పొగాకు రాజకీయం..


పొగాకు రైతులు ఆరుగాలం పడిన కష్టమంతా కేవలం క్యూరింగ్‌పైనే ఆధారపడి ఉంటుంది. క్యూరింగ్‌కు సరిపడా వంట చెరకు లభించకపోతే చేతికంద వచ్చిన పంట నాశనమయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది ముందస్తుగా వంట చెరకు సమకూర్చుకున్న వారికి కష్టాలు తప్పాయి. కానీ సన్నచిన్న కారు రైతులు మాత్రం జీడిపుల్ల, అడవిపుల్లలపైనే ఆధారపడుతుంటారు. 1982 నుంచి అశ్వారావుపేట ప్రాంతానికి పొగాకు పంటను పరిచ యం చేసిన వ్యక్తులుగా.. పలు రాజకీయ పారీ ్టల్లో కీలక నేతలుగా పేరొందిన వారు పొగాకు క్యూరింగ్‌కు అటవీ కలపను నరికేందుకు అనుమతులు ఇప్పించి రైతుల నుంచి ప్రశంసలు అందుకునేవారు. కానీ ఈ ఏడాది అందుకు విరుద్ధంగా వీరే రైతుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.



 కథ మారిపోయింది..:

 ఇంతకుముందులా కలప నరుక్కునేందుకు అటవీశాఖ అధికారులు అంగీకరించకపోవడం తో చిన్న రైతులకు భారంగా మారింది. ఓపక్క బొగ్గుతో బ్యారన్‌లను నిర్వహించాలని ప్రభుత్వం చెబుతున్నా.. కొందరు వైట్ కాలర్ నాయకులు మాత్రం మేం అడవి పుల్లను ఇప్పిస్తామని చెప్పి రైతులను మభ్యపెట్టడ ంతో రైతులు ఆ దిశగా ఆలోచించలేదు. ఇదే  అదనుగా కొందరు నాయకులు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఏటా ఇది జరిగే తంతే అయినా.. రైతు లు మాత్రం పని అయిపోతుందని పట్టించుకోకుండా ఖర్చులు భరిస్తున్నారు. ఈ ఏడాది పుల్ల రవాణా కష్టం కావడంతో నాయకులను నమ్ముకున్న రైతులు ఇబ్బందుల పాలవుతున్నారు.



 పచ్చి ఆకు కొట్టి బ్యారన్ దగ్గరకు తెచ్చాక నిల్వ ఉంచడం కుదరని పరిస్థితి. పచ్చి ఆకును జడ లు కట్టాక ఉడికించాల్సిందే. ఉడికించేందుకు పుల్ల లేని పక్షంలో ఎంత ఖర్చయినా సరే.. రైతులు వెనుకాడలేరు. ఈ బలహీనతను ఆసరాగా తీసుకున్న కొందరు వ్యక్తులు అడ్డదారిలో తెచ్చిన కలపను ఎక్కువ ధరలకు చిన్న రైతులకు విక్రయిస్తున్నారు. దీంతో బొగ్గుకంటే ఎ క్కువ ధరతో పొగాాకును ఉడికించాల్సిన ఇ బ్బందికర పరిస్థితులు నెలకొన్నా.. రైతులు ఎవరికీ చెప్పుకోలేక నానా బాధలు పడుతున్నారు.



 మూడు రెట్లు ధర చెల్లించాల్సి వస్తోంది..:

 సాధారణంగా అడవి నుంచి పుల్లను తోలుకుంటే అయ్యే ఖర్చుకు మూడు రెట్లు ధర చెల్లించి కలపను సమకూర్చుకోవాల్సి వస్తోందని పలువురు రైతులు వాపోతున్నారు. పుల్ల రవాణాకు అటవీశాఖ అధికారులు అనుమతులు ఇవ్వలేదని ముందే గ్రహించిన కొందరు స్మగ్లర్లు రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని మూడు రెట్ల అధిక ధరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇంత చేసి పుల్లను కొనుగోలు చేసినా అనుమతులు లేవంటూ అటవీశాఖ అధికారులు కూడా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని రైతులు వాపోతున్నారు. ఆరుగాలం కష్టించి కంటికి రెప్పలా కాపాడుకుని సాగు చేసిన పంటను చివరలో క్యూరింగ్ సమయానికి నానా పాట్లు పడాల్సి వస్తోందని, వంట చెరుకు లభించకపోతే పొగా లు పొలంలోనే పండిపోతుందని, రంగు మారి తే కష్టమంతా వృధా అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. క్యూరింగ్ కోసం శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.    



 ఇవీ లె క్కలు..:

 అశ్వారావుపేట, దమ్మపేట మండలాలతో కలిపి జంగారెడ్డిగూడెం 2వ వేలం ప్లాట్‌ఫాం పరిధిలో 510 బ్యారన్‌లు ఉన్నాయి. ఒక్కో బ్యారన్‌కు 5 ఎకరాల విస్తీర్ణంలో సరిపడా పొగాకు సాగుచేస్తుంటారు. ఒక్కో బ్యారన్‌కు రూ.4 నుంచి 5లక్షల వరకు మట్టిలో సత్తువను బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి పెట్టుబడి అవుతుంది. ఒక్కో బ్యారన్ క్యూరింగ్ కోసం కనీసం 50 సీఎంటీ(క్యూబిక్ మీటర్)ల పుల్ల అవసరం అవుతుంది. అంటే ఇక్కడి ట్రాక్టర్ లోడింగ్‌ను బట్టి 10 ట్రక్కుల పుల్ల సరిపోతుంది. డ్రైవర్ పనితనాన్ని బట్టి పుల్ల వినియోగం తగ్గే అవకాశమూ ఉంది. ఏటా అటవీ కార్పొరేషన్ ద్వారా అడవిలో పాత చెట్లను తొలగించి వేలం ద్వారా విక్రయిస్తుంటారు.



కార్పొరేషన్ అధికారుల పర్యవేక్షణలో ముందుగానే అడవిలో చెట్లను నరికేసి.. లాట్లుగా పేర్చి ఉంచుతారు.  కలప వ్యాపారులు పోటీ పడి ఒక్కో సీఎంటీ ధర రూ.450 నుంచి రూ.500 వరకు కొనుగోలు చేస్తుంటారు. ఈఏడాది మాత్రం ఓ వ్యాపారి అత్యధికంగా రూ.1120కి కొనుగోలు చేశారు. ఈతరహా ధర పోటీ పెరిగినప్పుడు మాత్రమే ఉంటుందని, సాధారణంగా ఒక సీఎంటీ పుల్ల ధర రూ. 600కు మించదని కలప కాంట్రాక్టర్లు అంటున్నారు. ఈగణాంకాల ప్రకారం ఒక్కో బ్యారన్‌కు 50 టీఎంసీల చొప్పున రూ.30వేలు ఖర్చవుతుంది. అధికారికంగా ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసే పుల్లతో దర్జాగా పొగాకు ఉడికించుకోవచ్చు.



 కానీ ఇక్కడ జరిగేది ఇదీ..:

 అడవి పుల్ల కోసమని అధికారి పార్టీ నాయకులతోపాటు పొగాకు రైతు ప్రతినిధులు ఒక్కో బ్యారన్‌కు రైతుల నుంచి రూ.8వేల నుంచి రూ. 15 వేల వరకు వసూలు చేస్తుంటారు. ఆ తర్వాత ట్రాక్టర్‌కు రూ.3వేల చొప్పున( నరికివేత ముఠా, రవాణా ఖర్చులు) రైతులే భరించాలి. ఇలా ఒక్కో బ్యారన్‌కు రూ. 38 వేల నుంచి రూ. 45 వేల వరకు ఖర్చవుతోంది. దీనికి తోడు మధ్యలో అటవీశాఖ అధికారులు ఆపితే నజరానాలు చెల్లించాలి.



 ఈ క్రమంలో అటవీశాఖ అధికారులు కూడా ఫార్మాలిటీ కోసమని సన్న,చిన్నకారు రైతులపై కేసులు నమోదు చేస్తుంటారు. అన్నీ కలుపుకుంటే పుల్ల పేరుతో ఒక్కో బ్యారన్‌కు రూ. 50వేలకుపైగానే ఖర్చుఅవుతోందని రైతులు అంటున్నారు. రాజకీయనాయకులు అధికారుల చుట్టూ తిరగడం కన్నా టెండర్ సమయంలో పొగాకు రైతులకే ప్రభుత్వ ధరకు పుల్లను కేటాయించాలని డిమాండ్ చేస్తే ఎంతో మేలు చేసిన వారవుతారని రైతులు అంటున్నారు. తప్పుడు మార్గంలో అడవిలో పుల్లను నరికేందుకు అధికారులపై ఒత్తిడి తీసుకురావడం కన్నా సక్రమంగా పోరాడితే పొగాకు రైతులు గుండె నిబ్బరం చేసుకుని వ్యవసాయం చేసుకోవచ్చని అంటున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top