Ranveer Singh Reveals the First Look of Kapil Dev from the Movie '83' - Sakshi
Sakshi News home page

83.. అచ్చు కపిల్‌లానే!

Jul 6 2019 12:18 PM | Updated on Jul 6 2019 2:51 PM

Ranveer Singh Bowls Over With His Transformation Into Kapil Dev - Sakshi

నాకు ఎంతో ప్రత్యేకమైన రోజున హరియాణా హరికేన్‌ కపిల్‌దేవ్‌ను పరిచయం చేస్తున్నా’

ముంబై: 1983 ప్రపంచకప్‌లో కపిల్‌ దేవ్‌ సారథ్యంలో భారత జట్టు ప్రపంచకప్ ఎలా గెలిచింది అన్న నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘83’.. ఇందులో కపిల్‌ దేవ్‌గా బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. నేడు రణ్‌వీర్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతను ‘83’ ఫస్ట్‌లుక్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నాడు. ‘నాకు ఎంతో ప్రత్యేకమైన రోజున హరియాణా హరికేన్‌ కపిల్‌దేవ్‌ను పరిచయం చేస్తున్నా’ అని రణ్‌వీర్‌ ఆ ఫొటోకు క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. బంతిని ఎగరేస్తూ ఉన్న రణ్‌వీర్‌ అచ్చు కపిల్‌లానే ఉన్నాడు. కొద్ది గంటల్లోనే ఈ ఫస్ట్‌ లుక్‌ నెట్టింట వైరల్‌ అయింది. ఈ ఫొటోలో రణ్‌వీర్‌ అచ్చం పాజీ(కపిల్‌దేవ్‌)లానే ఉన్నాడని టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ రణ్‌వీర్‌ను కొనియాడుతూ.. బర్త్‌డే విషెస్‌ చెప్పాడు. (చదవండి: 83.. భారత క్రికెట్‌లో ఒక మరుపురాని జ్ఞాపకం)

ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు కబీర్‌ సింగ్‌ తెరకెక్కిస్తున్నాడు. మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు తహీర్‌ రాజ్‌ భాసిన్‌, అప్పటి టీమిండియా మేనేజర్‌ మాన్‌ సింగ్‌ పాత్రలో పంకజ్‌ త్రిపాఠి, క్రికెటర్లు సందీప్‌ పాటిల్‌ పాత్రలో ఆయన కుమారుడు చిరాగ్‌ పాటిల్‌,  శ్రీకాంత్‌ పాత్రలో తమిళ నటుడు జీవా, సయ్యద్‌ కిర్మాణి పాత్రలో సాహిల్‌ ఖట్టర్‌, బల్వీందర్‌ సింగ్‌ పాత్రలో అమ్మీ విర్క్‌ నటిస్తున్నారు. 2020 ఏప్రిల్‌ 10న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రయూనిట్‌ భావిస్తోంది. (చదవండి : క్రికెట్‌ చరిత్రలోనే అదో అద్భుతం!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement