
ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
అంగన్‌వాడీ కేంద్రాలకు ఈ నెల 1 నుంచి నెల రోజులల పాటు సెలవులు ఇవ్వాలని అడిగాం. ఇంత వరకు అతీగతీ లేదు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించే పౌష్టికాహారాన్ని ఇళ్లకు ఇవ్వాలన్నా ఈ ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి. పని ఒత్తిడి తగ్గిస్తామని చెప్పారు కానీ ఇంకా పెంచుతున్నారు. జీతాల విషయంలోనూ ఆలోచించట్లేదు. ఎండలు ఎక్కువగా ఉన్నా చిన్నారుల విషయంలో శ్రద్ధ చూపకపోవడం దారుణం. – నిర్మల, ఏపీ
అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్,
రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు (సీఐటీయూ)