
సాగులో లేని వాళ్లు ఉన్నట్లు చూపిస్తున్నారు. అసలు ప్రాణా
2002లో చనిపోతే..
2018లో కోర్టుకు ఎలా వెళ్లారు?
పాలకొలనులోనే కలగొట్ల నాగమ్మ అనే మహిళకు 2 ఎకరాల పొలం ఉంది. ఎకరాకు రూ.4.30లక్షల చొప్పున ఈమెకు రూ.8.60లక్షలు పరిహారం రావాలి. అయితే నాగమ్మ 2002లో చనిపోయారు. భూమిని 2013లో సేకరించారు. కానీ పరిహారం కోసం నాగమ్మ పేరుతో ఓ టీడీపీ నేత 2018లో రిట్ (డబ్ల్యూపీ 42989/2018)దాఖలు చేశారు. అందులో నాగమ్మ వేలిముద్రలను ఫోర్జరీ చేశారు.
అయ్యన్న సంతకాలు ఫోర్జరీ
సర్వేనెంబర్ 232లో అయ్యన్న అనే వ్యక్తికి రెండు ఎకరాల పొలం ఉంది. ఇతనికి కూడా రూ.8.60లక్షలు పరిహారం రావాలి. ఇతను 2008 జూలై 8న చనిపోయారు. ప్రభుత్వం మరణధ్రువీకరణ పత్రం కూడా జారీ చేసింది. అయితే ఇతని పొలాన్ని 2013లో సేకరించారు. పరిహారం కోసం చనిపోయిన అయ్యన్న 2018 నవంబర్ 5న కోర్టులో రిట్(40116/2018) దాఖలు చేశారు. 2002లో చనిపోయిన వ్యక్తి 2018లో కోర్టును ఎలా ఆశ్రయించారో అధికారులకే తెలియాలి.
నాకు తెలీకుండానే
నా పేరుతో కోర్టుకు..
నాకు అరెకరా ఉంది. నాకు రూ.2.15లక్షలు రావాలి. నేను బతికే ఉన్నా. నాకు తెలియకుండా నా పేరుతో టీడీపీ లీడర్ కోర్టుకు వెళ్లారు. నాకు సంతకం రాదు. నేనైతే ఎక్కడా వేలిముద్రలు వేయలేదు. కానీ నేను వేసినట్లు వేలిముద్రలు వేశారట. లేదంటే డ్వాక్రా గ్రూపులోని వేలిముద్రలను తీసుకున్నారేమో తెలీదు. ఇది చాలా అన్యాయం. నా పరిహారం నాకు ఇప్పించాలి. – శేషమ్మ
నకిలీ పాసుపుస్తకాలు సృష్టించారు
మా మానాన్న మద్దిలేటికి 4.38 ఎకరాల పొలం ఉంది. ఇప్పటికీ పాసుపుస్తకాలు మా నాన్న పేరుతో ఉన్నాయి. అయితే మా ఆడపిల్లలతో పాటు మా సోదరుడు వెంకటేశ్వర్లు భార్య భాగమ్మ, ఆమె పిల్లలు బతికే ఉన్నారు. వారికి తెలియకుండా భూమి భాగ పరిష్కారాలు కాకుండా మొత్తం భూమి రామాంజనేయులు తీసుకున్నట్లు నకిలీ పాసుపుస్తకాలు సృష్టించారు. మా వద్ద మా నాన్న పాసుపుస్తకాలు ఉన్నాయి. దీనిపై అధికారులు విచారణ చేయాలి. అప్పటి వరకూ పరిహారం ఆపాలి.
– మద్దిలేటి వారసులు
ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ భూసేకరణ కుంభకోణం
● పరిహారం కోసం రైతులకు
తెలియకుండా కోర్టుకు
● చనిపోయిన వారి పేరిట
రిట్ పిటిషన్‌లు దాఖలు
● ఇప్పటికే 120 మందికి పరిహారం..
త్వరలో మరో 70 మందికి
● ఈ విషయంలో చక్రం తిప్పుతున్న
ఓ టీడీపీ నేత
● మంజూరైన పరిహారంలో
50శాతం ఇచ్చేలా ఒప్పందం
సాక్షి ప్రతినిధి కర్నూలు: ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌లో డీఆర్‌డీఓ(డిఫెన్స్ రీసెర్స్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్) కోసం 3,250 ఎకరాల భూమిని ఏపీఐఐసీ ద్వారా ప్రభుత్వం సేకరించింది. పట్టా భూము లకు, అసైన్డ్ భూములకు ప్రభుత్వం ఎకరాకు రూ.4.30లక్షల చొప్పున పరిహారం ఇచ్చింది. అయితే ఈ పరిహారం మంజూరులో కొందరు రైతుల పేర్లతో టీడీపీ నేతల భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. 15–20 ఏళ్ల కిందట చనిపోయిన వారి పేర్లతో ఫోర్జరీ సంతకాలు చేసి పరిహారం పొందేందుకు సిద్ధమ య్యారు. ఇప్పటికే 120మందికి పరిహారం అందింది. మరో 70మందికి పరిహారం మంజూరు కాగా, ఖా తాల్లో జమ కావల్సి ఉంది. అయితే ఈ పరిహారం మంజూరులో అక్రమాలు జరిగాయని ఇటీవలే బాధిత రైతు కుటుంబాలతో పాటు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాట సాని రాంభూపాల్‌రెడ్డి కలెక్టర్‌ను కలిసి విన్నవించారు. నిజమైన బాధితులకు న్యాయం చేయాలని కోరారు.
వేలిముద్రలు ఫోర్జరీ చేసి కోర్టులో రిట్
పాలకొలనులో మాదిగ శేషమ్మకు అరెకరా పొలం ఉంది. ఈమె భూమిని డీఆర్‌డీఓ కోసం సేకరించారు. అయితే పొలంలో శేషమ్మ సాగులో లేదని పరిహారం తిరస్కరించారు. దీనిపై శేషమ్మకు తెలియకుండానే ఆమె పేరుతో హైకోర్టులో 2022లో రిట్(పిటిషన్ నెం.25654) దాఖలు చేశారు. పిటిషన్‌లో శేషమ్మ పేరుతో వేలిముద్రలు వేసి ఆమె పేరు రాశారు. నిజానికి ఈ విషయం ఆమెకు ఏమాత్రం తెలీదు. గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు తప్పుడు వేలిముద్రలతో శేషమ్మ పేరుతో రిట్ దాఖలు చేశారు. లేదంటే డ్వాక్రా సంఘంలో ఉన్న శేషమ్మ రుణాల లావాదేవీలలో గతంలో వేసిన వేలిముద్రలను ఫోర్జరీ చేసి ఉండొచ్చని శేషమ్మ అనుమానిస్తున్నారు. ఇప్పుడు ఈమె పేరుతో మంజూరైన పరిహారం శేషమ్మకు తెలియకుండానే టీడీపీ నేత ఖాతాలో జమ కానుంది.
వచ్చిన పరిహారంలో ఫిఫ్టీ.. ఫిఫ్టీ
పాలకొలనులో డీఆర్‌డీఓ కోసం వందల ఎకరాల భూమి సేకరించారు. ఇందులో కొందరు నిజమైన అర్హులు ఉంటే కొందరు భూమి లేకుండా కేవలం నకిలీ పట్టాలు సృష్టించి పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్న వారున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎవరైతే ప్రభుత్వం నుంచి అసైన్డ్‌భూములు పొంది, సాగులో లేకుండా ఉన్నారో వారికి పరిహారం నిరాకరించారు. ఇదే అదునుగా ఓ టీడీపీ నేత పరిహారం నిరాకరించిన కొందరి పేర్లతో వారికి తెలీకుండా వారి పేర్లతో కోర్టులో రిట్‌దాఖలు చేశారు. ఇది చూసి ఇంకొందరు రైతులు కూడా టీడీపీ నేతతో కలిసి వెళ్లి తమకూ పరిహారం ఇప్పించాలని కోరారు. దీంతో ఆ టీడీపీ నేత వచ్చే పరిహారంలో సగం తనకు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. తనకు వచ్చే సగంలో అధికారులకు వాటా ఇస్తానని చెప్పినట్లు తెలుస్తోంది.
ఫ్యామిలీకి
తెలీకుండా
దోపిడీ
నక్కల మద్దిలేటికి సర్వేనెంబర్ 199లో 3.50 ఎకరాలు, సర్వేనెంబర్ 243/5లో 0.88 ఎకరాలు మొత్తంగా 4.38 ఎకరాలు ఉంది. మద్దిలేటి చనిపోయి 20 ఏళ్లు దాటింది. ఈయనకు ఐదుగురు ఆడపిల్లలు, ముగ్గురు మగపిల్లలు. వీరిలో మొదటి, రెండో కుమారులు మద్దిలేటి, వెంకటేశ్వర్లు చనిపోయారు. అలాగే ఓ ఆడపిల్ల కూడా చనిపోయింది. చిన్నోడు రామాంజనేయులుతో పాటు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. మద్దిలేటి పేరుతో ఉన్న పొలాన్ని రెండో కుమారుడు వెంకటేశ్వర్లు భార్య భాగ్యమ్మకు మగపిల్లోడు ఉన్నారు. ఈమెతో పాటు తక్కిన నలుగురు ఆడపిల్లలకు సంబంధం లేకుండా మొత్తం పొలం దాన విక్రయం కింద తండ్రి తనకు రాసిచ్చినట్లు పాస్‌బుక్కులు సృష్టించారు. పరిహారం కోసం కోర్టులో 2018లో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే రామాంజనేయులు మినహా తక్కిన మద్దిలేటి వారసులు పాస్‌బుక్కులు తమ తండ్రి పేరుతోనే ఉన్నాయని, నకిలీ పాసుపుస్తకాలు సృష్టించుకుని రామాంజనేయులు తమకు పరిహారం ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీని వెనుక గ్రామానికి చెందిన టీడీపీ నేత ఉన్నారని చెబుతున్నారు.

సాగులో లేని వాళ్లు ఉన్నట్లు చూపిస్తున్నారు. అసలు ప్రాణా

సాగులో లేని వాళ్లు ఉన్నట్లు చూపిస్తున్నారు. అసలు ప్రాణా

సాగులో లేని వాళ్లు ఉన్నట్లు చూపిస్తున్నారు. అసలు ప్రాణా

సాగులో లేని వాళ్లు ఉన్నట్లు చూపిస్తున్నారు. అసలు ప్రాణా

సాగులో లేని వాళ్లు ఉన్నట్లు చూపిస్తున్నారు. అసలు ప్రాణా

సాగులో లేని వాళ్లు ఉన్నట్లు చూపిస్తున్నారు. అసలు ప్రాణా