.
కనీస ప్రత్యామ్నాయ పన్నును పూర్తిగా తొలగించాలి. మ్యూచువల్ ఫండ్‌సగా మారిన స్వల్పకాల మూలధన రాబడిపై 20 శాతం పన్ను విధించాలి.
చిన్న మొత్తాల పొదుపుపై ఇస్తున్న పన్ను మినహాయింపును తొలగించాలి.
దీర్ఘకాల మూలధన రాబడులు, డివిడెంట్లపై పన్ను రద్దు చేయాలి.
ఎగుమతి రాయితీలు, ప్రోత్సాహకాలను రద్దు చేయాలి.
{పత్యేకించిన వ్యవసాయ ఉత్పత్తులపై 150శాతం వరకు కస్టమ్స్ డ్యూటీ, మోటా రు వాహనాలపై సుంకాన్ని తగ్గిస్తూ దిగుమతి చేసుకునే సెంకడ్ హ్యాండ్ కార్లపై ప్రస్తుత సుంకాన్ని కొనసాగించాలి.
పరోక్ష పన్నులు
భారత్‌లో పన్నుల రాబడి పెరుగుదల విషయంలో పరోక్ష పన్నులు గణనీయమైన పాత్ర పోిషించాయి. ఉత్పత్తి ఆధారంగా, అమ్మకాలు లేదా కొనుగోళ్లపై విధించే ఎగుమతి, దిగుమతి సుంకాలు, ఎక్సైజ్, అమ్మకపు పన్నులను పరోక్ష పన్నులుగా భావించవచ్చు. సేవలపై పన్ను, వినోదపు పన్ను, ఎలక్ట్రిసిటీ డ్యూటీలు, ప్రయాణికులు, సరకు రవాణాపై విధించే పన్నులు కూడా పరోక్ష పన్నులే.
భారత్‌లో పరోక్ష పన్నులు
ఎక్సైజ్ పన్ను
పురాతన కాలం నుంచి ఎక్సైజ్ పన్ను ప్రభుత్వానికి ముఖ్య ఆదాయంగా మారింది. మౌర్యుల కాలంలో మత్తు పానీయాలు, ఉప్పుపై ఎక్సైజ్ డ్యూటీని విధించారు. మొఘల్‌లు, బ్రిటీష్ పాలకులు.. ఆదాయాన్ని పెంచుకోవడానికి ఉప్పును ప్రధాన వస్తువుగా పరిగణించారు. 1894లో నూలుపై ఎక్సైజ్ పన్ను విధించడం ద్వారా ఆధునిక ఎక్సైజ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. అనంతరం ఎక్సైజ్ పన్ను పరిధి మరింత విసృ్తతమైంది. 1917లో మోటార్ స్పిరిట్‌ను, 1922లో కిరోసిన్‌ను ఈ పన్ను పరిధిలోకి తీసుకొచ్చారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం నిర్దిష్ట ప్రాతిపదికన కొన్ని ప్రత్యేక వస్తువులపై ఎక్సైజ్ పన్ను విధించారు. 1944 ముందు కాలంలో ఎక్సైజ్ పన్నును అనేక చట్టాల ద్వారా విధించారు. ఈ చట్టాలన్నింటినీ కన్సాలిడేట్ చేస్తూ 1944లో సెంట్రల్ ఎక్సైజెస్ అండ్ సాల్ట్ యాక్ట్‌ను ప్రభుత్వం రూపొందించింది. ఈ చట్టాన్ని ప్రస్తుతం సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్-1944గా పిలుస్తున్నారు