భారీ లాభాల్లో మార్కెట్లు : బ్యాంక్స్‌, మెటల్ అప్‌

stockmarkets opens with gains - Sakshi

ఫలితాల్లో డీలాపడిన ఐటీ మేజర్‌  టీసీఎస్‌ టాప్‌ లూజర్‌

సాక్షి, ముంబై:  దేశీయ  స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో కీలక సూచీలు రెండు ప్రధాన మద్దతుస్థాయిలకు పైన కొనసాగుతున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్‌, మెటల్‌ సెక్టార్లు లాభపడుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌  216 పాయింట్లు ఎగిసి 38097 వద్ద, నిఫ్టీ 58 పాయింట్లు ఎగిసి 11292 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.  అమెరికా  చైనా ట్రేడ్‌వార్‌కు  ఒక పరిష్కారం లభించనుందనే అంచనాల మధ్య మెటల్‌ షేర్ల  మెరుపులు  మెరిపిస్తున్నాయి. 

వేదాంతా, టాటా స్టీల్‌, కోల్‌ ఇండియా, కోటక్‌మహీంద్ర,  ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ,  హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్‌  టాప్‌  గెయినర్స్‌గా కొనసాగుతున్నాయి. మరోవైపు ఫలితాల ప్రభావంతా టీసీఎస్‌ బాగా నష్టపోతోంది. ఇంకా టెక్‌ మహీంద్రా,భారతి ఇన్‌ఫ్రాటెల్‌; ఐవోసీ, భారతి ఎయిర్‌టెల్‌, హెచ్‌సీఎల్‌టెక్‌ కూడా బలహీనంగా ట్రేడ్‌ అవుతున్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top