జిల్లావ్యాప్తంగా ప్రజారోగ్యంలో 77, వైద్యవిధాన పరిషత్‌కు సంబంధించి ఒకటి వైద్య పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో
కాకినాడ సిటీ : జిల్లావ్యాప్తంగా ప్రజారోగ్యంలో 77, వైద్యవిధాన పరిషత్‌కు సంబంధించి ఒకటి వైద్య పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నవారి మెరిట్ జాబితాను వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం కార్యాలయంలో ప్రదర్శించారు. మొత్తం 78 పోస్టులకు 521 మంది దరఖాస్తు చేసుకోగా, సకాలంలో దరఖాస్తు చేసుకోలేదని 25, ఎన్‌ఐసీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో రాలేదని 62 దరఖాస్తులను తిరస్కరించారు. మెరిట్ జాబితా ప్రకారం ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉంది. అయితే అధికారులు మెరిట్ జాబితా రూపకల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా, పోస్టుల భర్తీ కమిటీ చైర్మన్‌గా ఉన్న కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని వైద్య ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.