
ఆల్ మేవా నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవం
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోిసియేషన్ (ఆల్‌మేవా)కు నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఏర్పాటయ్యింది. శనివారం జిల్లా పరిషత్‌లోని మండలపరిషత్ సమావేశ మందిరంలో నూతన కార్యవర్గ ఎన్నిక కార్యక్రమం చేపట్టారు. నంద్యాల జిల్లా ఆల్ మేవా జనరల్ సెక్రటరీ ఎస్‌ఎండీ సలీమ్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఇమ్రాన్‌పాషా, గౌరవ అధ్యక్షుడు ఎస్‌ఎండీ అబులైస్, జనరల్ సెక్రటరీ అంజాద్‌పాషా పర్యవేక్షించారు. జిల్లా ఆల్ మేవా అధ్యక్షుడు ముక్తార్ బాషా (పంచాయతీ రాజ్), వర్కింగ్ ప్రసిడెంటుగా మౌలీబాషా (రెవెన్యూ), అసోసియేట్ ప్రశిడెంటుగా హుస్సేన్ (నీటిపారుదల), ఉపాధ్యక్షులుగా జాకీర్ హుస్సేన్, పీఎండీ అబ్దుల్ ఖలీల్, మహ్మమ్మద్ హక్, హుస్సేన్ సాబ్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా షేక్ మహమ్మద్ రియాజ్ బాషా, అడిషినల్ జనరల్ సెక్రటరీగా సైపుల్లా బేగ్, ఇలియాస్ ఖాన్, అల్లాబకాష్, కోశాధి కారి షఫీఅహ్మద్, మహిళ సెక్రటరీగా సహరాబాను, దిల్షాద్ బేగం, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సుభాన్‌బాషా, షంషుల్లాఖాన్, ఎస్‌ఎండీ ఇంతియాజ్, జాయింట్ సెక్రటరీగా అక్బర్‌బాషా ఎన్నికయ్యారు. రాష్ట్ర నేతలు, ఎన్నికల అధికారి నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు