ప్రకాశం జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మరణించగా.... మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఒంగోలు : ప్రకాశం జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మరణించగా.... మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.... చీరాల ఎమ్మార్వో కార్యాలయం వద్ద శుక్రవారం ఉదయం చేపల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి... ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ ఎన్ ఎలీషాతోపాటు రైల్వే ఉద్యోగి కె. నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోలోని మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అలాగే దర్శి మండలం రాజంపల్లి సమీపంలో పాలక్యాన్లతో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని దర్శి ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో ఒకరి పరిస్థితి విషమంగా మారడంతో అతడిని ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.