Kurnool District News
-
యాగంటిని దర్శించుకున్న డైరెక్టర్ సుకుమార్
బనగానపల్లె రూరల్: మండలంలోని ప్రముఖ శైవక్షేత్రం యాగంటిలో వెలసిన శ్రీ ఉమామహేశ్వరస్వామిని ప్రముఖ సినీ డైరెక్టర్ సుకుమార్ సోమవారం సాయంత్రం దర్శించుకున్నారు. ముందుగా ఆలయంలో ఏకశిలారూపంలో కొలువైన శివపార్వతులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వెంకటేశ్వరస్వామి గుహను సందర్శించి అక్కడున్న వెంకటేశ్వరస్వామిని కూడా దర్శించుకున్నారు. గతంలో అల్లుఅర్జున్ హీరోగా నటించిన పుష్ప–2 షూటింగ్ ఇక్కడ జరిగిన విషయం తెలిసిందే. మళ్లీ డైరెక్టర్ సుకుమార్ యాగంటిని దర్శించుకోవడంతో పుష్ప–3 షూటింగ్ చిత్రీకరణ ఏర్పాట్ల పరిశీలన నిమిత్తం వచ్చి ఉంటారనే చర్చ అభిమానుల మధ్య సాగుతోంది. -
పెద్దమ్మ జాతరకు వేళాయె!
గోస్పాడు: కుల, మత, రాజకీయాలకు అతీతంగా యాళ్లూరులో పెద్దమ్మ జాతరను నిర్వహించేందుకు గ్రామస్తులు సిద్ధమయ్యారు. 1926, 1966, 2015 సంవత్సరాల్లో గ్రామంలో జాతరను నిర్వహించారు. మళ్లీ పదకొండేళ్ల తర్వాత ఈనెల 29, 30 తేదీల్లో జాతర నిర్వహించేందుకు గ్రామపెద్దలు నిర్ణయించారు. దీంతో గ్రామంలో సందడి నెలకొంది. అమ్మవారికి ప్రత్యేకంగా ఎలాంటి ఆలలయం లేకపోవడంతో పూర్వం నుంచి వస్తున్న ఆచారం మేరకు అమ్మవారిని స్థానిక రామచావిడి ఎదుట ఏర్పాటు చేసి జాతర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేటితో ఉత్సవాలు ప్రారంభం పెద్దమ్మ జాతర మహోత్సవంలో భాగంగా మంగళవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అమ్మ వారి మహిషముల గ్రామ ఊరేగింపు ఉంటుంది. రాత్రి 8గంటలకు అన్నదానం, 10 గంటలకు అమ్మవారిని రామ చావిడికి తీసుకెళ్లి ఆశీనులను చేయనున్నారు. 30 తెల్లవారుజామున 3.30 గంటలకు అమ్మవారికి మహిషముల సమర్పణ, ఉదయం 5 గంటల నుంచి గ్రామంలో పొలి చల్లే కార్యక్రమం, ఉదయం బోనాల సమర్పణ, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు అన్నదానం, సాయంత్రం 4గంటల నుంచి అమ్మవారికి గ్రామోత్సవం(దీవెన బండారు) నిర్వహిస్తారు. జాతరకు అధిక ఖర్చు.. అమ్మవారికి మొక్కు తీర్చుకునే విషయంలో గ్రామ స్తులు ఖర్చుకు వెనుకాడటం లేదు. జాతరకు వ చ్చే బంధుమిత్రులకు మాంసాహార విందు ఇచ్చేందుకు బాగానే ఖర్చు అవుతుంది. ఈలెక్కన గ్రామం మొత్తంపై దాదాపు రూ. 4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఖర్చు కావచ్చని గ్రామ పెద్దలు అంచనా వేస్తున్నారు. ప్రశాంతంగా నిర్వహించాలి జాతర ప్రశాంతంగా జరుపు కోవాలి. ఎలాంటి గొడవలకు తావులేకుండా జాతర పూర్తయ్యేలా ప్రజలు సహకరించాలి. గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా, ప్రోత్సహించినా చర్యలు తప్పవు. జాతర సందర్భంగా వాహనాలకు, ప్రజలకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా గ్రామ శివారులు ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంతో వాహనాలు నిలుపుకోవాలి. – ఎస్ఐ వెంకటప్రసాద్ యాళ్లూరులో 11 ఏళ్ల తర్వాత ఉత్సవం గ్రామంలో పండగ సందడి -
దాడిలో గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్త మృతి
కోడుమూరు రూరల్: మండలంలోని పులకుర్తి గ్రామంలో ఈనెల 26న జరిగిన దాడిలో గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్త నడిపి రంగన్న (38) ఆదివారం అర్ధరాత్రి మృతిచెందాడు. దీంతో పులకుర్తిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త నడిపి రంగన్న అదే గ్రామానికి చెందిన మునిస్వామిల మధ్య కొంతకాలంగా మనస్పర్థలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 26న నిందితుడు మునిస్వామి, బజారి, మరికొద్ది మంది అనుచరులతో కలిసి నడిపి రంగన్నను, అతని అల్లుడు సురేష్ విషయంపై మాట్లాడేందుకంటూ పిలిపించారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం నడిపి రంగన్నతో గొడవ పెట్టుకుని రాడ్లు, కర్రలతో తీవ్రంగా కొట్టారు. కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆదివారం సాయంత్రం ఇంటికి తీసుకెళ్లారు. అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురై సృహలేకుండా పడిపోవడంతో కుటుంబ సభ్యులు 108 వాహనంలో కోడుమూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే రంగన్న మృతిచెందినట్లు చెప్పారు. మునిస్వామి అతని అనుచరులు కొట్టిన దెబ్బల వల్లే రంగన్న మృతి చెందాడంటూ కుటుంబ సభ్యులిచ్చిన ఫిర్యాదు మేరకు కోడుమూరు ఎస్ఐ ఎర్రిస్వామి కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చేపట్టారు. మృతుడికి భార్య మల్లీశ్వరీ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కాగా విషయం తెలుసుకున్న కుడా మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్దన్‌రెడ్డి సోమవారం కోడుమూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని రంగన్న మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నడిపి రంగన్న మృతికి కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట కోడుమూరు జెడ్పీటీసీ సభ్యులు రఘునాథ్‌రెడ్డి, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు క్రిష్ణారెడ్డి, మాజీ ఉపసర్పంచు ప్రవీణ్‌కుమార్, స్థానిక నాయకులు రవికుమార్‌రెడ్డి, లింగమూర్తి, జగదీష్ ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన కోట్ల హర్ష -
బంగారు కిరీటం సమర్పణ
ఆదోని అర్బన్: మహాయోగి లక్ష్మమ్మవ్వకు సోమవారం ఆలయ నిర్వాహకులు బంగారు కిరీటం సమర్పించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎండోమెండ్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకుడు రాయచోటి సుబ్బయ్య, సభ్యులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి కర్నూలు సిటీ: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నేషనల్ మజ్దూర్ యూనియన్ రీజినల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పీఏ వలి అధ్యక్షతన రిలే నిరహార దీక్షలు చేపట్టారు. రెండు రోజుల పాటు జరిగే దీక్షలను మొదటి రోజు సోమవారం సంఘం రీజినల్ చైర్మన్ ఎస్ఎండీ గౌస్, కార్యదర్శి సి.మద్దిలేటిలు దీక్షలో కూర్చున ఉద్యోగులకు పూల మాలలు వేసి ప్రారంభించి ప్రసంగించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని డిపోల ఎదుట దీక్షలు చేపట్టినట్లు చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యోగ భద్రత కోసం జారీ చేసిన సర్క్యూలర్ 1/2019ను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అక్రమ సస్పెన్షన్స్, రిమూవల్స్‌ను నిలిపి వేయాలని, మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీఓ ప్రకారం పిల్లల సంరక్షణ సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మొదటి రోజు దీక్షలో ఆర్‌బీఎన్ మూర్తి, కేటీ రెడ్డి, సి.లక్ష్మన్న, ఆర్పీ రావు, జేబీ రాజేశ్వరయ్య, ఎం.జెడ్ బాషా, ఎస్డీ బాషా కూర్చున్నారు. వీరికి డిపో–1 సెక్రటరీ సయ్యద్ ఇసాక్, డిపో–2 సెక్రటరీ ఎంఎస్బీ రెడ్డి సంఘీభావం తెలిపారు. -
ఏపీ టీఏఎస్ఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సునీల్‌కుమార్
కర్నూలు(అగ్రికల్చర్): ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ సర్వీస్ అసోసియేషన్(ఏపీ టీఏఎస్ఏ) నూతన కార్యవర్గం ఎన్నికలు సోమవారం విజయవాడలో జరిగాయి. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కర్నూలు జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ఎస్టీఓగా పనిచేస్తున్న పలనాటి సునీల్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉమ్మడి జిల్లా నుంచి ఈయన అసోసియేషన్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికై నట్లుగా ఎన్నికల అధికారి పి.కిరణ్‌కుమార్ ధ్రువపత్రం అందజేశారు. ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర కార్యవర్గంలో తనకు ప్రాతినిధ్యం కల్పించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ట్రెజరీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం నంద్యాల(న్యూటౌన్): నంద్యాల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా కేంద్రంలో ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్రసాద్ సోమవారం తెలిపారు. ప్రభుత్వ ఐటీఐలో చేరాల్సిన విద్యార్థులు మే 24వ తేదీలోపు iti.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుని, 26వ తేదీలోపు నంద్యాల ప్రభుత్వ ఐటీలో సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకుని, జూన్ 2 నుంచి 10వ తేదీ వరకు డోన్ ప్రభుత్వ ఐటీఐలో జరిగే కౌన్సెలింగ్‌కు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. మరింత సమాచారం కోసం 9866022451 నంబరును సంప్రదించాలన్నారు. సరిహద్దు చెక్‌పోస్ట్‌లపై నిఘా పెంచుతాం ఎమ్మిగనూరురూరల్: రాష్ట్రాల సరిహద్దు చెక్‌పోస్ట్‌ల వద్ద నిఘా పెంచుతామని రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక మద్యాన్ని అక్రమ రాష్ట్రాంలోకి రాకుండా నిఘా ఉంచామన్నారు. మద్యం దుకాణాల పక్కన అనుమతులు లేకుండా షెడ్లు ఏర్పాటు చేసుకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. కర్ణాటక మద్యంతో పాటు బెల్టుషాపులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. సరిహద్దు చెక్‌పోస్ట్‌లను పరిశీలించనున్నట్లు చెప్పారు. సమావేశంలో ఎకై ్సజ్ సీఐ రమేష్‌రెడ్డి పాల్గొన్నారు. బదిలీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలి నంద్యాల(న్యూటౌన్): ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి డిమాండ్ శాచేరు. సోమవారం ఫెడరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి శివయ్య, ఉపాధ్యక్షుడు జాకీర్హుసేన్లతో కలిసి రామచంద్రారెడ్డి మాట్లాడారు. ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం కలుగుతోందన్నారు. 8 ఏళ్లు పూర్తయిన ఎస్జీటీలు 1,500పైగా ఆప్సన్లు ఇచ్చుకోవాల్సి వస్తోందన్నారు. సమావేశంలో ఏపీటీఎఫ్ నాయకులు వీరేశ్వరరెడ్డి, పుల్లయ్య, రాజేష్, మల్లికార్జున, మధు, తదితరులు పాల్గొన్నారు. -
కలపరిలో జ్వరంతో వృద్ధురాలి మృతి
ఆస్పరి: జ్వరాలతో మంచం పట్టిన కలపరిలో ఓ వృద్ధురాలు మృతి చెందడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. నాలుగు రోజుల క్రితం గ్రామంలో జ్వరపీడితుల రక్త నమూనాలు ల్యాబ్‌కు పంపగా చికున్‌గున్యాగా బయటపడింది. 26 మందిని పరీక్షించగా 10 మందికి చికున్ గున్యా ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన వెంకమ్మ (60) జ్వరంతో బాధపడుతూ ఆదివారం రాత్రి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజులు క్రితం వెంకమ్మకు జ్వరంతో పాటు కాళ్లు, కీళ్లు నొప్పులతో బాధపడుతండడంతో మొదట ఆర్ఎంపీతో వైద్యం చేయించారు. అయినా జ్వరం తగ్గకపోవడంతో ఆమెను ఐదు రోజుల క్రితం కర్నూలులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అక్కడ రూ. 3 లక్షలు ఖర్చు అయినా జ్వరం నయం కాకపోవడంతో కుటుంబీకులు రెండు రోజులు క్రితం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. కాగా కోలుకోలేక ఆదివారం రాత్రి 11 గంటలకు మృతి చెందినట్లు వెంకమ్మ కుమారుడు గిడ్డయ్య తెలిపారు. వెంకమ్మకు భర్త వెంకటేష్, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొనసాగుతున్న వైద్య శిబిరం కలపరి ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం సోమవారం కూడా కొనసాగింది. వైద్య శిబిరాన్ని జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ రఘు, పత్తికొండ డీఎల్పీఓ వీరభద్రప్ప సదందర్శించి రోగులతో మాట్లాడారు. రక్త పరీక్షల ద్వారా చికెన్ గున్యా వ్యాధిగా నిర్ధారణ కావడంతో గ్రామస్తులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. చికెన్ గున్యా సోకిన వారికి తలనొప్పి, వాంతులు, జ్వరం, వికారం, చేతి వేళ్లు, కాళ్లు నుంచి మొదలుకుని శరీరంలోని అన్ని కీళ్లు నొప్పితో బాధిస్తుందన్నారు. కీళ్ల నొప్పులు వల్ల సరిగా నిలబడలేని పరిస్థితి వస్తుందని, జ్వరం తగ్గినా నొప్పులు ఎక్కువ కాలం ఉంటాయన్నారు. రోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గ్రామంలో జ్వరాలు తగ్గే వరకు వైద్య శిబిరం కొనసాగిస్తామని పత్తికొండ డీప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ రఘురామిరెడ్డి చెప్పారు. సోమవారం వైద్య శిబిరంలో 30 మందికి వైద్య చికిత్సలు చేసి మందులు పంపిణీ చేశామని, అవసరమైన వారికి వైద్యం అందించాని డాక్టర దుర్గాబాయి తెలిపారు. వైద్య శిబిరంలో సర్పంచ్ సుధమ్మ, పంచాయతీ, వైద్య సిబ్బంది వెంకటేష్, విజయరాజు, పద్మావతి, శంకర్, ఖలీల్, శకుంతల రోగులకు సేవలు అందించారు. కొనసాగుతున్న వైద్య శిబిరం గ్రామాన్ని సందర్శించిన అధికారులు -
కాంగ్రెస్ నేత హత్యోదంతంలో నలుగురిపై కేసు
ఆలూరు/ఆలూరు రూరల్/చిప్పగిరి: కాంగ్రెస్ పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మార్పీఎస్ రాయలసీమ అధ్యక్షుడు లక్ష్మినారాయణ హత్యోదంతంపై కేసు నమోదు చేసినట్లు సీఐ రవిశంకర్ రెడ్డి సోమవారం విలేకరులకు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం చిప్పగిరి–గంతకల్లు మధ్య దుండగులు లక్ష్మినారాయణ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారును లారీతో గుద్ది వేటకొడవళ్లతో దారుణంగా నరికి హత్య చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు వినోద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైకుంఠం శివప్రసాద్, వైకుంఠం మల్లికార్జున, మల్లేష్, కొండ రామాంజితో పాటు మరికొందరిపై హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామన్నారు. 2006లో టీడీపీ నేత, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ వైకుంఠం శ్రీరాములు దంపతుల హత్యకేసులో లక్ష్మినారాయణ 7వ ముద్దాయి కాగా.. ఈ కేసును 2019లో కోర్టు కొట్టివేసింది. ఇదిలాఉంటే కర్నూలు–అనంతపురం జిల్లాలో సరిహద్దులో జరిగిన లక్ష్మినారాయణ హత్య కేసును అనంతపురం జిల్లా గుంతకల్లు పోలీసు స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు కాగా.. కర్నూలు జిల్లా చిప్పగిరి పోలీసు స్టేషన్‌కు బదలాయించారు. లక్ష్మినారాయణ మృతదేహానికి సోమవారం గుంతకల్లు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ఆయన భౌతికాయాన్ని భారీ పోలీసు బందోబస్తు నడుమ స్వగ్రామమైన చిప్పగిరికి తరలించారు. ఉద్దేశపూర్వకంగానే పికెట్ తొలగింపు: మారెప్ప లక్ష్మినారాయణ హత్యోదంతంపై సీబీఐతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి మూలింటి మారెప్ప డిమాండ్ చేశారు. సోమవారం ఆయన చిప్పగిరిలో లక్ష్మినారాయణ భౌతికాయానికి నివాళులర్పించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన పది నెలల్లో కుల రాజకీయాలకు వత్తాసు పలుకుతూ హత్యా రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నారని ఆరోపించారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే లక్ష్మినారాయణ ఇంటి వద్ద పికెట్‌ను తీసివేశారన్నారు. పికెట్ కొనసాగించాలని హోంమంత్రి అనితకు స్వయంగా తాను విన్నవించినా పట్టించుకోలేదన్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు తదితరులు ఉన్నారు. భారీ బందోబస్తు మధ్య లక్ష్మినారాయణ అంత్యక్రియలు లక్ష్మీనారాయణ అంత్యక్రియలు పూర్తి చిప్పగిరి: గుంతకల్లు – చిప్పగిరి మధ్య ఆదివారం హత్యకు గురైన కాంగ్రెస్ పార్టీ ఆలూరు నియోజక వర్గ ఇన్చార్జ్ లక్ష్మీనారాయణ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం చిప్పగిరిలో సోమవారం పూర్తయ్యాయి. మృతదేహానికి ఎమ్మెల్యే విరుపాక్షి నివాళులు అర్పించగా.. పీసీ అధ్యక్షురాలు షర్మిళ ఫోన్లో కుటుంబ సభ్యలును పరామర్శించి ధైర్యం చెప్పారు. అంత్యక్రియల సందర్భంగా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఏఎస్పీ ఉసేన్ పీరా ఆధ్వర్యంలో 8 మంది సీఐలు, పలువురు ఎస్ఐలతో గట్టి బందోబస్తు నిర్వహించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గ్రామాన్ని, హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. కుటుంభ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఆలూరు సీఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. కాగా నిందితులను కఠినంగా శిక్షించాలని పలువురు నాయకులు, ఎమ్మార్పీఎస్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
విద్యుదాఘాతంతో కేబుల్ ఆపరేటర్ మృతి
రుద్రవరం: మండల కేంద్రంలోని బెస్త కాలనీలో సోమవారం విద్యుదాఘాతంతో కేబుల్ ఆపరేటర్ జనార్దన్(42) మృతి చెందాడు. కాలనీ వాసులు తెలిపిన వివరాలు.. జనార్దన్ కొన్నేళ్లుగా కేబుల్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. అప్పుడప్పుడు విద్యుత్ స్తంభాలకున్న డిష్ తీగలను సరిచేస్తూ ఉండటాన్ని అదిగమనించిన విద్యుత్ లైన్మెన్ ఖాజామొహిద్దీన్.. బెస్త కాలనీకి వెళ్లే ప్రధాన రహదారిలో విద్యుత్ తీగలు సరి చేయాలని కోరాడు. లైన్మెన్ నిచ్చెన పట్టుకోగా కేబుల్ ఆపరేటర్ స్తంభంపైకి చేరుకొని విద్యుత్ తీగలను సరి చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే 108 వాహనంలో నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్సలు అందిస్తుండగానే మృతి చెందినట్లు కాలనీవాసులు తెలిపారు. ఎస్ఐ వరప్రసాదు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. మృతుడి భార్య విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ పెద్ద మృతిచెందడంతో భార్య, పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు. -
పాలిసెట్‌కు సర్వం సిద్ధం
● 30న ప్రవేశ పరీక్ష ● జిల్లాకు 22 పరీక్ష కేంద్రాలు కేటాయింపు ● హాజరుకానున్న 5,700 మంది అభ్యర్థులునంద్యాల(న్యూటౌన్): పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 30న పాలిసెట్–2025 నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. పరీక్షకు గంట ముందుగానే ఆయా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. జిల్లా వ్యాప్తంగా పాలిసెట్‌కు 5,700 మంది దరఖాస్తు చేసుకున్నారు. నంద్యాలలో 13 పరీక్ష కేంద్రాలు కేటాయించారు. ఇందులో 3,747 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. జిల్లాలో 5 కళాశాలలు ప్రభుత్వ పాలిటెక్నిక్ పాటు జిల్లావ్యాప్తంగా 2 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. వీటిల్లో కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో సివిల్ 66, మెకానికల్ 132 సీట్లు ఉండగా, ఐదు ప్రైవేటు కళాశాలల్లో వివిధ కోర్సుల్లో సుమారు 1,500 సీట్లు ఉన్నాయి. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఎంత మంది హాజరవుతారో, వారిలో ర్యాంకులు సాధించేవారెందరో, ర్యాంకు వచ్చినా పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరేందుకు ఎంత మంది ఆసక్తి చూపుతారో చూడాల్సి ఉంది. కొన్నేళ్లుగా కొన్ని కళాశాలల్లో వందల సంఖ్యలో సీట్లు ఉండగా, పదుల సంఖ్యలోనే విద్యార్థులు చేరుతూండటంతో తరగతుల నిర్వహణ ఇబ్బందిగా మారుతున్నట్లు సమాచారం. గంట ముందుగానే ప్రవేశం ● ప్రవేశ పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు. ● పరీక్ష కేంద్రంలోకి ఉదయం 10 గంటల నుంచి అనుమతిస్తారు. ● పరీక్ష ప్రారంభమైన తర్వాత నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోనికి అనుమతించరు. ● విద్యార్థులు హాల్ టికెట్టు, బాల్ పాయింట్ పెన్ను, హెచ్‌బీ పెన్సిల్, ఎరేజర్, షార్ప్‌నర్ తీసుకుని వెళ్లాలి. ● సెల్‌ఫోన్, కాలిక్యులేటర్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. మౌలిక వసతులకు ప్రాధాన్యం పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. కేంద్రాల ఆవరణంలో తాగునీరు, విద్యుత్, వైద్య సేవల వంటి మౌలిక వసతులకు కల్పనకు ప్రాధాన్యమిచ్చాం. – శ్రీనివాసప్రసాద్, జిల్లా కో ఆర్డినేటర్, నంద్యాల -
హామీల అమలుపై చిత్తశుద్ధి లేని ప్రభుత్వం
కర్నూలు సిటీ: ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన మేనిఫెస్టో హామీల అమలుపై ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథ రెడ్డి విమర్శించారు. సోమవారం సలాంఖాన్ భవనంలో ఏర్పాటు చేసిన ఎస్టీయూ జిల్లా ప్రథమ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే సీపీఎస్/జీపీఎస్ విధానాన్ని సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామని, మెరుగైన పీఆర్సీ అమలు చేస్తామని, తాము అధికారాన్ని చేపట్టిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని, పెండింగ్‌లో ఉన్న బకాయిలు విడుదల చేస్తామని అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఆ దిశగా ఆలోచనలు చేయకపోవడం తగదన్నారు. ఇప్పటికై నా 12వ పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటు చేసి, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. జీఓ 117 రద్దు చేసి కొత్త పాఠశాలల విధానాన్ని అమలు చేసేటప్పుడు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సమావేశంలో సంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిమ్మన్న, జిల్లా అధ్యక్షులు ఎస్.గోకారి, కార్యదర్శి టి.కె జనార్దన్, నాయకులు వీరచంద్ర యాదవ్, సి.రమేష్, షఫీ పాల్గొన్నారు. -
ముస్లింల హక్కులు కాలరాస్తున్న బీజేపీ
కర్నూలు(సెంట్రల్): ముస్లింల హక్కులను బీజేపీ కాలరాస్తోందని, వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని సేవ్ వక్ఫ్.. సేవ్ రాజ్యాంగం జేఏసీ ప్రకటించింది. సోమవారం కర్నూలులో జేఏసీ ఆధ్వర్యంలో ముస్లింలు పెద్ద ఎత్తున శాంతి ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది ముస్లింలు రోడ్డెక్కగా కులమతాలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీలు మద్దతు పలికి ర్యాలీలో పాల్గొన్నారు. కూటమి పార్టీలైనా బీజేపీ, టీడీపీ, జనసేన తప్ప మిగిలిన రాజకీయ పార్టీలన్నీ మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ మౌలానా సయ్యద్ జాకీర్ అహ్మద్, కోకన్వీనర్ ఎంఏ హమీద్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వక్ఫ్ చట్ట సవరణ చేశారన్నారు. ఈ కారణంగా తాము రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కోల్పోయే ప్రమాదం ఏర్పడుతోందన్నారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు చోటు కల్పించడం అన్యాయమన్నారు. వక్ఫ్ చట్టాన్ని ప్రజల మద్దతు లేకుండా సవరణ చేశారని, దానిని అమలు చేయడానికి ఎంతమాత్రం వీలు లేదన్నారు. నిలుపుదల చేసే వరకు పోరాటాలు ఉద్ధృతం చేస్తామన్నారు. ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీమోహన్‌రెడ్డి మాట్లాడుతూ వక్ఫ్ పరిరక్షణ ఉద్యమాలకు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్లమెంట్లో చట్ట సవరణకు వ్యతిరేకంగా తమ పార్టీ ఎంపీలతో ఓటు వేయించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్, బిహార్ ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, నితీష్‌కుమార్ వక్ఫ్ సవరణ చట్టానికి మద్దతు తెలిపి ముస్లింలకు తీరని ద్రోహం చేశారన్నారు. ● వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, పార్టీ నాయకుడు అహ్మద్ అలీఖాన్ మాట్లాడుతూ తమ పార్టీ తరపున వక్ఫ్ చట్ట సవరణను రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు వెళ్లినట్లు చెప్పారు. వక్ఫ్ సవరణ చట్టం రద్దు చేసే వరకు జరిగే అన్ని పోరాటాల్లో తమ పార్టీ పాల్గొంటుందన్నారు. ● సీపీఎం, సీపీఐ నాయకులు డి.గౌస్‌దేశాయ్, ఎస్ఎండీ షరీఫ్, పి.రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులపై కన్నేసి చట్ట సవరణ చేసిందన్నారు. దానిని రద్దు చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. అనంతరం కలెక్టర్ పి.రంజిత్‌బాషాకు జేఏసీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. నిరసనలో జైరాజ్(బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు), దాసరి ఎర్రన్న(కార్యదర్శి), అబ్దుల్లాఖాన్, జహంగీర్(ఎస్డీపీఐ), సయ్యద్ ఖాలిద్(ప్రాసిక్యూషన్ రిటైర్డ్ జేడీ), తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ సాగిందిలా.. ఉస్మానియా కాలేజీ ఆవరణలోని ఉర్దూ అరబిక్ పాఠశాల నుంచి ర్యాలీ ప్రారంభమైంది. వడ్డెగేరి, చిల్డ్రన్‌పార్కు, రాజ్‌విహార్ వరకు కొనసాగింది. అక్కడికి వెంకటరమణ కాలనీ, కొత్తబస్టాండ్, కల్లూరు తదితర ప్రాంతాల నుంచి కూడా కొన్ని ర్యాలీలు వచ్చి రాజ్‌విహార్ చేరుకున్నాయి. వీరంతా కలిసి వేలాది మంది ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఇక్కడ గాంధీ విగ్రహం ఎదుట వక్ఫ్ చట్ట సవరణ బిల్లును రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు.వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కు తీసుకునే వరకు పోరాటం కర్నూలులో సేవ్ వక్ఫ్.. సేవ్ రాజ్యాగం జేఏసీ ఆధ్వర్యంలో ముస్లింల భారీ ర్యాలీ మద్దతు ప్రకటించిన వైఎస్సార్సీపీ, కమ్యూనిస్టులతో పాటు విద్యార్థి, యుజవన, ప్రజా సంఘాలు -
టీడీపీ కార్యకర్తలకే డ్రోన్లు
● ఉమ్మడి జిల్లాకు 80 మంజారు ● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే అందుబాటులోకి సేవలు ● అప్పట్లో మహిళా సంఘాలకు ఉచితంగా 8 సరఫరా ● శిక్షణ ధ్రువపత్రాలు ఇచ్చిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ● కూటమి ప్రభుత్వం అప్పటి గ్రూపులను పక్కన పెట్టిన వైనం ● టీడీపీ కార్యకర్తలతో ఎఫ్ఎంబీ కిసాన్ డ్రోన్ గ్రూపుల ఏర్పాటు కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయంలో పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకునేందుకు సాంకేతికత దోహద పడుతోంది. ఇందులో భాగంగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల వారీగా(ఆర్ఎస్కేలు) వైఎస్సార్ యంత్రసేవ పథకం కింద కస్టమ్ హయరింగ్ సెంటర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లు అందుబాటులోకి తెచ్చింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సులభంగా, వేగంగా పురుగు మందుల పిచికారీ కోసం డ్రోన్లను కూడా వినియోగంలోకి తీసుకొచ్చింది. నాటి ప్రభుత్వ చొరవతో వివిధ ఎరువుల కంపెనీలు 8 డ్రోన్లు మహిళా గ్రూపులకు సరఫరా చేశా యి. ఐదు కోరమాండల్ కంపెనీ, ఇప్కో, ీపీపీఎల్, ఆర్సీఎఫ్ కంపెనీలు ఒక్కొక్కటి చొప్పున అందించాయి. డ్రోన్ల వినియోగానికి ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేసి పైలెట్ శిక్షణ కూడా ఇప్పించారు. 2023–24లోనే ఈ గ్రూపులకు సబ్సిడీపై డ్రోన్లు ఇవ్వాలని తలపెట్టినప్పటికీ ఎన్నికల కోడ్ రావడం వల్ల సాధ్యం కాలేదు. కూటమి ప్రభుత్వం కూడా డ్రోన్ సేవలను రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. విశేషమేమంటే టీడీపీ కార్యకర్తలకే డ్రోన్లను మంజూరు చేస్తుండటం గమనార్హం. 2023–24లో రాజకీయాలకు అతీతంగా అర్హులైన వారితో ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేసి ఇవ్వాలని తలపెట్టింది. కూటమి ప్రభుత్వం కూడా మొదట్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పైలెట్ శిక్షణ పొందిన వారిలో ఆసక్తి ఉన్న గ్రూపులకు డ్రోన్లు ఇవ్వాలని తలపెట్టింది. అయితే ఆ ప్రభుత్వంలో ఎంపిక చేసిన వారికి ఇవ్వడం తగదని కూటమి పార్టీల నేతలు ఒత్తిడి తెచ్చి టీడీపీ కార్యకర్తలకే మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టడం గమనార్హం. టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జీ లు రెకమెండ్ చేసిన కార్యకర్తలకే డ్రోన్లు అంటూ ప్రచారం జోరుగా జరుగుతోంది. నాడు శిక్షణ సర్టిఫికెట్లు పొందినా.. గత ౖవైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కర్నూలు జిల్లాలో 36 మంది, నంద్యాల జిల్లాలో 35 మంది రిమోట్ పైలెట్ శిక్షణ పొందారు. వీరిలో అగ్రికల్చర్ బీఎస్సీ, అగ్రికల్చర్ డిప్లొమో చేసిన వారు కూడా ఉన్నారు. గుంటూ రులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వీరు 12 రోజుల శిక్షణ తీసుకుని సర్టిఫికెట్లు అందుకున్నారు. 2024 జూన్ నెలలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో డ్రోన్ అందుబాటులోకి రావడం ఆలస్యమైంది. ఆ తర్వాత కూడా ఏడాది జాప్యం చేశారు. ఎట్టకేలకు 2025–26లో డ్రోన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే వైఎస్సార్ సీపీ పాలనలో ఎంపిక చేసిన గ్రూపులను, రిమోట్ పైలెట్లను పక్కన పెట్టడం విమర్శలకు తావిస్తోంది. కొందరు వ్యవసాయ అధికారులే సంబంధిత ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలతో మాట్లాడు కోవాలని సూచిస్తుండటం గమనార్హం. టీడీపీ మద్దతుదారులు, సానుభూతి పరులనే ఎంపిక చేస్తుండటంతో తమ పరిస్థితి ఏమిటని శిక్షణ పొందిన వారు ప్రశ్నిస్తున్నారు. కర్నూలు జిల్లాలో వైఎస్సార్సీపీ హయాంలో రిమోట్ పైలెట్‌గా శిక్షణ పొందిన వారిలో కూటమి ప్రభుత్వంలో కూడా కొందరికి అవకాశం ఇచ్చారు. శిక్షణ పొందిన వారు సంబంధిత ఎమ్మెల్యేలను కలువడంతో ఇది సాధ్యమైంది. జిల్లాలో 36 మంది పైలెట్ శిక్షణ పొందితే 10 మందికి పైగా అవకాశం దక్కించుకున్నారు. నంద్యాల జిల్లాలో మాత్రం గత ప్రభుత్వంలో శిక్షణ పొందిన వారందరినీ ౖవైఎస్సార్‌సీపీ ముద్ర వేసి పక్కన పెట్టడం గమనార్హం. కూటమి ప్రభుత్వం అర్హతలను పక్కన పెట్టి కార్యకర్తలకే పెద్దపీట వేసింది. అర్హతలను పట్టించుకోకుండా పైలెట్ శిక్షణకు పంపుతుండటం మితిమీరిన రాజకీయానికి నిదర్శనం. ఉమ్మడి జిల్లాకు 80 డ్రోన్లు మంజూరు కూటమి ప్రభుత్వం ఉమ్మడి కర్నూలు జిల్లాకు 80 డ్రోన్లను మంజూరు చేసింది. కర్నూలు జిల్లాకు 40, నంద్యాల జిల్లాకు 40 ప్రకారం కేటాయించారు. టీడీపీ కార్యకర్తలతో ఏర్పాటైన ఎఫ్ఎంబీ కిసాన్ డ్రోన్ గ్రూపులకు మంజూరు చేస్తోంది. వీటి సరఫరాకు డ్రోగో, విహంగ కంపెనీలను ఎంపిక చేసింది. డ్రోగో కంపెనీ డ్రోన్ పూర్తి ధర రూ.9.80 లక్షలు, విహంగ కంపెనీ డ్రోన్ ధర రూ.9.81 లక్షలు. ఇందులో ప్రభుత్వం 80 శాతం సబ్సిడీ ఇస్తుంది. అయితే 50 శాతం మొత్తానికి బ్యాంకులు రుణాలు ఇస్తాయి. మిగిలిన 50 శాతం కిసాన్ డ్రోన్ గ్రూపులు భరిస్తాయి. ఎఫ్ఎంబీ కిసాన్ డ్రోన్ గ్రూపులో ఐదుగురు సభ్యులు ఉంటారు. గ్రూపు సభ్యులు పైలెట్‌గా ఎంపిక చేసుకున్న వారికి ప్రభుత్వం శిక్షణ ఇస్తుంది. ఈ పైలెట్ కనీసం మూడేళ్లు పనిచేయాల్సి ఉంది. మధ్యలో మానుకోవాలనుకుంటే రూ.70 వేలు చెల్లించాలనే నిబంధన పెట్టారు. డ్రోన్ల సామర్థ్యం 25 లీటర్లు.నంద్యాల జిల్లాలో వైఎస్సార్సీపీ ముద్ర వేసి.. -
ఎంపీడీఓలకు మండలాలు కేటాయింపు
కర్నూలు(అర్బన్): ఉమ్మడి జిల్లాలో ఎంపీడీఓలు గా పదోన్నతులు పొందిన పరిపాలనాధికారులు, డిప్యూటీ ఎంపీడీఓలకు మండలాలు కేటాయించినట్లు జిల్లా పరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆయా మండలాలకు నియమితులైన ఎంపీడీఓలకు జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఉత్తర్వులను అందించారు. ఈ సందర్భంగా సీఈ ఓ నాసరరెడ్డి మాట్లాడుతూ బీవీ రమణారావును దేవనకొండ, బీ నూర్జహాన్ను మంత్రాలయం, కె.విజయశేఖర్రావును కౌతాళం, జి.ప్రభావతిదేవిని పెద్దకడుబూరు, ఎ.మద్దిలేటి స్వామిని ఆలూ రుకు నియమించామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఉచిత విద్య ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు కర్నూలు సిటీ: విద్యాహక్కు చట్టం ప్రకారం 2025–26 విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్య ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు డీఈఓ ఎస్.శామ్యూల్ పాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాల్సి ఉందన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి ఉచిత విద్యను అందించే జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలు గడువులోపు తమ వివరాలను విద్యాశాఖ వెబ్సైట్ htts://cse.ap.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు. విద్యార్థులు మే నెల 2 నుంచి 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఐబీ, సీబీఎస్ఈ, ఐసీఎస్సీ సిలబస్ పాఠశాలల్లో ప్రవేశాలకు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేది నాటికి ఐదేళ్ల వయస్సు, స్టేట్ సిలబస్ పాఠశాలల్లో ప్రవేశాలకు జూన్ 1వ తేది నాటికి ఐదేళ్ల వయస్సు నిండిన పిల్లలు దరఖాస్తుకు అర్హులన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల డేటా ఆధారంగా వచ్చే నెల 20 నుంచి 24వ తేదీ వరకు విద్యార్థుల ప్రవేశాలకు అర్హతల ఆధారంగా లాటరీ తీస్తామన్నారు. 29న లాటరీ ఫలితాలను విడుదల చేసి, జూన్ 8వ తేదీన ప్రవేశాల నిర్ధారణ చేస్తారని, రెండో విడత జూన్ 11న సీట్ల కేటాయింపు జాబితా విడుదల చేసి, 18న ప్రవేశాల నిర్ధారణ చేస్తామన్నారు.బీఈడీ సెమిస్టర్ పరీక్షలకు 392 మంది గైర్హాజరు కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహిస్తున్న బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షల్లో భాగంగా సోమవారం జరిగిన పరీక్షలకు 392 మంది గైర్హాజరయ్యారు. 3,384 మందికి 2,992 మంది ఛాత్రోపాధ్యాయులు హాజరు కాగా 392 మంది గైర్హాజరయ్యారని, వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఇద్దరు విద్యార్థులు చూచిరాతలకు పాల్పడగా వారిని డిబార్ చేసినట్లు తెలిపారు. ఏఓలుగా ముగ్గురికి పదోన్నతి కర్నూలు(అర్బన్): జిల్లాపరిషత్ పరిధిలో సీనియర్ సహాయకులుగా పనిచేస్తున్న ముగ్గురికి పరిపాలన అధికారులుగా పదోన్నతి కల్పించినట్లు జిల్లాపరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పదోన్నతి పొందిన వీవీ రామసుబ్బయ్యను ఆళ్లగడ్డ మండల పరిషత్‌కు, ఎం.మహమ్మద్ హక్‌ను కల్లూరు ఎంపీపీకి, ఎ.మధుసూదనయ్యను జూపాడుబంగ్లా మండల పరిషత్ కార్యాలయానికి కేటాయించామన్నారు. డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు చైర్మన్లు ● డీసీసీబీ చైర్మన్‌గా ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్‌గా నాగేశ్వరరావు యాదవ్ కర్నూలు(అగ్రికల్చర్): కూటమి ప్రభుత్వం ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, ఉమ్మడి జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలకు చైర్మన్లను ప్రకటించింది. సహకార సంఘాలు, డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ ఉంది. అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇదిలాఉంటే జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్‌గా కోడుమూరు నియోజకవర్గం ఎదురూరు గ్రామానికి చెందిన టీడీపీ నేత డి.విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్‌గా డోన్ నియోజక వర్గం చండ్రపల్లి గ్రామానికి చెందిన జి.నాగేశ్వరరావు పేర్లను ప్రకటించారు. అయితే జీవోలు విడుదల కావాల్సి ఉంది. -
ఏజీబీఎస్సీ చేసిన యువకుడినీ పక్కనపెట్టారు
సర్టిఫికెట్లు ఏం చేసుకోవాలి అగ్రికల్చర్ డిప్లొమా పూర్తయింది. 2024 జనవరి 5 నుంచి 16వ తేదీ వరకు డ్రోన్ రిమోట్ పైలెట్‌గా శిక్షణ తీసుకున్నా. ఇలాగైనా ఉపాధి లభిస్తుందని ఆశపడ్డా. ప్రభుత్వం మారడంతో మమ్మల్ని పక్కనపెట్టేశారు. శిక్షణ పొందిన సర్టిఫికెట్లు ఏం చేసుకోవాలి. నిరుద్యోగుల విషయంలోనూ రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసం. – ముత్యాలరాజు, వెల్దుర్తి గ్రామం కల్లూరు మండలం పుసులూరు గ్రామానికి చెందిన యువకుడు అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేశాడు. వ్యవసాయం పట్ల అతనికున్న ఆసక్తిని గమనించి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో డ్రోన్ పైలెట్‌గా ఎంపిక చేశారు. రైతులకు సేవ చేసేందుకు అవకాశం కలిసి వచ్చిందని అతను ఎంతో సంతోషించాడు. ఆచార్యా ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 12 రోజులు రిమోట్ పైలెట్ శిక్షణ కూడా తీసుకున్నాడు. కూటమి ప్రభుత్వం ఆధికారంలోకి రావడంతో టీడీపీ నేతలు ‘తమ్ముళ్ల’ కోసం ఇతడిని పక్కన పెట్టేయడం గమనార్హం. -
అకాల వర్షాలతో ఉద్యాన పంటలకు నష్టం
కర్నూలు(అగ్రికల్చర్): అకాల వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని మిగుల్చుతున్నాయి. రెండు రోజులుగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షాలతో ఉద్యాన పంట లు భారీగా దెబ్బతిన్నాయి. కర్నూలు జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి హొళగుంద, కౌతాళం, మంత్రాలయం మండలాలు మినహా అన్ని మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. ఉమ్మడి జిల్లాలో అకాల వర్షాల వల్ల వరి, మిర్చి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. ఆదోని, ఆలూరు మండలాల్లో బొప్పాయ కేవలం 3.5 హెక్టార్లలో దెబ్బతిన్నట్లుగా ఉద్యాన అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. 100 హెక్టార్ల వరకు దెబ్బతిన్నప్పటికీ తూతూమంత్రంగా నమో దు చేయడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. నంద్యాల జిల్లాలో బనగానపల్లె, కొలిమిగుండ్ల మండలాల్లో అరటి 10 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా తేల్చారు. ఈ మండలాలతో పాటు బేతంచెర్ల మండలంలో మామిడికి భారీ నష్టం కలిగింది. 33 శాతం పైగా మామిడి నేల రాలి నట్లు ఉద్యాన అధికారులు గుర్తించారు. కాగా సోమ వారం సాయంత్రం నుంచి నంద్యాల జిల్లాలో కురిసిన వర్షాలు, పెనుగాలులకు వరి, మొక్కజొన్న, కొర్ర, మినుము పంటలు దాదాపు 1,321 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. బండిఆత్మకూరు మండలంలో 402 హెక్టార్లు, మహానందిలో 325, నంద్యాలలో 15, ఆళ్లగడ్డలో 81, అవుకులో 308, చాగలమర్రి మండలంలో 190 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. -
అర్జీల పరిష్కారంపై ఆడిట్
కర్నూలు(సెంట్రల్): పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్(పీజీఆర్ఎస్)లో వచ్చిన అర్జీల పరిష్కారంపై ఆయా శాఖల అధికారులు ఆడిట్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా, జేసీ డాక్టర్ బి.నవ్య ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సేవలకు సంబంధించి ప్రజల నుంచి ఫీడ్ బ్యాకు తీసుకుంటున్నారని, ఇందుకు సంబంధించి మొదటి సారి ఫిర్యాదు వచ్చినప్పుడు సంబంధిత వ్యక్తిని పిలిపించి మాట్లాడాలన్నారు. రెండుసార్లు అయితే జాయింట్ కలెక్టర్, మూడోసారి అయితే కలెక్టర్ పిలిపించి మాట్లాడతారన్నారు. సిటిజన్ చార్టు ఫీడ్ బ్యాక్‌పై మండలాల వారీగా సమీక్షలు నిర్వహించి లోపాలు ఉంటే సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓలను ఆదేశించారు. మద్దికెర, హాలహర్వి, వెల్దుర్తి మండలాల తహసీల్దార్లు ప్రజల సమస్యలను ఓపిగ్గా వినడం లేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే ఫిర్యాదుల పరిష్కారంలో గోనెగొండ్ల, మద్దికెర, హాలహర్వి, కర్నూలు అర్బన్ మండలాలు వెనుకబడ్డాయన్నారు. కార్యక్ర మంలో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ● శ్రీరామ రెసిడెన్సీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీలో నివాసం ఉంటున్న ఏఆర్ కానిస్టేబుల్ శ్యామ్ విద్యాసాగర్, అతని కుమారులు మహిళలు, పిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కాలనీ వాసులుఫిర్యాదు చేశారు. తమకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చంపుతామని బెదిరిస్తున్నారని, అసోసియేషన్ సభ్యులపై అనవసరంగా అక్రమ ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి వేధిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. -
ఆదోని మున్సిపల్ తాత్కాలిక చైర్మన్‌గా ఎంఎం గౌస్
ఆదోని టౌన్: ఆదోని మున్సిపల్ తాత్కా లిక చైర్మన్‌గా ఎంఎం గౌస్‌ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి సోమవారం ఆదేశాలు జారీ చేశారని మున్సిపల్ కమిషనర్ ఎం.కృష్ణ తెలిపారు. ఎంఎం గౌస్ మున్సిపల్ వైస్ చైర్మన్–1గా కొనసాగుతున్నారు. అయితే మున్సిపల్ చైర్పర్సన్ బోయ శాంతపై ఈనెల 16వ తేదీన పాలకవర్గ సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆమెను పదవి నుంచి తొలగిస్తూ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. ఈ మేరకు వైస్ చైర్మన్–1 ఎంఎం గౌస్‌ను తాత్కాలిక మున్సిపల్ చైర్మన్‌గా కొనసాగాలని ఉత్తర్వు లు అందాయన్నారు. త్వరలో చైర్మన్ ఎన్నికపై పాలకవర్గ సభ్యులతో సమావేశం ఉంటుందన్నారు. -
మేలో పూర్తి స్థాయిలో దిగుబడి
జనవరి నెలలో ఈ పంట పూత దశ ఉన్న సమయంలో తేనే మంచుపురుగు ఆశించి కొంత మేర దెబ్బతిన్నా సస్యరక్షణ చర్యలతో దిగుబడి ఆశాజనకంగానే ఉంది. వారం రోజులుగా దిగుబడి లభిస్తుండగా మే నెలలో పూర్తి స్థాయిలో దిగుబడి మార్కెట్‌కు చేరుతుంది. – అబ్దుల్ హమీద్, మామిడి తోటల యజమాని, బనగానపల్లె గతేడాది కంటే తక్కువ ధర గతేడాది వంద మామిడి పండ్లు రూ. ఐదారు వేల వరకు విక్రయించగా ఈ సంవత్సరం రూ. నాలుగైదు వేలకు మించడం లేదు. పండ్లు నాణ్యతగా ఉన్నాయి. వ్యాపారం కూడా పదిరోజుల్లో ఊపందుకుంటుందని అనుకుంటున్నాం. బంగినపల్లి రకం రుచి అద్భుతంగా ఉంటుంది. – ఖాదర్‌వలి, పండ్లవ్యాపారి, బనగానపల్లె -
మత్స్యకారులను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
కర్నూలు(అర్బన్): రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మత్స్యకారులను తీవ్రంగా మోసం చేస్తున్నదని జాతీయ మత్స్యకారుల సంఘం జిల్లా అధ్యక్షులు బెస్త శ్రీనివాసులు తీవ్రంగా ఆరోపించారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ జిల్లాలకు మత్స్యకార భరోసా ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేది వరకు 61 రోజుల పాటు రాష్ట్రంలో చేపల వేట జరగకుండా వెయిటర్ నిషేధం విధించిన సమయంలో రాష్ట్రంలోని మత్స్యకారులందరికీ భృతి చెల్లించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. అయితే ఇంగ్లాండ్ చెరువులపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో భృతి చెల్లించకపోవడం దారుణమన్నారు. రాయలసీమలోని మత్స్యకార సొసైటీలు కూడా చేపల పెంపకానికి చెరువులకు పన్ను చెల్లిస్తున్నప్పుడు మత్స్యకార భరోసాకు వారు ఎందుకు అర్హులు కారని ప్రశ్నించారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని విడనాడి అందరికీ న్యాయం చేయాలన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మత్స్యకారులకు రాజకీయంగా పెద్ద పీట వేశారని, ఒక రాజ్యసభ, ఒక మంత్రి, నాలుగు ఎమ్మెల్సీలు, నాలుగు పార్టీ జిల్లా అధ్యక్ష పదవులు, బ్యాంకు చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు తదితర అనేక పదవులు ఇచ్చారని శ్రీనివాసులు గుర్తు చేశారు. నేడు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తు ప్రాంతాల వారీగా మత్స్యకారులను విడదీసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఇప్పటి వరకు మత్స్యకారులను కూటమి ప్రభుత్వం గుర్తించిన దాఖలాలు లేవన్నారు. ఇప్పటికై నా సంప్రదాయ మత్స్యకారులు చంద్రబాబు కుటిల రాజకీయాలను తిప్పికొట్టాలన్నారు. సమావేశంలో నాయకులు బెస్త సత్యనారాయణ, ఎద్దుల వెంకటేశ్వర్లు, బెస్త కమల, తెలుగు కన్నా, నంద కిషోర్, మోహన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. జాతీయ మత్స్యకారుల సంఘం జిల్లా అధ్యక్షులు బెస్త శ్రీనివాసులు -
ప్రాణం తీసిన విద్యుదాఘాతం
సి.బెళగల్: విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బురాన్‌దొడ్డి గ్రామానికి చెందిన బోయ కాలప్ప (40).. సి.బెళగల్ గ్రామ శివారులోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ పక్కనున్న బండల డిపోలో కట్టర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం బండల డిపోలో పని చేసుకుంటుండగా వైరు పాడైపోయి ఉండటంతో రేకుల షెడ్‌కు విద్యుత్ ప్రసారం అయ్యింది. గమనించని కాలప్ప.. షెడ్ రేకులను తాకడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మృతుడి భార్య లక్ష్మి సంఘటన స్థలానికి చేరుకుని రోదించిన తీరు పలువురను కంటతడి పెట్టించింది. బోయ కాలప్పకు భార్యతో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. విద్యుత్ తీగల నిర్వహణలో బండల డిపో యజమాని నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని మృతుడి బంధువులు ఆరోపించారు. యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానిక పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. హెడ్ కానిస్టేబుల్ తిమ్మప్ప సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను నమోదు చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 5 నుంచి రంగస్థల నటనపై శిక్షణ కర్నూలు కల్చరల్: టీజీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో మే 5వ తేదీ నుంచి రంగస్థల నటనపై శిక్షణ ఇస్తున్నట్లు కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య తెలిపారు. వేసవి సెలవుల నేపథ్యంలో మే 3వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు. ఎంపికై న వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. 16 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉండి, 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు. నట శిక్షకులు, నాటక దర్శకులు జల్లుకుమార్ (చైన్నె)చే 5 నుంచి 15వ తేదీ వరకు ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. శిక్షణ పొందిన వారిచే 16వ తేదీన నాటక ప్రదర్శన ఉంటుందని తెలిపారు. -
శ్రీశైలంలో భక్తుల సందడి
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజామున్నే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. పలువురు భక్తులు ఆన్లైన్ ద్వారా టికెట్లు పొంది స్వామివారి స్పర్శదర్శనం చేసుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులన్ని కిటకిటలాడాయి. సమస్యల పరిష్కారానికి కృషి కర్నూలు(సెంట్రల్): న్యాయశాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తగిన కృషి చేస్తానని కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా భరోసా ఇచ్చారు. ఆదివారం సాయంత్రం కర్నూలు జిల్లా జ్యూడిషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవేంద్రగౌడ్, జనరల్ సెక్రటరీ గోపాల్ ఆధ్వర్యంలో పలువురు ఉద్యోగులు కలెక్టర్‌ను ఆయన చాంబరులో మర్యాదపూర్వకంగా కలిశారు. న్యాయశాఖ ఉద్యోగులకు అన్ని వేళల సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ తెలిపినట్లు వారు వివరించారు. ట్రెజరర్ శివరాముడు, సలహాదారు రాముడు, కార్యదర్శులు రాఘవరెడ్డి, రమేష్, సభ్యుడు రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ప్రశాంతంగా ‘గురుకుల’ పరీక్ష ఆదోని సెంట్రల్: ఆంధ్రప్రదేశ్ మహాత్మా జ్యోతిరావ్ పూలే గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష ఆది వారం ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో 2,497 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 2,273 మంది పరీక్ష రాసినట్లు జిల్లా కో అర్డినేటర్ య మునాదేవి తెలిపారు. ఆదోని డివిజన్ పరిధిలో ఏడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. హ్యాండ్‌బాల్ చాంపియన్ ‘కర్నూలు’ కర్నూలు (టౌన్)/ కదిరి అర్బన్: శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణం ఎస్టీఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజులుగా జరిగిన 54వ రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో కర్నూలు జట్టు చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకుంది. మొత్తం 16 జట్లు ఈ టోర్నీలో పాల్గొన్నాయి. ఆదివారం టోర్నీ ముగిసింది. ప్రథమ స్థానం కర్నూలు, ద్వితీయ స్థానం పశ్చిమగోదావరి, తృతీయ స్థానంలో శ్రీసత్యసాయి జిల్లా జట్లు నిలిచాయి. విజేత జట్టుకు సీనియర్ హ్యాండ్‌బాల్ క్రీడాకారుడు ప్రసాద్ ట్రోఫీని ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి మహేష్‌తో పాటు పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. ‘వేదావతి’లో ఇసుక దోపిడీ హొళగుంద: వేదావతి(హగరి) నుంచి అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నారు. దీంతో నదిలో రాళ్లు, రప్పలు కనిపిస్తున్నాయి. హొళగుంద మండల పరిధిలోని మార్లమడికి వద్ద ఈ దుస్థితి నెలకొంది. ఉచితంగా ఇసుక తీసుకునేందుకు అనుమతి ఉంది. అయితే నిబంధనలను పాటించడం లేదు. దీంతో వేదావతి నది నుంచి అక్రమంగా ఇసుకను పట్టణాలకు తరలిస్తున్నారు. ఫలితంగా భూగర్భ జలాలు ఇంకి పోయి నదిలో రాళ్లు తేలాయి. ఈ నదిలోనే ముందుకు వెళితే కర్ణాటక రాష్ట్రంలోని రారావి వద్ద ఇసుక మేటలు కనిపిస్తాయి. -
విదేశీ పక్షులకు ఆతిథ్యం
ఆత్మీయంనీరు ఉండే ప్రాంతంలో చేపల కోసం కొంగల నిరీక్షణకొన్ని తెల్ల కొంగలు.. మరికొన్ని నల్ల కొంగలు తుంగభద్రా నదీ తీరంలో సందడి చేస్తున్నారు. నల్ల కొంగలు విదేశాల నుంచి విహరిస్తూ వచ్చాయి. వీటితో తెల్ల కొంగల కలసి సంచరిస్తున్నాయి. తుంగభద్ర నదిలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే గుంతల్లో నీరు కనిపిస్తోంది. ఆ నీటిలో చేపలను వేటాడేందుకు ఇవి గుంపులుగా నిరీక్షిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
ఉగ్రవాదులను అంతం చేయాలి
కర్నూలు (టౌన్): ఉగ్రవాదులను అంతం చేయాలని పలువురు నేతలు, వివిధ పార్టీలకు చెందిన నేతలు అన్నారు. అమాయకులను పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ దేశంపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అన్నారు. కశ్మీర్లో ఉగ్రవాదుల హత్యాకాండను నిరసిస్తూ ఆదివారం రాత్రి కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద ‘ హిందూస్థాన్ జిందాబాద్.. పాకిస్తాన్ ముర్థాబాద్’ అన్న బ్యానర్ ప్రదర్శించారు. కశ్మీర్లో మృతి చెందిన వారికి కొవ్వొత్తులతో నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఖాజీ అబ్దుల్ సలామ్ మాట్లాడుతూ.. కశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిని ప్రతి భారతీయుడు కులాలకు, మతాలకు అతీతంగా ఖండిస్తున్నారన్నారు. ఉగ్రవాదులను సమూలంగా నిర్మూలించాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి భారతదేశం సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. కశ్మీర్ ఘటనను ప్రతి భారతీయుడు స్వచ్ఛందంగా ఖండిస్తున్నారన్నారు. టెర్రరిస్టులపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు. కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామన్నారు. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ బహిరంగంగా ప్రకటించిందన్నారు. కేడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ విజయ మనోహరి మాట్లాడుతూ.. దేశంలో ఉగ్రవాద చర్యలు సమూలంగా నిర్మూలించాలన్నారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, వైఎస్సార్సీపీ నాయకులు, పార్టీ అనుబంధ నాయకులు పాల్గొన్నారు. కర్నూలులో కొవ్వొత్తులతో ప్రదర్శన -
ఉరిమిన వర్షం.. పిడుగులా నష్టం!
అప్రమ్తతంగా ఉండాలి కర్నూలు(సెంట్రల్): జిల్లాలో నాలుగైదు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పి.రంజిత్‌బాషా ఆదివారం రాత్రి ఒక ప్రక టనలో తెలిపారు. ఉరుములతో వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉండడంతో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండ కూ డదని సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు, గొర్రెలు మేపేవారు సమీపంలోని సురక్షిత భవనాల్లోకి వెళ్లి ప్రాణాపాయం నుంచి సురక్షితంగా ఉండాలన్నారు. కర్నూలు(అగ్రికల్చర్): ఉరుములు, మెరుపులు, పి డుగులు, భారీ గాలులతో ఉన్నట్టుండి ఆదివారం మధ్యాహ్నం కురిసిన వర్షం రైతులను నిలువునా ముంచింది. తీవ్ర నష్టం మిగిల్చింది. ఉమ్మడి కర్నూ లు జిల్లాలో ఐదు చోట్ల పిడుగుపాటు ఘటనలు చోటు చేసుకోగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయా రు. అకాల వర్షంతో కల్లాల్లో ఉన్న వరి ధాన్యం తడిచి పోయింది, పెనుగాలుల తీవ్రతకు అరటి, బొప్పాయి, మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. నష్టం ఇలా.. ● కౌతాళం మండలం నదిచాగి, మేళిగనూరు గ్రామాల్లోని రైతులు వారం క్రితం వరిని కోసి ధాన్యాన్ని కల్లాల్లో నిల్వ ఉంచారు. అకాల వర్షంతో తడిచి ముద్ద అయ్యింది. ● నందవరం మండలంలో 1,250 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇప్పటికే 1,100 ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయి. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడవటంతో రైతులకు నష్టం మిగిలింది. ● హొళగుంద మండలంలో గజ్జహళ్లి, వందవాగిలిగ్రామాల్లో వరి పైరు నేలకొరిగింది. గింజలు నేల పాలయ్యాయి. దిగుబడి చేతికొచ్చే సమయంలో ఇలా జరుగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ● కృష్ణగిరి మండలంలోని కొన్ని గ్రామాల్లో పొలాల్లో ఉన్న మిరప పంట, పొగాకు ఉత్పత్తులు వర్షానికి తడిచిపోయాయి. ● హాలహర్వి మండలంలోని బిలేహాల్ గ్రామానికి చెందిన గోపాల్ అనే రైతు రెండు ఎకరాల్లో బొప్పాయి పంట నేలమట్టం అయ్యింది. దాదాపు రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు. ● విరుపాపురం, సుళువాయి తదితర ప్రాంతాల్లో మామిడి చెట్లు, బొప్పాయి చెట్లు నేలమట్టమయ్యాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం వచ్చింది. కాత్రికి గ్రామంలో విషాదం కౌతాళం మండలం కాత్రికి గ్రామంలో పిడుగు పడి అశోక్(21), బాలయ్య (22) మృతి చెందారు. అలాగే నిరుపాధి, గంగాధర్ తీవ్రంగా గాయపడ్డారు. క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా గాలీవాన మొదలై వర్షం ఎక్కువ కావడంతో సమీపంలోని చెట్టు కిందకు చేరుకోవడంతో పిడుగు పడి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ● కృష్ణగిరి మండలం కటారుకొండ గ్రామంలో పొలానికి వెల్లిన బోయ శ్రీనివాసులు అనే రైతు పిడుగుపాటు పడి మృతి చెందారు. కల్లాల్లో తడిచిన వరి ధాన్యం నేలరాలిన బొప్పాయి, మామిడి పిడుగుపాటుతో ముగ్గురు మృతి -
పిడుగు పడి రెండు ఎద్దులు మృతి
పెద్దకడబూరు: మండల పరిధిలోని రంగాపురం గ్రామంలో ఆదివారం పిడుగు పడి చిన్న మాదన్న అనే రైతుకు చెందిన రెండు ఎద్దులు మృత్యువాత పడ్డాయి. బాధిత రైతు, స్థానికుల వివరాల మేరకు.. చిన్న మాదన్న ఎప్పటి లాగే (గ్రామానికి సమీపంలో ఉన్న) పొలానికి తీసుకెళ్లి అక్కడ ఎద్దులను కట్టేసి ఇంటికి వెళ్లాడు. మధ్నాహ్నం వాటిపై పిడుగు పడటంతో మృతి చెందాయి. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి బాధిత రైతుకు సమాచారం అందించారు. కుటుంబసభ్యులు వెళ్లి విగతజీవులుగా పడిఉన్న ఎద్దులను చూసి బోరున విలపించారు. దాదాపు రూ. 1.80లక్షలు ఆస్తి నష్టం వాటిల్లినట్లు చిన్న మాదన్న వాపోయాడు. కష్టం చేసుకుని బతికే తమకు రెండు ఎద్దులు చనిపోవడంతో చేతులు విరిగినట్లు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. -
హంతకులను తక్షణమే అరెస్టు చేయాలి
● సీడబ్ల్యూసీ సభ్యుడు ఎన్.రఘువీరారెడ్డి కర్నూలు(సెంట్రల్): ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణను హత్య చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. కర్నూలు, అనంతపురం జిల్లాల ఎస్పీలతో ఫోన్లో మాట్లాడినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. కాగా.. లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులను ఎన్.రఘువీరారెడ్డితో పాటు కర్నూలు జిల్లా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి అంబటి రామకృష్ణ యాదవ్ ఫోన్లో మాట్లాడి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పరిపాలనాధికారిగా పదోన్నతి కర్నూలు(అర్బన్): జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తూ జిల్లాల పునర్విభజనలో నంద్యాలకు వెళ్లిన జీఎన్ఏ ప్రసాద్‌కు పరిపాలనాధికారిగా పదోన్నతి లభించింది. జోన్–4లో జరిగిన పదోన్నతుల్లో భాగంగా ప్రసాద్‌ను శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ డీఎల్పీఓ కార్యాలయానికి పోస్టింగ్ ఇస్తూ పీఆర్అండ్ఆర్డీ డైరెక్టర్ వీఆర్ క్రిష్ణతేజ మైలవరపు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రసాద్‌కు పరిపాలనాధికారిగా పదోన్నతి లభించడంపై జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయ ఉద్యోగులు, సహచరులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం పట్టివేత గోస్పాడు: పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా గోస్పాడు ఎస్ఐ వెంకటప్రసాద్ పట్టుకున్నారు. బియ్యం బస్తాలతో బనగానపల్లె వైపు వెళ్తున్న బొలెరో వాహనాన్ని మండలంలోని రాయపాడు గ్రామ సమీపంలో గుర్తించి తనిఖీలు చేపట్టారు. మొత్తం 16 బస్తాల బియ్యం ఉండటంతో ఆ వాహనాన్ని సీజ్ చేసి బనగానపల్లెకు చెందిన వంశీ, హుసేని, గిరి అనే వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఉరుముల శబ్దానికి వృద్ధుడి మృతి ప్యాపిలి: పట్టణంలో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. పట్టణంలోని బాలికల వసతి గృహం సమీపంలో నివాసం ఉంటున్న మసాలా బాషా సాహెబ్ (70) ఇంటి వసారాలో కూర్చుని ఉండగా ఒక్కసారిగా ఉరుముల శబ్దం వచ్చింది. ఉరుముల శబ్దంతో గుండెపోటుకు గురైన ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎర్రమట్టి ట్రాక్టర్ల పట్టివేత సి.బెళగల్: మండల కేంద్రం సి.బెళగల్లో అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. శనివారం రాత్రి మండలంలోని గ్రామాల్లో వారు గస్తీ నిర్వహిస్తుండా నిషిద్ధ ప్రాంతమైన సి.బెళగల్ పచ్చిక బయళ్లు ఉన్న కొండ నుంచి ఎర్రమట్టిని తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లు కనబడ్డాయి. వాటిన సీజ్ చేసి రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు హెడ్ కానిస్టేబుల్ తిమ్మప్ప తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా అనుమతి లేకుండా ఎర్రమట్టి తరలిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. -
నేడు కర్నూలులో ముస్లింల శాంతి ర్యాలీ
కర్నూలు(సెంట్రల్): వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని కోరుతూ సోమవారం కర్నూలులో ముస్లింలు భారీ శాంతి ర్యాలీ నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ ర్యాలీకి మతాలు, కులాలకు అతీతంగా రాజకీయ పార్టీలు, వివిధ ప్రజాసంఘాలు మద్దతు ఇవ్వాలని సేవ్ వక్ఫ్..సేవ్ రాజ్యాగం జేఏసీ కన్వీనర్ సయ్యద్ జాకీర్ అహ్మద్, కోకన్వీనర్ ఎంఏ హమీద్ కోరారు. ఆదివారం వక్ఫ్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ..ఉదయం 9 గంటలకు ఉస్మానియా కాలేజీ నుంచి ర్యాలీ ప్రారంభమై వడ్డేగేరి, చిల్డ్రన్స్ పారు మీదుగా రాజ్ విహార్ చేరుకుంటుందన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రారంభమయే ర్యాలీలు రాజ్‌విహార్ చేరుకొని అక్కడి నుంచి కలెక్టరేట్‌కు వస్తాయని చెప్పారు. ర్యాలీలో ప్రభుత్వాలకు ఎవరూ వ్యతిరేకంగా నినాదాలు చేయరాదని సూచించారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు యూనస్‌బాషా, సీపీఎం నాయకుడు ఎస్ఎండీ షరీఫ్, బీఎస్పీ నాయకులు సలీం, జైరాజ్, బుర్రన్న, రాజ్‌కుమార్ పాల్గొన్నారు. -
కురువ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కురువ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందించేందుకు తీర్మానించినట్లు జిల్లా కురువ సంఘం నేతలు తెలిపారు. ఆదివారం సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో గౌరవాధ్యక్షులు కే కిష్టన్న, అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న, ప్రధాన కార్యదర్శి ఎంకే రంగస్వామి, మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీలీలమ్మ, ప్రధాన కార్యదర్శి అనిత హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024–25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రతిభా పురస్కారాలను అందించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠఠశాలల్లో 10వ తరగతిలో 500 మార్కులకు పైగా, ప్రైవేటు పాఠశాలల్లోని వారు 550కి పైగా మార్కులు వచ్చిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ప్రభుత్వ కళాశాలల్లో చదివిన వారు 850 మార్కులకు పైగా, ప్రైవేటు కళాశాలల్లో చదివిన విద్యార్థులు 900కి పైగా మార్కులు తెచ్చుకున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అర్హులైన విద్యార్థులు తమ మార్కుల మెమో, కులం సర్టిఫికేట్ జీరాక్స్ కాపీలను మే నెల 5వ తేదిలోగా సెల్: 9440756199, 9032741194 నెంబర్లకు వాట్సాప్ పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బీ వెంకటేశ్వర్లు, కే ధనుంజయ, కేసీ నాగన్న, తిరుపాల్, తవుడు శ్రీనివాసులు, పాల సుంకన్న, బీసీ తిరుపాలు, పుల్లన్న, బాలరాజు, కే మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. -
మత సామరస్యంతో మెలగాలి
కర్నూలు కల్చరల్: ప్రజలు మత సామరస్యంతో మెలగాలని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్ సూచించారు. శ్రీశైలం ప్రాజెక్ట్ విశ్రాంత సర్కిల్ అఽధికారి, మిమిక్రీ ఆర్టిస్ట్ ఖాదర్‌బాబు అభినందన సభ, మిమిక్రీ నాటక ప్రదర్శన, సంగీత విభావరి కార్యక్రమాలు ఆదివారం సీక్యాంప్ టీజీవీ కళాక్షేత్రంలో జరిగాయి. ఈ సందర్భంగా టీజీ మాట్లాడుతూ.. ఖాదర్ బాబు నాటక రంగంలో మల్టీటాలెంటెడ్‌గా రాణించడం అభినందనీయమన్నారు. టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు కళారత్న పత్తిఓబులయ్య, ఆర్ఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ బాలమద్దయ్య, విశ్రాంత ఎస్పీ లక్ష్మీనాయక్ మాట్లాడారు. అనంతరం ఖాదర్‌బాబు ప్రదర్శించిన నాటక సన్నివేశాలు, గాయకులు సుధారాణి, హబీబ్, బాల వెంకటేశ్వర్లు నిర్వహించిన సంగీత విభావరి అలరించింది. కళాక్షేత్రం మాజీ అధ్యక్షుడు దస్తగిరి, కార్యదర్శి మహమ్మద్ మియ్యా, సభ్యులు రమణ తదితరులు పాల్గొన్నారు . -
సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్తుల ఆటకట్టిద్దాం
కర్నూలు: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరస్తుల ఆట కట్టిద్దామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. శనివారం డీపీఓలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నేర సమీక్ష నిర్వహించారు. కర్నూలు, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు సబ్ డివిజన్లలో దీర్ఘకాలిక పెండింగ్ కేసులను సమీక్షించి పరిష్కారానికి సలహాలు, సూచనలు చేశారు. డ్రంకెన్ డ్రైవ్ వల్ల ఎక్కడైనా రోడ్డు ప్రమాదాలు జరిగితే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సోషల్ మీడియాపై గట్టి నిఘా ఉంచాలని, ఎలాంటి ఆధారాలు లేకుండా పుకార్లు వ్యాపింపజేస్తే కఠినంగా వ్యవహరించాలన్నారు. పోలీసు అధికారులు గ్రామాల్లో పర్యటించేటప్పుడు సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఆదివారం కచ్చితంగా రౌడీషీటర్లను స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్ చేయాలన్నారు. వివిధ కేసుల్లో ప్రతిభ కనపరచిన పోలీసు అధికారులకు, సిబ్బందికి ఎస్పీ ఈ సందర్భంగా ప్రశంసాపత్రాలు అందజేశారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, లీగల్ అడ్వైజర్ మల్లికార్జునరావు, డీఎస్పీలు బాబుప్రసాద్, శ్రీనివాసాచారి, వెంకటరామయ్య, ఉపేంద్ర బాబు, హేమలత, సీఐలు, ఎస్ఐలు సమావేశంలో పాల్గొన్నారు. -
ఛాతీలో కణితి తొలగించి ప్రాణం పోశారు
కర్నూలు(హాస్పిటల్): ఛాతీలో నాలుగు కిలోల కణితి ఉన్న ఓ మహిళకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి ఆమెకు ప్రాణం పోశారు. డోన్ మండలం జొన్నగిరికి చెందిన దాసరి బేబి(40) ప్రస్తుతం కర్నూలులోని ఓ ప్రైవేటు కాలేజిలో స్వీపర్‌గా పనిచేస్తోంది. ఆమెకు భర్త లేడు. కష్టపడి జీవనం సాగిస్తున్న ఆమెకు తీవ్ర అనారోగ్యం వచ్చి పడింది. అకస్మాత్తుగా విపరీతమైన దగ్గు, ఊపిరి ఆడేది కాదు. ఇటీవల ఆమె చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స విభాగంలో వైద్యులను కలిసింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె ఛాతీలో నాలుగు కిలోల కణితి ఉన్నట్లు గుర్తించారు. రక్తనాళాలను, వాయునాళాన్ని గట్టిగా ఒత్తేస్తోందని, ఆమెకు ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నట్లు తెలుసుకున్నారు. దీంతో ఈ నెల 22న కార్డియోథొరాసిక్ సర్జరీ హెచ్‌వోడీ డాక్టర్ సి. ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి కణితిని తొలగించారు. ప్రస్తుతం ఆమె కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. పెద్దాసుపత్రిలో మహిళకు అరుదైన ఆపరేషన్ -
మాజీ ఎంపీటీసీ సభ్యుడిపై దాడి
బండి ఆత్మకూరు: కడమల కాలువ గ్రామంలో వైఎస్సార్సీపీకి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడుపై అదే గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ సుబ్బరాయుడు దాడికి పాల్పడ్డాడు. బాధితుని వివరాల మేరకు.. గ్రామంలో ప్రస్తుతం రీ సర్వే జరుగుతోంది. అయితే సుబ్బరాయుడికి చెందిన 1.50 ఎకరాల భూమిని భాస్కర్ గతంలో కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఆ పొలాన్ని సాగు చేసుకుంటున్నాడు. పాస్ బుక్కులు కూడా ఉన్నాయి. అయితే ఆన్లైన్లో సుబ్బరాయుడి తండ్రి పేరు ఉందని ఆక్రమించే ప్రయత్నం చేయడంతో రెవెన్యూ అధికారులు భాస్కర్‌కు చెందుతుందని తేల్చారు. అయితే పొలాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడని తెలుసుకున్న భాస్కర్ శనివారం సచివాలయం వద్దకు వెళ్లాడు. కాగా అక్కడే సుబ్బరాయుడు అతనిపై దాడి చేయడం గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఇద్దరి వ్యక్తులపై బైండోవర్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జగన్ మోహన్ తెలిపారు. 14వేల హెక్టార్లకు సూక్ష్మ సేద్యం కర్నూలు(అగ్రికల్చర్): 2025–26వ సంవత్సరానికి సూక్ష్మ సేద్యం లక్ష్యాలు ఖరారయ్యాయి. మొదట్లో ఉమ్మడి కర్నూలు జిల్లాకు 14వేల హెక్టార్లకు సూక్ష్మ సేద్యం కల్పించే విధంగా లక్ష్యాలను ఇచ్చింది. కర్నూలు జిల్లాలో 7 వేలు, నంద్యాల జిల్లాలో 7 వేల హెక్టార్లకు సూక్ష్మ సేద్యం కల్పిస్తారు. 2024–25 సంవత్సరంలో కర్నూలు జిల్లాలో 5,653 హెక్టార్లకు, నంద్యాల జిల్లాలో 5,058 హెక్టార్లకు సూక్ష్మ సేద్యం కల్పించినట్లు స్పష్టమవుతోంది. గత ఏడాది సాధించిన ప్రగతిని దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాదికి లక్ష్యాలను ఇచ్చినట్లుగా అధికార వర్గలు తెలిపాయి. ఐదెకరాల్లోపు ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీపై సూక్ష్మ సేద్యం కల్పిస్తారు. ఒక రైతుకు గరిష్టంగా రూ.2.18 లక్షల వరకు సబ్సిడీ ఇస్తారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 33 శాతం ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం 67 శాతం భరిస్తుంది. ఇతర సన్న, చిన్నకారు రైతులకు ఐదు ఎకరాల వరకు 90 శాతం సబ్సిడీపై సూక్ష్మ సేద్యం కల్పిస్తారు. రైతులు 10 శాతం భరించాలి. సబ్సిడీ రూ.2.18 లక్షలు లభిస్తుంది. కేంద్రం 33 శాతం, రాష్ట్రం 57 శాతం భరిస్తాయి. స్ప్రింక్లర్లు 50 శాతం సబ్సిడీపై ఇవ్వనున్నారు. బెల్టు షాపులపై ఎకై ్సజ్ దాడులు కర్నూలు: లైసెన్స్ దుకాణాల నుంచి మద్యం తరలించి గ్రామీణ ప్రాంతాల్లో బెల్టు షాపుల ద్వారా అధిక లాభాలకు విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం అందడంతో ఎకై ్సజ్ అధికారులు దాడులు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ సీఐ జయరాముడు, ఎస్ఐ రవితేజ, ఎకై ్సజ్ స్టేషన్ ఎస్ఐలు రెహనా, నవీన్, సిబ్బంది నందీశ్వర్ రెడ్డి, చంద్రపాల్, ఈరన్న, రామలింగయ్య తదితరులు బృందాలుగా ఏర్పడి కర్నూలు మండలంలోని వివిధ గ్రామాల్లో తనిఖీ నిర్వహించారు. లక్ష్మీపురంలో ఎరుకలి నరసింహులు, పుసులూరులో బోయ అయ్యస్వాములు బెల్టు షాపులు నడుపుతున్నట్లు గుర్తించి తనిఖీ నిర్వహించారు. 22 మద్యం బాటిళ్లను వారి నుంచి స్వాధీనం చేసుకుని ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా బంగారుపేటలో నాటుసారా స్థావరంపై దాడులు చేసి 25 లీటర్ల నాటుసారా, వెయ్యి లీటర్లు సారా తయారీకి ఉపయోగించే ఊటను ధ్వంసం చేశారు. సారా విక్రయిస్తున్న నీలిషికారి మహాలిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. -
యూట్యూబ్‌లో చూసి.. చోరీ చేసి!
కర్నూలు: కర్నూలులోని సాయి వైభవ్ నగర్లో నివాసముంటున్న ఆర్టీసీ డిపో–1 మేనేజర్ సర్దార్ హుసేన్ ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగలను పోలీసులు అరెస్టు చేసి కటకటాలకు పంపారు. సీతారాం నగర్లో నివాసముంటూ దుర్గా హోటల్ పక్కన ఉన్న స్పైసీ డాబాలో పనిచేస్తున్న షేక్షావలితో పాటు ఐదుగురు మైనర్లు చోరీకి పాల్పడినట్లు సాంకేతిక ఆధారాలతో గుర్తించి పక్కా ఆధారాలతో నిందితులను అదుపులోకి తీసుకుని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఎదుట హాజరుపర్చగా శనివారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ వివరాలు వెల్లడించారు. షేక్షావలి సంతోష్ నగర్, కొండారెడ్డి నగర్, ఎన్టీఆర్ బిల్డింగ్స్ ప్రాంతాల్లో నివాసముంటున్న ఐదుగురు మైనర్లతో జట్టు కట్టి సర్దార్ హుసేన్ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ముందు రోజు ఇద్దరు మైనర్లు ద్విచక్ర వాహనంపై సాయి వైభవ్ నగర్లో రెక్కీ నిర్వహించారు. సర్దార్ హుసేన్ ఇళ్లు తాళం వేసి ఉండటంతో అర్ధరాత్రి ఆరుగురు నిందితులు అక్కడికి చేరుకుని ఇంట్లోకి చొరబడి అందినమట్టుకు మూటగట్టుకుని ఉడాయించారు. మరుసటి రోజు పనిమనిషి గుర్తించి సర్దార్ హుసేన్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి మూడో పట్టణ పోలీసులు దర్యాప్తులో భాగంగా పక్కా ఆధారాలతో షేక్షావలితో పాటు మరో ఐదుగురు మైనర్లను నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని కేంద్రీయ విద్యాలయం దగ్గర అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. వారి వద్ద నుంచి 27 తులాల బంగారు, 35 తులాల వెండి, నేరానికి ఉపయోగించిన రెండు మోటర్ సైకిళ్లు, రంపం, ఇనుప రాడ్డు స్వాధీనం చేసుకున్నారు. యూట్యూబ్‌లో చూసి... దొంగతనం ఎలా చేయాలనే దానిని యూట్యూబ్‌లో వీడియోలు చూసి తాళాన్ని విరగ్గొట్టేందుకు అవసరమైన పరికరాలను సమకూర్చుకుని రెండు బైక్‌లపై అర్ధరాత్రి నిందితులు ఆ ఇంటి వద్దకు చేరుకున్నారు. శబ్దం రాకుండా తాళం విరగ్గొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో ఉన్న బంగారు, వెండి ఆభరణాలను దొంగలించి వాటిని పంచుకున్నట్లు విచారణలో బయటపడింది. ఇందులో ఇద్దరు మైనర్లు గతంలో ద్విచక్ర వాహనాల తాళాలు తీయడంలో నేర్పరులు. మైనర్లు ఐదుగురు కూడా పాఠశాలకు వెళ్లకుండా డ్రాపౌట్ అయి మెకానిక్ షెడ్డులో పనిచేస్తూ అల్లరిచిల్లరగా తిరుగుతూ జల్సాలకు అలవాటు పడి షేక్షావలితో జట్టు కట్టి చోరీలకు పాల్పడినట్లు ఎస్పీ వెల్లడించారు. ఎల్‌హెచ్‌ఎంఎస్ యాప్‌ను వినియోగించుకోండి... ఇళ్లకు తాళం వేసి ఊర్లకు వెళ్లేటప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని, ఇంటి భద్రత కోసం ఎల్‌హెచ్‌ఎంఎస్ యాప్‌ను వినియోగించుకోవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. కాలనీలో కొత్త వ్యక్తులు, అనుమానితులు సంచరిస్తున్నట్లయితే సమాచారం అందించాలన్నారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ ఖాజా హుసేన్, కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, సీఐలు శేషయ్య, నాగశేఖర్ తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. కేసును ఛేదించిన క్రైం పార్టీ సిబ్బందికి ఎస్పీ నగదు రివార్డులను అందజేశారు. ఆర్టీసీ డిపో మేనేజర్ ఇంట్లో చోరీ చేసిన దొంగలు అరెస్టు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల గుర్తింపు 27 తులాల బంగారు, 35 తులాల వెండి రికవరీ -
ఉన్నత చదువుతో ఉజ్వల భవిష్యత్తు
కర్నూలు(సెంట్రల్): ఉన్నత చదువులు చదివితే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అన్నారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించి 17 మంది విద్యార్థులను శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ సన్మానించారు. ఇందులో 600 మార్కులకు గాను 597 మార్కులు సాధించిన విద్యార్థులు ఏడుగురు ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2,700 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. కొందరు విద్యార్థులు మధ్యలో చదువు మానేసి వలసలు వెళ్లడంతో ఉత్తీర్ణత శాతంలో వెనుకబడినట్లు చెప్పారు. అయినప్పటికీ నాలుగు సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం 1,000 మంది విద్యార్థులు అధికంగా పాసైనట్లు చెప్పారు. పదో తరగతి తరువాత విద్యార్థులు మంచి కెరీర్‌ను ఎంచుకునేందుకు వీలుగా ‘నైపుణ్య’ అనే పేరుతో హైదరాబాద్ 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమీ ద్వారా ఉచిత శిక్షణను ప్రారంభించామన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్‌లోనూ ఉంచామని అవసరమైన విద్యార్థులు చూసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులను సన్మానించి వారితో గ్రూపు ఫొటో దిగారు. కార్యక్రమంలో డీఈఓ శామ్యూల్‌పాల్, గురుకుల పాఠశాల కో ఆర్డినేటర్ శ్రీదేవి, ఏసీబీ డీఎస్పీ కృష్ణారెడ్డి, పోటీ పరీక్షల నిర్వాహకుడు గణేష్, వెల్దుర్తి బీసీ వెల్ఫేర్ హాస్టల్ ప్రిన్సిపాల్ సబీనా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా -
పోలీసు శాఖలో 154 మందికి స్థానచలనం
కర్నూలు: జిల్లా పోలీసు శాఖలోని వివిధ స్టేషన్లలో పనిచేస్తున్న 118 మంది కానిస్టేబుళ్లు, 24 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 12 మంది ఏఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో శనివారం బదిలీల ప్రక్రియ నిర్వహించారు. ఒకే పోలీస్ స్టేషన్లో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిబ్బంది జాబితాను ముందుగానే సిద్ధం చేసి కౌన్సెలింగ్‌కు పిలిచారు. సీనియారిటీ జాబితాను ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించి స్టేషన్ల వారీగా ఖాళీలను అందులో చూపి బదిలీలకు కౌన్సెలింగ్ చేపట్టారు. ఖాళీలకు అనుగుణంగా పోలీస్ స్టేషన్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించారు. స్పౌజ్ కేసు (భార్యాభర్తలు ఉద్యోగులు), అనారోగ్యంతో ఉన్న పోలీసు సిబ్బందికి మినహాయింపు ఇచ్చి కోరుకున్న చోటుకు బదిలీ చేశారు. కార్యక్రమంలో అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, డీపీఓ ఏఓ విజయ్‌కుమార్ నాయుడు, స్పెషల్ బ్రాంచ్ సీఐ తేజమూర్తి, ఎస్ఐలు ఖాజా వలి, వేణుగోపాల్ రాజు, డీపీఓ కా ర్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. మైనారిటీలకు సబ్సిడీ రుణాలు ● దరఖాస్తుకు మే 25 ఆఖరు కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మైనారిటీ, క్రిిస్ట్టియన్ వర్గాల ప్రజలు సబ్సిడీ రుణాలకు మే 25లోగా దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ కార్పొరేషన్ ఈడీ ఎస్.సబీహా పర్వీన్ తెలిపారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మైనారిటీలకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకు, క్రిిస్టియన్ మైనారిటీలకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రుణాలను అందిస్తామన్నారు. ఎంపికై న వారికి 50 శాతం సబ్సిడీ మంజూరవుతుందన్నారు. అర్హత కలిగిన వ్యక్తులు వివరాలను https://apobmms.apcfss.in అనే వెబ్సైట్లో నమోదు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు ఈడీ, మైనారిటీ కార్పొరేషన్ కార్యాలయం, లేదా 9848864449, 9440822219 నెంబర్లను సంప్రదించాలన్నారు. విధుల నుంచి సమగ్ర శిక్ష ఏపీసీ రిలీవ్ కర్నూలు(సిటీ): సమగ్ర శిక్ష అదనపు కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న టి.శ్రీనివాసులు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఓఎస్డీగా నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ఎస్ఎస్ఏ అదనపు కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. ఆయన ఈ ఏడాది జనవరి 4వ తేదీన ఏపీసీగా బాధ్యతలు స్వీకరించారు. ఈయన సమగ్ర శిక్ష పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో లోటుపాట్లను సరిచేసుకునేందుకు 12 మంది స్పెషల్ ఆఫీసర్లకు నోటీసులు ఇచ్చి కొంత మేరకు మార్పులు తీసుకొచ్చారు. ఏపీసీగా విధుల్లో నుంచి రిలీవ్ అయ్యేందుకు ముందుగా జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషాను మర్యాదపూర్వకంగా కలిశారు. రేపు బీచ్ కబడ్డీ జట్ల ఎంపిక పోటీలు నంద్యాల(న్యూటౌన్): ఉమ్మడి కర్నూలు జిల్లా సీనియర్ బీచ్ కబడ్డీ పురుషుల, మహిళల జట్ల ఎంపిక పోటీలు ఈనెల 28వ తేదీన నిర్వహిస్తున్నట్లు నంద్యాల జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ ఏపీరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నంద్యాలలోని నందమూరినగర్ నాగులకట్ట వద్ద పోటీలు ఉంటాయని ఆయన తెలిపారు. పురుషులు 85 కేజీల్లోపు, మహిళలు 75 కేజీల్లోపు ఉండాలని, పోటీలకు వచ్చే సమయంలో ఆధార్‌కార్డు, పదో తరగతి మార్కులిస్టు తీసుకుని రావాలన్నారు. జట్లకు ఎంపికై న వారు మే 2 నుంచి 4వ తేదీ వరకు కాకినాడ బీచ్‌లో జరిగే రాష్ట్రస్థాయి బీచ్ కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. బెలుం గుహలకు వేసవి ఎఫెక్ట్ కొలిమిగుండ్ల: బెలుం గుహలపై వేసవి ప్రభా వం పడింది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. సాధారణ రోజుల్లో రోజుకు రూ.15వేలకు పైగా, శని, ఆదివారాల్లో రూ.30 వేల మేర ఆదాయం వస్తుండేది. ప్రస్తుతం ఎండల తీవ్రత దృష్ట్యా యాత్రికుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో ఆదాయం పడిపోయింది. -
లిమిటేషన్ యాక్ట్‌తో కేసుల సత్వర పరిష్కారం
● న్యాయమూర్తుల వర్కుషాపులో జిల్లా జడ్జి జి.కబర్ధి కర్నూలు(సెంట్రల్): లిమిటేషన్ యాక్ట్‌తో కేసులను త్వరగా పరిష్కరించేందుకు వీలు ఉంటుందని జిల్లా జడ్జి జి.కబర్ధి పేర్కొన్నారు. జిల్లా కోర్టులో ఉమ్మడి కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న సీనియర్, జూనియర్ జడ్జీలకు లిమిటేషన్ యాక్ట్‌పై శనివారం వర్కుషాపు నిర్వహించారు. ముందుగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. లిమిటేషన్ యాక్ట్‌పై క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలన్నారు. అప్పుడు కేసులను సత్వరమే పరిష్కరించడానికి వీలు అవుతుందన్నారు. అనంతరం రిసోర్స్పర్సన్లు విశ్రాంత న్యాయమూర్తులైన మోహన్‌రావు, ఎస్.రజనీలు మాట్లాడారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జీలు కమలాదేవి, పీజేసుధాకర్, అమ్మనారావు, పి.వాసు, ఎం.శోభారాణి, ఎన్. శ్రీవిద్య పాల్గొన్నారు. -
జిల్లా అంతటా పోలీసుల విస్తృత తనిఖీలు
కర్నూలు: శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు జిల్లా అంతటా విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు సబ్ డివిజన్ అధికారుల నేతృత్వంలో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, లాడ్జీలు, దేవస్థానాలు, దర్గాలు, వ్యాపార సముదాయాలు, షాపింగ్ మాల్స్‌లలో శనివారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఏకకాలంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. కర్నూలులో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు కూడా తనిఖీల్లో పాల్గొన్నాయి. కర్నూలు నగరంలో ముఖ్యమైన కూడళ్లతో పాటు కిడ్స్ వరల్డ్, రాజ్‌విహార్, ప్రభుత్వాసుపత్రి, సి.క్యాంప్, రైల్వేస్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. మంత్రాలయంలో..మంత్రాలయం: కశ్మీర్ పహల్గామ్లో ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో శనివారం మంత్రాలయంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బాంబు, డాగ్ స్క్వాడ్ బృందంతో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం, గంగమ్మ గుడి, ఆంజనేయ స్వామి ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో తనిఖీలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి మంత్రాలయానికి వచ్చే బస్సులు, కార్లు, తదితర వాహనాలకు క్షుణ్ణంగా పరిశీలించారు. మంత్రాలయం మండలంలోని తుంగభద్ర రేల్వేస్టేషన్‌లో తనిఖీలు నిర్వహించారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సీఐ రామాంజులు, ఎస్ఐ శివాంజల్ సూచించారు. -
అప్పుల ఊబిలో బలవన్మరణం
పది నెలల్లో 67 మంది రైతుల బలవన్మరణం ●● కలసిరాని వ్యవసాయంతో అప్పులపాలు ● అన్నదాత సుఖీభవకు నీళ్లొదిలిన కూటమి ప్రభుత్వం ● ఆత్మహత్యల సంఖ్య తగ్గించి చూపే ప్రయత్నాల్లో త్రీమెన్ కమిటీ ● ఉచిత పంటల బీమాకు చెల్లుచీటి ● 2023 ఖరీఫ్, 2023–24 రబీ, 2024 ఖరీఫ్ పంటల బీమా అందనట్లే.. కుటుంబం వీధిన పడింది తుగ్గలి మండలం రాంపల్లి గ్రామానికి చెందిన వెంకట్రాములుకు వ్యవసాయమే జీవనాధారం. 2024–25లో గతంలో ఎప్పుడూ లేని విధంగా వ్యవసాయంలో దెబ్బతిన్నాడు. 5 ఎకరాల స్వంతభూమి ఉండగా.. మరో ఐదారు ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. సహకార సంఘంలో రూ.10 లక్షలకు పైగా అప్పు చేశాడు. ప్రయివేటు అప్పులు ఐదారు లక్షలు ఉన్నాయి. అధిక వర్షాలు, వర్షాభావంతో పాటు అరకొర పంటలకు గిట్టుబాటు ధర లేక నష్టాలను మూటకట్టుకున్నాడు. అప్పులు తీర్చాలనే ఒత్తిళ్లు అధికమవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య లక్ష్మి అనాథగా మారింది. వెల్దుర్తి మండలం రామళ్లకోటకు చెందిన కలుగొట్ల బోయ హనుమంతు కౌలుదారు. ఈయన 6.65 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని సాగు చేశాడు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వ్యవసాయం కోసం రూ.6 లక్షలు అప్పు చేశాడు. ప్రభుత్వం నుంచి ఎలాంటి తోడ్పాటు లభించక, వ్యవసాయం కలిసిరాక అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. విధిలేని పరిస్థితుల్లో గత ఏడాది పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈయనకు భార్య బోయ రామేశ్వరి. శివ(12), లత(10) సంతానం. ఇంటికి ఆధారమైన వ్యక్తి మరణించంతో వీళ్లంతా దిక్కులేని వాళ్లయ్యారు. త్రీమెన్ కమిటీ కౌలుదారు ఆత్మహత్యగా నిర్ధారించిందే కానీ, ప్రభుత్వం ఇప్పటికీ ఆదుకోని పరిస్థితి. కర్నూలు(అగ్రికల్చర్): ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోవడం.. వ్యవసాయం కలసి రాకపోవడం.. ప్రకృతి కరుణించకపోవడం.. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడం.. వెరసి రైతుల జీవనం దుర్భరం అవుతోంది. వ్యవసాయం కోసం బ్యాంకులు, పీఏసీఎస్‌ల్లో తీసుకున్న అప్పులు, ప్రయివేటు వ్యక్తుల దగ్గర అధిక వడ్డీలతో పొందిన రుణాలు బక్కచిక్కిన రైతులను బలవన్మరణాలకు ఉసిగొల్పుతున్నాయి. 2014–15 నుంచి 2018–19 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో 321 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. తిరిగి మళ్లీ ఆయన ప్రభుత్వంలోనే రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. నాడు వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు ఇప్పటికి ఆ మాటలకే కట్టుబడి ఉన్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు, కరువు కవలలనే పేరుంది. 2014–15 నుంచి 2018–19 వరకు ఐదేళ్లు పాలిస్తే వరుసగా నాలుగేళ్లు కరువొచ్చింది. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ప్రతి ఏటా వర్షాభావం ఏర్పడుతుండటంతో ఉమ్మడి కర్నూలు జిల్లా ఎడారిగా మారింది. వర్షాలు లేక, అంతంతమాత్రం పండిన పంటలకు గిట్టుబాటు ధర లేక పెట్టిన పెట్టుబడిలో 10 శాతం కూడా దక్కక రైతులు చితికిపోయారు. నాటి దారుణ పరిస్థితులే మళ్లీ పునరావృతం అవుతున్నాయి. రైతులు బలవన్మరణాలకు పాల్పడుతుంటే.. బ్యాంకులు రుణాలు రికవరీకి ఆస్తులను జప్తులు చేస్తుండటం గమనార్హం. అన్నదాత సుఖీభవ అమలులో నిర్లక్ష్యం 2024 ఎన్నికల సమయంలో సూపర్–6లో భాగంగా రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.20 వేలు చెల్లించి ఆదుకుంటామని ఊరూవాడ చంద్రబాబు ప్రకటించారు. ఆయన మాటలు నమ్మి రైతులు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. రైతుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ మొదటి ఏడాది అన్నదాత సుఖీభవకు నీళ్లొదిలారు. ఈ నేపథ్యంలో పంట పెట్టుబడులకు రైతులు అప్పులు చేయాల్సి వస్తోంది. ఈ అప్పులు తీర్చలేక పురుగుల మందు తాగడం, ఉరేసుకోవడం ద్వారా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 2025–26 సంవత్సరానికి అన్నదాత సుఖీభవ అమలు చేస్తామని ప్రకటించారు. అయితే పీఎం కిసాన్తో కలిపి రూ.20వేలు ఇస్తామని నాలుక మడతేశారు. రైతు సంక్షేమాన్ని పట్టించుకుంటే ఒట్టు 2023 ఖరీఫ్ కరువు మండలాలకు సంబంధించి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2024 జనవరిలోనే ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేసింది. 41,857 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో తప్పులు ఉన్నందున రూ.60.59 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ విడుదల కాలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖాతాలను సరి చేసి పంపారు. ఇంతవరకు ఈ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయని పరిస్థితి. 2023–24 రబీలో ఉమ్మడి జిల్లాలో 31 కరువు మండలాలను గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గుర్తించింది. కరువు ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో 92,208 రైతులు నష్టాలను మూటకట్టుకున్నారు. ఇన్పుట్ సబ్సిడీ కోసం కర్నూలు జిల్లాకు రూ.58.28 కోట్లు, నంద్యాల జిల్లాకు రూ.37.76 కోట్లు విడుదల కావాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతనే కేంద్ర బృందం జిల్లాలో పర్యటించింది. అయితే ఇప్పటికీ ఇన్పుట్ సబ్సిడీ అతీగతీ లేకుండాపోయింది. బీమా మర్చిపోవాల్సిందే.. ● గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఐదేళ్లూ ఉచిత పంటల బీమాను అమలు చేసింది. ● 2024, 2024–25 రబీ సీజన్‌కు సంబంధించి రైతుల వాటా ప్రీమియం చెల్లించాల్సిన సమయానికి ఎన్నికల కోడ్ రావడంతో బ్రేక్ పడింది. ● కూటమి ప్రభుత్వం రైతుల వాటా సొమ్మును చెల్లిస్తే రైతులకు బీమా పరిహారం అందుతుంది. ● 2024 ఖరీఫ్ సీజన్లో కూటమి ప్రభుత్వం ఉచిత పంటల బీమాను అమలు చేస్తామని చెప్పినా, రైతుల వాటా విడుదల చేయని పరిస్థితి. ● దీంతో మూడు సీజన్లకు సంబంధించి రైతులు పంటల బీమా పరిహారానికి దూరమయ్యారు. ● కేవలం 2024–25 రబీ పంటల బీమాను మా త్రమే ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటోంది. ● అది కూడా ఉచిత పంటల బీమాను పక్కనపెట్టి రైతులే ప్రీమియం చెల్లించే విధానాన్ని తీసుకురావడం గమనార్హం. తుగ్గలి మండలం రాంపల్లి గ్రామానికి చెందిన రైతు భార్య లక్ష్మిదేవి రామళ్లకోట గ్రామానికి చెందిన రామేశ్వరి 18.7.24డోన్ మండలం గోసానిపల్లి గ్రామానికి చెందిన వై.రామాంజనేయులు(35) కౌలు రైతు. 3.95 ఎకరాల భూమి కౌలుకు తీసుకొని గత ఏడాది ఉల్లి సాగు చేశాడు. పెట్టుబడుల కోసం రూ.9 లక్షలు అప్పు తీసుకున్నాడు. అయితే అధిక వర్షాలు, అనావృష్టి కారణంగా పంట దెబ్బతినింది. గత ఏడాది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈయనకు భార్య అనిత, కూతురు మైతిలి(8), కుమారులు రామ్కుషల్(6), రామ్ చరణ్(4) ఉన్నారు. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మరణించడంతో భార్యా పిల్లలు దీనావస్థలో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 67 మంది రైతులు ఆత్మహత్య కూటమి ప్రభుత్వం ఏర్పాటైన మొదటి ఏడాదిలోనే మరణమృదంగం మోగింది. ప్రభుత్వం నుంచి చేయూత లేకపోవడం, వ్యవసాయం కలసిరాక అప్పులు మీద పడటంతో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో రికార్డు స్థాయిలో 67 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం గమనార్హం. కర్నూలు జిల్లాలో 42 మంది, నంద్యాల జిల్లాలో 25 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్యను తగ్గించి చూపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్రీమెన్ కమిటీ విచారణలో అనర్హులుగా తేల్చేందుకు రంగం సిద్ధమవుతోంది. మండల వ్యవసాయ అధికారి, తహసీల్దారు రైతుల ఆత్మహత్యలేనని నిర్ధారించినప్పటికీ త్రీమెన్ కమిటీ విచారణలో రైతులు కాదని, ఇతర కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్యాయం చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. -
ఓవరాల్ చాంపియన్ కర్నూలు బెటాలియన్
కర్నూలు: ఏపీఎస్పీ రేంజ్–2 స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో కర్నూలు రెండో బెటాలియన్ క్రీడాకారులు ఓవరాల్ ఛాంపియన్‌ను కై వసం చేసుకున్నారు. కర్నూలు ఏపీఎస్పీ రెండో బెటాలియన్‌లో కమాండెంట్ దీపిక పాటిల్ నేతృత్వంలో మూడు రోజుల పాటు పోటీలు నిర్వహించారు. కర్నూలుతో పాటు కడప, అనంతపురం, చిత్తూరు స్పెషల్ ఆర్మ్డ్ రిజర్వ్ ఆఫ్ సెంట్రల్ పోలీస్ లైన్ అంబర్‌పేట, హైదరాబాదు బెటాలియన్‌కు చెందిన పోలీసు క్రీడాకారులు స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్నారు. బాస్కెట్‌బాల్ పోటీల్లో రెండో బెటాలియన్ మొదటి బహుమతి సాధించగా, 9వ బెటాలియన్ రన్నర్స్‌గా నిలిచారు. అలాగే కబడ్డీ పోటీ ల్లో రెండో బెటాలియన్ మొదటి బహుమతి సాధించగా, 9వ బెటాలియన్ క్రీడాకారులు రన్నర్స్‌గా నిలిచారు. వాలీబాల్ పోటీల్లో 14వ బెటాలియన్‌కు మొదటి బహుమతి దక్కగా రెండో బెటాలియన్ క్రీడాకారులు రన్నర్స్‌గా నిలిచారు. క్రికెట్ పోటీల్లో కూడా 14వ బెటాలియన్ మొదటి బహుమతి సాధించగా కర్నూలు రెండో బెటాలియన్ రన్నర్స్‌గా నిలిచింది. వ్యక్తిగత స్పోర్ట్స్ విభాగాల్లో జావెలిన్ త్రోలో 11వ బెటాలియన్ పీసీ ప్రదీప్ కుమార్ మొదటి బహుమతి, నరసింహ తృతీయ బహుమతి, 9వ బెటాలియన్ పీసీ గోపీనాథ్ ద్వితీయ బహుమతి కై వసం చేసుకున్నారు. అలాగే లాంగ్‌జంప్‌లో 11వ బెటాలియన్ పీసీ ప్రదీప్ కుమార్ మొదటి బహుమతి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ ద్వితీయ బహుమతి, ఎస్ఏఆర్సీపీఎల్ యూనిట్ పీసీ వెంకటేశ్వర్లు మూడో బహుమతి సా ధించారు. 800 మీటర్ల పరుగుపందెంలో రెండో బెటాలియన్ పీసీ నరేంద్ర మొదటి బహుమతి, 9వ బెటాలియన్ పీసీ వెంకయ్య రెండో బహుమతి, పీసీ అశోక్ మూడో బహుమతి కై వసం చేసుకున్నారు. హైజంప్‌లో 11వ బెటాలియన్ పీసీ ప్రదీప్ కుమార్ మొదటి బహుమతి, రిజర్వు ఇన్స్పెక్టర్ రామకృష్ణ, రెండో బహుమతి, ఎస్ఏఆర్సీపీఎల్ యూనిట్ వెంకటేశ్వర్లు మూడో బహుమతి సాధించారు. ఈ పోటీల్లో ఓవరాల్ చాంపియన్‌గా రెండో బెటాలియన్ నిలిచింది. డీఐజీ చేతుల మీదుగా బహుమతుల ప్రదానం.. ఏపీఎస్పీ రేంజ్–2 స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ముగింపు కార్యక్రమానికి శుక్రవారం సాయంత్రం కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, రెండో బెటాలియన్ కమాండెంట్ దీపిక పాటిల్ ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో రెండో బెటాలియన్ అదనపు కమాండెంట్ నాగేంద్రరావు, అసిస్టెంట్ కమాండెంట్లు మహబూబ్ బాషా, రవికిరణ్, వెంకటరమణ, సుధాకర్ రెడ్డి, రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. ముగిసిన ఏపీఎస్పీ రేంజ్–2 స్పోర్ట్స్ మీట్ డీఐజీ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం -
కేడీసీసీ బ్యాంకులో పిటిషన్ల గోల!
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా పిటిషన్ల పర్వం సాగుతోంది. తమ లక్ష్యాలకు అడ్డం పడుతున్నారనే అనుమానం ఉన్న అధికారులకు పిటిషన్ల ద్వారా చుక్కలు చూపుతున్నారు. ఇటీవల కాలంలో బ్యాంకులో పనిచేస్తున్న సీనియర్ అధికారుల పేరుతోనే పిటిషన్లు నేరుగా ఆప్కాబ్‌కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. 10 నెలల కాలంలో దాదాపు 100 వరకు ఇలాంటి పిటిషన్లు వెళ్లినట్లు సమాచారం. బ్యాంకుకు కొత్త సీఈఓ వస్తున్నారంటే చాలు ఆయన క్యారెక్టర్‌ను దెబ్బతీసే విధంగా పిటిషన్లు వెళ్తుండటం గమనార్హం. పిటిషన్లు మంచి భాషతో పెడితే ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు కానీ, కుటుంబ సభ్యులను దా రుణంగా కించపరుస్తూ బూతులతో నింపేస్తుండటం అధికారుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తోంది. ఈ వ్యవహారంపై బ్యాంకు అధికారులు కొద్ది నెలల క్రిత మే పోలీసులకు పిర్యాదు చేశారు. అయినప్పటికీ వీటి వెనుక ఎవరున్నారనే విషయాన్ని గుర్తించలేకపోవడంతో మరింత రెచ్చిపోతున్నట్లు చర్చ జరుగుతోంది. మహిళల జీవనోపాధికి రుణాలు ● డీఆర్డీఏ పీడీ రమణారెడ్డి కర్నూలు(అగ్రికల్చర్): స్వయం సహాయక సంఘాల్లోని మహిళల జీవనోపాధిని అభివృద్ధికి చేసేందుకు రుణాలు ఇవ్వనున్నట్లు డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ వైపీ రమణారెడ్డి తెలిపారు. ఇందుకోసం 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,898.15 కోట్లతో రుణ ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో 954 గ్రామైక్య సంఘాలు, 25 మండల సమాఖ్యలు ఉన్నాయన్నారు. మొత్తం 32,572 ఎస్‌హెచ్‌జీలు ఉండగా.,. ఇందులో 3,30,044 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి, ఉన్నతి తదితర వాటి కింద రుణ సదుపాయం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ‘ఉపాధి’ నిధులతో పండ్లతోటల అభివృద్ధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో పండ్లతోటలను అభివృద్ధి చేసుకోవచ్చని డ్వామా పీడీ వెంకటరమణయ్య తెలిపారు. ఇందుకు అర్హులైన రైతులను గుర్తించాలన్నారు. కలెక్టరేట్లోని డ్వామా సమావేశ మందిరంలో సాంకేతిక సహాయకులకు ఈ నెల 17 నుంచి నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలు శుక్రవారం ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో డ్వామా పీడీ మాట్లాడుతూ.. 2025–26 సంవత్సరంలో 6,750 ఎకరాల్లో పండ్లతోటలు అభివృద్ధి చేయాలనేది లక్ష్యమన్నారు. మొత్తంగా 17 రకాల పండ్ల తోటల సాగుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. అదనపు పీడీ మాధవీలత, ఏపీడీలు పాల్గొన్నారు. 3,075 స్పౌజ్ పింఛన్లు మంజూరు కర్నూలు(అగ్రికల్చర్): ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద 3,075 మంది వితంతు మహిళలకు పింఛన్లు మంజూరయ్యాయి. 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్యకాలంలో వృద్ధాప్య పింఛను తీసుకుంటూ మరణించిన వారి భార్యలకు వితుంతు పింఛన్లు మంజూరు చేసింది. ఈ జాబితాలను ప్రభుత్వం డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌కు పంపగా.. వీటిని ఎంపీడీఓలు, ము న్సిపల్ కమిషనర్లు, వార్డు, గ్రామ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లకు పంపారు. వితంతు పింఛను మంజూరుకు ఆయా సచివాలయాల వెల్ఫేర్ అసిస్టెంట్లు వెంట నే డెత్ సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలన్నారు. నంద్యాల జిల్లాకు 3,169 పింఛన్లు మంజూరయ్యాయి. -
ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
బొమ్మలసత్రం: నంద్యాల పట్టణానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ చిన్ని కృష్ణ శుక్రవారం గడ్డిమందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న చిన్ని కృష్ణ గత కొంత కాలంగా బాలాజీ కాంప్లెక్స్‌లోని ఓ అద్దె ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక చిన్నచెరువు సమీపంలో గడ్డిమందు సేవించి అపస్మారక స్థితిలో పడిపోయాడు. స్థానికులు గమనించి నంద్యాల జీజీహెచ్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం శాంతిరామ్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆత్మహత్యకు కుటుంబ కలహాల లేక మరేదైన కారణమా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పొగాకు దగ్ధం ● రూ.10 లక్షల ఆస్తి నష్టం పాములపాడు: ఇస్కాల గ్రామంలో శుక్రవారం ప్రమాదవశాత్తు పొగాకు పంట దగ్ధమైంది. గ్రామానికి చెందిన గుర్రం వెంకటేశ్వర్లు 30 క్వింటాళ్లు, సోమేశ్వరుడు 10 క్వింటాళ్లు, రాము 10 క్వింటాళ్లు, బన్నూరు శివ 10 క్వింటాళ్ల చొప్పున పొగాకు పంటను తోరణాలు కూర్చి ఆరు బయట ప్రాంతంలో ఆరబెట్టారు. కాగా ప్రమాదవశాత్తు నిప్పు అంటుకోవడంతో 60 క్వింటాళ్ల పొగాకు పంట దిగుబడి అగ్నికి ఆహుతి అయ్యింది. గమనించిన రైతులు వ్యవసాయ బావిలో నుంచి మోటార్ల ద్వారా నీటిని చల్లినప్పటికీ పంటను కాపాడుకోలేక పోయారు. ప్రస్తుతం దిగుబడులు అంతంత మాత్రమే ఉండడం గిట్టుబాటు ధర లేకపోవడం రైతులను కృంగదీస్తుంది. ఇలాంటి తరుణంలో ఈ విపత్తుతో సుమారు పది లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించిందని రైతన్న లబోదిబోమని వాపోతున్నారు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి బాధిత రైతులను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. గుండెపోటుతో గర్భిణి మృతి ఆత్మకూరు: కొట్టాల చెరువు గ్రామానికి చెందిన గర్భిణి కుడుముల అంకమ్మ(40) గుండెపోటుతో మృతి చెందింది. బైర్లూటి సాంఘిక సంక్షేమ గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో కమాటీగా పని చేస్తున్న అంకమ్మ పాఠశాలకు వేసవి సెలవులు కావడంతో సొంతూరు కొట్టాల చెరువుకు చేరుకుంది. ప్రస్తుతం ఆమె తొమ్మిదో నెల గర్భిణి. కాగా శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కుటుంబీకులు ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలికి భర్త వలి, కుమారుడు దరగయ్య, కుమార్తె ధరణి ఉన్నారు. అంకమ్మ మృతి విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే స్పందించి మట్టి ఖర్చులకు రూ.25 వేలు అందించారు. అంకమ్మ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని గిరిజన సంక్షేమ సంఘం నాయకులు జవహార్‌నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. పోలీసు బదిలీలకునేడు కౌన్సెలింగ్ కర్నూలు: పోలీసు శాఖలో ఒకే చోట ఐదేళ్లు పనిచేసిన వారికి స్థానచలనం కలగనుంది. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ స్థాయి సిబ్బంది ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన వారికి బదిలీ అయ్యే అవకాశముంది. సిబ్బంది బదిలీ కోసం శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 12 మంది ఏఎస్ఐలు, 24 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 118 మంది కానిస్టేబుళ్లు కలిపి మొత్తం 154 మందికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సిందిగా బదిలీ జాబితాలో పేర్లున్న వారికి డీపీఓ నుంచి ఆదేశాలు వెళ్లాయి. -
తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని మోసం
కర్నూలు: తక్కువ ధరకు బంగారం ఇప్పించి రెట్టింపు ధరకు అమ్మి పెడతానని చెప్పి మోసానికి పాల్పడిన రంగు నగేష్ అలియాస్ నాగిరెడ్డిని పోలీసులు పక్కా ఆధారాలతో అరెస్టు చేసి కటకటాలకు పంపారు. తెలంగాణ రాష్ట్రం కేవీ రంగారెడ్డి జిల్లా విజయ నగర్ కాలనీ హయత్ నగర్లో రంగు నగేష్ నివాసం ఉండేవారు. హైదరాబాదు సరూర్ నగర్లో నివాసముంటున్న సంతోషి మాతకు మాయ మాటలు చెప్పారు. తక్కువ ధరకు బంగారం ఇప్పించి రెట్టింపు లాభం వచ్చేలా చేస్తానని నమ్మబలికి మోసం చేశాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పక్కా ఆధారాలతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్ ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా శుక్రవారం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి డీఎస్పీ వివరాలు వెల్లడించారు. రూ.60 లక్షలు డబ్బులిస్తే కేజీ బంగారం కొని రూ.30 లక్షలు లాభంతో రూ.90 లక్షలకు అమ్మిస్తానని రంగు నగేష్ నమ్మించాడు. వచ్చిన లాభంలో తనకు కొద్దిపాటి సొమ్ము ఇస్తే చాలని చెప్పాడు. దీంతో సంతోషి మాత భర్త శ్రీశైలంతో కలసి కొన్ని రోజుల క్రితం సొంత ఇంటిని అమ్మగా వచ్చిన మొత్తం డబ్బులు రూ.46 లక్షలు తీసుకున్నారు. ఈనెల 19వ తేదీన ఉదయం హైదరాబాద్ నుంచి కారులో రంగు నగేష్ కలసి కర్నూలుకు వచ్చారు. కర్నూలులోని సాయిబాబా గుడి దగ్గర వారిని దించేసి బంగారు కొనేటప్పుడు వేరే వ్యక్తులు ఉండకూడదని నమ్మించి రంగు నగేష్ కారులో కర్నూలు బస్టాండ్ చేరుకున్నాడు. అక్కడ డ్రైవర్‌కు బాడుగ డబ్బులు ఇచ్చేసి హైదరాబాద్‌కు ఉడాయించాడు. ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో మోసపోయినట్లు సంతోషి మాత దంపతులు గ్రహించి రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో అదే రోజు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితుడు హైదరాబాదులో ఉన్నట్లు గుర్తించి పక్కా ఆధారాలతో అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. అతని వద్ద నుంచి రూ.45.91 లక్షలు నగదు స్వాధీనం చేసుకుని నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించినట్లు డీఎస్పీ బాబుప్రసాద్ తెలిపారు. సీఐలు నాగరాజరావు, శేషయ్యతో పాటు క్రైం పార్టీ పోలీసులు సమావేశంలో పాల్గొన్నారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రూ.45.91 లక్షల నగదు స్వాధీనం -
వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి
● 28న కర్నూలులో ముస్లింల భారీ ర్యాలీ ● 30న రాత్రి ఇళ్లల్లో విద్యుత్ దీపాలు ఆర్పివేసి నిరసన ● రౌండ్ టేబుల్ సమావేశంలో ముస్లిం మత పెద్దలుకర్నూలు (టౌన్): వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ఉలమ్ అధ్యక్షుడు మౌలానా మజీద్ డిమాండ్ చేశారు. కర్నూలు రైల్వే స్టేషన్ ప్రాంగణంలోని ఒక హోటల్లో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముస్లిం మత పెద్దలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మేధావులు హాజరయ్యారు. కశ్మీర్లో ఉగ్రవాదుల దాడికి నిరసన తెలుపుతూ మృతులకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు. అనంతరం మౌలానా మజీద్ మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతర వ్యక్తులను నియమించడం, కలెక్టర్ పర్యవేక్షణ చేయడం వంటి విధానాలు వ్యతిరేకిస్తున్నామన్నారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈనెల 28న కర్నూలులో భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే ఈనెల 30వ తేదీ రాత్రి 9 నుంచి 9.15 గంటల వరకు ప్రతి ఇంట్లో లైట్లను ఆర్పివేసి నిరసనను వ్యక్తం చేద్దామన్నారు. ● వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీమోహన్ రెడ్డి మాట్లాడుతూ... పార్లమెంట్, రాజ్య సభలో తమ పార్టీ ముస్లింలకు మద్దతుగా నిలిచిందన్నారు. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించిందన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు అహమ్మద్ అలీఖాన్ మాట్లాడుతూ.. ముస్లింలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. కలసికట్టుగా పోరాడుదామన్నారు. మైనార్టీలైన క్రైస్తవులు మద్దతు ఇవ్వడం సంతోషం అన్నారు. ● పాస్టర్లు షాలేమ్ రాజు, బొరెల్లి శశికుమార్ మాట్లాడుతూ.. ముస్లింలు చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తామన్నారు. సమావేశంలో ఆర్ఆర్డీ సజీవరావు, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, రెవరెండ్ అమ్రోజ్, విజయ్‌కుమార్, జహీంగీర్ అహమ్మద్, హమీదు, జాకీర్ అహమ్మద్, అన్వర్ బాషా పాల్గొన్నారు. -
పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో బీఈడీ మూడో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు. ‘ఆర్‌యూలో నిత్యం సమస్యల ‘పరీక్ష’’ శీర్షికతో సాక్షిలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి వర్సిటీ అధికారులు స్పందించారు. ఈనెల 25వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు గడువును విధించగా 24వ తేదీ వరకు ఫీజు చెల్లింపుకు ఎన్ఆర్లో విద్యార్థుల పేర్లు రాలేదు. దీంతో ఈనెల 28వ తేదీ వరకు ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించేందుకు గడువును పొడిగించారు. రూ. 100 ఫైన్‌తో 29వ తేదీ, రూ.200 ఫైన్‌తో 30వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ఈనెల 24వ తేదీ కర్నూలు, ఆదోనిలోని పరీక్ష కేంద్రాల్లో ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తూ పట్టు బడటంతో సంబంధిత పరీక్ష కేంద్రాల సీఎస్, అబ్జర్వర్, ఇన్విజిలేటర్లకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లును వర్సిటీ వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ వి. వెంకట బసవరావు ఆదేశించారు. -
సార్.. కందులు కొనుగోలు చేయడం లేదు
కొత్తపల్లి: ‘కందుల కొనుగోలు నిర్వాహకుల నిర్లక్ష్యంతో దిగుబడిని అమ్ముకోలేక పోతున్నాం. రోజులు తరబడి నిరీక్షిస్తున్నా పట్టించుకోవడం లేదు’ అని రైతులు జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్‌కు మొర పెట్టుకున్నారు. దుద్యాల గ్రామంలోని కందుల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. కేంద్రం వద్ద కందు ల నాణ్యత, రైతుల ఆన్లైన్ వివరాల నమోదు, తుకా లు, క్యూఆర్ కోడ్ ట్యాగ్ పనితీరు, కందుల నాణ్యతను కొలిచే యంత్రం పనితీరులను క్షుణ్ణంగా పరిశీలించా రు. జేసీ వచ్చారనే సమాచారం తెలుసుకున్న రైతులు అక్కడికి చేరుకుని తమ సమస్యలు విన్నవించారు. ● ఎకరాకు ఐదు క్వింటాల కందులు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, పండించిన మొత్తం కందులను కొనుగోలు చేయాలని కోరారు. ● 20 రోజులైనా తన కందులను తీసుకోవడం లేదని రైతు నాగేశ్వరరావు జేసీకి మొరపెట్టుకున్నారు. అధికారులను అడిగితే తిప్పుకుంటున్నారన్నారు. ● ఈనెల 20వ తేదీతో కొనుగోలు గడువు ముగిసిందని సమయం పెంచి న్యాయం చేయాలన్నారు. ● నేషనల్ హైవే రహదారి నిర్మాణానికి మామిడి తోటలో ఉన్న సుమారు 22 మామిడి చెట్లు పోయాయని ఇంతవరకు పరిహారం అందలేదని ఓ మహిళ రైతు జేసీకి విన్నవించింది. ● కల్లాలకు ఆన్లైన్ సమస్య పరిష్కారం కావడం లేదని, పూర్వపు ఆస్తులు అమ్ముకునేందుకు పేర్లులేక ఇబ్బంది పడుతున్నామని రైతులు తెలిపారు. ● అనంతరం జేసీ మాట్లాడుతూ.. స్థానిక రెవెన్యూ అధికారులతో రైతుల సమస్యకు సమాధానం చెప్పాలని సమస్య ఏ స్థాయిలో ఉందో వెంటనే నాకు సమాచారం కావాలని రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ వెంట ఆత్మకూరు వ్యవసాయ సహాయ సంచాలకులు ఆంజనేయ, తహసీల్దార్ ఉమారాణి, ఎంపీడీఓ దాసరి మేరీ, ఎంపీపీ కుసుమలత, సర్పంచ్ శోభలత, మండల వ్యవసాయ అధికారి మహేష్ పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్‌కు సమస్యల వెల్లువ -
కార్పొరేషన్లో బిల్లు బిల్లుకీ పర్సంటేజీ
● ఓ మంత్రి వద్ద పనిచేసే ఉద్యోగి, తెలుగు తమ్ముళ్ల దందా తోడు ● గగ్గోలు పెడుతున్న మున్సిపల్ కాంట్రాక్టర్లు ● కమిషనర్‌పై సీఎంకు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు ఫిర్యాదు ● రూ.60 కోట్ల బిల్లులకు ఇచ్చింది రూ.15 కోట్లే ● అదీ పర్సంటేజీలు ఇచ్చిన వారికే మంజూరు కర్నూలు(టౌన్): కర్నూలు నగరపాలక సంస్థలో కమీషన్ల దందా మితిమీరిపోయింది. కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించాలంటే 8 శాతం పర్సంటేజి ఇవ్వాల్సిందే. లేదంటే కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే. వీరికి తోడు ఓ మంత్రి వద్ద పనిచేసే పీఏ స్థాయి ఉద్యోగి, కార్పొరేషన్లో పనిచేసే ఒకరిద్దరు తెలుగు తమ్ముళ్ల పైరవీలు సరేసరి. బిల్లుల క్లియరెన్స్‌లో వీరే మధ్యవర్తులు. ఆ పీఏ స్థాయి ఉద్యోగి సైతం మంత్రికి సంబంధించిన పనులైతే వెంటనే క్లియర్ అవుతాయి. జనరల్ ఫండ్ కింద చేసిన పనుల బిల్లులూ ఇవ్వడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ‘ఏడాది అవుతుంది. మేము చేసిన అభివృద్ధి పనుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అప్పుల్లోకి వెళ్లిపోయాం. బిల్లులు క్లియర్ కావాలంటే 8 శాతం పర్సంటేజీ డిమాండ్ చేస్తున్నారు. అంత ఇచ్చుకోలేం. మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబుపై తగిన చర్యలు తీసుకోవాలి’ అంటూ కర్నూలు కార్పొరేషన్ కాంట్రాక్టర్ల వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కలెక్టర్ నుంచి సీఎం వరకు అందరికీ ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్లకు చుక్కలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.60 కోట్ల విలువైన పనుల బిల్లులు రాగా, అందులో దాదాపు రూ.15 కోట్ల వరకు నగరపాలక సంస్థ అధికారులు క్లియర్ చేశారు. వీటిలో అధిక శాతం అధికారుల పర్సంటేజీలు, ఇతరత్రా ముడుపులు ఇచ్చుకున్న వారికే బిల్లులు అందాయనే విమర్శలు ఉన్నాయి. కొంత మంది కాంట్రాక్టర్లు గట్టిగా మాట్లాడి రూ.2 కోట్ల వరకు బిల్లులు తీసుకున్నారు. ఇటీవల ప్రభుత్వం నుంచి మరో రూ.17 కోట్లు విడుదల చేశారు. దీంతో పైరవీలు, ఒత్తిళ్లు పెరిగాయి. అయినా ఇప్పటివరకు ఒక్క బిల్లు కూడా సీఎఫ్ఎంఎస్ ( కాంప్రెసీవ్ ఫైనాన్షియల్ మానటరింగ్ సిస్టమ్ ) నమోదు చేయలేదు. జీజీఎంపీ (గడప, గడపకు మన ప్రభుత్వం) బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. సకాలంలో బిల్లులు రాక, అప్పులు చేసి పనులు చేయడంతో ఆ ఒత్తిడి తాళలేక ఓ మున్సిపల్ కాంట్రాక్టరు గత నెలలో గుండెపోటుతో ఆసుపత్రి పాలయ్యాడు. పనుల టెండర్ దశ నుంచి అగ్రిమెంటు, ఆ తరువాత బిల్లుల చెల్లింపుల వరకు కాంట్రాక్టర్లకు సినిమా కనిపిస్తుంది. -
మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు
కర్నూలు(సెంట్రల్): మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నార్కోటిక్స్ కోఆర్డినేషన్(ఎన్సీఓఆర్డీ) సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనర్థాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. పొలాల్లో, అటవీ భూముల్లో గంజాయి సాగుపై నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ.. పట్టణాల శివారు ప్రాంతాల్లో ముళ్ల పొదలు, పాత భవనాలను తొలగించి విద్యుత్ దీపాలు వేయించాలన్నారు. పోలీసులతోపాటు 11 మంది జిల్లా అధికారులతో మాదకద్రవ్యాల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, మునిసిపల్ కమిషనర్ రవీంద్రబాబు, డీటీసీ శాంతకుమారి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సుధీర్‌కుమార్, డీఎంహెచ్ఓ శాంతి కళ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా -
మొక్క జొన్న పంట దగ్ధం
పాణ్యం: మండల కేంద్రమైన పాణ్యంలోని డొంగు సమీపంలో చేతికొచ్చిన మొక్కజొన్న పంట అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైంది. గ్రామంలోని రైతు వై.వి లింగమయ్యకు చెందిన 3 ఎకరాలు, లింగాల సుబ్రహ్మణ్యంకు చెందిన 3 ఎకరాలు, గుడిపాటి మద్దిలేటికి చెందిన 1.50 ఎకరాల పంట దగ్ధమైంది. పొలంలో మంటలు వ్యాపించడంతో గమనించిన రైతులు నంద్యాల అగ్నిమాపక స్టేషన్‌కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. మరో రోజుల్లో మూడు రోజుల్లో పంట కోత చేపట్టాల్సిన సమయంలో ప్రమాదం జరగడంతో రైతులు నష్టపోయారు. బోర్ వైర్ నుంచి మంటలు చేలరేగి పంటలకు వ్యాపించినట్లు ప్రాథమికంగా తెలిసింది. ఎకరానికి రూ. 35వేలకు వరకు పెట్టుబడులు పెట్టామని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ నరేంద్రనాథ్‌రెడ్డి, ఆర్ఐ రాము, వ్యవసాయ అధికారులు దగ్ధమైన పంటను పరిశీలించారు. -
ప్రభుత్వాసుపత్రిలో నాగుపాము కలకలం
ఎమ్మిగనూరురూరల్: స్థానిక ప్రభుత్వాసుపత్రిలోని పిల్లల వార్డులో గురువారం నాగుపాము కలకలం సృష్టించింది. పిల్లల వార్డులో పామును గుర్తించిన తల్లులు కేకలు వేయటంతో అక్కడ ఉన్న బంధువులు వచ్చి పామును కర్రలతో వార్డు నుంచి బయటకు వెళ్లేలా చేశారు. అనంతరం బయటకు వచ్చిన పామును చంపటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గతంలో చాలా సార్లు పాములు ఆసుపత్రిలో వచ్చిన సంఘటనలు ఉన్నాయి. అసుపత్రి అవరణలో అపరిశుభ్రంగా ఉండటంతో పాములు వార్డుల్లోకి వస్తున్నాయని రోగులు వాపోతున్నారు. శ్రీశైలం ఘాట్‌లో అదుపుతప్పిన బస్సు ● డ్రైవర్‌కు తీవ్ర గాయాలు ● 20 మంది ప్రయాణికులకు స్వల్పగాయాలు శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం ఘాట్ రోడ్డులో గురువారం ఉదయం ఓ ప్రైవేటు బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి కొండచరియను ఢీ కొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు, 20 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా సిరిగుప్ప ప్రాంతానికి చెందిన 40 మంది భక్తులు తీర్ధయాత్రలకు బయలుదేరారు. గురువారం ఉదయం 8 గంటల సమయంలో చిన్నారుట్ల ఘాట్ రోడ్డులో బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో డ్రైవర్ బస్సు లోయలో పడకుండా పక్కనే ఉన్న కొండ చరియలను ఢీ కొడ్డాడు. ప్రమాదంలో బస్సు డ్రైవర్ ఫయాజ్ (28) తీవ్ర గాయాలయ్యాయి. 20 మంది భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ ఫయాజ్ను మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. ప్రకాశం జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రభుత్వాసుపత్రిలో రోగి అదృశ్యం
కర్నూలు (హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం వచ్చిన ఓ రోగి కనిపించకుండా పోయాడు. కృష్ణగిరి మండలం బాపనదొడ్డికి చెందిన చిన్న ఆంజనేయులు (80)కు ఆయాసం ఉండటంతో కుమారుడు బీరప్ప బుధవారం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చాడు. తండ్రిని ఎమర్జెన్సీ వార్డు వద్దే ఉంచి స్కానింగ్ రిపోర్టు తీసుకునివచ్చే సరికి కనిపించకపోవడంతో ఆయన చుట్టు పక్కల గాలించాడు. కుటుంబ సభ్యులకు సమాచారమివ్వడంతో చెరుకులపాడు, బాపనదొడ్డి, చెట్లమల్లాపురం తదితర గ్రామాల్లో రాత్రి అంతా వెతికారు. చిన్న ఆంజనేయులు ఆచూకీ కానరాకపోవడంతో గురువారం ఉదయం కర్నూలులోని మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో తన తండ్రి కనిపించడం లేదని బీరప్ప ఫిర్యాదు చేశారు. తన తండ్రి ఆచూకీ తెలిసిన వారు 96664 96775, 70320 85182కు సమాచారం అందించాలని ఆయన కోరారు. ఏసీబీ కేసులో షరాఫ్ గోపాల్ ఉద్యోగం తొలగింపు కర్నూలు(సెంట్రల్): ప్రస్తుతం కర్నూలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో షరాఫ్‌గా పనిచేస్తున్న గోపాల్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ జిల్లా రిజిస్ట్రార్ ఎం.చెన్నకేశవరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 2022 ఏపిల్ర్ 27వ తేదీన కర్నూలు, కల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏక కాలంలో ఏసీబీ దాడి చేసి కల్లూరులో 15 మంది డ్యాకుమెంట్ రైటర్లు, సిబ్బంది నుంచి రూ.55,660, కర్నూలులో 12 మంది డ్యాకుమెంట్రైటర్లు ఇతర ఉద్యోగుల నుంచి రూ.40,470 అనధికార నగదు ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఇందులో కల్లూరు అప్పటి సబ్ రిజిస్ట్రార్ అరుణ్‌కుమార్, కర్నూలులో షరాఫ్‌గా పనిచేస్తున్న గోపాల్‌లపై కేసులను ఏసీబీ నమోదు చేసింది. ఈ క్రమంలో షరాఫ్ గోపాల్‌పై అభియోగాలు వాస్తవమని తేలడంతో విధుల నుంచి తొలగించాలని డీఐజీని ఆదేశించింది. ఉపాధ్యాయులకు వైద్యపరీక్షలు కర్నూలు (హాస్పిటల్): బదిలీల నేపథ్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులకు గురువారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని ధన్వంతరి హాల్లో వైద్యపరీక్షలు నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వైద్య పరీక్షల్లో మొదటి రోజు 72 మందికి వైద్యులు పరీక్షించి నివేదికలు ఇచ్చారు. శుక్ర, శనివారాల్లో ధన్వంతరి హాలులో ఆర్థోపెడిక్ మినహా మిగిలిన విభాగాల వారు ఆయా విభాగాల్లోనే వైద్యపరీక్షలు నిర్వహించి నివేదికలు ఇవ్వాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. -
గ్రామీణాభివృద్ధిలో పంచాయతీరాజ్ కీలకం
● జిల్లా కలెక్టర్ రంజిత్బాషాకర్నూలు(అర్బన్): గ్రామీణాభివృద్ధి, స్థానిక పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తున్నదని జిల్లా కలెక్టర్ పీ రంజిత్‌బాషా అన్నారు. గురువారం జిల్లా పరిషత్ మినీ సమావేశ భవనంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2025లో ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థకు 1947 స్వాతంత్య్రం వచ్చిన అనంతరం ఉన్న పరిస్థితికి చాలా వ్యత్యాసం ఉందన్నారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ షెడ్యూల్లో 243 ఆర్టికల్ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను రూపొందిస్తూ చట్టం చేశారన్నారు. ఈ చట్టాన్ని రాజ్యసభ, లోక్‌సభతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో కూడా ఆమోదం చేసిన తరువాత 1993 ఏప్రెల్ 24వ తేదీన నుంచి అమల్లోకి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలోనే పంచాయతీరాజ్ వ్యవస్థలో పర్యవేక్షణ బలోపేతం అయ్యిందన్నారు. పంచాయతీలకు చట్టపరమైన గుర్తింపు ఇవ్వడం, స్వయం ప్రతిపత్తి కల్పించడం వంటి సంస్కరణలు వచ్చాయన్నారు. ఫైనాన్స్ పరిధిలోకి రావడం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా సక్రమంగా ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం జరిగిందన్నారు. స్థానిక పాలనా వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడంలో పీఆర్ సంస్థలు కీలకంగా వ్యవహరిస్తున్నాయన్నారు. నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డుకు పెరవలి ఎంపిక.. నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డుల కోసం దేశ వ్యాప్తంగా 1.40 లక్షల దరఖాస్తులు రాగా, ఇందులో ఆరు గ్రామ పంచాయతీలను ఎంపిక చేశారని కలెక్టర్ చెప్పారు. ఎంపికై న ఆరు గ్రామ పంచాయతీల్లో జిల్లాలోని మద్దికెర మండలం పెరవలి గ్రామ పంచాయతీ ఉండడం అభినందనీయమన్నారు. అలాగే ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ కింద జిల్లాలోని మద్దికెర, హొళగుంద, చిప్పగిరి మండలాలు ఎంపికయ్యాయన్నారు. ఇందులో మద్దికెర మండలం దక్షిణ భారత దేశంలో ప్రథమ స్థానంలో ఉందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1.50 కోట్లను మంజూ రు చేసిందన్నారు. కార్యక్రమంలో పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ పర్యవేక్షక ఇంజనీర్లు వీ రామచంద్రారెడ్డి, బీ నాగేశ్వరరావు, కర్నూలు డివిజినల్ పంచాయతీ అధికారిణి టీ లక్ష్మి, పీఆర్ ఈఈ మద్దన్న, పీఏ టు ఎస్ఈ బండారు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్‌యూలో నిత్యం సమస్యల ‘పరీక్ష’
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ పరీక్షల విభాగంలో గందరగోళం వీడటం లేదు. నిత్యం ఏదో ఒక సమస్యతో నెట్టుకురావడం తప్ప పరిష్కార మార్గాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈనెల 23న బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే రెండు కళాశాలల విద్యార్థులకు పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు కూడా హాల్‌టికెట్లు రాకపోవడంతో ఆందోళన చెందారు. దీంతో పాటు విద్యార్థుల వివరాలతో కూడిన ప్రింటెండ్ ఓఎమ్మార్ షీట్లు ఏర్పాటు చేయలేకపాయారు. డోన్‌లో ఓ పరీక్ష కేంద్రం, కర్నూలులో ఓ పరీక్ష కేంద్రంలో సుమారు 90 మంది విద్యార్థులతో బఫర్ ఓమ్మార్ షీట్లలో వివరాలు నమోదు చేయించి పరీక్ష రాయించారు. వివరాలు నమోదు చేసే సమయంలో పొరపాటు చేస్తే ఆ విద్యార్థి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. గురువారం జరిగిన పరీక్షకు కర్నూలు ఉస్మానియా కళాశాల కేంద్రంలో శాంతినికేతన్ కళాశాలకు చెందిన ఓ విద్యార్థి స్థానంలో మరో విద్యార్థి పరీక్ష రాస్తూ పట్టుబడటం పర్యవేక్షణ లోపమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిరాక్స్ ప్రశ్నపత్రాలు రెండు పరీక్ష కేంద్రాల్లో ప్రింటెండ్ కాకుండా జిరాక్స్ ప్రశ్నపత్రాలతో పరీక్షలు రాయిస్తున్నారు. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి అర గంట ముందు ప్రశ్నపత్రాల షీల్డ్బండిల్ను తెరుస్తారు. అందులోంచి ప్రశ్నపత్రాలను తీసుకొని వాటిని జిరాక్స్ తీయించి పరీక్షలు రాయిస్తున్నారు. అదే సమయంలో ప్రశ్నా పత్రం లీక్ అయినా, కరెంట్ పోయినా, ప్రింటర్ పనిచేయకపోయినా ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వెబ్సైట్లో కానరాని విద్యార్థుల పేర్లు 2023–25 విద్యా సంవత్సరం బీఈడీ మూడో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫీజును శుక్రవారంలోగా చెల్లించేందుకు వర్సిటీ అధికారులు గడువు విధించారు. అయితే గురవారం అర్ధరాత్రి వరకు ఫీజు చెల్లింపుకు ఎన్ఆర్లో విద్యార్థుల పేర్లు పెట్టలేదు. దీంతో ఒక్కరోజులోనే విద్యార్థులకు ఎప్పుడు సమాచారం ఇవ్వాలి, ఫీజు ఎప్పుడు చెల్లించాలని కళాశాలల యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి. ఏజెన్సీ మారడంతో సమస్యలు పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పరీక్ష నిర్వహణ ఏజెన్సీ మారడంతో కొన్ని సాంకేతిక సమస్యలు ఉత్పన్నవుతున్నాయి. త్వరలోనే పరిష్కరిస్తాం. వీసీతో చర్చించి బీఈడీ మూడో సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంచేందుకు నిర్ణయం తీసుకుంటాం. ఒక విద్యార్థి స్థానంలో మరో విద్యార్థి పరీక్ష రాస్తూ దొరకడంతో అతనిపై పోలీస్‌లకు ఫిర్యాదు చేశాం. – డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు, సీఈ, ఆర్యూ గురువారం ఒక విద్యార్థికి బదులు మరో విద్యార్థి పరీక్ష రాస్తుండగా గుర్తింపు బీఈడీ మూడో సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లింపు నేటితో గడువు పూర్తి ఫీజు చెల్లింపునకు వెబ్సైట్లో కానరాని విద్యార్థుల పేర్లు -
రైతుల పాలిట ‘పగా’కు!
● ఉమ్మడి జిల్లాలో 67,336 ఎకరాల్లో పొగాకు సాగు ● 50వేల టన్నుల వరకు దిగుబడి ● ఇప్పటి వరకు కొనుగోలు 20 వేల టన్నులే.. ● పత్తాలేకుండా పోయిన కంపెనీల ప్రతినిధులు ● రైతుల కష్టాన్ని పట్టించుకోని ప్రభుత్వం ● అకాల వర్షాలతో దిక్కుతోచని రైతులు -
అహోబిలం.. ‘వసంత’ వైభవం
ఆళ్లగడ్డ: దిగువ అహోబిలంలో వసంతోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. వసంత రుతువులో శ్రీ లక్ష్మీనరసింహస్వామికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవం అని పేరు. ఎండ వేడి నుంచి స్వామివారు ఉపశమనం పొందేందుకు జరిపే ఉత్సవం కావడంతో ఉపశమనోత్సవం అని కూడా అంటారు. ఉత్సవంలో సుగంధాన్ని వెదజల్లే పుష్పాలతో పాటు పలురకాల మధురఫలాలను స్వామికి నివేదిస్తారు. వేడుకల కోసం దేవాలయం ఎదరుగా భాష్యకార మండపంలో ఆకర్షణీయంగా మండపాన్ని తీర్చిదిద్దారు. అలాగే పలురకాల వృక్షాల ప్రతిరూపాలతో నల్లమల అడవిని తలపించేలా మండపాన్ని తీర్చిదిద్దారు. గురువారం ఉదయం నిత్య పూజలు అనంతరం యాగశాలకు చేరుకున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను కొలువుంచారు. ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాలు, అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య తిరుమంజనం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
సాగు పెరిగి.. నష్టాలు మిగిలి
ఉమ్మడి జిల్లాలో పొగాకు సాగు లేని మండలం లేదంటే అతిశయోక్తి కాదు. 10 ఎకరాల నుంచి 100 ఎకరాలు సాగు చేసిన రైతులు ఉన్నారు. ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు కౌలుకు తీసుకొని మరీ సాగు చేశారు. 2023–24లో రికార్డు స్థాయి ధరలు లభించడంతో ఈ ఏడాది రైతులు సాగుకు రెండు జిల్లాల్లో పోటీపడ్డారు. కంపెనీలు కూడా అదేవిధంగా ప్రోత్సహించాయి. 2024–25లో కర్నూలు జిల్లాలో 36,471 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 30,865 ఎకరాల్లో పొగాకు సాగయింది. 2023–24తో పోలిస్తే 48,959 ఎకరాల్లో అదనంగా సాగు చేయడం విశేషం. విత్తనం మొదలు పొగాకును కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లే వరకు ఎకరాకు రూ.60 వేల వరకు పెట్టుబడి పెడుతున్నారు. ఎకరాకు సగటున 4 క్వింటాళ్ల వరకు మాత్రమే దిగుబడి వచ్చింది. కంపెనీలు అరకొరగా కొనుగోలు చేసి చేతులెత్తేయడంతో రైతులు రోడ్డెక్కుతున్నారు. -
నేడు మార్కెట్‌యార్డుకు సెలవు
ఆదోని అర్బన్: జమ్మూ కశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని నిరసిస్తూ శుక్రవారం ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు సెలవు ఇవ్వాలని కమీషన్ ఏజెంట్లు, గుమస్తా, మర్చంట్ అసోసియేషన్ నాయకులు గురువారం యార్డు అసిస్టెంట్ సెక్రటరీ శాంతకుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు రాజాగౌడ్, లక్ష్మన్న మాట్లాడారు. ముస్లిం దేశాల్లో హిందువులకు రక్షణలేదని, హిందువులున్న దేశంలో కూడా హిందువులకు రక్షణ లేకపోవడం ఘోరమన్నారు. జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ శుక్రవారం సెలవు ప్రకటించాలని కోరారు. ఇందుకు యార్డు అధికారులు అంగీకరించారు.ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీగా డాక్టర్ పి.చంద్రశేఖర్కర్నూలు(హాస్పిటల్): డాక్టర్ ఎన్టిఆర్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా కర్నూలుకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ పి.చంద్రశేఖర్ నియమితులయ్యారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గురువారం జీఓ విడుదల చేశారు. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగుతారు. ఆయన 1960 సంవత్సరం ఆగస్టు 14న జిడి.లక్ష్మణదాస్, జి.సావిత్రమ్మలకు కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామంలో జన్మించారు. తండ్రి జిడీ. లక్ష్మణదాస్ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేశారు. డాక్టర్ పి.చంద్రశేఖర్ కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్‌గా 38 ఏళ్ల పాటు పనిచేసి పదవీ విరమణ చెందారు. అనంతరం ఆయన కార్డియాలజి విభాగంలోనే తిరిగి ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు.కానిస్టేబుల్ అభ్యర్థులకు జూన్ 1న రాత పరీక్షకర్నూలు: కానిస్టేబుల్ అభ్యర్థులకు జూన్ 1వ తేదీన తుది రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు నియామక మండలి ప్రకటన విడుదల చేసింది. పోలీస్ కానిస్టేబుల్, సివిల్, ఏపీఎస్పీ విభాగాల్లో పోస్టులకు సంబంధించి ప్రాథమిక రాత పరీక్ష 2023 జనవరి 22న జరిగింది. అర్హత సాధించిన వారికి 2024 డిసెంబర్ 30 నుంచి 2025 ఫిబ్రవరి 1 వరకు కర్నూలు ఏపీఎస్పీ రెండో పటాలం మైదానంలో దేహదారుఢ్య పరీక్షలు పూర్తి చేశారు. ఇందులో అర్హత సాధించిన వారందరికీ జూన్ 1న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలకు htt pr://rprb.ap.gov.inను సందర్శించాలని పేర్కొన్నారు.ప్రధానోపాధ్యాయురాలు సర్వీస్ నుంచి తొలగింపుకర్నూలు సిటీ: కర్నూలు నగరంలోని బి.క్యాంపు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డి.శారదాదేవిని సర్వీసు నుంచి తొలగిస్తూ ఆర్జేడీ శామ్యూల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న ఆమెను అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ కింద అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు బదిలీ చేశారు. గతంలో కర్నూలులో పని చేసే సమయంలో జరిగిన కొన్ని వివాదాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే శారదాదేవి అక్కడ విధుల్లో చేరకపోవడంతో సర్వీసు నుంచి తొలగించారు.తనయుడు ఫెయిల్ అయ్యాడని తల్లి ఆత్మహత్యకర్నూలు: పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో కుమారుడు భరత్‌బాబు ఫెయిల్ అయ్యాడనే మనస్థాపంతో తల్లి బెజవాడ లక్ష్మీజ్యోతి (39) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రవి, లక్ష్మీజ్యోతి దంపతులకు ఇద్దరు పిల్లలు సంతానం కాగా మొదటి కుమారుడు భరత్ బాబు పదవ తరగతి పరీక్షల్లో రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. బుధవారం ఫలితాలు వెలువడగా రాత్రి తల్లి లక్ష్మీజ్యోతి కర్నూలు నగరంలోని ఇంట్లోనే చీరతో ఉరేసుకుంది. ఆమె భర్త గుర్తించి ఉరి నుంచి తప్పించి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తల్లి రేపల్లె సుగుణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండో పట్టణ ఎస్ఐ మల్లికార్జున కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కుక్కను తప్పించబోయి..
పత్తికొండ రూరల్: పత్తికొండ–కర్నూలు రోడ్డులో అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి బుధవారం కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. సిమెంట్‌నగర్‌కు చెందిన భానుప్రకాశ్, శంకరమ్మ దంపతులు, ఇద్దరు పిల్లలు కలిసి మద్దికెరలోని మామ మనవరాలి నామకరణ మహోత్సవానికి కర్నూలు నుంచి కారులో బయల్దేరారు. పత్తికొండ సమీపంలో ప్రధాన రోడ్డుకు అడ్డంగా కుక్క రావడంతో దాన్ని తప్పించబోగా కారు అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్లలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. -
టీడీపీ నేత మమ్మల్ని వేధిస్తున్నాడు
● పార్టీ జిల్లా కార్యాలయం ఎదుట పత్తికొండ మహిళల ఆందోళన కర్నూలు(రూరల్): పత్తికొండ షాడో ఎమ్మెల్యేగా చెలమణి అవుతున్న సాంబశివారెడ్డి తమను వేధిస్తున్నాడని అతనిపై పార్టీ హైకమాండ్ చర్యలు తీసుకోవాలని బాధిత మహిళలు ఆందోళనకు దిగారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ మహిళ ఐక్య వేదిక వ్యవస్థాపకురాలు పట్నం రాజేశ్వరి, రాష్ట్ర అధ్యక్షరాలు నంది విజయలక్ష్మి ఆధ్వర్యంలో వారు బుధవారం నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉన్న తమను కనీసం గౌరవం ఇవ్వకపోగా ప్రతి పనిలో అడ్డు తగులుతున్నాడని పత్తికొండ రామచంద్రరెడ్డినగర్, కొండగేరికి చెందిన పార్వతీబాయి, లలితాబాయి, కురువ లలిత, కురువ వరలక్ష్మి కుటుంబాలు వాపోయాయి. పొదుపు సంఘాల్లో జోక్యం చేసుకుంటూ విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్‌గా తుగ్గలి మహిళను తీసుకొచ్చి పెట్టారన్నారు. ఈ అన్యాయంపై అధికారులకు కలిసి విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ ఆందోళనలో పొదుపు సంఘం సభ్యులు పాల్గొన్నారు. -
పల్లె ముంగిట్లోనే ‘పాలన’
వైఎస్సార్సీపీ హయాంలో విప్లవాత్మక సంస్కరణలు ● దేశంలోనే ఆదర్శంగా సచివాలయ వ్యవస్థ ● ఆర్డీఓల తరహాలో డీఎల్డీఓ పోస్టులు ● నెరవేరిన ఎంపీడీఓల దశాబ్దాల కల ● జిల్లా అధికారులుగా పదోన్నతి పొందిన ఎంపీడీఓలు ● పర్యవేక్షకులను ఏఓలుగా గుర్తించి గెజిటెడ్ హోదా ● సచివాలయ ఉద్యోగులకు పేస్కేల్ అమలు ● నేడు పంచాయతీరాజ్ దినోత్సవం కర్నూలు(అర్బన్): వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల వందల సంఖ్యలో ఉద్యోగులకు పదోన్నతుల పరంపర ప్రారంభమైంది. ముఖ్యంగా ఉద్యోగంలో చేరినప్పటి నుంచి పదవీ విరమణ అయ్యేంతవరకు ఎలాంటి పదోన్నతులు లేకుండా ఉన్న ఎంపీడీఓలకు పదోన్నతులు కల్పించి గత ప్రభుత్వం చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. 2022 ఆగష్టు నెలలో అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల జిల్లాలో అర్హులైన దాదాపు 17 మంది ఎంపీడీఓలు వివిధ ప్రభుత్వ శాఖల్లో జిల్లా అధికారులుగా పదోన్నతి పొందారు. వీరి కంటే ముందు ( 2020 అక్టోబర్ నెలలో ) రెవెన్యూ శాఖలో ఉన్న విధంగానే ( ఆర్డీఓ తరహాలో ) పంచాయతీరాజ్ శాఖలో కూడా డివిజన్ స్థాయిలో డీఎల్డీఓ పో స్టును క్రియేట్ చేసి అర్హులకు పదోన్నతులు కల్పించారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లాకు ముగ్గురు డీఎల్డీఓలు వచ్చారు. ఎంపీడీఓలకు పదోన్నతులు ప్రారంభం కాగానే, క్షేత్ర స్థాయి (ఆఫీస్ సబార్డినేట్) నుంచి పదోన్నతుల ప్రక్రియ ఊపందుకుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అర్హత కలిగిన 17 మంది ఎంపీడీఓలు జిల్లా స్థాయి అధికారులుగా పదోన్నతిపై వెళ్లగా, వారి స్థానంలో 14 మంది ఏఓ, 13 మంది ఈఓఆర్డీలకు 2023 మే నెలలో ఎంపీడీఓలుగా పదోన్నతి కల్పించారు. వీరి స్థానంలో 9 మంది సీనియర్ అసిస్టెంట్లు, 15 మంది గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శులకు ఈఓఆర్డీలుగా పదోన్నతి లభించింది. ఈ నేపథ్యంలోనే సీనియర్, జూనియర్ సహాయకులు, టైపిస్టులు, రికార్డు అసిస్టెంట్లకు వారి అర్హతలను బట్టి పదోన్నతులు దక్కాయి. పర్యవేక్షకులను ఏఓలుగా గెజిటెడ్ హోదా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన వివిధ కార్యాలయాల్లో (ఎంపీడీఓ, జెడ్పీ, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్) పర్యవేక్షకులుగా(సూపరింటెండెంట్ ) ఉన్న వారిని పరిపాలనాధికారులుగా (ఏఓ)లుగా గుర్తించారు. వీరికి గెజిటెడ్ హోదా కల్పించిన ఘనత గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కింది. దేశానికే తలమానికంగా సచివాలయ వ్యవస్థ వైఎస్సార్పీపీ పాలనలో ఏర్పాటైన సచివాలయ వ్యవస్థ ద్వారా ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 10వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మొత్తం 1188 గ్రామ/వార్డు సచివాలయాలు ఉండగా, వీటిలో కర్నూలు జిల్లాలో 465 గ్రామ సచివాలయాలు, 207 వార్డు సచివాలయాలు ఏర్పాటయ్యాయి. నంద్యాల జిల్లాలో 420 గ్రామ సచివాలయాలు, 96 వార్డు సచివాలయాలు ఉన్నాయి. సచివాలయాల్లో మొత్తం మంజూరైన పోస్టులు 9,878 కాగా, 8,630 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకోవడంతో పాటు డిపార్టుమెంటల్ టెస్ట్ ఉత్తీర్ణులైన 7,466 మంది ఉద్యోగుల ప్రొబేషన్ ముందుగా డిక్లేర్ కాగా, మిగిలిన వారికి విడతల వారీగా డిక్లేర్ చేశారు. ప్రొబేషన్ డిక్లేర్ కావడంతో పే స్కేల్‌ను కూడా అమలు చేశారు. ఉద్యోగంలో చేరిన సమయంలో నెల జీతం రూ.15 వేలు ఉండగా, ప్రస్తుతం గ్రాస్‌గా ప్రతి సచివాలయ ఉద్యోగి దాదాపు నెలకు రూ.30 వేల వరకు డ్రా చేస్తున్నారు. అలాగే గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులు నెలకు రూ.32 వేల వరకు డ్రా చేస్తున్నారు. జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసిన ఘనత గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కుతుంది. పాలనను ప్రజలకు అత్యంత చేరువ చేసేందుకు ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ దేశానికే తలమానికంగా నిలిచిందనడలో అతిశయోక్తి లేదు. ప్రభుత్వ పథకాలను ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా పారదర్శకంగా అందించేందుకు ఏర్పాటు చేసిన వలంటీర్ వ్యవస్థను వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆదర్శంగా తీసుకున్నాయి. ప్రభుత్వ పాలనలో అత్యంత కీలకమైన పంచాయతీరాజ్ శాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడంతో అన్ని విభాగాల ఉద్యోగులకు న్యాయం జరిగింది. జిల్లా అధికారులుగా ఎంపీడీఓలు గత ప్రభుత్వం పదోన్నతులు కల్పించడం వల్ల అనేక మంది ఎంపీడీఓలు వివిధ ప్రభుత్వ శాఖల్లో జిల్లా అధికారులయ్యారు. పరిషత్ సీఈఓ, డిప్యూటీ సీఈఓ, జిల్లా పంచాయతీ అధికారి, డ్వామా, డీఆర్డీఏ, మెప్మా, హౌసింగ్ శాఖల్లో పీడీలుగా, పలు శాఖల్లో కీలకమైన పోస్టుల్లో పదోన్నతి పొందారు -
దేశ సమైక్యతను దెబ్బతీసే కుట్ర
● కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ కర్నూలు (టౌన్): దేశ సమైక్యతను దెబ్బతీసేందుకే ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారని, వారి కుట్రలను సమర్థవంతంగా తిప్పి కొట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ పోలిటికల్ ఆడ్వైజరీ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. పర్యాటక ప్రాంతమైన జమ్మూ కశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని బుధవారం ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. 26 మంది అమాయకులు ప్రా ణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఉగ్రమూకల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలన్నారు. మృతుల కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ప్రగాఢ సానుభూతి తెలుపుతుందని, కేంద్ర ప్రభుత్వం వారికిఅన్ని విధాలుగా అండగా నిలబడాలని కోరారు. మంగళగిరికి ఎంపీడీఓలు, స్థానిక ప్రజా ప్రతినిధులు కర్నూలు(అర్బన్): జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 24న ( నేడు ) మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర స్థాయి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. బుధవారం జెడ్పీలోని తన చాంబర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రస్థాయి కార్యక్రమానికి తనతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఎంపీడీఓలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు హజరవుతున్నట్లు వెల్లడించారు. గనులపై మైనింగ్ అధికారుల దాడులు కొలిమిగుండ్ల: బెలుం–బెలుం శింగవరం గ్రామా ల మధ్యలో ఉన్న నాపరాతి గనులపై బుధవారం భూగర్భ గనుల శాఖ అధికారుల బృందం దాడులు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్ చేస్తున్నారనే కారణంతో స్థానిక పోలీసులతో కలిసి మైనింగ్ అధికారులు ఈ దాడులు చేశారు. ఎంత మేర గనుల తవ్వకా లు చేశారనే వాటిపై కొలతలు సేకరించారు. నాపరాళ్ల వెలికి తీసేందుకు ఉపయోగించే ఆరు కోత మిషన్లతో పాటు ప్రొక్లెయినర్, ట్రిప్పర్‌ను స్వాధీ నం చేసుకొని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉంచారు. అధికారులు దాడులకు వచ్చా రని తెలుసుకున్న చుట్టు పక్కల గనుల యజమానులు, కూలీలు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లి పోయారు. ఏసీబీ డీఎస్పీగా సోమన్న కర్నూలు: కర్నూలు రేంజ్ ఏసీబీ డీఎస్పీగా సోమన్న నియమితులయ్యారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఇక్కడ డీఎస్పీగా ఉన్న వెంకటాద్రి చిత్తూరు స్పెషల్ బ్రాంచ్‌కు బదిలీ అయ్యారు. అప్పటి నుంచి డీఎస్పీ స్థానం ఖాళీగా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 నెలల తర్వాత డీఎస్పీ పోస్టును భర్తీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. అనంతపురం జిల్లాకు చెందిన సోమన్న 1991లో ఎస్ఐ హోదాలో పోలీసు శాఖలో చేరి కర్నూలు రేంజ్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఎస్ఐగా, సీఐగా సేవలందించారు. కొంతకాలం పాటు ఆదోని డీఎస్పీగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్లో పనిచేస్తున్న ఈయన కర్నూలుకు నియమితులయ్యారు. అయితే మరో ఆరు మాసాల పాటు అటాచ్మెంట్ కింద సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్లోనే విధులు నిర్వహిస్తూ కర్నూలు పర్యవేక్షణ బాధ్యతలు కూడా చూసుకునేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెండు సీఐ పోస్టులు ఖాళీ కర్నూలు రేంజ్ ఏసీబీ విభాగంలో ప్రస్తుతం క్రిష్ణారెడ్డి, క్రిష్ణయ్య, రాజ ప్రభాకర్, శ్రీనివాసులు సీఐలుగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఇంతియాజ్, వంశీనాథ్, ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లడంతో రెండు సీఐ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖాళీ సీఐ పోస్టులను కూడా భర్తీ చేసి ఏసీబీ విభాగాన్ని పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ట్రాన్స్జెండర్ల సమస్యల పరిష్కారానికి కృషి
కర్నూలు(అర్బన్): జిల్లాలో ట్రాన్స్జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి తెలిపారు. బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు/జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ది ఆదేశాల మేరకు స్థానిక న్యాయ సేవా సదన్‌లో ట్రాన్స్జెండర్ల హక్కులపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ట్రాన్స్జెండర్లు తమకు గుర్తింపు కార్డులు, రేషన్‌కార్డులు లేని కారణంగా పింఛన్లు రావడం లేదని జడ్జి దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు ఆయన స్పందిస్తూ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ట్రాన్స్జెండర్లు అందుబాటులోని పథకాలను తెలుసుకొని ప్రయోజనం పొందాలన్నారు. టీజీఐడీ నేషనల్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకుంటే గుర్తింపు కార్డులు వస్తాయన్నారు. దివ్యాంగులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్ ఫాతిమా మాట్లాడుతూ ట్రాన్స్‌జెండర్స్‌కు అనేక ప్రభుత్వ పథకాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్యానెల్ న్యాయవాది హేమలత మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లకు న్యాయ సహాయం అందించేందుకు తోడ్పడతామన్నారు. సదస్సులో ట్రాన్స్జెండర్ల నాయకులు వీణారెడ్డి, శ్రీవాణి, పావని తదితరులు పాల్గొన్నారు. -
ఏపీఎస్పీ బెటాలియన్‌లో రేంజ్–2 స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
కర్నూలు : రాష్ట్ర విభజన తర్వాత కర్నూలు ఏపీఎస్పీ రెండవ బెటాలియన్‌లో రేంజ్–2 స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్– 2025 మొదటిసారిగా ప్రారంభమైంది. బెటాలియన్ కమాండెంట్ దీపిక పాటిల్ ముఖ్య అతిథిగా హాజరై పరేడ్ గ్రౌండ్లో క్రీడాపోటీలను ప్రారంభించారు. ఈనెల 25వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. కర్నూలుతో పాటు కడప, అనంతపురం, చిత్తూరుతో పాటు స్పెషల్ ఆర్మ్డ్ రిజర్వ్ ఆఫ్ సెంట్రల్ పోలీస్ లైన్, అంబర్‌పేట, హైదరాబాదు (ఎస్ఏఆర్సీపీఎల్) బెటాలియన్స్కు చెందిన పోలీసు క్రీడాకారులు స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్నారు. బుధవారం ప్రారంభ రోజు జావెలిన్ త్రో, లాంగ్‌జంప్, 800 మీటర్ల పరుగు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజయం సాధించిన వివిధ పటాలాలకు చెందిన క్రీడాకారులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు కమాండెంట్ అందజేశారు. జావెలిన్ త్రోలో 11వ బెటాలియన్‌కు చెందిన పీసీ యు.ప్రదీప్ కుమార్ మొదటి బహుమతి కై వసం చేసుకోగా 9వ బెటాలియన్‌కు చెందిన పీసీ గోపీనాథ్ రెండో బహుమతి, 11వ బెటాలియన్‌కు చెందిన నరసింహ మూడో బహుమతి దక్కించుకున్నారు. లాంగ్‌జంప్‌లో 11వ బెటాలియన్ పీసీ ప్రదీప్ కుమార్ మొదటి బహుమతి, రిజర్వు ఇన్స్పెక్టర్ కె.రామకృష్ణ రెండో బహుమతి, ఎస్ఏఆర్సీపీఎల్ యూనిట్ పీసీ వెంకటేశ్వర్లు మూడో బహుమతి గెలుచుకున్నారు. అలాగే 800 మీటర్ల పరుగుపందెంలో రెండో బెటాలియన్ పీసీ నరేంద్ర మొదటి బహుమతి, 9వ బెటాలియన్ పీసీ వెంకయ్య రెండో బహుమతి, పీసీ అశోక్ మూడో బహుమతి సాధించారు. కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ నాగేంద్ర రావు, అసిస్టెంట్ కమాండెంట్లు మహబూబ్ బాషా, రవికిరణ్, వెంకటరమణ, సుధాకర్‌రెడ్డి, రిజర్వు ఇన్స్పెక్టర్లు, రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్లు, మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి జరుగుతున్న క్రీడాపోటీలు -
జిల్లా అంతటా విజిబుల్ పోలీసింగ్
కర్నూలు: ప్రజల భద్రత, రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు జిల్లా అంతట విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం ఏకకాలంలో జిల్లా అంతటా విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా రోడ్డు భద్రత నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. వాహనాలు నడిపేవారు హెల్మెట్/సీటు బెల్టు ధరించాలని, డ్రంకెన్ డ్రైవ్‌కు దూరంగా ఉండాలని వాహనదారులకు సూచనలు చేశారు. ఆయా స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో పర్యటించి గొడవలకు దూరంగా ఉండాలని, మహిళా నేరాలు, సైబర్ మోసాలు, బాల్య వివాహాలు, పేకాట వంటి వాటిపై పోలీసులకు సమాచారమివ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. గంజాయి, మత్తు పదార్థాల వాడకంతో కలిగే అనర్థాల గురించి ప్రజలకు వివరించి వాటికి దూరంగా ఉండాలని యువకులకు సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. -
మంచం పట్టిన కలపరి
● గ్రామంలో వంద మందికి పైగా జ్వరం ● ప్రతి ఇంట్లో ఇద్దరు, ముగ్గురు బాధితులు ● కన్నెత్తి చూడని వైద్యారోగ్యశాఖ అధికారులు ఆస్పరి: మండలంలోని కలపరి గ్రామం మంచం పట్టింది. ఈ గ్రామంలో 110 కుటుంబాలుండగా, ప్రతి ఇంట్లో ఇద్దరు, ముగ్గురు జ్వరాలతో బాధపడుతున్నారు. స్థానిక ఆర్ఎంపీల వద్ద చూపించుకుంటున్నా తగ్గడం లేదని వాపోతున్నారు. సమస్య ఇంత తీవ్రంగా ఉంటే వైద్యారోగ్యశాఖ అధికారులు ఇటువైపు కన్నెతి చూసిన దాఖలాలు లేవు. వెంకమ్మ అనే వృద్ధురాలు పరిస్థితి ఆందోళన కరంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మల్లమ్మ, మల్లికార్జున, ఉరుకుందు, సోమన్న, లక్ష్మి, మునిస్వామి, వీరేష్, వెంకటలక్ష్మి, ఆటో ఉరుకుందప్ప, సూరి, లోకేశ్వరీతో పాటు వందమంది వంద మంది జ్వరం, కాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. దాదాపు రెండు వారాల నుంచి ఈ సమస్య ఉంది. ఇళ్లలో ఒకరి తర్వాత ఒకరు జ్వరం బారిన పడుతున్నారు. పారిశుద్ధ్య లోపమా లేక మరే కారణమో తెలియదని, అధికారులు స్పందించి వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
సచివాలయ వ్యవస్థతో వేలాది ఉద్యోగాలు
2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం 73వ రాజ్యాంగ సవరణ ముఖ్య ఉద్దేశాన్ని గుర్తించింది. గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి వేలాది ఉద్యోగాల కల్పనకు కారణమయ్యారు. ప్రతి 2వేల జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. నూతన సాంకేతిక ఒరవడితో ఆన్లైన్ సదుపాయం కల్పించారు. ఎంపీడీఓల పదోన్నతులకు శ్రీకారం చుట్టారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల జిల్లా పరిషత్‌లలో పీఆర్‌కు చెందిన వారే సీఈఓ, డిప్యూటీ సీఈఓలుగా విధులు నిర్వహిస్తున్నారు. – జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మూడంచెల పీఆర్ వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో 1.20 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఎలాంటి అవినీతికి తావు లేకుండా వివిధ ప్రభుత్వ సేవలను గ్రామ/వార్డు సచివాలయ స్థాయిలోనే అందించారు. ప్రతి 50 కుటుంబాలకు ఒకరు ప్రకారం ఏర్పాటు చేసిన వలంటీరు వ్యవస్థ వల్ల ఎంతో మేలు జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా పదోన్నతులకు నోచుకోని ఎంపీడీఓలకు పదోన్నతులు లభించాయి. – జీ జయపాల్‌రెడ్డి, రిటైర్డు జెడ్పీ సీఈఓ, ఎస్ఐఆర్డీ తెలంగాణ కన్సల్టెంట్ ● -
జర్నలిస్టులకు రక్షణ కల్పించకపోతే ప్రజాస్వామ్యానికి హాని
కర్నూలు(సెంట్రల్): సాక్షి దినపత్రిక ఏలూరు కార్యాలయంపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు దాడి చేయడాన్ని సీనియర్ జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నాయకులు తీవ్రంగా తప్పుపట్టారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశాయి. జర్నలిస్టులకు రక్షణ క ల్పించకపోతే ప్రజాస్వామ్యానికి హాని కలిగే ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వెలిబుచ్చారు. బుధవారం జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషాను ఆయన కార్యాలయంలో కలసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏపీ డబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోరంట్లప్ప, సీనియర్ జర్నలిస్టు సత్యనారాయణ గుప్తా మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర ఎంతో ఉందన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ తప్పులు, ఒప్పులు, అక్రమాలు నిజాలను బయట పెట్టే బాధ్యత పత్రికలపై ఉంటుందన్నారు. అందులో భాగంగా దృష్టికి వచ్చిన అంశాలపై కథనాలు, విశ్లేషణలు చేస్తుంటాయన్నారు. అయితే ఏదైనా పత్రికలో వార్త వచ్చిన సమయంలో సంబంధిత వ్యక్తులు ఇబ్బందిగా భావిస్తే ఖండన ఇవ్వవచ్చు అన్నారు. అందుకు సంతృప్తి చెందకపోతే న్యాయస్థానాల ద్వారా లీగల్‌గా ప్రొసీడ్ అయ్యేందుకు వీలు ఉందన్నారు. అయితే అవేవీ పట్టకుండా ప్రభుత్వంలోని కొందరు నేతలు పత్రికల్లో వార్తలు వస్తే జర్నలిస్టులను భయపెట్టే విధంగా దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టు కార్యాలయాలను ధ్వంసం చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఇటీవల కాలంలో జర్నలిస్టులు, జర్నలిస్టు సంస్థలపై దాడులు అధికమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ నగర అధ్యక్ష, కార్యదర్శులు ఎం.శివశంకర్, ఎర్రమల, సీనియర్ జర్నలిస్టులు రవికుమార్, హుస్సేన్, రవిప్రకాష్, శ్రీనాథ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకు వినతిపత్రం ఇచ్చిన జర్నలిస్టులు -
‘పది’లో స్వల్పంగా పెరిగిన ఉత్తీర్ణత
● 66.1 శాతంతో చివరి నుంచి రెండో స్థానంలో జిల్లా ● మొదటి శ్రేణిలో 14,291 మంది విద్యార్థులు ● ఏడుగురు విద్యార్థులకు 597 మార్కులు ● ప్రభుత్వ యాజమాన్యాల్లోనూ విద్యార్థుల రాణింపు ● రెండు కేజీబీవీల్లో వంద శాతం ఉత్తీర్ణత ● ఫలితాల్లో బాలికలదే పైచేయి ● సత్ఫలితాలిచ్చిన ఇంగ్లిష్ మీడియం విద్య -
తల్లి కష్టంతో చదివి
తల్లి వద్ద విద్యార్థి ప్రేమ్ గణేష్ఎమ్మిగనూరుటౌన్: పట్టణంలోని వీవర్స్ కాలనీ జెడ్పీ హైస్కూల్లో చదివిన ప్రేమ్ గణేష్ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 588 మార్కులు తెచ్చుకున్నారు. కుర్ణికులానికి చెందిన తన తండ్రి ఎం.శివకుమార్ అనారోగ్యంతో మృతిచెందారు. ఎమ్మిగనూరు శివన్న నగర్లో నివాసం ఉండే తల్లి శ్రావణి టైలర్‌గా పనిచేస్తూ కుమారుడు ప్రేమ్ గణేష్‌ను చదివించింది. తల్లి కష్టంతో చదివి పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన తాను ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ తీసుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తానని ప్రేమ్ గణేష్ తెలిపారు. -
66.01 ఉత్తీర్ణత శాతం
జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు పగిడాల గీతిక (597) షేక్ మహమ్మద్ (597) వెంకట కీర్తన (597) టి.గాయత్రి (597) సలీమా (597) జి.నందు (597) హరిణి (597) సాయి నందిని (596) వెంపలి రస్మితారెడ్డి (596) రత్నపల్లి మనుచరణ్ (596) పి.రాజ్వాన (596) షేక్ తస్రీన్ (596) నేహాతాళ యాస్మిని (596) కర్నూలు సిటీ: పదవ తరగతి పరీక్షల ఫలితాల పెంపునకు కూటమి ప్రభుత్వం వంద రోజుల ప్రణాళికను తయారు చేసి అమలు చేసింది. అయితే ఆ ప్రణాళిక అమలుపై క్షేత్ర స్ధాయిలో సరైన పర్యవేక్షణ లోపించింది. కూటమి ప్రభుత్వం సంస్కరణల పేరుతో చదువులను విస్మరించింది. పశ్చిమ పల్లెల నుంచి వలస వెళ్లిన విద్యార్థులను గుర్తించి సకాలంలో వెనక్కి తీసుకు రాలేకపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో పరీక్షల ఫలితాలు అశించిన స్థాయిలో రాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఫలితాల్లో జిల్లా గతేడాది కంటే ఈ ఏడాది ఉత్తీర్ణత 3.53 శాతం పెరిగింది. గత నెల 17 నుంచి 30వ తేది వరకు 172 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఈనెల 3 నుంచి 9వ తేది వరకు ముల్యాంకనం చేపట్టారు. గతేడాది 62.47 శాతంతో జిల్లా చిట్టచివరి స్థానం దక్కించుకోగా.. ఈ ఏడాది 66.01 శాతం ఉత్తీర్ణతతో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఇక పదవ తరగతి పరీక్షలంటే సాధారణంగా బాలికలదే పైచేయి ఉంటుంది. తాజా ఫలితాల్లోనూ బాలికలే ముందంజలో నిలిచారు. మొత్తం విద్యార్థుల్లో 14,291 మంది ఫస్ట్ క్లాసు, 3,904 మంది సెకెండ్ క్లాస్, 2,389 మంది థర్డ్ క్లాసులో ఉత్తీర్ణులయ్యారు. సత్ఫలితాలిచ్చిన ఎన్సీఈఆర్టీ సిలబస్ పాఠశాల విద్యలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్యతో పాటు ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను ప్రవేశ పెట్టింది. ఈ సంస్కరణ తీసుకొచ్చిన తరువాత నిర్వహించిన పది పరీక్షల్లో ఫలితం స్పష్టంగా కనిపించింది. ఇంగ్లిష్ మీడియంలో రాసిన విద్యార్థులు తెలుగు మీడియం వారి కంటే అత్యధిక శాతం ఉత్తీర్ణులు కావడమే ఇందుకు కారణం. ఇంగ్లిష్ మీడియంలో రాసిన వారు సుమారు 85 శాతం ఉత్తీర్ణులు కాగా.. తెలుగు మీడియం విద్యార్థులు 40 శాతం కూడా ఉత్తీర్ణత సాధించలేకపోవడం గమనార్హం. ఇదిలాఉంటే గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టుల్లోనే అత్యధిక శాతం విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. 34 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత జిల్లాలో 517 స్కూళ్లకు చెందిన విద్యార్థులు పరీక్షలు రాయగా, 34 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 100 శాతం ఉత్తీర్ణతలో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్(బాలికలు, బనవాసి), ఏపీ రెసిడెన్షియల్ స్కూల్(బాలురు, కాల్వ బుగ్గ), మహత్మజ్యోతిరావు ఫూలే బీసీ వెల్ఫేర్ స్కూల్(బాలికలు, ఆరేకల్లు), ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్(కర్నూలు), కేజీబీవీ క్రిష్ణగిరి, కేజీబీవీ పంచలింగాల స్కూల్‌కి చెందిన విద్యార్థులు 100 శాతం ఫలితాలు సాధించారు. ఈ స్కూళ్లలో చదివిన విద్యార్థులు టి.సాయి లిఖిత 592 మార్కులు(ఏపీజే అబ్దుల్ కలాం స్కూల్), వై.దేవిక 576 మార్కులు సాధించారు. మూడు కార్పొరేట్, 23 ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయి. ● జిల్లాలో ఏపీ మోడల్ స్కూళ్లు 16 ఉన్నాయి. ఈ స్కూళ్ల నుంచి 1,333 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 930 మంది పాసయ్యారు. కోడుమూరు ఏపీ మోడల్ స్కూల్‌కి చెందిన జి.సోహాల్ 583 మార్కులు సాధించారు. కేజీబీవీల్లో.. జిల్లాలో 25 కస్తూర్బా గాంధీ విద్యాలయాలకు చెందిన 978 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 774 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో పంచలింగాల, క్రిష్ణగిరి కేజీబీవీలో 100 శాతం అత్యధికంగా, కోసిగిలో అత్యల్పంగా 43 శాతం ఉత్తీర్ణత సాధించారు. వై.దేవిక అత్యధికంగా 576 మార్కులు సాధించింది. 75 మందికి 500 మార్కులకు పైగా వచ్చాయి. మున్సిపల్ హైస్కూళ్లు.. జిల్లాలో మున్సిపల్ హైస్కూళ్లకు చెందిన 1,838 మంది విద్యార్థుల్లో 961 మంది ఉత్తీర్ణత సాధించారు. కర్నూలు నగరంలోని ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ మెమోరియల్ స్కూల్లో 43 మంది పరీక్షలు రాయగా అందరూ పాసయ్యారు. ఈ స్కూల్‌కి చెందిన టి.సాయి లఖిత 595 మార్కులు సాధించింది. 42 మంది 500 మార్కులకు పైగా సాధించడం విశేషం. ● ఎయిడెడ్ స్కూళ్లకు చెందిన 187 మందిలో 102 మంది పాసయ్యారు. ఈ స్కూళ్లకు చెందిన బి.హేమప్రియకు 570 మార్కులు వచ్చాయి(సెయింట్ జోసెఫ్ హైస్కూల్, చిల్డ్రన్స్ పార్క్). ● ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్ల నుంచి 91 మందిలో 60 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో ఆలూరు స్కూల్‌కి చెందిన పి.అంజలి 564 మార్కులు అత్యధికంగా సాధించారు. ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లకు చెందిన 544 మందిలో 483 మంది ఉత్తీర్ణులు కాగా.. బిక్యాంపు రెసిడెన్షియల్ స్కూల్‌కి చెందిన ఎం.ప్రమీలా 587 మార్కులు సాధించింది. బీసీ వెల్ఫేర్ స్కూళ్లకు చెందిన 227 మందిలో 221 మంది ఉత్తీర్ణులైయ్యారు. ఈ స్కూళ్లకు చెందిన జి.హాసిని 592 మార్కులు సాధించారు. ● ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లకు చెందిన 374 మంది పరీక్షలు రాయగా, 360 మంది పాసయ్యారు. కాల్వబుగ్గ రెసిడెన్షియల్ స్కూల్, మహత్మజ్యోతిరావు ఫూలే స్కూల్ ఆరెకల్లులో 100 శాతం ఫలితాలు వచ్చాయి. పంచలింగాల స్కూల్ విద్యార్థి 592 మార్కులు సాధించారు. ● డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులాలు 8 ఉన్నాయి. ఈ స్కూళ్లకు చెందిన 1,002 మంది పరీక్షలకు హాజరుకాగా 919 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 771 మంది మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. 31,185 పరీక్షకు హాజరైన విద్యార్థులు 20,584 ఉత్తీర్ణులైన విద్యార్థులు 60.36 బాలుర ఉత్తీర్ణత శాతం (9,854 మంది) 72.21 బాలికల ఉత్తీర్ణత శాతం (10,730 మంది)బనవాసికి గురుకులానికి మరోసారి ‘వంద’నం ఎమ్మిగనూరురూరల్: కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా బనవాసి గురుకుల పాఠశాల ఫలితాలను సాధిస్తోంది. బుధవారం ప్రకటించిన 10వ తరగతి పరీక్షల్లో ఈ పాఠశాల విద్యార్థులు వందశాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 79 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాదించి తమ సత్తా మరోసారి చాటుకున్నారు. ఎమ్మిగనూరు మండల పరిధిలోని బనవాసి గురుకుల పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ పాఠశాల 2007 నుంచి వరుసగా 18 సంవత్సరాలుగా వందశాతం ఉత్తీర్ణతను సాధిస్తూ వస్తోంది. ఈ ఏడాది వై. శ్రీవాణి 583, జి. నందిని 576, బి. కీర్తన 573, టి. బిందు 570, డీఎస్ భాగ్యశ్రీ 567, కె. సుమయ్యతప్సం 566, పి. గీతాంజలి 559, పి. నందిని 559, వై.నందిని 558 మార్కులు సాధించారు. ప్రతి సారి ఇలాంటి ఫలితాలే వస్తున్నాయని ప్రిన్సిపాల్ సామ్రాజ్యం తెలిపారు. -
ఉగ్ర దాడి హేయమైన చర్య
● వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసనకర్నూలు(టౌన్): అమాయకులపై ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య అని కర్నూలు మేయర్ బి.వై.రామయ్య అన్నారు. బుధవారం రాత్రి స్థానిక వైఎస్సార్ సర్కిల్ వద్ద కశ్మీర్లో ఉగ్రవాదుల ఊచకొత ఘటనను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడిని పిరికిపందల చర్యగా అభివర్ణించారు. అమాయకులను పొట్టన పెట్టుకోవడం క్షమించరాని నేరమన్నారు. దేశంలో అలజడి సృష్టించే ఉద్దేశంతో ఉగ్రవాదులు చేస్తున్న కుట్రలను కేంద్ర ప్రభుత్వం తిప్పి కొట్టాలన్నారు. ● వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉగ్రవాదం ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైందన్నారు. దీన్ని కూకటి వేళ్లతో పెకలించాలన్నారు. ● వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మూద్దురు సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలు, విదేశీయులను సైతం ఉగ్రవాదులు అత్యంత క్రూరంగా చంపేశారన్నారు. ఉగ్రవాదంపై కేంద్రం ఉక్కుపాదం మోపాలన్నారు. ● వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అహమ్మద్ ఆలీఖాన్ మాట్లాడుతూ కశ్మీర్ ఘటనకు కారణమైన ఉగ్ర మూకలను వెతికి పట్టుకొని కఠినంగా శిక్షించాలన్నారు. అమాయకులను అత్యంత క్రూరంగా చంపడాని సహించరాదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, జిల్లా నాయకులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
విధుల్లో అలసత్వం తగదు
ఆలూరు: విధి నిర్వహణలో వైద్య సిబ్బంది అలసత్వం వహించడం తగదని డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం స్థానిక సీహెచ్‌సీ కేంద్రాన్ని (ప్రజా ఆరోగ్య కమ్యూనిటీ అర్బన్ హెల్త్ కేంద్రాన్ని) ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సేవలను రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్య సిబ్బందితో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారిలో ఎక్కువ శాతం పేదలు ఉంటారని, వారిని నిర్లక్ష్యం చేయడం మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. కోట్లాది రూపాయలతో ఆధునాతన వైద్య పరికరాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని, వాటిని సద్వినియోగం చేయాలన్నారు. ఆసుపత్రి ఆవరణను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సమావేశంలో సివిల్‌సర్జన్ డాక్టర్ వాహిద్, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శ్రీకాంత్, రామకృష్ణ, స్టాఫ్ నర్సులు నిర్మల, మంగమ్మ, రాజేశ్వరి, భారతి, ఎన్టీర్ ఆరోగ్య మిత్రలు కృష్ణారెడ్డి, మంజునాథ్ తదితరులు ఉన్నారు. -
క్రీడలతో పాటు వ్యాయామం తప్పనిసరి
● రేంజ్ పోలీసుల క్రీడా పోటీల్లో ఏఆర్ అడిషనల్ ఎస్పీ కర్నూలు: పోలీసు సిబ్బందికి క్రీడలు, వ్యాయామం చాలా అవసరమని, వీటి ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ అన్నారు. కర్నూలు, కడప, నంద్యాల, అన్నమయ్య జిల్లాల (రేంజ్ పరిధిలో) పోలీసులకు కర్నూలు నగరంలోని ఔట్‌డోర్ స్టేడియంలో మంగళవారం క్రీడల పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ క్రీడలు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. కర్నూలు డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో క్రీడాపోటీల్లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న పోలీసు సిబ్బందికి అవకాశం కల్పించారు. ఫుట్‌బాల్, వాలీబాల్, కబడ్డీ, హ్యాండ్‌బాల్, షటిల్, రన్నింగ్, లాంగ్ జంప్, హైజంప్, షాట్‌పుట్, క్రికెట్, బాస్కెట్ బాల్ తదితర క్రీడల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రస్థాయి పోలీసు క్రీడాపోటీలు త్వరలో జరగనున్న నేపథ్యంలో రేంజ్ పరిధిలో క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనపరచిన పోలీసులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ భాస్కర్‌రావు, ఆర్ఐలు, రేంజ్ పరిధిలోని వివిధ జిల్లాలకు చెందిన పోలీసు సిబ్బంది పోటీల్లో పాల్గొన్నారు. -
‘ఉపాధి’ పనులు 7 శాతమేనా?
● అసంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ కర్నూలు(సెంట్రల్): ఉపాధి పనుల్లో ఏప్రిల్ నెల నందవరం, గోనెగండ్ల, హాలహర్వి, ఆస్పరి మండలాలు 7 శాతంలోపే ఉండడంపై జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో పురోగతి కనిపించకపోతే షోకాజ్ నోటీసులు జారీ చేస్తానని ఎంపీడీఓలు, ఏపీఓలను హెచ్చరించారు. వేసవిలో కూలీలకు ముమ్మరంగా ఉపాధి పనులను కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి, హౌసింగ్, గ్రామ, వార్డు సచివాలయాల సేవలపై జిల్లా, మండలాల ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలతో మంగళవారం జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ లోపు 8500 ఫార్మ్ఫాండ్లను పూర్తి చేయాలన్నారు. పశువుల తొట్టె నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. హౌసింగ్‌కు సంబంధించి జూన్1 నాటికి 11 వేల ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందులో ఇప్పటి వరకు 5,700 ఇళ్లను పూర్తి చేశామన్నారు. ఆదోని డివిజన్‌లోనే ఎక్కువగా ఇళ్ల నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. టెలీకాన్పరెన్స్‌లో ఆదోని సబ్‌కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఆర్డీఓలు సందీప్‌కుమార్, ఆర్డీఓ భరత్‌నాయక్, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, డ్వామా పీడీ వెంకటరమణయ్య పాల్గొన్నారు. రక్షిత నీటిని సరఫరా చేయాలి కర్నూలు(అర్బన్): అన్ని పంచాయతీల్లోని ప్రజలకు రక్షిత మంచి నీటిని అందించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి జీ భాస్కర్ ఆదేశించారు. మంగళవారండీఎల్పీఓ టీ లక్ష్మితో కలిసి కోడుమూరు, గూడూరు మండలం పెంచికలపాడు గ్రామా ల్లోని తాగునీటి ట్యాంకులు, ఎస్‌డబ్ల్యూపీసీ కేంద్రాలను పరిశీలించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి శుభ్రం చేయాలన్నారు. -
సీహెచ్‌ఓల నిరసన దీక్ష
కర్నూలు(సెంట్రల్): ఆరేళ్లు దాటిన సీహెచ్‌ఓల సర్వీసును క్రమబద్ధీకరించాలని సీహెచ్ఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు టీఎస్ చందన డిమాండ్ చేశారు. కలెక్టరేట్ నుంచి ధర్నా చౌక్ వరకు సీహెచ్‌ఓలు సోమవారం ర్యాలీ నిర్వహించి అక్కడ నిరసన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. ఎన్హెచ్ఎంలోని ఇతర ఉద్యోగులతో సమానంగా 23 శాతం పీఆర్సీ ఇవ్వాలన్నారు. ప్రతి నెలా జీతంతోపాటు ఇన్సెంటివ్ను ఇవ్వాలని, ప్రతి సంవత్సరం 5 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని కోరారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. 1,940 హెక్టార్లలో పండ్ల తోటల అభివృద్ధికి చర్యలు కర్నూలు(అగ్రికల్చర్): 2024–25 ఆర్థిక సంవత్సరంలో కొత్త తోటల అభివృద్ధి కింద 1,940 హెక్టార్లలో ఉద్యాన పంటలు అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు ఉద్యాన శాఖ జిల్లాకు లక్ష్యాలను నిర్దేశించింది. ఎంఐడీహెచ్ కింద 890 హెక్టార్లు, రాష్ట్రీయ కృషి వికాశ్ యోజన కింద 550 హెక్టార్లలో ఉద్యాన పంటలు అభివృద్ధి చేసే విధంగా ఉద్యాన శాఖ జిల్లాకు లక్ష్యాలు ఇచ్చింది. ఆయిల్ పామ్ సాగును చేపట్టాలని సూచించింది. ఈ ఏడాది జిల్లాలో 500 హెక్టార్లలో ఆయిల్‌పామ్ సాగు చేసేలా లక్ష్యాలు ఇచ్చింది. అర్హులైన రైతులను మే నెల చివరిలోగా గుర్తించాలని జిల్లా ఉద్యాన అధికారి పి.రామాంజనేయులు ఉద్యాన అధికారులను ఆదేశించారు. హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ కర్నూలు(హాస్పిటల్): కర్నూలు నగరంలోని కింగ్‌మార్కెట్ సమీపంలో ఉన్న ఈడెన్ గార్డెన్ కమ్యూనిటీ హాల్లో హజ్ యాత్రకు వెళ్లే యాత్రి కులకు మంగళవారం వ్యాక్సినేషన్ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరాన్ని డీఎంహెచ్ఓ డాక్టర్ పి.శాంతికళ పరిశీలించి మాట్లాడారు. హజ్ యా త్రికులకు ఆరోగ్యపరీక్షలు నిర్వహించి అవసరమైన టీకాలు వేసి సర్టిఫికెట్ ఇస్తామన్నారు. హజ్ యాత్రికులందరూ ఎలాంటి అపోహలు లేకుండా వ్యాక్సిన్(ఓరల్ పోలియో వ్యాక్సిన్, మేనింగోకోకల్, ఇన్ఫ్లూయింజా) తీసుకుని సర్టిఫికెట్ పొందాలన్నారు. కార్యక్రమంలో డీఐవో డాక్టర్ నాగప్రసాద్‌బాబు, డిస్ట్రిక్ట్ ఎపడమాలజిస్టు వేణుగోపాల్, యుపీహెచ్సీ వైద్యాధికారులు, ఆరోగ్యపర్యవేక్షకులు, స్టాఫ్‌నర్సులు పాల్గొన్నారు. రూ.60 లక్షల బంగారం పట్టివేత ఆదోని అర్బన్: పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మహమ్మద్ ఫజల్ ఎలాంటి ఆధారాలు, బిల్లులు లేకుండా బంగారాన్ని తీసుకొస్తుండగా టూటౌన్ పోలీసులు మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో పట్టుకున్నారు. ఈ మేరకు టూటౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి స్వాధీనం చేసుకున్న బంగారం బిస్కెట్లను చూపి వివరాలను వెల్లడించారు. మహమ్మద్ఫజల్ రూ.60 లక్షల విలువ చేసే బంగారం బిస్కెట్లను ప్రొద్దుటూరు నుంచి తీసుకొస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. ఆ మేరకు ఆస్పరి బైపాస్ రోడ్డు వద్ద తనిఖీ నిర్వహించి పట్టుకున్నట్లు తెలిపారు. ఆయన వద్ద ఎలాంటి బిల్లులు, ఆధారాలు లేకపోవడంతో బంగారాన్ని స్వాధీనం చేసుకుని వాణిజ్యశాఖ అధికారులకు అప్పగించామన్నారు. 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటిపోయాయి. వడగాల్పుల తీవ్రత పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దొర్నిపాడు 43.9, మిడుతూరు 43.3 డిగ్రీలు, నందికొట్కూరు 43.3 డిగ్రీలు, పాణ్యం 43.7 డిగ్రీల ప్రకారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో అత్యధికంగా కర్నూలు అర్బన్‌లో 43.5, కౌతాళంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గోస్పాడు, పాములపాడు, బండిఆత్మకూరు, సంజామల, శిరువెళ్ల, నంద్యాలల్లో సమాన స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
ఊరికి చేరి.. ఊపిరి పీల్చి!
వెల్దుర్తి: ఊరంటే ఎనలేని ప్రేమ.. హద్దులులేని అభిమానం.. అక్కడే పెరిగారు.. అందరితో ఆత్మీయంగా ఉండేవారు. అదే పల్లెలో ఎన్నో ఏళ్లుగా జీవనం.. అందరూ తెలిసిన వారే.. అయితే గతేడాది జరిగిన ఒక హత్య ఎనలేని కష్టాలను తెచ్చింది. గ్రామస్తుల ప్రమేయం లేకున్నా టీడీపీ నాయకులు కక్ష గట్టారు. పలు కుటుంబాలను గ్రామం నుంచి వెళ్లగొట్టారు. ఊరు వదిలిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు హైకోర్టు ఆదేశాలతో 32 మందిలో 27మంది ఈనెల 7న తిరిగి గ్రామం చేరుకున్నారు. మిగిలిన ఐదుగురు సైతం మంగళవారం పోలీసు బందోబస్తు మధ్య గ్రామానికి వచ్చారు. ఇదీ ఘటన.. వెల్దుర్తి మండలంలోని బొమ్మిరెడ్డిపల్లె గ్రామంలో జూన్ 9న టీడీపీ కార్యకర్త గిరినాథ్ చౌదరి హత్య జరిగింది. కేసులో దాదాపు 11మంది వైఎస్సార్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తల పేర్లను అక్రమంగా చేర్చారు. కేసులో ముద్దాయిలతోపాటు, సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామంలోని పలు కుటుంబాలను టీడీపీ నాయకులు గ్రామం నుంచి వెళ్లగొట్టారు. శాంతిభద్రతల పేరుతో వారికి పోలీసులు వంతపాడారు. ఈ దశలో కేసులో ముద్దాయిలు 11మందితోపాటు ఊరు విడిచి వెళ్లిన వారు మొత్తంగా 32మంది తమను తిరిగి గ్రామం చేర్చాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో జస్టిస్ హరినాథ్.. పిటిషనర్లు గ్రామంలోకి వెళ్లేలా అనుమతించాలని గత నెల తీర్పునిచ్చారు. దీంతో పోలీసులు ఈనెల 7వ తేదీన 32మందిని గ్రామంలోకి చేరుకునేలా ప్రయత్నించారు. ఆ సమయంలో పరిస్థితుల నేపథ్యంలో 27మందికి మాత్రమే అనుమతినివ్వడంతో మిగిలిన ఐదుగురు వెనుదిరిగారు. ఈ పరిస్థితులను అన్నీ ఎస్పీ విక్రాంత్ పాటిల్ సమీక్షిస్తూ వచ్చారు. గ్రామంలో రెండు దఫాలుగా పర్యటించారు. ఈ క్రమంలో మిగిలిన ఐదుగురు సైతం మంగళవారం పోలీస్ బందోబస్తు మధ్య గ్రామం చేరుకున్నారు. వీరిలో భాస్కర్ నాయుడు, రంగయ్య సోదరులు, సూర్యనారాయణ, వెంకటేశ్, రాజేశ్ ఉన్నారు. పది నెలల అనంతరం వారు ఇంటికి చేరుకుని ఆనందం వ్యక్తం చేశారు. గ్రామంలో ప్రశాంతతకు పోలీసులు పికెట్ నిర్వహిస్తూనే ఉన్నారు. పది నెలల తర్వాత తెరపడిన నిరీక్షణ బొమ్మిరెడ్డిపల్లె చేరుకున్న గ్రామస్తులు -
బంగారుపేట సారా స్థావరంపై పోలీసుల దాడి
కర్నూలు: కర్నూలులోని బంగారుపేట కేసీ కెనాల్ గట్టు పొడవున ఉన్న నాటుసారా స్థావరంపై సివిల్, ఎకై ్సజ్ పోలీసులు దాడి చేసి విస్తృత తనిఖీలు నిర్వహించారు. మంగళవారం ఉదయమే రెండో పట్టణ పోలీసులు, కర్నూలు ఎకై ్సజ్ పోలీసులు పెద్ద ఎత్తున బంగారుపేటకు చేరుకోవడంతో ప్రజలు ఏమి జరిగిందోనని ఆందోళనకు లోనయ్యారు. ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, సూపరింటెండెంట్ సుధీర్ బాబు, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు రాజశేఖర్ గౌడ్, రామకృష్ణారెడ్డి, సీఐలు నాగరాజరావు, మన్సూరుద్దీన్, నాగశేఖర్, ఎకై ్సజ్ సీఐలు చంద్రహాస్, జయరాం నాయుడు, కృష్ణ తదితరులు ఐదు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్‌కు వెళ్లే రోడ్డు నుంచి ఆనంద్ థియేటర్ వరకు దాదాపు కిలోమీటర్ పొడవున నాటుసారా స్థావరాలపై దాడులు జరిపి బట్టీలను ధ్వంసం చేశారు. 1,350 లీటర్ల నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం ఊటను ధ్వంసం చేసి 65 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. నీలి షికారి భాగ్యమ్మపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా నాటుసారా నిర్మూలన ఆవశ్యకతను, సారా వినియోగం వల్ల ఎదురయ్యే అనారోగ్య సమస్యలను వార్డు ప్రజలకు వివరించారు. – 65 లీటర్ల నాటు సారా సీజ్ -
విషాదం
● రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమార్తె మృతి ● మోటారు సైకిల్‌ను ఢీకొన్న లారీ ● పెద్దహోతూరు సమీపంలో దుర్ఘటన ఆలూరు/ఆస్పరి: పేదింట్లో విషాదం నెలకొంది. పేదరికం నుంచి బయట పడేందుకు నలుగురు పిల్లలను చదివిస్తున్న ఆ కుటుంబంపై విధి పగపట్టింది. లారీ రూపంలో తండ్రి వడ్డె ఈరన్న(45)ను, అతని రెండో కుమార్తె వడ్డె శ్రావణి (14)ని కబళించింది. ఈ దుర్ఘటన పెద్దహోతూరు సమీపంలో నిర్మాణంలో నిలిచిన టోల్గేట్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. ఆస్పరి మండలం ముత్తుకూరు గ్రామానికి చెందిన ఈరన్న, రాధమ్మ దంపతులకు సెంటు భూమి లేదు. ఈరన్న టైలర్‌గా, రాధమ్మ కూలి పనులకు వెళ్తూ జీవనం సాగించేవారు. వీరి పెద్ద కుమార్తె హిందు తొమ్మిదో తరగతి వరకు చదువుకుని తండ్రి దగ్గర టైలరింగ్ పని నేర్చుకుంటోంది. రెండో కుమార్తె శ్రావణి (14) చిప్పగిరిలో కస్తూర్బా పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. మూడో కుమార్తె స్వాతి 6 తరగతి మండలంలోని బిల్లేకల్లు హైస్కూల్లో, చిన్న కుమారుడు విక్రమ్ 3వ తరగతి ముత్తుకూరులోనే చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు విద్యా శాఖ అధికారులు సెలవులు ప్రకటించడంతో రెండో కుమార్తె వడ్డె శ్రావణి ని తీసుకొచ్చేందుకు తండ్రి వడ్డె ఈరన్న మోటార్ సైకిల్‌పై చిప్పగిరి వెళ్లాడు. పాఠశాల నుంచి రెండో కుమార్తె శ్రావణితో పాటు సొంతూరుకు వస్తుండగా కర్నూలు నుంచి ఆలూరు వైపు వస్తున్న లారీ పెద్దహోతూరు సమీపంలో బలంగా ఢీ కొట్టింది. దీంతో తండ్రి, కుమార్తె ఇద్దరూ ఒక్కసారిగా టైర్లు కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఆలూరు ఎస్ఐ మహబూబ్‌బాషా ,హెడ్ కానిస్టేబుల్ జానీవాకర్, పోలీసులు ప్రమాద స్థలాన్ని చేరుకుని మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మృతుల కుటుంబాన్ని ఓదార్చిన ఎమ్మెల్యే ప్రమాద విషయం తెలుసుకుని ఆలూరు ఎమ్మెల్యే బి. విరూపాక్షి ఆసుపత్రికి వచ్చారు. తండ్రి, కుమార్తెల మృతదేహాలను పరిశీలించారు. వడ్డె ఈరన్న భార్య వడ్డె రాధమ్మను, కుమార్తెలు హిందు, స్వాతి, కుమారుడు విక్రమ్, సమీప బంధువులను ఓదార్చారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. నేషనల్ హైవే అఽథారిటీ అధికారులు ప్రమాద సూచికలను, రేడియం స్టిక్కర్లును ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. మృతుల కుటుంబాన్ని రాష్ట్ర ప్ర భుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. ఎమ్మె ల్యే వెంట వైఎస్సార్సీపీ నాయకులు భాస్కర్, వీరేష్, బాబు, ఆలూరు మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మల్లికార్జున, ఎంపీపీ రంగమ్మ, రాముడు ఉన్నారు. -
ఉన్నత చదువులతో రాణించాలి
● రాష్ట్ర స్థాయిలో కర్నూలు సంక్షేమ విద్యార్థుల ప్రతిభ కర్నూలు(అర్బన్): ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు 83.91 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలోనే అత్యుత్తమ ప్రతిభను చాటారు. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లోని పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థులు మరింత ఉన్నత చదువులు చదివి ఉత్తమ భవిష్యత్తును అందుకోవాలని కోరారు. విద్యార్థులు మంచి మార్కులు సాధించేందుకు సహకారం అందించిన వసతి గృహ సంక్షేమాధికారులను కూడా ఆయన అభినందించారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ మెడల్స్, నూతన వస్త్రాలను బహూకరించారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ జె.రంగలక్ష్మిదేవి, సహాయ సాంఘిక సంక్షేమాఽధికారులు కె.బాబు, బి.మద్దిలేటి, వసతి గృహ సంక్షేమాధికారిణులు బి.బెన్నమ్మ, రజినమ్మ, క్రాంతికుమార్ పాల్గొన్నారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు: కె.రాఘవేంద్ర(958),కె.రోజ(955), ఎస్.సలీమా (953), ఎం.సాయిప్రసాద్(935), కె.తరుణ్(933), బి.దస్తగిరమ్మ(926), ఎం.ప్రభావతమ్మ(919). -
వైద్యానికి ‘సెలవు’
● వంద పడకల ఆసుపత్రిలో వైద్యుల కొరత ● 23 మంది వైద్యుల్లో ప్రస్తుతం ఆరుగురే ● 11 మంది సెలవులో, మరో ఆరుగురు బదిలీ ● నాడు ఓపీ 600.. నేడు 200 ● సేవలు అందక ప్రజల అవస్థలు డోన్: పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన వంద పడకల ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలు నానాటీకి సన్నగిల్లుతున్నాయి. పట్టణ శివారులో దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.40 కోట్లతో కార్పొరేట్ తరహాలో ఆధునిక యంత్ర పరికరాలతో వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వంద పడకల ఆసుపత్రిలో వైద్యం దైవాదీనంగా మారుతోంది. ఆసుపత్రి ప్రారంభం 23 మంది వైద్యులను గత ప్రభుత్వం నియమించగా.. ఇందులో సగానికి సగం మంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇక్కడి నుండి బదిలీ, సెలవులపై వెళ్లిపోయారు. గతంలో ప్రతిరోజూ 600 వరకు ఓపీ నడవగా ప్రస్తుతం 200కు పడిపోయింది. ఇందుకు కారణం ప్రస్తుతం వైద్యుల్లో ఆరు బదిలీలపై వెళ్లిపోవడం, 11 మందిలో కొందరు మహిళా వైద్యులు ప్రసూతీ సెలవు, కొంతమంది మెడికల్ లీవ్‌లపై వెళ్లిపోయారు. రేడియాలజిస్ట్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో డాక్టర్ల సంఖ్య ప్రస్తుతం ఆరుకు పరిమితమైంది. ఇందులో ఆర్థో డాక్టర్‌ను జిల్లా వ్యాప్తంగా జరిగే సదరన్ క్యాంపులకు డ్యూటీపై వేయడంతో ఆయన కూడా అందుబాటులో లేరు. ఇందుకు సంబంధించిన రోగులందరూ ప్రతిరోజూ ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి ఆసుపత్రికి రావడం, డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో వెనక్కి వెళ్లిపోవడం నిత్యకృత్యమైంది. నిన్నటి వరకు శస్త్రచికిత్సలు, ఆధునాతన వైద్య సేవలు అందించిన ఆసుపత్రిలో సేవలు మృగ్యమవుతుండటంతో పేదలు ఆందోళన చెందుతున్నారు. ఆసుపత్రి ఆవరణలో నేలపై కూర్చున్న దివ్యాంగురాలు గర్భిణుల కష్టాలు ప్రభుత్వాసుపత్రిలో అల్ట్రా సౌండ్ స్కానింగ్ వైద్యులు దీర్ఘకాలిక సెలవులపై వెళ్లిపోవడంతో ప్రైవేటు స్కానింగ్ సెంటర్లకు ఇక్కడి వైద్యులు సిఫారసు చేస్తున్నారు. ఒక్కొక్క స్కానింగ్‌కు రూ.1500 నుండి రూ.2వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. సాధారణ స్కానింగ్ కోసం కూడా గంటల తరబడి నేలపై కూర్చొని వేచిచూడాల్సిన దుస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా కూడా కనీసం ఆసుపత్రిలో ఫర్నీఛర్ కూడా ఏర్పాటు చేయలేదు. -
సివిల్స్‌లో పవన్ విజయం
● సత్తా చాటిన కర్నూలు మెడికల్ కాలేజీ విద్యార్థి ● మొదటి ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లొచ్చారు ● రెండో ప్రయత్నంలో 375వ ర్యాంకు కర్నూలు సిటీ: సివిల్స్ ఫలితాల్లో కర్నూలు మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించిన విద్యార్థి పవన్ కుమార్ రెడ్డి 375వ ర్యాంకు సాధించారు. కల్లూరు మండలం పర్ల గ్రామానికి చెందిన(ప్రస్తుతం కర్నూలులోని ఎన్.ఆర్పేట్లో ఉంటున్నారు) ఎం.కృష్ణారెడ్డి, ఎం.మధుమతి దంపతులకు ఇద్దరు సంతానం. కుమారుడు ఎం.పవన్‌కుమార్ రెడ్డి కర్నూలు మెడకల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించే సమయంలోనే కుటుంబ సభ్యుల సలహా, సూచనల మేరకు సివిల్స్‌కు సన్నద్ధం అయ్యారు. మొదటి ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లొచ్చారు. రెండో సారి 2024 నోటిఫికేషన్లో మెడికల్ సైన్స్ అప్షనల్ సబ్జెక్టు ఎంపిక చేసుకోని 375వ ర్యాంకు సాధించారు. తండ్రి ఎం.కృష్ణారెడ్డి కర్నూలు రూరల్ మండలం పంచలింగాల ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగాను, తల్లి ఎం.మధుమతి.. ఆర్.కొంతలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ టీచర్‌గా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు కావడంతో కుమారుడు పవన్ కుమార్ రెడ్డి.. కర్నూలు నగరంలోని ప్రైవేటు స్కూళ్లలోనే హైస్కూల్ విద్య పూర్తి చేశారు. ఇంటర్మీడియట్ విద్య గుంటూరులోని ఓ కార్పొరేట్ కాలేజీలో చదివి, ఏపీ ఎంసెట్(అప్పటికి నీట్ ఉండేది కాదు)లో రాష్ట్ర స్థాయిలో 600వ ర్యాంకు రావడంతో కర్నూలు మెడికల్ కాలేజీలో వైద్య విద్య చదివారు. మెడిసిన్ 2022లో పూర్తి అయ్యాక సివిల్స్ ప్రిపేర్ కావాలని తల్లిదండ్రులు చెప్పడంతో 2023లో మొదటిసారి మొదటిసారి ప్రయత్నం చేసి ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. మరోసారి 2024 ఫిబ్రవరిలో ఇచ్చిన నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసి, గతేడాది జూన్ 16న ప్రిలిమ్స్ పరీక్ష రాసి అర్హత సాధించారు. సెప్టెంబరు 20 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించిన మెయిన్స్ పరీక్షలు రాసి ఈ ఏడాది జనవరి 17న ఇంటర్వ్యూకు హాజరయ్యారు. తన విజయంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎంతో సహకరించారని పవన్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతి రోజు 8నుంచి 10 గంటల పాటు, పరీక్షల సమయంలో 12 గంటల పాటు చదివేవాడినని వెల్లడించారు. సివిల్స్ సన్నద్ధం కావాలనుకునేవారు ఇష్టమైన సబ్జెక్టును ఆప్షనల్‌గా ఎంపిక చేసుకోవాలని సూచించారు. రోజుకు కనీసం 10 గంటలు చదివితేనే సివిల్స్‌లో ర్యాంకు సాధించవచ్చునని తెలిపారు. తమ కుమారుడు సివిల్స్‌లో ర్యాంకు సాధించడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. -
చదవాలంటే ఎండకు నడవాల్సిందే!
పలు గ్రామాలకు చెందిన విద్యార్థులు బస్సు సౌకర్యం లేక కాలినడకన పాఠశాలకు వచ్చి వెళ్తున్నారు. మండుతున్న ఎండలకు పెద్దలే తల్లడిల్లిపోతున్నారు. విద్యార్థులు మాత్రం మండుటెండలోనే పాఠశాల నుంచి ఇంటికి వెళ్లాల్సి వస్తోంది. రాచర్ల ఉన్నత పాఠశాలకు కొమ్మేమర్రి, నేరేడుచెర్ల, బొంచెర్వుపల్లి తదితర గ్రామాల విద్యార్థులు ప్రతి రోజూ కాలినడకన వచ్చి వెళ్తున్నారు. ఒంటి పూట బడులు కావడంతో మధ్యాహ్నం 12–30 గంటలకు విద్యార్థులను ఇంటికి వదులుతున్నారు. దీంతో ఆయా గ్రామాల విద్యార్థులు మంగళవారం సూర్యుడు నడినెత్తిన ఉన్న సమయంలో నడకయాతన పడుతూ ఇళ్లకు వెళ్తూ కనిపించారు. – ప్యాపిలి -
సంక్రాంతి, శివరాత్రి, ఉగాది కూడా పాయే
● ఉమ్మడి జిల్లాలో రూ.150.04 కోట్లతో 1,916 పనుల ప్రారంభం ● కర్నూలు జిల్లాలో వంద శాతం, నంద్యాల జిల్లాలో 98.84 శాతం పనుల పూర్తి ● ఇప్పటి వరకు విడుదలైన మొత్తం రూ.23.75 కోట్లు ● నాలుగు నెలలుగా పెండింగ్‌లో రూ.126.29 కోట్లు ● నైరాశ్యంలో చోటా కూటమి నేతలు కర్నూలు మండలం ఆర్.కొంతలపాడులో వేసిన సీసీ రోడ్డు కర్నూలు(అర్బన్): పల్లెల్లో అంతర్గత రోడ్లపై ఆర్భాటం చేశారు. గ్రామానికి ఒక రోడ్డును మంజూరు చేసి పూర్తి స్థాయిలో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ప్రచారాలను హోరెత్తించారు. పల్లె పండుగ వారోత్సవాలంటూ గత ఏడాది అక్టోబర్ 14 నుంచి 20వ తేదీ వరకు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపడుతున్న సీసీ రోడ్ల పనులకు భూమి పూజలు నిర్వహించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సింహ భాగం సర్పంచ్‌లు వైఎస్సార్సీపీ వర్గీయులే ఉన్నా, వారి మాటను ఖాతరు చేయకుండా చోటా కూటమి నేతలు తమ ఇష్టారాజ్యంగా రోడ్లను మంజూరు చేయించుకున్నారు. చేసిన పనులకు చేసినట్లుగా బిల్లులను విడుదల చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు దాదాపు అన్ని పనులను సంక్రాంతి పండుగ నాటికి పూర్తి చేశారు. అయితే సంక్రాంతి, శివరాత్రి, ఉగాది పండుగ పోయినా, నేటికీ బిల్లులు విడుదల కాకపోవడంతో పనులు చేసిన చోటా కూటమి నేతలు తీవ్ర నైరాశ్యంలో ఉండిపోయారు. గ్రామాల్లో అప్పులు చేసి పనులు పూర్తి చేసిన వారు నేడు చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక దిక్కులు చూస్తున్నారు. నిన్న మొన్నటి వరకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చేసిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లించలేదని అపద్దపు ఆరోపణలు చేసిన కూటమి నేతలు ప్రస్తుతం తమ ప్రభుత్వంలో బిల్లుల విడుదలలో నెలకొన్న జాప్యంపై నోరు మెదపని స్థితిలో ఉన్నారు. చేసిన పనులకు చేసినట్లుగా ఎం.బుక్ రికార్డు చేసి బిల్లులను అప్లోడ్ చేసిన రెండు, మూడు రోజుల్లోనే బిల్లులు పడిపోతాయని చెప్పిన దానికి, ప్రస్తుత పరిస్థితికి పొంతన లేకపోవడం గమనార్హం. రూ.150.04 కోట్లతో 1,916 పనులు వారోత్సవాల్లో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ.150.04 కోట్లతో మొత్తం 1,916 పనుల్లో భాగంగా 270.25 కిలోమీటర్ల మేర గ్రామాల్లో సీసీ రోడ్లు వేయాలని పనులు చేపట్టారు. ఈ పనుల్లో ఇప్పటి వరకు 268.51 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. పనులను సంక్రాతి పండుగ నాటికి పూర్తి చేయాలని నిర్ణీత గడువును కూడా విధించిన నేపథ్యంలో పల్లెల్లో కూటమి పార్టీలకు చెందిన నేతలు హడావుడిగా పనులను పూర్తి చేశారు. అదే దారిలో బీటీ రోడ్ల పనులు సీసీ రోడ్ల దారిలోనే బీటీ రోడ్లకు సంబంధించిన బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. కర్నూలు జిల్లాలో 4, నంద్యాల జిల్లాలో 3 పనులు మంజూరయ్యాయి. ఉమ్మడి జిల్లాలో రూ.13.30 కోట్లతో 14.89 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లను వేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 3.60 కిలోమీటర్లు మాత్రమే వేశారు. ఈ పనులకు కూడా ఇప్పటి వరకు నయాపైసా విడుదల కాని పరిస్థితి. నెలాఖరుకు బిల్లులు విడుదలయ్యే అవకాశం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, ఇతరత్రా పనులకు ఈ నెలాఖరులోగా బిల్లులు విడుదలయ్యే అవకాశం ఉంది. ఉపాధి పనులకు సంబంధించి మెటీరియల్ కాంపోనెంట్, వేతనాలకు బిల్లులను విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే పల్లె పండుగ కార్యక్రమంలో చేపట్టిన సీసీ రోడ్ల పనుల బిల్లులు కూడా విడుదల కానున్నాయి. ఇప్పటి వరకు చేసిన పనులకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో రూ.23.75 కోట్లు విడుదల కాగా, ఇంకా రూ.126.29 కోట్లు విడుదల కావాల్సి ఉంది. చేసిన పనులకు చేసినట్లుగా బిల్లులను అప్లోడ్ చేశాం. – వి.రామచంద్రారెడ్డి, పీఆర్ ఎస్ఈ నాణ్యత కూడా అంతంత మాత్రమే.. రూ.126.29 కోట్ల వరకు బకాయిలు ఆయా గ్రామాల్లో చేపట్టిన సీసీ రోడ్ల పనులకు సంబంధించి ఇప్పటి వరకు రూ.126.29 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ నెలలో కర్నూలు జిల్లాకు రూ.14.80 కోట్లు, నంద్యాల జిల్లాకు రూ.8.95 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. సీసీ రోడ్లతో పాటు భవనాలు, ప్లాంటేషన్, మినీ గోకులాలు, బీటీ రోడ్లు, ఇతరత్రా పనులకు సంబంధించిన బిల్లులు కూడా కోట్ల రూపాయాల్లో పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వేగంగా చేసిన పనులకు చేసినట్లుగా బిల్లులు విడుదల కాకపోవడం వల్ల పలు ప్రాంతాల్లో చేసిన పనులకు సంబంధించిన క్వాలిటీపై కూడా దృష్టి సారించనట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. వేగంగా సీసీ రోడ్లు వేయడం, క్యూరింగ్ కూడా సరిగా చేయనట్లు తెలుస్తోంది. రోడ్ల నాణ్యత పట్ల పీఆర్ క్వాలిటీ కంట్రోల్ విభాగం ఇంజనీర్లు కూడా అధిక రోడ్ల పనులు జరుగుతున్న నేపథ్యంలో సమయం తక్కువగా ఉండడంతో ఆయా పనుల పట్ల పూర్తి స్థాయిలో దృష్టి సారించనట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,916 పనుల్లో ఇప్పటి వరకు 50 శాతం పనులను కూడా క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు చెక్ చేయకపోవడం గమనార్హం. నాణ్యత పరిశీలించిన పనుల్లో కూడా దాదాపు 50 నుంచి 60 శాతం పనుల్లో రికవరీకి ఆదేశించినట్లు సమాచారం. కాగా పూర్తయిన పనులకు వంద శాతం బిల్లుల చెల్లింపు జరగదని, మొత్తం బిల్లులో 15 శాతాన్ని డిపాజిట్‌గా ఉంచుకొని, క్వాలిటీ చెక్ చేసిన అనంతరం డిపాజిట్‌గా ఉంచుకున్న మొత్తాన్ని విడుదల చేస్తారని ఇంజనీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. -
యువకుడిపై లాఠీ నృత్యం
● అకారణంగా చితక్కొట్టిన హెడ్ కానిస్టేబుల్సంజామల: కూటమి ప్రభుత్వంలో పోలీసుల అరాచకాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. నొస్సం గ్రామానికి చెందిన రమేష్‌బాబు అనే యువకుడిని కానిస్టేబుల్ విచక్షణా రహితంగా చితకబాదిన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాలు.. ఈనె ల 19న నొస్సం గ్రామానికి చెందిన భరత్ మద్యం తాగి బస్టాండ్‌లో రోడ్డుపై అడ్డంగా బైక్ పెట్టి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించాడు. అదే క్రమంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్, మహిళా కండెక్టర్‌తో భరత్ వాగ్వాదానికి దిగాడు. దీంతో వారు విధులకు ఆటంకం కలిగిస్తున్నాడంటూ పోలీసుకు సమాచారం ఇచ్చారు. సమీపంలో ఉన్న రమేష్‌బాబు మహిళా కండెక్టర్‌కు భరత్‌తో సారీ చెప్పించి పంపించేశారు. ఈలోపు హెడ్‌కానిస్టేబుల్ నాగన్న, మరో ఇద్దరు పోలీసులు సాయంత్రం నొస్సం చేరుకుని భరత్ కోసం ఆరా తీశారు. అతడు కనపడకపోవడంతో రమేష్‌బాబును పోలీసు వాహనంలో పుచ్చయకాయపల్లె గ్రామ సమీపంలోని పొలంలోకి తీసుకెళ్లి చితక్కొట్టారు. అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. తీవ్ర గాయాలతో ఇంటికి చేరుకున్న రమేష్‌బాబును కుటుంబ సభ్యులు వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల పాటు చికిత్స పొంది సాయంత్రం స్టేషన్‌కు చేరుకుని సీఐ హనుమంత్‌నాయక్‌ను కలిసి హెడ్‌కానిస్టేబుల్ నాగన్నపై ఫిర్యాదు చేశారు. ఈ విషయమై సీఐని వివరణ కోరగా విచారించి కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. -
సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యార్థుల ప్రతిభ
కర్నూలు (హాస్పిటల్): ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన వార్షిక పరీక్షల్లో కర్నూలు మెడికల్ కళాశాల సూపర్ స్పెషాలిటీ విభాగాల్లోని పీజీ వైద్య విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపరచి రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. కార్డియాలజీ విభాగంలో మహేష్ పునుగుపాటి స్టేట్ ఫస్ట్ ర్యాంకు, ఆదిత్య, రంగవేణి సమాన మార్కులతో నెఫ్రాలజీ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు, కిషన్ రెడ్డి ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో స్టేట్ థర్డ్ ర్యాంకు, హిమజ యూరాలజీ విభాగంలో స్టేట్ సెకండ్ ర్యాంకు సాధించారు. వీరిని సోమవారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టి నరసమ్మ అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోనే మంచి పేరున్న కర్నూలు మెడికల్ కళాశాల పేరును ఈ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి మరోసారి నిలబెట్టారని కొనియాడారు. కళాశాల సూపర్ స్పెషాలిటీ విభాగాల్లోని కార్డియాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ విభాగాల్లో మొత్తం 9 మంది పరీక్ష రాయగా అందరూ మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారని, అందులో ఐదుగురికి స్టేట్ ర్యాంకులు రావడం ఆనందంగా ఉందని తెలిపారు. సూపర్ స్పెషాలిటీ విభాగాలు ప్రారంభమైనప్పటి నుంచి కళాశాల విద్యార్థులు స్టేట్ ర్యాంకులతో మంచి ఫలితాలు సాధిస్తున్నారన్నారు.ఈ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్, యూరాలజీ హెచ్ఓడీ డాక్టర్ సీతారామయ్య, ప్లాస్టిక్ సర్జరీ హెచ్ఓడీ డాక్టర్ మంజుల బాయి, నెఫ్రాలజీ హెచ్ఓడీ డాక్టర్ అనంత్, గ్యాస్టో ఎంట్రాలజీ హెచ్ఓడీ డాక్టర్ మోహన్‌రెడ్డి అభినందించారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకులు -
బసవేశ్వర పురాణంలో ఆకట్టుకున్న సీమంతం
హొళగుంద: స్థానిక సిద్ధేశ్వరస్వామి ఆలయ ఆవరణంలో జరగుతున్న కల్బుర్గి శ్రీశరణ బసవేశ్వరస్వామి పురాణ ప్రవచనంలో భాగంగా సోమవారం రాత్రి జరిగిన సీమంతం భక్తులను అమితంగా ఆకట్టుకున్నా యి. కార్యక్రమాన్ని తిలకించడానికి చుట్టు పక్కల గ్రా మాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రవచన కారుడు సిద్ధరామయ్యస్వామి హిరేమ ఠ్శాసీ్త్ర శరణ బసవేశ్వరస్వామి లీలలు గురించి వివరిస్తూ సీమంతం కార్యక్రమంపై భక్తులకు కథలు, గేయల రూపంలో చెప్పి ఆకట్టుకున్నారు. ఈనెల 30 వరకు జరిగే ఈ పురాణ ప్రవచన కార్యక్రమానికి వచ్చే చుట్టు పక్కల గ్రామాలు, దూర ప్రాంతాల భక్తులకు నిత్యం అన్నదానం చేపడుతున్నారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు రాజ పంపన్న గౌడ్, శివశంకర్‌గౌడ్, సిద్ధార్థగౌడ్, ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. -
ఆర్టీసీ బస్సులో చోరీ
● రూ.6 వేల నగదు అపహరణ ఆదోని అర్బన్: ఆర్టీసీ బస్సులో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. ఆదోని పట్టణానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ కం కండెక్టర్ మధుసూదన్‌రెడ్డి తెలిపిన వివరాలు.. ఆదివారం రాత్రి హైదరాబాద్ నుంచి ప్రయాణికులతో ఆదోనికి బయలుదేరారు. కోడుమూరులో ఓ వ్యక్తి తన పేరు శ్రీనివాస్ అని, సత్తివీడుకు చెందిన ఆర్టీసీ ఎంప్లాయినంటూ డూప్లికేట్ ఆర్టీసీ పాస్ చూపించి బస్సు ఎక్కాడు. గోనెగండ్లలో డ్రైవర్ కం కండెక్టర్ ప్రయాణికులకు టికెట్ కొడుతుండగా శ్రీనివాస్ డ్రైవింగ్ సీటు వద్ద నగదు ఉన్న బ్యాగు, సెల్‌ఫోన్ తీసుకుని బస్సు దిగి వెళ్లిపోయాడు. టికెట్లు పూర్తి చేసుకుని బస్సును కాస్త ముందుకు నడుపుకుంటూ వచ్చిన కాసేపటికి బ్యాగు లేదని గమనించిన డ్రైవర్ కం కండెక్టర్ వెంటనే మరో బస్సు డ్రైవర్‌కు సమాచారం చేరవేశాడు. అతడు గోనెగండ్లలో బ్యాగుతో ఉన్న వ్యక్తిని పట్టుకునేందుకు వెళ్లేలోపే సెల్‌ఫోన్ పడేసి బ్యాగ్‌తో పరారయ్యాడు. బ్యాగులో రూ.6 వేల నగదు ఉందని, తెలిసిన వారితో అప్పు చేసి కౌంటర్లో కట్టానని డ్రైవర్ కం కండెక్టర్ మధుసూదన్‌రెడ్డి తెలిపాడు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి సలహాతో పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపాడు.నువ్వుల కట్టెకు నిప్పు ఆత్మకూరు రూరల్: మండల పరిధిలోని అమలాపురం గ్రామానికి చెందిన రైతు స్వామన్న పొలంలో కోత కోసి కుప్ప నూర్చేదుకు సిద్ధంగా ఉంచిన నువ్వుల కట్టెకు సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. బాధితుడు తెలిపిన వివరాలు.. తనకు ఉన్న పొలంతో పాటు మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని నువ్వుల పంట సాగుచేశాడు. పైరును ఇటీవల కోసి కుప్ప నూర్చేందుకు సిద్ధం చేశాడు. అంతలోనే గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడంతో దాదాపు 10 క్వింటాళ్ల నువ్వులు బూడిద పాలయ్యాయని రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా స్వామన్న వైఎస్సార్సీపీ గ్రామ నాయకుడు కావడం, ఇటీవల గ్రామంలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనల నేపథ్యంలోనే ఓర్వలేని వారు ఈ ఘటనకు పాల్పడి ఉంటారని పలువురు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. వీఆర్ఓ అనుమానాస్పద మృతి హాలహర్వి: మండల కేంద్రానికి చెందిన వీఆర్ఓ కె.సత్యనారాయణరావు(44) సోమవారం అనుమానాస్పదంగా మృతిచెందారు. కె.సత్యనారాయణరావు కొంతకాలంగా మద్యానికి బానిస అయ్యాడు. ఈవిషయమై భార్య భర్తల మధ్య మనస్పర్థలు రావడంతో భార్య రూప భర్తకు దూరంగా పుట్టినిల్లు ఎమ్మిగనూరులో ఉంటోంది. కాగా మద్యం తాగి విధులకు హాజరవుతుండటంతో సత్యనారాయణరావును అధికారులు సస్పెండ్ చేశారు. ఈక్రమంలో సోమవారం ఇంట్లో విగతజీవిగా పడివున్న సత్యనారాయణరావును గుర్తించిన స్థానికులు అతని భార్యకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆమె హాలహర్వికి చేరుకుని భర్త మృతదేహంపై పడి బోరున విలపించింది. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ప్రాధాన్యత కేటగిరి టీచర్లకు ప్రత్యేక వైద్య శిబిరం
కర్నూలు సిటీ: ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ యాజమాన్యాల స్కూళ్లలో పని చేస్తున్న అన్ని కేటగిరిల ఉపాధ్యాయులు ప్రాధాన్యత కేటగిరి, స్పెషల్ పాయింట్లకు అర్హత కలిగిన ఉపాధ్యాయులకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు డీఈఓ ఎస్.శామ్యూల్‌పాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(ధన్వంతరి కాన్ఫరెన్స్ హాల్) మూడో అంతస్తులో వైద్యశిబిరం ఏర్పాటు చేశామన్నారు. పర్వతారోహకుడికి ఆర్థిక సాయం కర్నూలు(సెంట్రల్): ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనా 7వ శిఖరం దౌళగిరి పర్వతాన్ని అధిరోహించిన గోనెగండ్లకు చెందిన సురేష్‌బాబుకు సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ పి.రంజిత్‌బాషా ఆర్థిక సాయం అందజేశారు. 25 ఏళ్ల సురేష్‌బాబు ఇప్పటి వరకు 25 శిఖరాలను అధిరోహించడమే గాకుండా ఏడు ఖండాల్లోని 5 ఎత్తైనా శిఖరాలను అతి తక్కువ సమయంలో అధిరోహించి రికార్డు సృష్టించారు. సురేష్‌బాబు ధైర్యసాహసాలను కలెక్టర్ మెచ్చుకుని సీఎస్ఆర్ కింద జియో మైసూరు కంపెనీతో మాట్లాడి రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందించి అభినందించారు. కార్యక్రమంలో జేసీ డాక్టర్ బి.నవ్య, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, పీసీబీ ఈఈ కిశోర్‌రెడ్డి, జియోమైసూరు కంపెనీ ప్రతినిధి రామ్మోహన్ పాల్గొన్నారు. -
మరో ఆశల సాగు..
రబీలో నష్టపోతే ఖరీఫ్.. ఖరీఫ్ ముంచితే రబీ.. ఏటా అన్నదాతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉంటారు. ఈ ఏడాది రబీ పంటలు అంతంత మాత్రంగానే చేతికందడంతో ఖరీఫ్‌పై కోటి ఆశలతో సాగుకు సిద్ధమవుతున్నారు. కల్లూరు, కోడుమూరు మండలాల్లో పంటల వ్యర్థాలను, కంప చెట్లను తొలగించి పొలాలను రూపు చేసుకునే పనుల్లో రైతన్నలు నిమగ్నమయ్యారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు స్థల వివాదంలో టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణఆత్మకూరు: మండలంలోని క్రిష్ణాపురం గ్రామంలో సోమవారం ఓ స్థల వివాదంలో ఒకే వర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణ మాటలతో ప్రారంభమై చివరకు రాళ్లతో దాడులు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటాన గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. క్రిష్ణాపురం గ్రామంలో ఓ స్థల వివాదంలో కంప చెట్లు తొలగించే సమయంలో ఒకరినొకరు (రెండు వర్గాలూ టీడీపీకి చెందినవారే)దూషించుకుంటూ ఘర్షణకు పాల్పడ్డారు. కర్రలు, ఇనుప రాడ్లు, రాళ్లతో దాడులకు దిగారు. ఇరువర్గాలకు చెందిన పది మందికి రక్త గాయాలయ్యాయి. అందులో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా మారింది. సమాచారం తెలుసుకున్న ఆత్మకూరు సీఐ రాము తన సిబ్బందితో క్రిష్ణాపురం చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన వారిని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ప్రథమ చికిత్స అనంతరం ఇద్దరిని 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. పది మందికి పైగా గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం -
ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి
నందికొట్కూరు: ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని ఉమ్మడి కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బీ.లీలా వెంకట శేషాద్రి సూచించారు. సోమవారం సబ్‌జైల్‌ను ఆయన తనిఖీ చేశారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు న్యాయవాదులు లేకుంటే ఉచిత న్యాయవాదులను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. 70 ఏళ్ల పైబడిన ఖైదీలకు, అనారోగ్యంతో బాధపడే వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు. త్వరగా బెయిల్ మంజూరు అయ్యేలా కృషి చేయనున్నట్లు తెలిపారు. ఖైదీలు కోర్టు వాయిదాలకు కచ్చితంగా హాజరుకావాలన్నారు. ఏమైనా సమస్యలుంటే జిల్లా న్యాయసేవ అధికార సంస్థను సంప్రందించాలన్నారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్‌లైన్ నెంబర్ 15100కు సమచారం తెలియజేయాలన్నారు. కొందరు ఖైదీలు బెయిల్ మంజూరైనా జామీనుదారులు లేక జైలులోనే ఉన్నామని తెలియజేయడంతో విచారించి బెయిల్ మంజూరు కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఖైదీలకు అందించే ఆహారం ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో న్యాయవాదులు అరుణ్‌కుమార్, సూపరింటెండెంట్ పాల్గొన్నారు. సారా తయారీదారులపై బైండోవర్ కేసులు కర్నూలు: ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని గుమ్మితం తండాలో 16 మంది సారా తయారీదారులపై ఎకై ్సజ్ పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేశారు. పలుమార్లు నాటుసారా స్థావరాలపై దాడులు చేసి విక్రయ, రవాణాదారులను అరెస్టు చేసి జైలుకు పంపినప్పటికీ మార్పు రాకపోవడంతో గుమ్మితం తండా గ్రామానికి చెందిన బిలావత్ స్వామి నాయక్, బిలావత్ బాలు నాయక్, దేశవత్ రాముడు నాయక్, దశావత్ థౌరు నాయక్, లక్ష్మా నాయక్, రాము నాయక్, మల్యాల లక్ష్మీబాయి, మదిర సుభా నాయక్, ముదిరేచ బాలాజీ నాయక్, ఎం.కృష్ణా నాయక్, ఎం.సురేష్ నాయక్, ఎం.వాసు నాయక్, మున్నే నాయక్, రవి నాయక్, లక్ష్మీబాయి, ఎస్.వెంకటమ్మ తదితరులపై బైండోవర్ కేసులు నమోదయ్యాయి. వీరందరినీ ఎస్ఐ రెహనా ఆధ్వర్యంలో ఓర్వకల్లు తహసీల్దార్ ఎదుట హాజరుపరచి బైండోవర్ చేశారు. -
ఉద్యోగం పేరుతో మోసం
కర్నూలు: స్థానిక బళ్లారి చౌరస్తా వద్ద ఉన్న కరెంటు ఆఫీస్‌లో తన కుమారుడు రమేష్‌కు ఏఈ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి అందులో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగి రామాంజనేయులు రూ.22 లక్షలు తీసుకుని మోసం చేశాడని, విచారణ జరిపి న్యాయం చేయాల్సిందిగా సీతారాం నగర్‌కు చెందిన శాంతమ్మ ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు. కర్నూలు టూటౌన్ పోలీస్ స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించి, వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీజీఆర్ఎస్కు మొత్తం 128 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నిటిపై చట్టపరిధిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఐలు పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. పీజీఆర్ఎస్కు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని... ● ఆన్లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడితే రెట్టింపు డబ్బులు వస్తాయని చెప్పి గుర్తు తెలియని వ్యక్తులు 18 విడతలుగా రూ.62 లక్షలు వారి ఖాతాలో జమ చేసుకుని మోసం చేశారని కర్నూలుకు చెందిన బాధితుడు ఫిర్యాదు చేశారు. వాట్సాప్‌లో లింక్ పంపి దానిని క్లిక్ చేసిన తర్వాత ఆన్లైన్ ట్రేడింగ్‌లో డబ్బులు పెట్టుబడి పెడితే రెట్టింపు లాభం వస్తుందని చెప్పి మొదట రూ.1.20 లక్షలు వారి ఖాతాలో వేయించుకుని తిరిగి డబ్బులు పంపి నమ్మించారని, తర్వాత భారీ మొత్తంలో డబ్బు వేయించుకుని విత్‌డ్రా ఆప్షన్ ఇవ్వకుండా తన మొబైల్ నెంబర్‌ను బ్లాక్ చేసి మోసం చేసినట్లు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైం పోర్టల్‌లో ఫిర్యాదు చేయగా కొంత మొత్తాన్ని ఫ్రీజ్ చేశారని, ఎఫ్ఐఆర్ చేయించి ఫ్రీజ్ చేసిన మొత్తాన్ని కోర్టు నుంచి ఇప్పించాలని బాధితుడు ఎస్పీతో మొర పెట్టుకున్నారు. ● హెచ్డీఎఫ్సీ ఏటీఎం కేంద్రంలో డ్రా చేసిస్తామని చెప్పి ఇద్దరు వ్యక్తులు తన ఏటీఎం కార్డు తీసుకుని మార్పు చేసి బ్యాంకు ఖాతాలో రూ.50 వేలు డ్రా చేసుకుని మోసం చేశారని, సీసీ కెమెరాలో వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కర్నూలు ఎన్ఆర్పేటకు చెందిన ఇక్బాల్‌బాషా ఫిర్యాదు చేశారు. ● కుమారుడు, కోడలు కలిసి తనను ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇంటిని కూడా వేరేవాళ్లకు రిజిస్ట్రేషన్ చేశామని చెబు తూ మోసం చేస్తున్నారని కర్నూలు నాగిరెడ్డి కా లనీకి చెందిన మహబూబ్ బాషా ఫిర్యాదు చేశారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు పీజీఆర్ఎస్కు 128 ఫిర్యాదులుసమస్యలు తక్షణమే పరిష్కరించండి ఎస్పీ అదిరాజ్‌సింగ్‌రాణా నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన వినతుల్లో చట్టపరిధిలో ఉన్న వాటిని తక్షణమే పరిష్కరించాలని నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్‌సింగ్‌రాణా అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమంలో జిల్లా ఎస్పీ, అడిషనల్ ఎస్పీ యుగంధర్‌బాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో 96 వినతులు వచ్చాయని, వీటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులకు ఎస్పీ సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన వినతులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ
కోడుమూరు రూరల్: వెల్దుర్తి నుంచి కోడుమూరుకు వస్తున్న ఆర్టీసీ బస్సు, కోడుమూరు నుంచి వెల్దుర్తి వైపు వెళుతున్న లారీ వెంకటగిరి గ్రామ సమీపాన ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్‌కు రక్త గాయాలవ్వగా, బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో కేవలం 15 మంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. సింగల్ రోడ్డులో ఆర్టీసీ బస్సు, లారీ డ్రైవర్ ఇద్దరూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రయాణికులు తెలిపారు. రైలు పట్టాలపై వృద్ధుడి మృతదేహం నంద్యాల: పట్టణంలోని గురురాజ పబ్లిక్ పాఠశాల సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద ఆదివారం గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైనట్లు రైల్వే ఎస్ఐ జలీల్ తెలిపారు. వృద్ధుడి వయస్సు 70 సంవత్సరాలు ఉంటుందని, మృతుడు ఎరుపు రంగు పంచ, పచ్చరంగు చొక్కా ధరించి ఉన్నాడన్నారు. వృద్ధుడు మృతి చెంది నాలుగు రోజులు కావస్తున్నట్లు తెలుస్తోందన్నారు. మృతదేహానికి నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. వైన్‌షాప్ సమీపంలో వ్యక్తి మృతి ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని అగ్నిమాపక కేంద్రం ఎదరుగా ఉన్న వైన్‌షాప్ సమీపంలో ఆదివారం రాత్రి కురవ అడివప్ప(58) అనే వ్యక్తి మృతి చెందాడు. వివరాలు..పెద్దకడుబూరు మండలం హెచ్.మురవణి గ్రామానికి చెందిన కురవ అడివప్ప(58) ఉదయం ఎమ్మిగనూరుకు వచ్చాడు. ఫైర్ స్టేషన్ ఎదురుగా వున్న వైన్ షాప్‌కు సమీపంలోని కూల్‌డ్రింక్ షాప్ పక్కన కూర్చొని ఉన్నాడు. వర్షం ప్రారంభం కావటంతో అక్కడ ఉన్న వారు తలదాచుకునేందుకు వైన్‌షాప్ దగ్గరకు పరుగులు తీశారు. వర్షం తగ్గాక వచ్చి చూడగా కూల్‌డ్రింక్ షాప్ దగ్గర కూర్చున్న కుర వ అడివప్ప స్పృహతప్పి పడిపోయి ఉండటంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య లక్ష్మి, ముగ్గురు కుమారులు ఉన్నా రు. అడివప్ప మృతికి కారణాలపై విచారిస్తున్నా మని ఎమ్మిగనూరు రూరల్ పోలీసుల తెలిపారు. వాగులో పడ్డ ఆటో పాణ్యం: మండల పరిధిలోని అనుపూరు గ్రామం వద్ద ఉన్న కొర్రవాగులో ఓ ఆటో పడి ప్రయాణికులకు గాయాలయ్యాయి. నంద్యాల నుంచి కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో ఆటోలో ఉన్న ముగ్గురికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం నంద్యాలకు తరలించినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా దెబ్బతినింది. -
తల్లిదండ్రులకు అండగా నిలుస్తా
అనంతపురం జిల్లా పెద్దపప్పురు గ్రామానికి చెందిన వెన్నపూస రామ్మోహన్‌రెడ్డి, లక్ష్మీదేవిల కుమార్తె వి. వైష్ణవి ఏపీఆర్జేసీ బనవాసిలో చదివి ఎంఈసీలో 979 మార్కులు సాధించారు. రాష్ట్రస్థాయిలో మంచి మార్కులు సాధించి ప్రశంసలతో పాటు ప్రతిభ పురస్కారాన్ని అందుకున్నారు. బనవాసి ఏపీఆర్జేసీ కాలేజీలో విద్యార్థిని రాష్ట్రస్థాయిలో మంచి మార్కులు సాధించటం గత ప్రభుత్వం విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించటమే కారణమని తెలుస్తోంది. మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు అండగా నిలవాలని ఉందని విద్యార్థిని వి. వైష్ణవి చెప్పారు. -
ఏపీటీఎస్‌ఏ ఉమ్మడి జిల్లా శాఖ ఎన్నికలు ఏకగ్రీవం
కర్నూలు(అగ్రికల్చర్): ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ సర్వీస్ అసోసియేషన్(ఏపీటీఎస్‌ఏ) ఉమ్మడి కర్నూలు జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఏర్పాటైంది. ఆదివారం బి.క్యాంపులోని జిల్లా ట్రెజ రీ కార్యాలయంలో నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. ఎన్నికల అధికారిగా నెల్లూరు జిల్లా ఏపీటీఎస్‌ఏ అధ్యక్షుడు పి.కిరణ్‌కుమార్ వ్యవహరించారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షుడు వీసీహెచ్ వెంగళ్‌రెడ్డి జిల్లా ట్రెజరీలో సీనియర్ అకౌంటెంటుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన చొరవ తీసుకోవడంతో పోటీ లేకుండా ఎన్నిక ఏకగ్రీవమైంది. ఏపీటీఎస్‌ఏ ఉమ్మడి జిల్లా శాఖ అధ్యక్షుడుగా డి.రవికుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ఎస్.మహబూబ్‌బాషా, ఉపాధ్యక్షులుగా టి.వనిత, పి.సుధాకర్‌రెడ్డి, ఎస్.ఆంజాద్‌బాషా, రాకేష్, కార్యదర్శిగా టి.గురుమూర్తి, జాయింట్ సెక్రటరీలుగా కె.విజయమ్మ, జి.అరవింద్ హనోక్, ఆర్.లక్ష్మణ్ నాయక్, కోశాధికారిగా ఎన్.సునీల్‌బాబు. స్టేట్ కౌన్సిల్ మెంబర్లుగా ఉదయ్‌కుమార్, వేమచంద్రరావు, హెచ్ఎండీ అలియా ఎన్నికయ్యారు. -
ఎట్టకేలకు డీఎస్సీ!
పోస్టుల భర్తీ ఇలా.. డీఎస్సీతో ఉమ్మడి జిల్లాలో ఎస్జీటీ 1817, స్కూల్ అసిసెంట్లు లాంగ్వేజ్–182 పోస్టులు, హిందీ 114, ఇంగ్లిషు 81, గణితం 90, ఫిజికల్ సైన్స్ 66, బయోలాజికల్ సైన్స్ 74, సోషల్ స్టడీస్ 112, ఫిజికల్ ఎడ్యుకేషన్ 209 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటితో పాటు ఏపీ మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, గురుకులాల్లో జోన్–4లో ఉమ్మడి జిల్లాలో సుమారు 121 పోస్టులు భర్తీ చేయనున్నారు. కర్నూలు సిటీ: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మోగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ఆగస్టు నెలలో హడావుడి చేసింది. టెట్ పరీక్షల పేరుతో నాడు డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా వేసి, టెట్ నిర్వహించి ఫలితాలను సైతం విడుదల చేశారు. అదిగో...ఇదిగో అంటూ నాలుగైదు నెలలుగా నిరుద్యోగులను ఊరించి..ఊరించి ఎట్టకేకలకు డీఎస్సీ నోటఫికేషన్‌ను జారీ చేశారు. ఏడాదికిపైగా నిరుద్యోగులు డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారు. కొంత మంది విద్యార్థులు మనస్తాపానికి గురై అనారోగ్యాల బారిన పడ్డారు. ఇదీ నిజం ● వాస్తవానికి 2018లోనే 1,393 టీచర్ పోస్టులు, 192 క్రాఫ్ట్ టీచర్ పోస్టులను రద్దు చేసి అప్పటి డీఈఓ వాటిని డీఎస్సీలో నోటిఫై చేయాలని నాటి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం నామమాత్రంగా 608 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చింది. ● 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పోస్టులను భర్తీ చేసింది. అదే విధంగా 1998 డీఎస్సీ బాధితులకు, 2008 డీఎస్సీలో ఎంపికై ఉద్యోగాలు రాని వారికి సైతం టీచర్ పోస్టులు ఇచ్చింది. ● గతేడాది జిల్లాలో సుమారు 1,693 టీచర్ పోస్టుల భర్తీకి అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే టీడీపీ నేతలు న్యాయస్థానాల్లో కేసులు వేయించారు. దీంతో నిరుద్యోగులు మరో ఏడాది పాటు డీఎస్సీ కోసం వేచి చూడాల్సిన పరిస్థితులు వచ్చాయి. ● స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఉన్నప్పటికీ ప్రస్తుత డీఎస్సీలో ఒక్క పోస్టు కూడా చూపలేదు. ● పరీక్షలను ఆన్లైన్లో నెల రోజుల పాటు నిర్వహిస్తుండడంపై నిరుద్యోగులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ● ఒకే నోటిఫికేషన్, ఒకే ప్రశ్నపత్రం ద్వారా పరీక్షలను ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ● గతేడాది ఆగస్టు నెలలో నిర్వహించిన టెట్‌లో తక్కువ మంది అర్హత పొందారు. మిగిలిన వారికి కూడా అర్హత పొందేందుకు మరోసారి టెట్ నిర్వహించి..ఫలితాలు వచ్చిన వెంటనే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. అయితే అందుకు విరుద్ధంగా చేశారు. అవసరం ఇదీ.. ● ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2,843 స్కూళ్లు ఉన్నాయి. వీటిలో చదవుతున్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా 4,000 టీచర్ పోస్టులు అవసరం అని గతంలో జిల్లా విద్యాశాఖ అధికారులు నివేదికలు ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం 2,645 పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ● ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు బోధన చేసే స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు ‘టెట్’ నిర్వహించినా డీఎస్సీలో ఒక్క పోస్టును కూడా చూపలేదు. పోస్టులు భర్తీ చేయనప్పుడు ఎందుకు టెట్ నిర్వహించారని ప్రశ్నిస్తూ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ● మున్సిపల్ స్కూళ్లలో అన్ని క్యాటగిరీలకు చెందిన 98 పోస్టులను భర్తీ చేయనున్నారు. మున్సిపల్ టీచర్లకు పదోన్నతులు ఇవ్వలేక 22 పోస్టులు మాత్రమే ఇచ్చారు. ● ప్రస్తుతం విద్యాశాఖలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన క్లస్టర్, మోడల్ ప్రైమరీ స్కూల్ విధానంతో ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఇంకా 1,300 టీచర్ పోస్టులకు పైగా అవసరమని విద్యాశాఖ అధికారులు గుర్తించారు. వైఎస్సార్సీపీ చొరవతోనే... ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా పశ్చిమ ప్రాంతంలోని పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు పోస్టులు మంజూరైనా వారికి అవసరం లేని వాటిని ఉమ్మడి కర్నూలు జిల్లాకు బదలాయించారు. దీంతో సుమారు 1,845 పోస్టులకు జిల్లాకు వచ్చాయి. ఆ పోస్టుల్లో పనిచేస్తున్న వారికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు ఇచ్చారు. దీంతో ఎస్జీటీ పోస్టులను నేటి డీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు అవకాశం కలిగింది. ఉమ్మడి జిల్లాలో 2,645 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఎస్జీటీ 1,817, స్కూల్ అసిస్టెంట్లు 828, ట్రైబల్ వెల్ఫేర్‌లో 33 పోస్టులు డీఎస్సీలో చూపించని స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు నెల రోజుల పాటు ఆన్లైన్లో పరీక్షలపై మండిపడుతున్న నిరుద్యోగులు -
జగన్ మామయ్య చేసిన మార్పులతోనే..
కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామానికి చెందిన బోయ స్వాములు, వరలక్ష్మి దంపతుల కుమార్తె బోయ హరిత ఓర్వకల్లు కస్తూర్బా గాందీ విద్యాలయంలో చదివారు. ఇంటర్ ఎంఈసీ గ్రూపులో 913 మార్కులు సాధించారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌బాబు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. తాను వ్యవసాయ కుంటుంబంలో పుట్టి, ఇంట్లో పనులు, పొలం పనులు చేసుకుంటూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలిచానని ఈ విద్యార్థిని తెలిపారు. ఊర్లో జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదివి మంచి మార్కులు సాధించానని, ఇంటర్లో 913 మార్కులు సాధించడం చాలా గర్వంగా ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మామయ్య ప్రభుత్వ విద్యలో మార్పులు చేసి ఆయన ప్రవేశపెట్టిన ‘బేబీ బుల్లెట్స్’ అనే పుస్తకం నా చదువుకు ఎంతగానో ఉపకరించిందని ఈ విద్యార్థిని తెలిపారు. -
రాజకీయ కక్షతోనే ఎంపీ మిథున్ రెడ్డిపై తప్పుడు కేసులు
కర్నూలు (టౌన్): రాజకీయ కక్షతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మద్దూరు సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. ఆదివారం స్థానిక సి. క్యాంపులోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మిథున్‌రెడ్డి కుటుంబంపై అనేక నిరాధార ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించారు. ఆధికార అండతో ప్రతి అంశంపై ఆరోపణలు చేస్తున్నారు తప్పా.. అందులో ఏ ఒక్కటి నిజం లేదని ఇప్పటికే ప్రజలకు అర్థమైందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష పూరిత రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికై న వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధించడం మాని ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. -
హాస్టల్లో చదువుకుని..
ఆదోని మండలం నాగథనహళ్లి గ్రామానికి చెందిన రాఘవేంద్ర.. క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్ మెంట్ కోర్స్‌లో 958 మార్కులు సాధించి రాష్ట్ర ప్రథమంలో నిలిచారు. గత మంగళవారం విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ చేతుల మీదుగా ప్రతిభా అవార్డు అందుకున్నాడు. ఈ విద్యార్థి ఎమ్మిగనూరు ఎస్సీ సంక్షేమ వసతి గృహంలో ఉండి స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో చదివారు. పదేళ్ల క్రితం తండ్రి మాల తిక్కయ్యను కోల్పోయిన ఈ విద్యార్థిని తల్లి ఆసనమ్మ కూలి పనులు చేసి చదివించింది. ప్రభుత్వ సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి ఇంటర్లో మంచి మార్కులు సాఽధించానని ఈ విద్యార్థి తెలిపారు. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ చేసి వ్యవసాయ శాఖలో మంచి ఉద్యోగం సాధించి రైతులకు చేయూతనందించాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. -
డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిందే!
కర్నూలు(హాస్పిటల్): ఎవ్వరికై నా జ్వరం, జలుబు, దగ్గు, వాంతులు, విరేచనాలు వంటి సాధారణ జబ్బులు వస్తే చాలా మంది డాక్టర్ వద్దకంటే మెడికల్‌షాపులకు ముందుగా వెళ్తారు. అక్కడ వారికి వచ్చిన అనారోగ్య లక్షణాలు చెప్పి మందులు ఇవ్వాలని కోరతారు. ఈ మేరకు రెండు, మూడు రోజులకు సరిపడా మందులు ఇస్తే చాలా వరకు తగ్గిపోతుంది. దీనివల్ల డాక్టర్ వద్దకు వెళ్లే సమయం, ఖర్చు మిగిలిపోతుందని సామాన్యుని భావన. కానీ ఇకపై ఇలా నేరుగా మందుల దుకాణానికి వెళ్లి మందులు ఇవ్వాలని కోరితే కుదరదు. అలా ఏవి పడితే ఆ మందులు ఇవ్వొద్దని మందుల దుకాణదారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. యాంటిబయాటిక్స్‌తో పాటు నిద్ర, ఆందోళన, డిప్రెషన్ మందులు వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా ఇస్తే లైసెన్స్ రద్దు చేస్తామని చెబుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 3,100 దాకా రిటైల్ మెడికల్ షాపులు, 500 దాకా హోల్‌సేల్ మెడికల్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి నెలా రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు వ్యాపారం నిర్వహిస్తున్నారు. కర్నూలు, ఆదోని, నంద్యాల డివిజన్లకు నలుగురు డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. వీరు ఒక్కొక్కరు ప్రతి నెలా 40 దుకాణాలు తనిఖీలు చేయాల్సి ఉంది. ముఖ్యంగా దుకాణంలో ఫార్మాసిస్టు ఉన్నారా, మందుల కొనుగోలు, అమ్మకాల వివరాలు, కొనుగోలుదారులకు బిల్లు ఇస్తున్నారా, వైద్యుల ప్రిస్కిప్షన్ ఆధారంగా మందులు ఇస్తున్నారా, గడువు తీరిన, గడువు ఉన్న మందులు విక్రయిస్తున్నారా, నిషేధిత మందులను అమ్ముతున్నారా, ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నారా అనే అంశాలను పరిశీలించి నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. వారు ఇచ్చిన నివేదికల ఆధారంగా ఏడీ స్థాయి అధికారులు సదరు దుకాణాలపై చర్యలు తీసుకుంటారు.ఇటీవల దాడులతో కంగారు..ఇటీవల విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, డ్రగ్ ఇన్స్పెక్టర్లు కలిసి జిల్లా వ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు నిర్వహించారు. పలు దుకాణాల్లో యాంటిబయాటిక్స్, నిద్రమాత్రలు, మత్తును కలిగించే నొప్పి మాత్రలు, ఆందోళన, డిప్రెషన్ మందులు వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు పలువురికి ముందుగా నోటీసులు ఇచ్చి వారు ఇచ్చిన సంజాయిషీ ఆధారంగా వారం రోజుల పాటు సస్పెన్షన్ విధించారు. అప్పటి నుంచి వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా యాంటిబయాటిక్స్, మత్తును కలిగించే మాత్రలు విక్రయించేందుకు దుకాణదారులు వెనుకడుగు వేస్తున్నారు. తాజాగా వైద్యులు రాసిచ్చిన చీటిని తెస్తేనే మందులు ఇస్తామని తెగేసి చెబుతున్నారు.డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా విక్రయించడం నేరంరాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవల గరుడ ఆపరేషన్ పేరుతో నార్కోటిక్ డ్రగ్స్ అమ్మకాలపై నిఘా ఉంచాం. ఈ మేరకు పలు దుకాణాలపై దాడులు నిర్వహించి చర్యలు తీసుకున్నాము. హెచ్ వన్ రిజిస్టర్లో ఉన్న యాంటిబయాటిక్స్, యాంటి టీబీ, మత్తుకలిగించే మందులు డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా విక్రయించకూడదు. నిద్ర, ఆందోళన, డిప్రెషన్ మందులు రెగ్యులర్‌గా వాడుతున్న వారు డాక్టర్ రాసిన చీటిని తీసుకొచ్చి మందుల దుకాణాల్లో చూపిస్తే దానిపై సదరు దుకాణదారుడు ఇచ్చిన మందుల సంఖ్య, తేదిని రాసి సీలు వేస్తారు. దీనివల్ల నిర్ణీత సమయంలో తిరిగి అంతకుమించి మందులు వాడకుండా నియంత్రించబడుతుంది.– వి. వీరశేఖర్, డిప్యూటీ డైరెక్టర్, ఔషధ నియంత్రణ శాఖవృద్ధులు, రోగులు నరకయాతననార్కోటిక్ డ్రగ్స్‌ను డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులతో ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ఇటీవల నిర్వహించిన దాడులతో మెడికల్‌షాపుల వారు విక్రయాలు నిలిపివేశారు. డాక్టర్ తాజాగా రాసిచ్చిన చీటి తెస్తేనే మందులు ఇస్తామని చెప్పి వెనక్కి పంపిస్తున్నారు. దీంతో కొంత కాలంగా ఆయా మందులకు అలవాటుపడిన వారు మాత్రలు లభించక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మానసిక సమస్యలతో బాధపడుతూ వైద్యుల సూచన మేరకు కొంత కాలంగా మందులు వాడేవారు, గుండె, ఇతర ఆరోగ్య సమస్యలతో నిద్రకరువై వైద్యుల సూచన మేరకు నిద్రమాత్రలు, ఆందోళన, డిప్రెషన్ తగ్గించే మాత్రలు వాడే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరో దురలవాట్లకు బానిసలై ఇలాంటి మందులు కొంటే రెగ్యులర్‌గా వాడే మాలాంటి వారిని ఇబ్బందులకు గురిచేస్తే ఎలాగని వారు ప్రశి్నస్తున్నారు. దీనివల్ల ప్రతి ఒక్కరూ నిద్ర రాక, ఆందోళన, డిప్రెషన్ పెరిగి మరింత అనారోగ్యం కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన చెందుతున్నారు. రూ.50ల మాత్రలకు రూ.వెయ్యి దాకా ఖర్చు ఇప్పటి వరకు ఆయా ఆరోగ్య సమస్యలతో బాధపడే వారు వైద్యుల సూచనలతో మత్తు కలిగించే మందులు వాడుతూ వస్తున్నారు. ఒకసారి డాక్టర్ వద్ద చూపించుకుని నెలల తరబడి అవే మందులను మెడికల్‌షాపుల్లో కొనుగోలు చేసి వాడుతున్న వారు ఉన్నారు. చాలా చోట్ల తాజాగా వైద్యులు రాసిచ్చిన చీటి ఆధారంగానే ఇలాంటి మందులు ఇస్తారు. కానీ పరిచయం ఉన్న కారణంగా కొందరు వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండానే మందులు ఇచ్చేస్తున్నారు. దీనికితోడు ప్రతిసారీ డాక్టర్ వద్దకు వెళ్లాలంటే ప్రయాణ చార్జీలు, సమయం, డాక్టర్ ఫీజు కలిపి రూ.500ల నుంచి రూ.1000ల దాకా అవుతోంది. అదే నేరుగా మెడికల్‌షాపులకు వెళ్లి గతంలో రాసిన మందులు కొంటే రూ.50ల నుంచి రూ.100లతో పని పూర్తవుతుంది. తాజా నిబందనల వల్ల ఆర్థిక భారం అధికమవుతోందని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పేద ఇంట విద్యా దీపం
కర్నూలు మండలం ఆర్.కొంతలపాడు గ్రామానికి చెందిన తెలుగు మహేష్, సువర్ణమ్మలకు రెండెకరాల భూమి మాత్రమే ఉంది. ఉన్న కాస్త భూమిలో పంటలు పడించడంతో పాటు కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమార్తె మానస పంచాలింగాల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ ఓకేషనల్ (అకౌంట్స్ ట్యాక్సేషన్) సెకండియర్‌లో 992మార్కులు సాధించారు. విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. విద్యార్థిని మానస మాట్లాడుతూ.. తనను చదివించాడనికి తల్లిదండ్రులు ఎంతో పడ్డ కష్టపడ్డారని, ఉపాధ్యాయులు కూడా ఎంతగానో ప్రోత్సహించారన్నారు. తాను ఐఏఎస్ అయ్యి మారుమూల గ్రామాల్లోని పిల్లలకు చదువు అందించేందుకు కృషి చేస్తానని మానస తెలియజేశారు. -
కంబోడియాలో కై లాస్‌రెడ్డి ప్రతిభ
● ఆసియా పారాత్రోబాల్ పోటీల్లో రజత పతకం కొలిమిగుండ్ల: మలేషియాలోని కంబోడియాలో జరిగిన దివ్యాంగుల పారాత్రోబాల్ పోటీల్లో కొలిమిగుండ్లకు చెందిన గండా కై లాస్‌రెడ్డి ప్రతిభ చాటాడు. రజత పతకాన్ని కై వసం చేసుకున్నాడు. ఇటీవలే కంబోడియాలో ఆసియా ఖండంలోని ఎనిమిది దేశాలకు చెందిన జట్లు ఆసియా పారాత్రోబాల్ పోటీల్లో పాల్గొన్నాయి. ఈపోటీల్లో భారత జట్టు రజత పతకం సాధించినట్లు నిర్వాహకులు ఆదివారం ప్రకటించారు. పారా క్రికెట్లో ఆంధ్ర జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన కై లాస్‌రెడ్డి.. జాతీయ స్థాయి పారాత్రోబాల్ పోటీల్లోను మంచి ప్రతిభ కనపర్చి భారత జట్టు రజత పతకం సాధించేందుకు దోహదపడ్డాడు. రజత పతకం కోసం భారత్, మలేషియా జట్లు పోటీ పడ్డాయి. కై లాస్‌రెడ్డి విజయవాడలోని గనులు, భూగర్బ శాఖలో అవుట్ సోర్స్ కింద టైపిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆసియా స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అండగా నిలిచిన సహచర ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. -
రాజ్యాంగానికి మోదీ తూట్లు
డోన్ టౌన్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని పలువురు వక్తలు విమర్శించారు. నూతన వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆదివారం డోన్ పట్టణంలో ముస్లింలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని గుత్తి రోడ్డులో ఉన్న ఖబరస్తాన్ ఈద్గా నుంచి బేతంచెర్ల సర్కిల్, రైల్వే గేట్లు, పాత బస్టాండ్, స్టేట్ బ్యాంక్, కొత్త బస్టాండ్ తదితర ప్రాంతాల మీదుగా ఈ ర్యాలీ సాగింది. జాతీయ జెండాలు, నల్ల జెండాలు చేతబట్టి వక్ఫ్ సంరక్షణ, రాజ్యాంగ పరి రక్షణ అంటూ ముస్లింలు అధిక సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు ఆధ్వర్యంలో సీపీఐ నాయకులు ర్యాలీకి మద్దతు పలికారు. ఈ సందర్భంగా పాత బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పలువురు ముస్లిం మత పెద్దలు, సీపీఐ నాయకులు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా పరిపాలన సాగిస్తోందని విమర్శించారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు అంతా అన్యాయమన్నారు. ఈ బిల్లుతో ముస్లింలకు ఎలాంటి ప్రయోజనం లేదని, మరింత నష్టం కల్గించే విధంగా ఉందన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను కబ్జా చేసి పెట్టుబడి దారులకు కట్టబెట్టేందుకే కేంద్రం ఈ చట్టాని రూపొందించిందన్నారు. ఏపీ, బిహార్ సీఎంలు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ మద్దతుతో కేంద్ర ప్రభుత్వం దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుందన్నారు. నూతన వక్ఫ్ బోర్డు చట్టాన్ని వెంటనే రద్దు చేయక పోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నూతన వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసే వరకు పోరాటం నిరసన ర్యాలీలో ముస్లింలు -
రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృత్యువాత
కొలిమిగుండ్ల: రాఘవరాజుపల్లె సమీపంలోని ప్రధాన రహదారిపై ఆదివారం కారు, బొలేరో జీపు ఢీకొన్న ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందింది. మరో ఆరుగురు గాయపడ్డారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బ్రాహ్మణపల్లెకు చెందిన చంద్రమోహన్‌రెడ్డి తన కూతురు జోష్యహర్షిణిరెడ్డి(6)ని నంద్యాలలోని మేనమామ ఇంట్లో ఉంచి చదివిస్తుండేవాడు. చంద్రమోహన్‌రెడ్డి అమ్మవారికి మొక్కుబడి చేసే కార్యక్రమం ఉండటంతో చిన్నారి జోష్యహర్షిణిరెడ్డి తాతయ్య రిటైర్డ్ టీచర్ రామసుబ్బారెడ్డితో పాటు బంధువులు వెంకటసుబ్బారెడ్డి, ఏటూరి శ్రీనివాసరెడ్డి, లక్ష్మీదేవిలను కారులో నంద్యాల నుంచి తీసుకొని బయలు దేరారు. సోమవారం పరీక్ష ఉందని తాను రానని చిన్నారి మారం చేసింది. అయితే కార్యక్రమం పూర్తి కాగానే రాత్రిలోగా ఇంటికి వస్తామని చెప్పడంతో ఒప్పుకొని వారితో పాటు బయలుదేరింది. రాఘవరాజుపల్లె శివార్లలోకి చేరుకోగానే అంకిరెడ్డిపల్లె నుంచి కొలిమిగుండ్లకు వస్తున్న బొలేరో వాహనం కారును వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో కారు ఎగిరి రోడ్డు పక్కన బోల్తా పడింది. కారులో ఉన్నవారంతా అందులో ఇరుక్కు పోవడంతో స్థానికులు అతికష్టంగా బయటకు తీశారు. బొలేరోలో ఉన్న అంకిరెడ్డిపల్లె యువకులు రాజకుళ్లాయి, బాలుకు గాయాలయ్యాయి. చిన్నారి జోష్య హర్షిణి కోమాలోకి వెళ్లిపోవడంతో చికిత్స కోసం అనంతపురానికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మిగిలిన క్షతగాత్రులను 108లో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీఐ రమేష్‌బాబు ప్రమాద స్థలానికి చేరుకొని వివరాలు ఆరా తీశారు. శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు. -
గత ప్రభుత్వ చలువే
అనంతపురం జిల్లా పామిడికి చెందిన శ్రీనివాసులు, రమబాయిల కుమార్తె ఎం. దృతికబాయి ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీలో 987 మార్కులు సాధించారు. ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవటం తల్లిదండ్రులు ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులు చెల్లించలేక బనవాసి ఏపీఆర్జేసీ కాలేజీలో చేర్పించారు. గత ప్రభుత్వం విద్యా రంగంలో తీసుకువచ్చిన మార్పులు, విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించటంతో మెరుగైన విద్యను అందించారు. ఏపీఆర్జేసీ కాలేజీలో నాణ్యమైన విద్యనందించటంతో తమ బిడ్డ మంచి మార్కులు సాధించారని తల్లిదండ్రులు శ్రీనివాసులు, రమబాయిలు చెపుతున్నారు. -
భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు
మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు శ్రీశైలం టెంపుల్: శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మ వార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే గాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వేకువజామున పాతాళగంగలో పు ణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూ లైన్లలో బారులు తీరారు. క్యూ లైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, అల్పాహారం, బిస్కెట్స్ దేవస్థాన అధికారులు పంపిణీ చేశారు. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కళకళలాడుతున్నాయి. గాలులు, మెరుపులతో వాన కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలుచోట్ల ఆదివారం సాయంత్రం గాలులు, మెరుపులతో వర్షం కురిసింది. జూపాడుబంగ్లా మండలంలో 33.75, పాములపాడు మండలంలో 28.5, వెల్దుర్తి మండలంలో 21.0, నందికొట్కూరులో 16.5, గూడూరులో 13.5 మి.మీ ప్రకారం వర్షపాతం నమోదైంది. కర్నూలు నగరంలో సాయంత్రానికి ఒక మోస్తరు వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. పెనుగాలుల తీవ్రతకు పలుచోట్ల తోటల్లోని మామిడి చెట్లు నేలమట్టమయ్యాయి. మామిడి రైతుకు నష్టం వాటిల్లింది. ఇద్దరు ఏఈలకు పదోన్నతి కోడుమూరు రూరల్: గాజులదిన్నె ప్రాజెక్టు ఎడమ కాల్వ ఏఈగా పనిచేస్తున్న నారాయణ, ఎల్ఎల్సీ కోడుమూరు సబ్ డివిజన్ ఏఈగా పనిచేస్తున్న మోహన్‌రావులకు ఆదివారం డీఈఈలుగా పదోన్నతి లభించింది. జీడీపీ ఎడమ కాల్వ ఏఈ నారాయణ డీఈఈగా పదోన్నతిపై వైఎస్సార్ జిల్లాకు వెళ్లగా, ఎల్ఎల్సీ కోడుమూరు సబ్ డివిజన్ ఏఈ మోహన్‌రావును అనంతపురం హెచ్ఎల్సీ కెనాల్ డీఈఈగా నియమిస్తూ ఉన్నతాధికారులు లేఖ విడుదల చేశారు. నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలి కర్నూలు (టౌన్): నేర ప్రవృత్తికి స్వస్తి పలికి ప్రశాంత జీవనం గడపాలని రౌటీషీటర్లకు పోలీసు అధికారులు సూచించారు. నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లలో రౌడీషీటర్లకు, నేర చరిత్ర ఉన్న వారికి ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఈస్టర్ వేడుకలను ఆదివారం క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. పండుగ ప్రాముఖ్యతను మతపెద్దలు వివరించారు. పాపులను రక్షించడం గుడ్‌ఫ్రైడే సందేశమైతే, సత్యాన్ని అంతం చేయాలన్న ప్రతిసారీ ఏదో రూపంలో జన్మిస్తూనే ఉంటుందన్నది ఈస్టర్ నేర్పిన పాఠమని పేర్కొన్నారు. యేసుక్రీస్తు బోధనలను విశ్వసించి సన్మార్గంలో నడువాలని సూచించారు. –కర్నూలు టౌన్ -
అమరావతి పేరుతో రూ. వేల కోట్ల దోపిడీ!
కర్నూలు (టౌన్): ‘‘ ప్రపంచంలో ఎక్కడైనా లక్ష ఎకరాల్లో రాజధాని నిర్మించారా? కేవలం అమరావతి పేరు చెప్పి రూ. వేల కోట్ల దోపీడీ చేస్తుంది నిజం కాదా’’ అని వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీమోహన్ రెడ్డి ప్రశ్నించారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్‌లో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ.. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అని అందరికీ తెలుసని, అయితే సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం ఏపీని అమరావతి, పోలవరంగా మార్చారన్నారు. రాష్ట్రంలో ‘కూటమి’ ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతున్నా ఒక్క అమరావతి తప్ప మిగతా వెనుకబడిన 12 ఉమ్మడి జిల్లాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికే రూ. 1.60 లక్షల కోట్ల అప్పులు చేసి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేదన్నారు. రాష్ట్రాన్ని అప్పుల అంధ్రప్రదేశ్‌గా మార్చారని విమర్శించారు. అమరావతిలో రూ. 40 వేల కోట్ల పనులకు సంబంధించి ఇప్పటికే మొబలైజేషన్ పేరుతో 10 శాతం నిధులు కమీషన్ల పేరుతో కూటమి నేతలు కోట్టేశారని ఆరోపించారు. తాజాగా 52 వేల ఎకరాల భూసేకరణ చేయడం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేందుకు, వారి అనుయూయులకు రూ. కోట్లు కట్టబెట్టేందుకే అని ఆరోపించారు. ఒక కిలోమీటరు రోడ్డుకు అమరావతిలో రూ. 60 కోట్లు ఖర్చు చేస్తున్నారని, 7.29 కిలోమీటర్ల రోడ్డు పనులకు రూ.460 కోట్లు టెండర్లు పిలిచారన్నారు. అమెరికా దేశంలోని వైట్ హౌస్ వద్ద ఈ రోడ్డు వేసిన అంత ఖర్చు కాదన్నారు. పార్లమెంటుకు రూ.971 కోట్లు ఖర్చు చేశారని, అదే మన అమరావతిలో అసెంబ్లీ నిర్మాణం కోసం రూ.750 కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. జ్యుడీషియల్ టెండర్ల విధానం ఎత్తేసి రూ. 4 వేల కోట్లు కమీషన్లను దండుకుంటున్నారని ఆరోపించారు. అమరావతి నిర్మాణం పేరుతో జరుగుతున్న అవినీతి కుంభకోణాలను రాబోయే రోజుల్లో వెలుగులోకి తీసుకువస్తామన్నారు. హైకోర్టు బెంచీ ఏదీ? లక్ష ఎకరాల్లో ఎక్కడైనా రాజధాని నిర్మించారా? వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డికర్నూలుకు ఏడాది నుంచి హైకోర్టు కాదు కదా బెంచీ కూడా తీసుకురాలేని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉందని కర్నూలు మేయర్ రామయ్య విమర్శించారు. రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో కేసులు బనాయించడం తప్ప రాష్ట్రప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని విధాలా మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
క్యాన్సర్ ఆస్పత్రిలో కార్పొరేట్ స్థాయి సేవలు
కర్నూలు (హాస్పిటల్): కర్నూలులోని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో అత్యాధునిక పరికరాలు, వసతులతో రోగులకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. శనివారం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో లీనియర్ ఆక్సిలరేటర్, సీటీ సిమ్యులేటర్, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, మెడికల్ ఆంకాలజీ వార్డులను భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. పలువురు రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న సేవలను తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ వెనుకబడిన, కరువు ప్రాంతమైన రాయలసీమ ప్రజలు క్యాన్సర్ వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కర్నూలుకు ఈ ఆస్పత్రిని కేటాయించిందన్నారు. త్వరలోనే పూర్తిస్థాయి వైద్యులు, సిబ్బందిని నియమిస్తామన్నారు. అనంతరం ఆయన రోగుల విభాగాన్ని, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ విభాగాలను సందర్శించి అక్కడి వసతులు, సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో మెడికల్ కాలేజిలోని క్లినికల్ లెక్చరర్ గ్యాలరీలో సమీక్ష నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం, కోడుమూరు ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, దస్తగిరి, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ శ్రీనివాసరావు, అకడమిక్ డీఎంఈ డాక్టర్ రఘునందన్, డీఎంహెచ్‌వో డాక్టర్ పి.శాంతికళ, మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సీఎస్కే ప్రకాష్ పాల్గొన్నారు. అబద్ధాలు వల్లె వేసిన మంత్రి ● స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు వచ్చిన మంత్రి సత్యకుమా ర్ అబద్ధాలు వల్లె వేశారు. క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి 2019లో ఎన్డీఏ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ● ఐదేళ్లు వైఎస్సార్సీపీ అధికారంలో ప్రభుత్వం పట్టించుకోవడంతో 2024 మార్చి నాటికి భవననిర్మాణం పూర్తయ్యింది. ● ఆ ప్రభుత్వ హయాంలోనే రూ.కోట్ల విలువైన లీనియర్ యాక్సిలరేటర్, సీటీ సిమ్యులేటర్ యంత్రాలు వచ్చాయి. ● కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకు కూడా ఈ ఆస్పత్రిని పట్టించుకోలేదు. ● మీడియాలో కథనాలు రావడంతో స్పందించి వసతులు, సౌకర్యాలు కల్పించింది. ● ఇప్పుడు భవనమంతా తామే నిర్మించినట్లు చెప్పుకోవడంపై వైద్యులు, ఇక్కడి ప్రజలు ఇదేం చోద్యమంటూ ముక్కున వేలేసుకున్నారు. ● బోధనాస్పత్రుల్లో వైద్యుల ఖాళీలు 40 శాతం ఉండేవని, అధికారంలోకి వచ్చిన తర్వాత 6 శాతానికి తగ్గించా మని చెప్పుకోవడంపైనా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ●కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడా నియామకాలు చేపట్టలేదని బాహాటంగానే విమర్శిస్తున్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ -
అదుపు తప్పి ఆటో బోల్తా
బనగానపల్లె రూరల్: ఆటో డ్రైవ ర్ అతివేగం, నిర్లక్ష్యానికి ఓ మహిళ ప్రాణం పోయింది. ఎర్రమల కొండల్లో కటికవాని కుంట సమీపంలో శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రుద్రవరం మండలం చిన్న కంబలూరు గ్రామానికి చెందిన పది మంది తమ బంధువులకు చెందిన పుట్టెంట్రుకల కార్యక్రమం నిమిత్తం బేతంచెర్ల మండలంలోని మద్దిలేటిస్వామి క్షేత్రానికి ఆటోలో చేరుకున్నారు. మధ్యాహ్నం కార్యక్రమం ముగిసిన తర్వాత ఆటోలో స్వగ్రామానికి బయల్దేదారు. మార్గమధ్యలో ఎర్రమల కొండపై ఉన్న కటికవానికుంట గ్రామం దాటిన తరువాత మలుపు వద్ద ఆటో డ్రైవర్ అతివేగంతో వెళ్లడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఈశ్వరమ్మ(45) అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన చిన్నమ్మ, కాశమ్మ, హుస్సేనమ్మ, పెద్దక్క, ఐదేళ్ల చిన్నారి భువనసాయి, రమేష్, సుబ్బలచ్చమ్మ, ఆటో డ్రైవర్ వీరప్పను 108లో బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాగా చిన్నమ్మ, కాశమ్మ, భువనసాయికి తీవ్రగాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బనగానపల్లె సీఐ ప్రవీణ్‌కుమార్ వెంటనే సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్షతగ్రాతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. మహిళ మృతి, మరో ఏడుగురికి గాయాలు -
స్వచ్ఛ ర్యాలీలో విద్యార్థులకు శిక్ష
అధికారుల నిర్లక్ష్యంతో రుద్రవరం జెడ్పీ స్కూల్ పిల్లలు అవస్థలు పడ్డారు. స్వచ్ఛాంధ్ర.. స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల వరకు శనివారం భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించాలని భావించారు. కార్యక్రమానికి కూటమి నేతలు, అధికారులు వస్తారని మధ్యాహ్నం వరకు వేచి ఉన్నారు. ఎవరూ రాకపోవడంతో మండల పరిషత్ అధికారులు తమ కార్యాలయానికి ఎదురుగా ఉన్న జెడ్పీ పాఠశాల నుంచి విద్యార్థులను పిలిపించారు. ప్రధాన రహదారి మీదుగా అమ్మవారిశాల సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి, అక్కడ మానవహరం చేపట్టారు. అయితే ఎండకు పాదరక్షలు లేని విద్యార్థులు కాళ్లు కాలి విలవిలలాడారు. ఎండలో నిలబడలేక నీరసించిపోయారు. ఎండలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. – రుద్రవరం -
హంద్రీ నది ఎండి .. గొంతులు తడారి
గోనెగండ్ల: హంద్రీనది పూర్తిగా ఎండిపోయింది. నదీ పరివాహక గ్రామాల్లోని బోర్లు, బావుల్లో జలం అడుగంటి పోతుంది. తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆయా గ్రామస్తులు చెబుతున్నారు. గోనెగండ్ల మండలం గంజిహళ్లి, హెచ్. కై రవాడి, వేముగోడు, తిప్పనూరు గ్రామ సమీపంలోని హంద్రీనది పూర్తిగా ఎండిపోవడంతో అక్రమార్కులు కొందరు రోజుకు 20 నుంచి 30 ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నారు. హంద్రీ పరివాహక గ్రామాలైన హెచ్. కై రవాడి, పుట్టపాశం వేముగోడు, తిప్పనూరు తదితర గ్రామాల్లో బోర్లు పనిచేయడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. హంద్రీ నదిలో ఇసుకను అక్రమంగా తరలిస్తుండడంతో భూగర్భ జలాలు అడుగంటి తాగునీటి సమస్య తీవ్రమవుతుందని భయాందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి హంద్రీనదిలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక రావాణాను అరికట్టి, తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. -
పగలు దాచేస్తారు.. రాత్రి దాటించేస్తారు!
● దర్జాగా కూటమి నేతల ఇసుక దందా ● నది పరివాహక గ్రామాల్లో ఇసుక అక్రమ డంప్‌లు ● అధికారులు తనిఖీ చేయరు.. పోలీసులు పట్టుకోరు పడిదెంపాడు గ్రామ సమీపంలో తుంగభద్ర నదిలో ఇసుక తవ్వకాలతో ఏర్పడిన గోతులు కర్నూలు(రూరల్): ఉచిత ఇసుక పాలసీ కూటమి నేతలకు వరంగా మారింది. తుంగభద్ర నది పరివాహక గ్రామాల్లో దర్జాగా ఇసుక అక్రమ దందా కొనసాగిస్తున్నారు. పగలంతా నదిలో ఇసుక తోడేసి ఒడ్డున డంప్ చేస్తున్నారు. రాత్రికి రాత్రి టిప్పర్లలో ఊరి దాటించి విక్రయిస్తున్నారు. అధికారులకు తెలిసినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటంతో ఇసుకాసురుల దందాకు అడ్డేలేదు. కర్నూలు మండల పరిధిలోని తీర ప్రాంతాలైన పడిదెంపాడు, పూడూరు, పంచలింగాల, దేవమడ, మునగాలపాడు, నిడ్జూరు, ఆర్. కొంతలపాడు, సుంకేసులలో ఇసుక డంపులు వెలుస్తున్నాయి. నది సమీపంలోని మామిడి తోటలు, ప్రైవేటు వెంచర్లు, కల్లం దొడ్లలో నిల్వ చేసినా అడిగేవారు లేరు. తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాల్సిన మైనింగ్, రెవెన్యూ అధికారులు నది వైపు కన్నెత్తి చూడటం లేదు. డంప్ చేసిన ఇసుకను నదితీర గ్రామాల నుంచి కర్నూలు నగరంతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఒక్కో ట్రాక్టర్ దూరాన్ని బట్టి రూ.4 వేల నుంచి రూ.5 వేలకు పైగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కర్నూలు మండలంలో ఎక్కడా ఇసుక రీచ్‌లు లేవు. అయినా ఇసుక మాత్రం అక్రమ రవాణా అవుతోంది. వాస్తవంగా నది తీర ప్రాంత వాసులకు నిర్మాణాలకు ఇసుక అవసరమైతే సచివాలయం నుంచి అనుమతి తీసుకుని నదిలో తవ్వుకోవచ్చు. ఇలా అనుమతితో తవ్వుకునే వారు ఎవరూ కనిపించరు. అంతా కూటమి నేతలు ఏర్పాటు చేసిన ట్రాక్టర్లు ఉంటాయి. వీరి వద్ద నుంచే ఇసుక కొనుగోలు చేసుకోవాల్సిందే. వీరిని కాదని గుప్పెడు ఇసుక కూడా తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. ఉచిత ఇసుక పాలసీ పేరుతో కూటమి నేతలు తుంగభద్రనదిని తోడేస్తున్నారు. ప్రస్తుతం నదిలో నీటి ప్రవాహం లేకపోవడంతో తవ్వకాలు పగలు, రాత్రి తేడా లేకుండా జరుగుతున్నాయి. దందాకు రైట్ రైట్.. కూటమి నేతల ఇసుక దందాకు పోలీసులు, అధికారులు రైట్ రైట్ అంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రహదారులపై ఇసుక ట్రాక్టర్లు వెళ్తున్నా కనీసం అనుమతి ఉందా.. లేదా? అనేది అడగడం లేదు. ముందుగానే మామూళ్లు అందుతుండటంతో అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. పడిదెంపాడు, పూడూరు వైపు వచ్చే ట్రాక్టర్లు సూదిరెడ్డిపల్లె స్టేజి నుంచి ఇటు కర్నూలు, ఇటు బ్రాహ్మణకొట్కూరు వైపు దూసుకెళ్తున్నా అడిగేవారు కరువయ్యారు. అలాగే హంద్రీ నదిలో ఇసుక ట్రాక్టర్లు వెంగన్న బావి మీదుగా రయ్.. రయ్‌మంటున్నాయి. అయితే కొందరు పోలీసు సిబ్బంది మామూళ్లు తీసుకుని ట్రాక్టర్లను వదిలేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణా అరికడతాం మునగాలపాడు, పంచలింగాల, నిడ్జూరు, అర్.కొంతలపాడు గ్రామాల పరిధిలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. పోలీస్, రవాణా శాఖ అధికారుల సమన్వయంతో దాడులు చేసి కేసులను నమోదు చేస్తాం. నదుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలతో భూగర్భజలాలు అడుగంటుతాయి. ఈ విషయంపై ఆయా గ్రామాల్లో అవగాహన కల్పిస్తాం. – టీవీ రమేష్ బాబు, కర్నూలు రూరల్ తహసీల్దార్ -
ఇద్దరి ప్రాణాలు తీసిన అతివేగం
● ఎన్‌హెచ్–44పై బోల్తాపడిన కారును ఢీకొట్టిన ట్రావెల్ బస్సు ● దంపతుల దుర్మరణం, మరో నలుగురికి గాయాలు ● బంధువుల గృహ ప్రవేశానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం ● మృతులు బండి ఆత్మకూరు మండలం కాకునూరు వాసులు ఎర్రవల్లి/బండిఆత్మకూరు: అతివేగం ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. బంధువుల గృహప్రవేశానికి వెళ్లి వస్తుండగా కారు అదుపుతప్పి బోల్తా పడటం.. అదే సమయంలో వస్తున్న ట్రావెల్ బస్సు కారును ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఎర్రవల్లి మండలం వేముల స్టేజీ సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. కోదండాపురం ఎస్ఐ మురళి వివరాల మేరకు.. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం కాకునూరుకు చెందిన దేరెడ్డి పుల్లారెడ్డి (59), ఆయన భార్య లక్ష్మి పుల్లమ్మ (51), కుమారుడు వెంకటసుబ్బారెడ్డితో పాటు మరో ముగ్గురు కుటుంబ సభ్యులు శుక్రవారం హైదరాబాద్‌లో బంధువుల గృహప్రవేశానికి వెళ్లారు. అక్కడ కార్యక్రమం పూర్తయ్యాక తిరిగి అదే రోజు రాత్రి 8:30 గంటలకు కారులో స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలోని ఎర్రవల్లి మండలం వేముల స్టేజీ సమీపంలో దేరెడ్డి వెంకటసుబ్బారెడ్డి కారును అతివేగంగా, అజాగ్రత్తగా నడపడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి అవతలి రోడ్డుపై బోల్తాపడింది. అదే సమయంలో కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ట్రావెల్ బస్సు కారును ఢీకొట్టడంతో భార్యాభర్తలు దేరెడ్డి సుబ్బారెడ్డి, లక్ష్మి పుల్లమ్మతో పాటు వారి బంధువు స్రవంతికి తీవ్రగాయాలయ్యాయి. డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు తేలికపాటి రక్త గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికి త్స నిమిత్తం కర్నూలు ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే సుబ్బారెడ్డి, లక్ష్మిపుల్లమ్మ మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుల బంధువు మహేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
అదుపుతప్పితే.. కడుపుకోతే!
మండలంలోని నంచర్ల గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల ప్రాణాలకు భరోసా లేకుండాపోతోంది. నీటి కుళాయిలు మరమ్మతులకు నోచుకోక మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు సంపు పైకెక్కి నీరు తోడుకుంటున్నారు. ఈ సంపు సుమారు పది అడుగుల లోతు ఉంది. సంపు ఇనుప మూత పాడవడంతో మరమ్మతులు చేయించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ప్రమాదకర పరిస్థితుల్లో నీరు తీసుకుంటున్నారు. జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. – చిప్పగిరి సంపు పైకెక్కి నీరు తోడుకుంటున్న విద్యార్థులు -
తండ్రీకొడుకులు నోరు పారేసుకుంటున్నారు. సొంత పార్టీ లేదు, కూటమి గౌరవం లేదు.. అహంకారపూరిత మాటలతో కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఇదే సమయంలో కూటమి నేతల్లోనే అసహనం వ్యక్తమవుతోంది. మంత్రి టీజీ భరత్ ఎవరికీ అందుబాటులో ఉండకపోవడం, పీఏల పాలనతో శ్రేణులు
మంత్రి టీజీపై తమ్ముళ్ల తిరుగుబాటు ● పీఏల తీరుపై పెల్లుబికిన ఆగ్రహం ● మంత్రి వైఖరిని తూర్పారబట్టిన శ్రేణులు ● అసహనంతో మైక్ విసిరికొట్టి వెళ్లిపోయిన భరత్ ● తాజాగా టీజీ ఇంట్లో బీజేపీ సీనియర్ నేతకు అవమానం ● కర్నూలు కూటమిలో ముసలం పార్థసారధి ఆదోనికి ఎమ్మెల్యే కాదు.. కులానికి‘‘నేను ఎమ్మెల్యేను కాదు, మంత్రిని. మీ సమస్యలను పరిష్కరించేందుకు ఐదుగురు పీఏలను నియమించాం. వారి దృష్టికి తీసుకెళ్లండి.. పరిష్కరిస్తారు.’’ – కార్యకర్తల సమావేశంలో మంత్రి టీజీ భరత్ ● బీజేపీ కార్యకర్తల సమావేశంలో టీజీ వెంకటేష్ ఎత్తిపొడుపు డాక్టర్ పార్థసారధి ఆదోనికి ఎమ్మెల్యేలా కాకుండా కేవలం ఒక కులానికి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నాడని బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నట్లు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. అంబేద్కర్ జయంతి వారోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం మౌర్యా ఇన్‌లోని పరిణయ హాల్లో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధితో పాటు టీజీ వెంకటేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీజీ మాట్లాడుతూ ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పార్థసారధి ఓ కులానికి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నట్లు కనపడుతోందని అనడంతో పార్థసారధి తీవ్ర మనస్థాపానికి గురైనట్లు కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. టీజీ భరత్ ఇంటి దగ్గర బీజేపీ సీనియర్ నాయకుడు హరిష్ కుమార్‌కు అవమానం జరగడం, సాయంత్రం కార్యకర్తల సమావేశంలో ఆదోని ఎమ్మెల్యేను టీజీ వెంకటేష్ కించపరుస్తూ మాట్లాడటం ఒకే రోజు చోటు చేసుకోవడం గమనార్హం. ‘‘పీఏలు అధ్వానంగా తయారయ్యారు. కనీసం ఫోన్లు కూడా ఎత్తరు. డబ్బున్న వాళ్లకే పనిచేసి పెడుతున్నారు. వాళ్ల వ్యవహారశైలి కూడా చాలా దారుణంగా ఉంటోంది.’’ – కర్నూలు పాతబస్తీకి చెందిన ఓ మహిళా కార్యకర్త ఆవేశం కర్నూలు: జిల్లాకు చెందిన మంత్రి టీజీ భరత్‌పై కర్నూలు అర్బన్ తెలుగుతమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలను చెప్పుకునేందుకు అందుబాటులో ఉండడం లేదని, ఇటీవల మౌర్యా ఇన్‌లో జరిగిన పార్టీ ఇంచార్జీలు, కార్పొరేటర్ల సమావేశంలో పలువురు టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు నగరంలో చర్చనీయాంశమైంది. ఎన్నికలకు ముందు నియోజకవర్గంలోని ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చామని, ఓట్లు వేయించుకొని గెలుపొందిన తరువాత అందుబాటులో ఉండడం లేదని వార్డు ప్రజలు తమను నిలదీస్తున్నారని వారు వాపోయారు. ఈ నేపథ్యంలో మంత్రి కలుగజేకొని సమస్యలుంటే తన పీఏల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని చెప్పడం కార్యకర్తల ఆవేశానికి కారణమైంది. ● ఓ మహిళా కార్యకర్త లేచి తన స్థలం ఆక్రమణకు గురవుతోందని పలుమార్లు ఫిర్యాదు చేసినా, పీఏలు ఆక్రమణదారులకే వంత పలుకుతున్నారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ● కార్యకర్తలు అసహనంతో మాట్లాడుతున్న తీరుపట్ల సమావేశంలో పాల్గొన్న మెజారిటీ నేతలు, కార్యకర్తలు బహిరంగంగా చప్పట్లు, ఈలలు వేసి తమ సంఘీభావాన్ని తెలపడంతో మంత్రి టీజీ స్పందిస్తూ అమరావతి స్థాయిలో తన పనులే కావడం లేదు, నేనెవరికి చెప్పుకోవాలంటు తీవ్ర ఆవేశానికి లోనయ్యారని సమాచారం. ● మరి కొందరు కార్యకర్తలు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రయత్నిస్తుండగా, తీవ్ర అసహనానికి గురై తన చేతిలో ఉన్న మైక్‌ను నేలకేసి కొట్టి సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయినట్లు చర్చ జరుగుతోంది. తాజాగా బీజేపీ సీనియర్ నేతకు అవమానం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ జిల్లా పర్యటన సందర్భంగా టీజీ ఇంట్లో సీనియర్ బీజేపీ నేత హరీష్‌కుమార్ జరిగిన అవమానం కూడా కార్యకర్తల్లో తీవ్ర చర్చనీయాంశం కావడమే గాక, టీడీపీ వర్సెస్ బీజేపీ చందంగా మారింది. శనివారం మంత్రి సత్యకుమార్ పలు అధికారిక కార్యకలాపాల్లో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ తన ఇంటికి భోజనానికి మంత్రి సత్యకుమార్‌ను ఆహ్వానించారు. అయితే గతంలో కర్నూలు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ బదిలీ వ్యవహారంలో మంత్రులు ఇరువురి మధ్య ఆధిపత్య పోరు నడిచిందని తెలిసింది. గతంలో సూపరిటెండెంట్‌గా ఉన్న సి.ప్రభాకర్‌రెడ్డికి సత్యకుమార్ సపోర్టుగా నిలువగా, టీజీ భరత్ తన పలుకుబడిని ఉపయోగించి తనకు కావాల్సిన అధికారిని ఇక్కడకు తెచ్చుకున్నారు. దీంతో అప్పటి నుంచి వీరిద్దరి మధ్య అగాథం చోటు చేసుకుంది. ఈ నేఫథ్యంలోనే మంత్రి టీజీ ఇంటికి భోజనానికి వెళ్లేందుకు మంత్రి సత్యకుమార్ సంశయిస్తూ కాలయాపన చేశారు. విషయం తెలుసుకున్న టీజీ వెంకటేష్ జోక్యం చేసుకొని ఎట్టకేలకు సత్యకుమార్‌ను తన ఇంటికి రప్పించుకున్నారు. అయితే ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్‌కు పీఏగా ఉన్న జిల్లాకు చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు హరీష్‌కు తీవ్ర అవమానం జరిగిన ఘటనపై జోరుగా బీజేపీలో చర్చ జరుగుతోంది. హరీష్‌కుమార్ మంత్రితో పాటు టీజీ ఇంట్లోకి భోజనానికి వెళ్తుండగా, ద్వారం వద్దనే టీజీ వెంకటేష్ అడ్డుపడి లోపలికి కేవలం మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు మాత్రమే రావాలంటూ హరీష్‌ను చేయిపట్టుకొని బయటకు పంపడం పట్ల బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ అంశం ఇరుపార్టీల్లోని కార్యకర్తలను గందరగోళానికి గురి చేస్తోంది. -
డోన్‌లో ఇష్టారాజ్యం
కర్నూలు(అగ్రికల్చర్): మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరతో కొనుగోలు చేసిన కందులు గోదాముల దగ్గర తిరస్కరణకు గురవుతున్నాయి. కాసులకు కక్కుర్తి పడి వ్యాపారులు, దళారీల దగ్గర నాసిరకం కందులను సైతం కొనుగోలు చేస్తుండటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఏ పంటనైనా మద్దతు ధరతో కొనుగోలు చేయాలంటే కనీస నాణ్యతా ప్రమాణాలను పరిశీలిస్తారు. అయితే ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో టీడీపీతో పాటు కూటమి పార్టీలైన జనసేన, బీజేపీ అనుకూల వ్యాపారులు, దళారీల నుంచి నాణ్యత లేని కందులను సైతం కొనుగోలు చేస్తున్నారనే పిర్యాదులు ఉన్నాయి. మొత్తం కొనుగోలు కేంద్రాలను ఆయా జిల్లాల మార్క్‌ఫెడ్ మేనేజర్లు పర్యవేక్షించాల్సి ఉంది. అయితే కొనుగోలు కేంద్రాల నుంచి జిల్లా మేనేజర్లకు గుడ్ విల్ వస్తుండటం వల్ల చూసీచూడనట్లు పోతున్నారనే విమర్శలు ఉన్నాయి. దీనిని అవకాశంగా తీసుకొని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు దళారీలు, వ్యాపారుల నుంచి కందులు మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నారు. ముడుపులు ముట్టచెబుతుండటం వల్ల నాసిరకం కందులను కూడా కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు విక్రయిస్తుండటం గమనార్హం. సెంట్రల్, స్టేట్ వేర్‌హౌసింగ్ గోదాముల్లో నిల్వ దాదాపు మూడు నెలలుగా మద్దతు ధరతో కందుల కొనుగోలు జరుగుతోంది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ నెల 21వ తేదీతో కొనుగోలు కేంద్రాలను ముగించాల్సి ఉంది. అయితే కందుల కొనుగోలు ప్రక్రియను మరింత పొడిగించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో 5,575 టన్నులు, నంద్యాల జిల్లాలో 5,500 టన్నులు కొనుగోలు చేశారు. కర్నూలు జిల్లాలో 25 మండలాలు, నంద్యాల జిల్లాలో 21 మండలాల్లో కందుల కొనుగోలు జరుగుతోంది. కొనుగోలు చేసిన కందులను ఆదోని, నందికొట్కూరు, డోన్ తదితర ప్రాంతాల్లోని సెంట్రల్ వేర్‌హౌసింగ్, స్టేట్ వేర్ హౌసింగ్ గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. గోదాముల్లో కందులు అన్లోడ్ చేసే సమయంలో నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేస్తారు. సరుకు గోదాము చేరిన తర్వాతనే రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ అవుతుంది. పండించిన కందులను రైతులు అమ్ముకోవడం దాదాపు పూర్తయింది. మార్కెట్ యార్డులకు కూడా కందులు రావడం తగ్గిపోయింది. దళారీలు, వ్యాపారులు రైతుల నుంచి తక్కువ ధరతో కొనుగోలు చేసిన కందులను గోదాముల్లో నిల్వ చేసినట్లు తెలుస్తోంది. ధర పెరిగినప్పుడు అమ్ముకోవాలనేది ఉద్దేశం. అయితే ధర మరింత తగ్గుతుండటంతో కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరతో అమ్ముకునేందుకు బయటికి తీసుకొస్తున్నారు. 2,500 క్వింటాళ్లకు పైగా కందులు రిజెక్ట్ మార్క్‌ఫెడ్ అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ముడుపులు ఎర వేసి మద్దతు ధరతో విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ముడుపులు ముడుతుండటంతో నాణ్యతా ప్రమాణాలను పట్టించుకోని పరిస్థితి. నిజమైన రైతులు తీసుకుపోతే మూడు నాలుగు సార్లు జల్లెడ వేస్తారు. దళారీలు తీసుకెళ్తే జల్లెడ వేయకుండానే కొంటుండటం గమనార్హం. అయితే కొనుగోలు కేంద్రాల వద్ద జరిగే అక్రమాలు గోదాముల దగ్గర బయటపడుతున్నాయి. అక్కడ నిర్వహిస్తున్న తనిఖీల్లో నాణ్యత గుట్టు బయట పడుతోంది. కర్నూలు జిల్లాకు సంబంధించి దాదాపు 1,575 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు సంబంధించి 950 క్వింటాళ్ల కందులు రిజెక్ట్ అయ్యాయి. మార్క్‌ఫెడ్ అధికారులకు గుడ్‌విల్ ఇవ్వాల్సిందే.. మద్దతు ధరతో పంట ఉత్పత్తులను కొనుగోలు చేసే ప్రక్రియ మొదలవుతుందంటే మార్క్‌ఫెడ్ అధికారులకు పండుగే. నోడల్ ఏజెన్నీ మార్క్‌ఫెడ్ అయినప్పటికీ క్షేత్రస్థాయిలో డీసీఎంఎస్, పీఏసీఎస్‌ల ద్వారానే కొనుగోలు చేస్తారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు మార్క్‌ఫెడ్ అధికారులకు గుడ్‌విల్ భారీ మొత్తంలోనే ఇచ్చుకోవాల్సి ఉంది. లేదంటే 50 నుంచి 100 క్వింటాళ్లకు ఒక క్వింటా కందులు ముడుపుల కింద ఇవ్వాల్సిందేనని సమాచారం. ఎవరికి వారు మామూళ్ల మత్తులో పడిపోవడం వల్ల కొనుగోలు కేంద్రాల్లో టీడీపీ మద్దతుదారులైన దళారీలు, వ్యాపారుల హవా నడుస్తోంది. మద్దతు కొనుగోలు కేంద్రాలు వ్యాపారులు, దళారీలకే ఏర్పాటు చేసినట్లు అర్థమవుతోంది. ఇదీ కొను‘గోలుమాల్’ వ్యవహారం కందులు నాణ్యత లేకపోతే ఒకటి, రెండు సార్లు జల్లెడ వేయాల్సి ఉంది. అయితే ముడుపుల కారణంగా వచ్చిన వాటిని వచ్చినట్లు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్ల గోదాముల దగ్గర జరుపుతున్న నాణ్యత ప్రమాణాల్లో వందల క్వింటాళ్లు తిరస్కరణకు గురవుతున్నాయి. ● నిజమైన రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నప్పుడు నాణ్యతకు పెద్దపీట వేస్తుండటం.. దళారీలు, వ్యాపారుల నుంచి కొనుగోలు చేస్తున్నప్పుడు నాణ్యతను విస్మరించడం వెనుక ముడుపుల వ్యవహారం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. మార్గదర్శకాలకు అనుగుణంగానే కొనుగోళ్లు కందుల కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోంది. మార్గదర్శకాలకు అనుగుణంగా మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నాం. అనంతరం సెంట్రల్, స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ గోదాములకు తరలిస్తున్నాం. అక్కడ ప్రతి సంచి కందుల నాణ్యతను చెక్ చేస్తున్నారు. తగిన నాణ్యతా ప్రమాణాలు లేకుంటే రిజెక్ట్ అవుతాయి. రైతులు అంగీకరిస్తే మళ్లీ జల్లెడ వేసి పంపుతాం. జిల్లాకు సంబంధించి 80–90 టన్నుల వరకు రిజెక్ట్ అయ్యాయి. అంతమాత్రాన అక్రమాలు జరిగినట్లు కాదు. – జి.రాజు, జిల్లా మేనేజర్, కర్నూలు2014–2018 మధ్య కొనుగోలు కేంద్రాల్లో భారీ అక్రమాలు టీడీపీ అధికారంలో ఉన్న 2014–15 నుంచి 2018–19 వరకు దళారీలు, వ్యాపారుల నుంచి కందులు, శనగలు మద్దతు ధరతో కొనుగోలు చేసి ఆత్మకూరులోని వేర్ హౌసింగ్ గోదాముల్లో నిల్వ చేశారు. అప్పట్లో గోదాము అధికారులను మచ్చిక చేసుకోవడం వల్ల నాసిరకం సరుకును కూడా అనుమతించారు. రెండేళ్ల తర్వాత నాఫెడ్ అధికారులు పరిశీలిస్తే పుచ్చుపట్టి పనికిరాని కందులను గుర్తించారు. వందలాది టన్నుల పంట ఉత్పత్తులు పనికి రాకుండాపోయాయి. తాజాగా తిరిగి టీడీపీ ప్రభుత్వంలో నాటి పరిస్థితులే పునరావృతం అవుతున్నాయి. దళారీలు, వ్యాపారుల నుంచి మామూళ్ల మత్తులో పడి నాసిరకం కందులు కొనుగోలు చేస్తుండటం వల్ల రానున్న రోజుల్లో దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. అన్ని మండలాల్లో డీసీఎంఎస్, పీఏసీఎస్‌ల ప్రతినిధులు క్షేత్రస్థాయికి వెళ్లి కందులను కొనుగోలు చేస్తే డోన్‌లో మాత్రం రైతులు మార్కెట్ యార్డుకు తెచ్చి అమ్ముకునేలా సెంటర్ నిర్వాహకుడు షరతు విధించాడు. డోన్ మండలంలో డీసీఎంఎస్ బ్రాంచ్ కొనుగోలు కేంద్రాన్ని నిర్వహిస్తోంది. టీడీపీ వర్గీయులు బలంగా ఉన్న గ్రామాలకు వెళ్లి కందులను మద్దతు ధరతో కొనుగోలు చేశారు. ఈ విధంగా 4 గ్రామాల్లో మాత్రమే కొన్నారు. మిగిలిన అన్ని గ్రామాల రైతులు మార్కెట్‌యార్డుకు తెచ్చి అమ్ముకోవాలనే నిబంధన పెట్టారు. ఇందువల్ల రైతులపై రవాణ చార్జీల భారం పడింది. క్వింటాకు 2800 గ్రాముల కందులు అదనంగా తీసుకున్నారు. మద్దతు ధరతో అమ్ముకోవడానికి వెళ్లిన రైతులు దోపిడీకి గురయ్యారు. -
రుణాలు ఊరించి.. చేయూత మరిచి!
బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపులకు అరచేతిలో వైకుంఠం ● కర్నూలు జిల్లాలో 2,034 మందికి లబ్ధి చేకూర్చాలని లక్ష్యం ● 27,140 మంది దరఖాస్తు ● పూలే జయంతి రోజున 508 మందికి మెగా చెక్కు ● మిగిలిన వారి పరిస్థితి ప్రశ్నార్థకం ● వైఎస్సార్సీపీ హయాంలో నవరత్నాల పేరిట 6.97 లక్షల మందికి లబ్ధి కర్నూలు(అర్బన్): బడుగు, బలహీన వర్గాలకు ఆర్థిక చేయూతను అందించేందుకు బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలను అందించునున్నట్లు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు, మైనారిటీ వర్గాలకు ఆయా కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందించి వారి ఆర్థిక స్థితి గతుల్లో మార్పు తీసుకొస్తామని ప్రకటించింది. అయితే కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడంలో ఆరంభ శూరత్వాన్ని ప్రదర్శిస్తోంది. ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు గడిచిపోయినా, నేటికి కార్పొరేషన్ల రుణాలకు సంబంధించి స్పష్టత ఇవ్వకపోవడం శోచనీయం. జనవరి నెల మొదటి వారంలో బీసీ వర్గాలకు రుణాలు అందించేందుకు అంతా సిద్ధమైందని, వెంటనే అర్హత కలిగిన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని తేదీలు ప్రకటించి మరీ హడావుడి చేశారు. అయితే దరఖాస్తు చేసుకునేందుకు ఉద్దేశించిన ఓబీఎంఎంఎస్ వెబ్సైట్ పలు ఆర్థిక, సాంకేతిక కారణాల వల్ల ఆలస్యంగా ఓపెన్ అయ్యింది. కర్నూలు జిల్లాలో బీసీ, ఈబీసీ, కాపు వర్గాలకు చెందిన 2,034 మందికి ( బీసీ 1673, కాపు 190, ఈడబ్ల్యూఎస్ 171 ) సబ్సిడీ, బ్యాంకు రుణం కలిపి రూ.41.23 కోట్ల మేర స్వయం ఉపాధి పథకాలకు రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో అర్హులైన 27,140 మంది దరఖాస్తు చేసుకున్నారు. 508 మంది ఎంపికై నట్లు మెగా చెక్కు జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించిన లక్ష్యం మేరకు 2,034 మందికి రూ.41.23 కోట్ల మేర రుణాలను అందించాల్సి ఉంది. అయితే ఈ నెల 11న మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా రుణాలకు సంబంధించి 508 మంది లబ్ధిదారులు ఎంపికై నట్లు రూ.11.77 కోట్ల మెగాచెక్కును అందించారు. ఇందులో 488 మంది బీసీలు, 7గురు కాపులు, 13 మంది ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన వారు ఉన్నారు. అయితే లక్ష్య సాధనలో భాగంగా 508 మంది పోగా, మిగిలిన 1,526 మందికి రుణాలు ఎప్పుడు అందిస్తారనేది ప్రశ్నార్థకం. అందరికీ రుణాలు అందుతాయి మొదటి విడతలో ఈ నెల 11న మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి రోజున జిల్లాలో ఎంపికై న 508 మందికి రూ.11.77 కోట్ల మెగాచెక్కు ను లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ అందించారు. జిల్లాకు నిర్ణయించిన లక్ష్యం మేరకు మిగిలిన వారికి కూడా రుణాలు అందుతాయి.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మున్సిపాలిటీలు, మండల పరిషత్ కార్యాలయాల నుంచి లబ్ధిదారుల జాబితాలను బ్యాంకులకు పంపి ఖాతా లను ఓపెన్ చేయించి జాబితాలను తమ కార్యాలయాలకు పంపాలని కోరనున్నాం. జాబితాలు అందిన వెంటనే జిల్లా కలెక్టర్ ద్వారా ఆమో దం తీసుకొని తమ శాఖ ఉన్నతాధికారి కార్యాలయానికి పంపుతాం. – ఎస్ జాకీర్‌హుసేన్, ఈడీ, బీసీ కార్పొరేషన్ ఏఏ పథకాల ద్వారా ఎంతెంతంటే .... వైఎస్సార్సీపీ హయాంలో రూ.2049.22 కోట్ల లబ్ధి గడిచిన ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రకటించి అమలు చేసిన వివిధ పథకాల ద్వారా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 6,97,147 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.2049.22 కోట్లు జమ అయ్యాయి. -
హోరాహోరీగా బండలాగుడు పోటీలు
బేతంచెర్ల: పట్టణంలోని చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్థానిక శేషారెడ్డి హైస్కూలు మైదానంలో రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు శుక్రవారం హోరాహోరీగా సాగాయి. ఆయా ప్రాంతాల నుంచి 18 జతల వృషభాలు ఈ పోటీల్లో పాల్గొనాయి. చెన్న కేశవ స్వామి ఆలయ కమిటీ సభ్యులు రైతు సంఘం నాయకులు బూషిరెడ్డి, సీహెచ్ నాగిరెడ్డి పోటీలను ప్రారంభించారు. మండలంలోని ఆయా గ్రామాల యువకులు, రైతులు పోటీలను తిలకించడానికి రావడంతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈలలు కేరింతల మధ్య వృభజరాజములు రంకెలు వేస్తుండగా పోటీసులు రసవత్తరంగా సాగాయి. ఈ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలుకు చెందిన అక్షరారెడ్డి, కోడుమూరుకు చెంఇన శశాంక్ శ్రేయ ఎద్దులు సంయుక్త విజేతగా నిలిచి ప్రథమ, ద్వితీయ నగదు బహుమతిని కై వసం చేసుకున్నాయి. తాండ్రపాడుకు చెందిన వరలక్ష్మి ఎద్దులు తృతీయ, ఎమ్మిగనూర్‌కు చెందిన సాయి వర్ధన్ వృషభాలు నాల్గొవ, సంజామలకు చెందిన గుండం చెన్నారెడ్డి వృషభాలు 5వ స్థానంలో నిలిచాయి. దాతలు సహకారంతో వరుసగా రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేల నగదు బహుమతులను దాతలు, నగర పంచాయతీ చైర్మన్ చలం రెడ్డి, రైతు సంఘం నాయకుల చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు నాగభూషణం రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, గౌరు వెంకటరెడ్డి, రామ్ మోహన్‌రెడ్డి, అన్నారావు, వీరభద్రారెడ్డి, అజయ్ పాల్గొన్నారు. -
వక్ఫ్ సవరణ చట్టంపై ముస్లింల నిరసన
ఎమ్మిగనూరుటౌన్:వక్ఫ్ సవరణ చట్టంపై శుక్రవారం ఎమ్మిగనూరులో ముస్లింలు నిరసన తెలిపారు.శివసర్కిల్లోని అబుబకర్ మసీదు లో ప్రార్థనల అనంతరం ముస్లింలు ఒక చోట చేరారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, ముస్లింలకు న్యాయం చేయాలని నినాదా లు చేశారు. ముస్లింల మనోభావాలు దెబ్బతిసే లా వ్యవహరిస్తే ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. నిరసనలో మత పెద్దలు అతావుల్లా మౌలానా, మౌలానా మునీర్, పక్కీర్సాబ్, కౌన్సిలర్ వాహిద్, ముస్లింలు పాల్గొన్నారు. విద్యార్థులకు ‘ఫీజు’ పాట్లు కర్నూలు (టౌన్): ఫీజు రీయింబ్స్‌మెంట్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నీరుగారుస్తోందని వైఎస్సార్సీపీ విధ్యార్థి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కటికే గౌతమ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభు త్వం ఫీజులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్‌లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతున్నా విద్యార్థులకు ఫీజు బకాయిలు అందడం లేదన్నా రు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పట్టించుకోవడం లేదన్నారు. పెండింగ్‌లో ఉన్న బకా యిలు చెల్లించాలని, విధ్యార్థులను వేధిస్తున్న కళ శాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలోనే విద్యార్థినీ, విధ్యార్థులకు, తల్లిదండ్రులకు మద్దతుగా ఉద్యమాల బాట పడతామన్నారు. అగ్నిప్రమాదాలపై 101కు సమాచారం ఇవ్వాలి కర్నూలు: అగ్నిప్రమాదాలు సంభవించినప్పు డు టోల్‌ఫ్రీ నంబర్ 101కు ఫోన్ చేసి సమాచా రం ఇవ్వాలని అగ్నిమాపక శాఖ జిల్లా సహాయ అధికారి వై.చిన్నబజారి సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం కల్లూరు ఎస్టేట్‌లోని దామోదర్ ఆయిల్ మిల్, హిందుస్థాన్ పెట్రోల్ బంకుల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అగ్నిప్రమాదాలు అరికట్టడానికి సరిపడే నీరు, ఇసుక అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అగ్నిమాపక సిబ్బంది వెంకటరాముడు, హనుమంతు, నరసింహుడు, యు.రామాంజనేయులు, సి.రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
శ్రీనగర్ ఎస్పీగా కర్నూలు వాసి
కర్నూలు: జమ్ముకాశ్మీర్‌లో జరిగిన ఐపీఎస్‌ల బదిలీల్లో కర్నూలు వాసి డాక్టర్ సందీప్ చక్రవర్తి శ్రీనగర్ ఎస్పీగా నియమితులయ్యారు. ఈయన ఎంబీబీఎస్ పూర్తి చేసి 2013లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. విద్యాభ్యాసం మొత్తం కర్నూలులోనే జరిగింది. ఈయన తండ్రి డాక్టర్ రాంగోపాల్ రావు కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ఆర్ఎంఓగా పదవీ విరమణ పొంది ప్రస్తుతం కర్నూలు బీ–క్యాంప్‌లో నివాసముంటున్నారు. సందీప్ చక్రవర్తి పోలీసు శాఖలో చేరినప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఏఎస్పీగా పూంచ్, యూరి, సోపోర్, బారాముల్లా, శ్రీనగర్ సౌత్ జోన్ ఎస్పీగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం జరిగిన బదిలీల్లో శ్రీనగర్ ఎస్ఎస్పీగా నియమితులయ్యారు. విధి నిర్వహణలో ఈయన ఆరు పీఎంజీ, నాలుగు సార్లు జేకే పీఎంజీ, ఐదు సీఆర్పీఎస్ డీజీపీ కమాండెంటేషన్, రెండుసార్లు ఇండియన్ ఆర్మీ డిస్క్, ఒక్కసారి జమ్మూకాశ్మీర్ డీజీపీ నుంచి కమాండెంటేషన్ డిస్క్, ఒకసారి ఐటీ బీపీఈడీటీ కమాండెంటేషన్ డిస్క్ పతకాలను పొందారు. -
భారీగా కర్ణాటక మద్యం స్వాధీనం
కోసిగి/పెద్దకడబూరు: అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తుండగా దాడి చేసి పట్టుకున్నట్లు కోసిగి ఎకై ్స జ్ పోలీసులు తెలిపారు. స్థానిక ఎకై ్సజ్ స్టేషన్లో సీఐ భార్గవ్ రెడ్డి, కర్నూలు ఈఎస్టీఎఫ్ సీఐ రాజేంద్ర ప్రసాద్ శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మాలపల్లి నుంచి కంబాలదిన్నె గ్రామం వైపు పోవు రోడ్డు లోని మారెమ్మ గుడి వెనుక భాగం మట్టి రోడ్డులో కారులో 40 బాక్స్‌ల్లో టెట్రా ప్యాకెట్లు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మంత్రాల యం మండలం రచ్చుమర్రి గ్రామానికి చెందిన గోవిందు, పోలి వీరేష్, మజ్జిగ బొజ్జప్ప లు, పెద్దకడబూరు మండలం కంబదహాల్ గ్రామానికి చెందిన బోయ బాలును అదుపులో తీసుకున్నట్లు తెలిపారు. అలాగే రచ్చుమర్రి గ్రామానికి చెందిన ఆదోని శివశంకర్, కంబాలదిన్నె గ్రామానికి చెందిన బోయ ఉసేని పరారయ్యారు. పట్టుబడిన నిందితులను రిమాండ్‌కు తరలించామని, పరారైన వారిని త్వరలోనే పట్టుకుంటామని సీఐలు తెలిపారు. దాడుల్లో కోసిగి ఎకై ్సజ్ ఎస్ఐ కె. నాగేంద్ర, హెడ్ కానిస్టేబుల్ కిషోర్, కానిస్టేబుళ్లు భరత్, రవి కుమార్, మునిరంగడు, కర్నూలు ఈఎస్టీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ సాయిబాబా, కానిస్టేబుళ్లు మధు, లాలూ, కుమార్ స్వామి రెడ్డి పాల్గొన్నారు. -
మద్దతు ధర: 7,550
కొనుగోళ్లకు ఆఖరు తేది: ఈనెల 215,575 టన్నులు కర్నూలు జిల్లాలో కొనుగోలు చేసిన కందులు5,500 టన్నులు నంద్యాల జిల్లాలో కొనుగోలు చేసిన కందులు2,500 క్వింటాళ్లు నాణ్యత లేక గోదాముల వద్ద తిరస్కరించిన కందులుకందుల కొనుగోళ్లలో మతలబు ● నాసిరకం కందులు విక్రయిస్తున్న దళారీలు, వ్యాపారులు ● సెంట్రల్, స్టేట్ వేర్‌హౌసింగ్ గోదాముల వద్ద వెలుగులోకి అక్రమాలు ● నాణ్యతా లోపంతో 2,500 క్వింటాళ్లకు పైగా తిరస్కరణ ● ముడుపులతోనే చూసీచూడనట్లు వ్యవహారం ● గుడ్‌విల్ మత్తులో మార్క్‌ఫెడ్ అధికారులు -
అకాల వర్షం.. అపార నష్టం
హొళగుంద/చిప్పగిరి: ఈదురుగాలులతో కురిసిన వడగండ్ల వాన రైతులకు తీవ్ర నష్టం మిగిల్చింది. హొళగుంద మండల పరిధిలోని గజ్జహళ్లి గ్రామంలో కోతకు సిద్ధంగా ఉన్న వరి నేలవాలింది. కల్లాల్లో నిల్వ ఉంచిన మిరప తడిసిపోయింది. తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ) కింద వందలాది ఎకరాల్లో వరి సాగు చేశారు. పైరు గింజ దశలో ఉన్న సమయంలో వడగండ్ల వాన పడింది. దీంతో పైరులోని 90 శాతం మేర గింజలన్నీ నేలరాలాయి. అలాగే పైరు నేలకొరిగింది. ఇప్పటికే కోత జరిగి కల్లాల్లో ధాన్యం బస్తాలు ఉంచగా తడిసిపోయాయి. అదేవిధంగా మిరప, మామిడి తదితర పంటలకు నష్టం వాటిల్లింది. మామిడి పూత నేల రాలి దెబ్బ తినగా.. కల్లంలో ఉంచిన ఎండు మిరప నీటిలో నానిపోయింది. ఈదురుగాలులకు పెద్దహరివాణం రోడ్డులో, గజ్జహళ్ల్లి బీసీ కాలనీలో చెట్టు కొమ్మ లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. అయితే ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఉరుములు, మెరుపులతో ప్రజలు బయటకు రాలేకపోయారు. చేతికందే దశలో వరిపంట దెబ్బతిందని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. చిప్పగిరి మండలంలోని నేమకల్లు, రామదుర్గం, బెల్డోణ, దౌల్తాపురం నంచర్ల తదితర గ్రామాల్లో పెద్దఎత్తున మెరుపులు, ఉరుములతో వర్షం కురిసింది. నేమకల్లు, కుందనగుర్తి గ్రామాల్లో చెట్లు విరిగి పడ్డాయి. విద్యుత్ అంతరాయంతో మండలంలోని పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పగలు ఎండలు.. సాయంత్రానికి వానలు కర్నూలు అగ్రికల్చర్: ఉమ్మడి కర్నూలు జిల్లాలో శుక్రవారం ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తీవ్ర పెరిగింది. వేడి గాలులకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సాయంత్రం కర్నూలు, అటు నంద్యాల జిల్లాలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. పగలు మహానందిలో 41.5, పాణ్యంలో 41.5, గోస్పాడులో 41.6, దొర్నిపాడులో 41.7, గడివేములలో 41.1, కర్నూలులో 40.4, కోడుమూరులో 40.1 ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం హొళగుంద, ఆలూరు, ఆత్మకూరు, బనగానపల్లె, కొత్తపల్లి, కోవెలకుంట్ల తదితర మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. ఆస్పరిలో పిడుగు పడిన ఘటనలో ఒక ఎద్దు మృతిచెందింది. -
అహోబిలేశుడి సేవలో కేంద్ర మంత్రి
ఆళ్లగడ్డ: అహోబిల లక్ష్మీ నరసింహస్వామి వార్లను కేంద్ర ఆహార పౌరసరఫరాల, శుద్ధ ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం దర్శించుకున్నారు. అహోబిలం చేరుకున్న ఆయనకు ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అహోబిలం క్షేత్రంలోని శ్రీ లక్మీనరసింహస్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించా రు. అనంతరం అర్చకులు స్వామివార్ల శేషవస్త్రం, ప్రసాదాలు అందజేసి వేదశ్వీరచనాలు అందించా రు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా, అహోబిలం దేవస్థాన మేనేజర్ మాధవన్ తదితరులు ఉన్నారు -
జిల్లా అంతటా విజిబుల్ పోలీసింగ్
● జిల్లా కేంద్రంలో ప్రధాన కూడళ్లలో పర్యటించిన ఎస్పీ కర్నూలు: ఏపీ డీజీపీ ఆదేశాల మేరకు పోలీసులు జిల్లా అంతటా ఏకకాలంలో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. గురువారం రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము వరకు అన్ని ముఖ్యమైన రోడ్లు, కూడళ్లల్లో రేడియం జాకెట్లు ధరించి పోలీసులు సరికొత్తగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులు, కూడళ్లలో పర్యటించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు శాంతిభద్రతలను పరిరక్షించేందుకు జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. కర్నూలు నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఉల్చాల వై–రోడ్ జంక్షన్లో ఎస్పీ తనిఖీల్లో పాల్గొన్నారు. అనుమానాస్పద వ్యక్తుల సంచరింపు, అసాంఘిక కార్యకలాపాలపై ఆరా తీశారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీలు చేపట్టారు. వివిధ కాలనీల్లోని ప్రజలతో ముఖాముఖి మాట్లాడి స్థానికంగా ఉంటున్న సమస్యల గురించి పోలీసులు ఆరా తీశారు. ప్రజలతో మమేకం కావడంతో పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసం పెంపొందే వీలుంటుందని ఎస్పీ అభిప్రాయపడ్డారు. కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్, సీఐలు మధుసూదన్‌గౌడ్, నాగరాజరావు తదితరులు కూడా ఎస్పీ వెంట ఉన్నారు. -
బీహార్ సర్పంచ్ల బృందం సందర్శన
కర్నూలు(రూరల్)/పాణ్యం: గార్గేయపురం, కౌలూరు గ్రామాలను శుక్రవారం బీహార్ సర్పంచ్ల బృందం సందర్శించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంటు హైదరా బాద్ వారి అధ్వర్యంలో దాదాపు 55 మంది ఆయా గ్రామాల్లో జరిగిన అభివృద్ధి, గ్రామ సచివాలయ వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలు, గ్రామం నుంచి సేకరించే తడి, పొడి చెత్త నుంచి తయారు అయ్యే సేంద్రి య ఎరువు యూనిట్‌ను పరిశీలించారు. ప్రజలకు ప్రభు త్వం అందజేస్తున్న సేవలపై అడిగి తెలుసుకున్నారు. వారి వెంట ఎన్ఐఆర్డీ అధికారిణి ప్రత్యుష్ణ పట్నాయక్, గార్గేయపురం సర్పంచ్ సోమేశ్వరమ్మ, ఈఓఆర్డీ చంద్రమౌళీశ్వరగౌడ్, జిల్లా ప్రాజెక్టు రిసోర్సుశిక్షకులు గిడ్డయ్య తదితరులు ఉన్నారు. -
నాటుసారా స్థావరాలపై దాడులు
కర్నూలు: కర్నూలు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని గుమ్మితం తండా, గుడుంబాయి తండా గ్రామాల్లోని నాటుసారా స్థావరాలపై ఎకై ్సజ్ అధికారులు విస్తృత దాడులు చేపట్టారు. కర్నూలు స్టేషన్ సీఐ చంద్రహాస్, ఎన్ఫోర్స్మెంట్ సీఐ కృష్ణ, ఎస్ఐ మధు, సిబ్బంది రామలింగయ్య, చంద్రపాల్, చంద్రుడు, వీరన్న తదితరులు బృందాలుగా ఏర్పడి సారా స్థావరాలపై దాడులు చేశారు. గుమ్మితంతండాలో 400 లీటర్ల బెల్లం ఊట, 15 లీటర్ల నాటుసారా, గుడుంబాయి తండా శివారులో 600 లీటర్ల నాటుసారాకు ఉపయోగించే బెల్లం ఊట, 15 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేసి బట్టీలను పగులగొట్టారు. సారాకు వినియోగించే సామాగ్రి, ప్లాస్టిక్ డబ్బులు, బిందెలు, వంట పాత్రలన్నీ స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మీబాయి, లోక్‌నాయక్‌లు కలసి సారా తయారీ చేయిస్తున్నట్లు వెలుగు చూసిందని, వారిని త్వరలో అరెస్టు చేయనున్నట్లు సీఐ తెలిపారు. అనంతరం ఆయా గ్రామాల్లో గ్రామ సభ నిర్వహించి సారా వినియోగం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయనే విషయాలను వివరించారు. నాటుసారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని కోరారు. నవోదయం కార్యక్రమంలో భాగంగా దాడులు ఇకపై విస్తృతంగా కొనసాగుతాయని, సారా తయారీ, విక్రయాలు, రవాణా ఆపకపోతే పీడీ కేసులు నమోదు చేసి శాశ్వతంగా జైలుకు పంపుతామని హెచ్చరించారు. పొలం రస్తా విషయంలో ఘర్షణ.. ఇద్దరికి గాయాలు కోసిగి: మండల కేంద్రం కోసిగిలోని బాలుర ఉన్నత పాఠశాల వెనుక భాగంలో నివాసం ఉంటున్న తిమ్మాపురం ఈరన్న, దళవాయి యల్లయ్య మధ్య పొలం రస్తా విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఇరువురికి గాయాలయ్యాయి. శుక్రవారం ఉదయం పొలంలో రస్తా విషయంలో గొడవ పడగా, అది మనస్సులో పెట్టుకుని రాత్రి ఇంటి ప్రాంగణంలో గొడపడ్డారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇందులో తిమ్మాపురం ఈరన్న మెడకు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కోసిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా.. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం 108లో ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. బెల్టు షాపు నిర్వాహకుడి అరెస్ట్ ఆదోని రూరల్: మండలంలోని పెద్దపెండేకల్ గ్రామానికి చెందిన సుభాన్ అనే వ్యక్తి బెల్టు షాపు నిర్వహిస్తుండగా అరెస్టు చేసినట్లు తాలూకా ఎస్ఐ రామాంజనేయులు శుక్రవారం తెలిపారు. సుభాన్ ఆంధ్రాకు చెందిన మద్యం అక్రమంగా అమ్ముతుండగా పట్టుకున్నామన్నారు. అతని వద్ద నుంచి 180 ఎంఎల్‌ల 25 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసుకుని రిమాండ్‌కు పంపినట్లు చెప్పారు. -
మత్స్య శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు(అగ్రికల్చర్): నగరంలోని దేశీయ మత్స్యశిక్షణా కేంద్రంలో కార్యక్రమం మూడు నెలల పాటు నిర్వహించే శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మత్స్యశాఖ అధికారి రంగనాథబాబు తెలిపారు. చేపల పెంపకంపై ఆసక్తి కలిగిన రాయలసీమ జిల్లాలకు చెందిన యువత సద్వినియోగం చేసుకోవచ్చని పేర్కొన్నారు. మే 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండి 35 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలని, మత్స్య సహకార సంఘాల సభ్యులు, చేపల పెంపకందారులు, లైసెన్స్ దారులు అర్హులేనని పేర్కొన్నారు. 7వ తరగతి ఉత్తీర్ణులై చేపల పెంపకం పట్ల ఆసక్తి ఉన్న వారందరూ దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 29వ తేదీలోపు బంగారుపేటలోని మత్స్యశాఖ అధికారి కార్యాలయానికి పంపాలని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 30న ఇంటర్వ్యూలు నిర్వహించి శిక్షణకు ఎంపిక చేస్తామన్నారు. శిక్షణా కాలంలో నెలకు రూ.1000 ఉపకార వేతనం చెల్లించబడుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని రాయలసీమలోని జిల్లాలకు చెందిన వారు సద్వినియోగం చేసుకోవచ్చని కోరారు. కొలనుభారతిలో ప్రత్యేక పూజలు కొత్తపల్లి: సరస్వతీ క్షేత్రంగా విరాజిల్లుతున్న కొలనుభారతి క్షేత్రంలో శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేటప్టారు. పంచమి మూల నక్షత్రం కావడంతో అమ్మవారిని అలంకరించి పంచసూక్తములతో అభిషేకాలు, కుంకుమార్చనలు, మంగళహారతి వంటి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ పురోహితులు శ్రీనివాస శర్మ అమ్మవారి సన్నిధిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులకు బీజాక్షరాలు రాయించి సుమారు 50 మంది దాక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. పిడుగు పాటుకు ఎద్దు మృతి ఆస్పరి: మండల కేంద్రమైన ఆస్పరిలో శుక్రవారం పిడుగు పాటుకు ఓ ఎద్దు మృతి చెందింది. రైతు మహబూబ్‌బాషా వామి దొడ్డిలో ఎద్దులను కట్టేశాడు. అయితే ఎద్దులకు సమీపంలో పిడుగు పడటంతో ఒకటి అక్కడికక్కడే మృతి చెందగా మరొకటి స్పల్ప గాయాలయ్యాయని తెలిపారు. ఎద్దు మృతి చెందడంతో రైతుకు రూ.60 వేలు నష్టం వాటిల్లింది. మహిళ అదృశ్యం బేతంచెర్ల: పట్టణంలోని శ్రీ నగర్ కాలనీకి చెందిన ఓ మహిళ రెండు రోజులుగా కనిపించడం లేదు. స్థానికంగా నివాసముంటున్న నాగమణి ఓ ప్రైవేటు ఫైనాన్స్ కార్యాలయంలో పని చేస్తోంది. గురువారం ఉదయం ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లి మధ్యాహ్నం తర్వాత బయటకు వచ్చిన మహిళ ఇంటికి రాలేదు. బంధువులు, ఆయా ప్రాంతాల్లో ఆచూకీ కోసం గాలించినా తెలియలేదు. తమ కుమార్తె కనిపించడం లేదని నాగమణి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కేసీ తిరుపాల్ తెలిపారు. -
మహాత్ముల త్యాగమే సమాజ బలం
కర్నూలు కల్చరల్: మహాత్ముల త్యాగమే సమాజ బలమని పలువురు జీయర్ స్వామీజీలు, పీఠాధిపతులు అన్నారు. ఉభయ వేదాంత పండితులు సత్సంప్రదాయ పరిరక్షణ సభ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ శ్రీరంగం నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్య స్వామి శత జయంతి సందర్భంగా గోదా గోకులంలో ఐదు రోజులుగా జరుగుతున్న శ్రీమద్రామాయణ మహా యజ్ఞం శుక్రవారం ముగిసింది. అందులో భాగంగా 2 వేల మందితో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి, త్రిదండి అహోబల రామానుజ జీయర్ స్వామి, త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి, త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామి, ప్రయాగ్‌రాజ్ నుంచి రాఘవ ప్రసన్న జీయర్ స్వామి, శ్రీశ్రీ త్రిదండి శఠగోపముని రామానుజ జీయర్ స్వామి ఆచార్య పరమాత్మానందగిరి స్వామి, విరజానంద స్వామి సందేశం ఇచ్చారు. గోదా గోకులం వ్యవస్థాపక అధ్యక్షులు మారం నాగరాజు గుప్తు, ట్రస్టీ పల్లెర్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా సంగీత యుక్త ఇష్టలింగ మహాపూజ
హొళగుంద: స్థానిక సిద్ధేశ్వరస్వామి ఆలయ ఆవరణలో కాశీ మఠం వారణాసి పీఠాధిపతి మల్లికార్జున శివాచార్య మహా స్వామి ఆధ్వర్యంలో సంగీత యుక్త ఇష్టలింగ మహాపూజ వైభవంగా నిర్వహించారు. బసవేశ్వర జయంతి ఉత్సవాల సందర్భంగా రెండు రోజు శుక్రవారం ఉదయం జరిగిన బృహత్తర కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. సంగీత కార్యక్రమాలు, భజనలు, పూజలతో హొళగుందలో ఆధ్యాత్మిక వా తావరణ నెలకొంది. ఈ సందర్భంగా జగద్గురువు భక్తులనుద్దేశించి మాట్లాడారు. కార్యక్రమానికి జంగమర హొసళ్లికి చెందిన అజాత శంభులింగ శివాచార్య, పాల్తూరు చెన్నవీర శివాచార్య, కొట్టూరు శాకామఠానికి చెందిన మరికొట్టూరు దేశీకేంద్ర మహాస్వాములు, నందీపుర డాక్టర్ మహేశ్వరా శివాచార్య మహాస్వాములు, రౌడకుంద శివయోగి శివాచార్య మహాస్వాములు హాజరయ్యారు. లింగ పూజ పరమ శ్రేష్టం మనసు చెంచలం కాకుండా క్రమశిక్షణ, ఏక్రాగత, ప్రశాంతతకు లింగ పూజ ఎంతో ఉపయుక్తకరంగా ఉంటుందని కాశీ జగద్గురువులు అన్నారు. కుళ్లు కుతంత్రలు వదిలి తమకు చేతనైనంత మేర పేదలకు దాన ధర్మాలు చేస్తే మనశ్శాంతి లభిస్తుందని చెప్పారు. శాంతితో ప్రశాంత జీవనం గడుపుకునేలా జీవితాన్ని తీర్చుకోవాలని ఆయన ఉపదేశం చేశారు. ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకుని మంచి మార్గాల్లో నడవాలన్నారు. నవ సమాజాన్ని నిర్మించుకోవాలని భక్తులకు ఆయన బోధ చేశారు. -
ఉచిత విద్య ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
హొళగుందలో అడ్డ పల్లకీలో ఆశీనులైన కాశీ జగద్గురువు కర్నూలు సిటీ: విద్యాహక్కు చట్టం మేరకు 2025–26 విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులు ఒకటో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ ఎస్.శ్యామూల్ పాల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించారని, వచ్చే విద్యా సంవత్సరానికి ఉచిత విద్యను అందించే జిల్లాలోని అన్ని ప్రయివేట్ పాఠశాలలు ఈ నెల 19 నుంచి 26వ తేది వరకు తమ వివరాలను విద్యాశాఖ వెబ్సైట్ https://cse.ap.gov.in/ లో నమోదు చేసుకోవాలన్నారు. విద్యార్థులు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల డేటా ఆధారంగా వచ్చే నెల 16 నుంచి 20వ తేదీ వరకు విద్యార్థుల ప్రవేశాలకు అర్హతల ఆధారంగా లాటరీ ద్వారా మొదటి విడత సీట్లు కేటాయిస్తామన్నారు. వివరాలను 21 నుంచి 24వ తేదీ మధ్య ప్రకటిస్తామని పేర్కొన్నారు. -
క్రీడలతో మానసిక ఒత్తిడి దూరం
కర్నూలు: పోలీసులు విధి నిర్వహణలో ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు దోహదం చేస్తాయని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. కర్నూలు ఏపీఎస్పీ రెండో బెటాలియన్ మైదానంలో ఏపీఎస్పీ ఎస్డీఆర్ఎఫ్ పోలీసులకు, సివిల్, ఏఆర్ పోలీసుల జట్లకు నిర్వహించిన క్రికెట్ మ్యాచ్‌ను గురువారం డీఐజీ, ఎస్పీ కలిసి ప్రారంభించారు. వారు స్వయంగా క్రికెట్ ఆడి సిబ్బందిని ఉత్సాహపరిచారు. కర్నూలు జిల్లా సివిల్, ఏఆర్ పోలీసుల జట్టుకు డీఐజీ కెప్టెన్‌గా, ఏపీఎస్పీ ఎస్డీఆర్ఎఫ్ పోలీసులకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ కెప్టెన్‌గా వ్యవహరించారు. ఇరు జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ సందర్భంగా డీఐజీ, ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం విధుల్లో ఉండే సిబ్బందికి క్రీడలు నూతనోత్సాహాన్ని ఇస్తాయన్నారు. శారీరక దృఢత్వానికి, ఆరోగ్యానికి క్రీడలు దోహదం చేస్తాయన్నారు. గెలుపు, ఓటములు సహజమన్నారు. ఏపీఎస్పీ రెండవ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ నాగేంద్రరావు, కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, అసిస్టెంట్ కమాండెంట్లు ఎస్ఎం బాషా, సుధాకర్ రెడ్డి, రవికిరణ్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
21నాటికి ప్రోగ్రెస్ కార్డులు అందించాలి
కర్నూలు(సెంట్రల్): జిల్లాలోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మార్కులతో కూడిన ప్రోగ్రెస్ కార్డును ఈనెల 21వ తేదీ నాటికి అందించాలని జేసీ డాక్టర్ బి.నవ్య అఽధికారులను ఆదేశించారు. గురువారం పాఠశాలల ముగింపునకు సంబంధించిన అంశాలపై జేసీ వెబెక్స్ ద్వారా విద్యాశాఖాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోమవారం నుంచే విద్యార్థులను ఉన్నత తరగతులకు ప్రమోట్ చేసి అదే రోజు నుంచి బోధన జరిగేలా చూడాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 4,21,632 మంది విద్యార్థులను ఉన్నత తరగతులకు ప్రమోట్ చేయాలన్నారు. 1,886 అంగన్వాడీ కేంద్రాల నుంచి పూర్వ ప్రాథమిక విద్యను పూర్తి చేసుకొని ప్రాథమిక విద్యలోకి చేరుతుండడంతో వారంతా పాఠశాలల్లో చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షలో డీఈఓ శామ్యూల్‌పాల్ పాల్గొన్నారు. కనిష్ట స్థాయికి ఉల్లి ధర కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లి ధర కనిష్టస్థాయికి పడిపోతుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం అన్ సీజన్ కావడంతో అక్కడక్కడ బావులు, బోర్లు, ఇతర నీటిపారుదల కింద ఉల్లి సాగయింది. కర్నూలు మార్కెట్‌కు ఎనిమిది మంది రైతులు మాత్రమే 479 క్వింటాళ్ల ఉల్లి తెచ్చారు. క్వింటాకు కనిష్టంగా రూ.675, గరిష్ట ధర రూ.879 మాత్రమే లభించింది. సగటు ధర రూ.755 నమోదైంది. జిల్లాకు మహారాష్ట్రలో పండించిన ఉల్లి భారీగా దిగుమతి అవుతోంది. ఉల్లితో పాటు మిర్చి, వాము, వేరుశనగ, శనగ తదితర అన్ని పంటల ధరలు పడిపోయాయి. – క్వింటా మిర్చి ధర రూ.4వేల నుంచి రూ.7వేల వరకు మాత్రమే పలుకుతోంది. రెండు నెలల కిత్రం మిర్చి రైతులకు న్యాయం చేస్తామంటూ హడావుడి చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చివరికి నష్టాలనే మిగిల్చారు. – వాము క్వింటాకు కనిష్టంగా రూ.1880, గరిష్టంగా రూ.21,682 లభించగా.. సగటు ధర రూ.12,699 నమోదైంది. 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు గుర్తింపు కార్డులు కర్నూలు(అర్బన్): జిల్లాలో 60 సంవత్సరాల వయస్సు పైబడిన వయో వృద్ధులు సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్ ఫాతిమా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వార్డు సచివాలయాల పరిధిలోని వారు వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రెటరీ, గ్రామ సచివాలయాల పరిధిలోని వారు డిజిటల్ అసిస్టెంట్లను సంప్రదించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఆధార్‌కార్డు, ఒక పాస్‌పోర్టు సైజ్ ఫొటో తీసుకెళ్లి దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్డుకు పురుషులు 60 సంవత్సరాలకు పైబడి, మహిళలు 58 సంవత్సరాలకు పైబడిన వారు అర్హులన్నారు. గుర్తింపు కార్డుల జారీకి ఎలాంటి ఆన్లైన్ దరఖాస్తులు తమ కార్యాలయంలో స్వీకరించబడవని ఆమె స్పష్టం చేశారు. ముఖ ఆధారిత హాజరులో అవకతవకలు ● ఏడుగురికి చార్జి మెమోలు జారీ కర్నూలు(హాస్పిటల్): వైద్య ఆరోగ్యశాఖలో ముఖ ఆధారిత హాజరులో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఏడుగురి కి చార్జి మెమోలు జారీ చేశారు. ఇందులో ముగ్గురు మెడికల్ ఆఫీసర్లు, ముగ్గురు స్టాఫ్‌నర్సులు, ఒక ఫార్మాసిస్టు ఉన్నారు. వీరు తమ ఐ ఫోన్ ద్వారా హాజరును మార్ఫింగ్ చేశారని, అక్రమాలకు పాల్పడ్డారని రాష్ట్ర ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ మేరకు జాబితాను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.శాంతికళకు పంపించడంతో ఆమె ఏడుగురికి చార్జి మెమోలు పంపించారు. ఈ మేరకు వివరణ ఇచ్చిన వారు సాంకేతిక లోపం కారణంగానే హాజరు తప్పుగా నమోదైందని, ఇందులో తాము కావాలని చేసిందేమీ లేదని వివరణ ఇచ్చినట్లు సమాచారం. వారు ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందకపోతే కాంట్రాక్టు వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని, రెగ్యులర్ వారిని సస్పెండ్ చేయాలని ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. ఎల్లెల్సీకి నీటి సరఫరా బంద్ హొళగుంద: తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)కు ఈ నెల 15వ తేదీ అర్ధరాత్రి నుంచి నీటిమట్టాన్ని తగ్గిస్తూ వచ్చారు. బుధవారం పూర్తిగా నీటి సరఫరాను నిలిపివేశారు. జిల్లా సరిహద్దులోని 250 కి.మీ వద్ద కాలువలో గురువారం నీటి ప్రవాహం కనిపించలేదు. టీబీ డ్యాంలో 105.788 టీఎంసీలకు గాను ప్రస్తుతం 7.037 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాంకు ఇన్‌ఫ్లో ఏమీ లేక పోగా అవుట్‌ఫ్లో 325 క్యూసెక్కులుంది. -
ఆదోనిలో ఎమ్మెల్యే పేరుతో పీఏ, అనుచరుల దందా
● ఇసుక ట్రాక్టర్లు, టిప్పర్లకు నెల మామూళ్లు ఫిక్స్ ● కర్ణాటక నుంచి ఏపీ, తమిళనాడుకు వెళ్లే సరుకు రవాణా వాహనాల నుంచి వసూళ్లు ● మామూళ్లు ఇవ్వని వాహనాలపై అనుచరుల దాడులు, పోలీసు కేసులు ● ప్రత్యేకంగా ఓ ముఠాను నియమించుకున్న ఎమ్మెల్యే సాక్షి ప్రతినిధి కర్నూలు: బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి పేరు చెప్పి ఆయన పీఏ నాగరాజు గౌడ్, అనుచరులు చేస్తున్న అక్రమాలపై ఆదోనిలో టీ అంగళ్లు, హోటళ్లతో పాటు ఎక్కడ నలుగురు కలిసినా ఇదే చర్చ. ఆదోనిలో ఓ ప్రత్యేక ముఠా ఉంది. ఇసుక, కర్ణాటక నుంచి ఏపీ, తమిళనాడుకు ఫ్లయాస్ వెళ్లే లారీలు ఆపి బెదిరిస్తున్నారు. అర్ధరాత్రి ఇసుక సరఫరా చేసే ట్రాక్టర్లు, టిప్పర్లను ఆపి డ్రైవర్లపై దాడులు చేసి మామూళ్ల కోసం బెదిరిస్తున్నారు.అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో రెవె న్యూ, పోలీసులను చెప్పుచేతల్లో పెట్టుకుని వారికి మా మూళ్లు ఇస్తూ, తక్కిన డబ్బు టీడీపీ నేతలు పంచుకుంటూ భారీగా ఆర్జిస్తున్నారు. వీరి దెబ్బకు ఫైనాన్స్‌లో ట్రాక్టర్లు తెచ్చుకుని ఇసుక అవసరం ఉన్న వాళ్లకు ఉచితంగా తోలి, టిప్పునకు రూ.400–500 బాడుగ వస్తే బతుకుతాం’ అనేవాళ్ల కడుపుపై కొడుతున్నారు. దీంతో కడుపు రగిలిన కొందరు డ్రైవర్లు బీజేపీ ఎమ్మెల్యే అనుచరులపై ఎదురు తిరుగుతున్నారు. జరుగుతున్న దందా, రౌడీయిజంపై ధైర్యంగా గళం విప్పుతున్నారు. మున్సిపాలిటీలో ఏ పని చేయాలన్నా 10శాతం కప్పం కట్టాల్సిందే.. ఆదోని మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు టెండర్ వేయాలంటే ముందుగా ఎమ్మెల్యే పీఏతో మాట్లాడాలి. 10శాతం కప్పం కట్టాలి. లేదంటే పనులు చేయలేరు. చేసినా బిల్లులు రావు. గత ప్రభుత్వంలో మొదలై పురోగతిలో ఉన్న పనుల బిల్లులు కూడా ఆపేశారు. వాటి నుంచి కూడా కప్పం చెల్లించుకుని ఆ తర్వాత మంజూరు చేయించారు. పాతబస్టాండ్ వద్ద మునిసిపల్ కాంప్లెక్స్ భవనాన్ని ఇలాగే ఆపేశారు. కాంట్రాక్టర్ వచ్చి డబ్బులు చెల్లించిన తర్వాత తిరిగి పనులకు ‘గ్రీన్‌సిగ్నల్’ ఇచ్చారు. ఈ సర్వేనెంబర్లలో క్రయ విక్రయాలు పూర్తిగా బంద్ ఆదోనిలో ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఉన్న సర్వే నెంబర్ 352లో పూర్తిగా రిజిస్ట్రేషన్లను ఆపేసినట్లు తెలుస్తోంది. 1922లో బ్రిటీష్ ప్రభుత్వంలోని కొందరికి హక్కుగా వచ్చిన భూమి వంశపారపర్యంగా విక్రయిస్తూ వచ్చారు. ఇందులో కొంత తమకు ఇవ్వాలని కూటమి నాయకులు వారిని డిమాండ్ చేశారు. దీనికి భూ యజమానులు ఒప్పుకోకపోవడంతో ఈ భూమి రిజిస్ట్రేషన్లు ఆపేసినట్లు తెలిసింది. అలాగే సర్వే నెంబర్ 444లో కూడా రిజిస్ట్రేషన్లు ఆపేసినట్లు సమాచారం. ప్రతీ శాఖ కార్యాలయంలో ఇక్కడి ప్రజాప్రతినిధి తమ మనుషులను నియమించుకున్నారు. దీంతో రోజు ముఖ్యమైన ఫైళ్లు ఎవి కదులుతున్నాయి? భారీ లావాదేవీల సమాచారం ప్రజాప్రతినిధికి వస్తోంది. ఆ ప్రకారం పీఏ ఫోన్ చేసి లావాదేవీని బట్టి ‘కప్పం’ నిర్ణయిస్తారు. – ఆదోని ఎస్కేడీ కాలనీలో పార్థసారథి సన్నిహితుడు డాక్టర్ రవికిరణ్ 6.71 ఎకరాల భూమిని అక్రమంగా తమ తల్లిపేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీంతో బాధితులు ఆందోళనకు దిగారు. దీంతో రిజిస్ట్రేషన్ రద్దు చేశారు. ప్రైవేటు ఆస్పత్రులకు వేధింపులు: ఆదోనిలో మదర్ అండ్ చైల్డ్ ఆస్పత్రి ఉంది. ఇక్కడ 5గురు డాక్టర్లు ఉన్నారు. నెలకు 500 ప్రసవాలు జరుగుతాయి. ఇది తెలీకుండా అక్కడ రెండు ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) ద్వారా చికిత్స అందించే రెండు ఆస్పత్రులకు ఎక్కువగా కేసులు వెళ్తున్నాయని కలెక్టర్, డీఆర్సీ మీటింగ్‌లో ప్రస్తావించారు. అయితే ఎమ్మెల్యే ఆరోపణల్లో వాస్తవాలు లేవని అధికారులు ఆయన ఫిర్యాదు తేలిగ్గా తీసుకున్నారు. కానీ అధికారుల విచారణలో ఆస్పత్రుల యజమానులను ‘కప్పం’ చెల్లించాలని వేధిస్తే వారు దారికి రాకపోవడంతోనే వేధింపులకు పాల్పడుతున్నారని తేలినట్లు తెలుస్తోంది. నన్ను కొట్టి, ఫోన్ లాక్కుని దౌర్జన్యం చేశారు ‘నా పేరు మహ్మద్ హుస్సేన్. నదీచాగి నుంచి ఇసుక తీసుకొస్తున్నా. రాత్రి ఒంటిగంట తర్వాత బీజేపీ వాళ్లు బండిని ఫాలో అయ్యారు. సాయి, రమాకాంత్, సాయన్న బండి నిలిపారు. నా వద్ద ఉన్న బిల్లు తీసుకుని చించేశారు. అన్‌లోడింగ్‌కు పోతున్నామని చెబుతుంటే మీ ఓనర్ ఎవరు? ఇప్పుడు ఇక్కడికి రమ్మను అని అర్ధరాత్రి చెబుతున్నారు. వారితో 7–10మంది ఉన్నారు. వారు నన్ను కొట్టి బండి ఆపి దౌర్జన్యం చేశారు. ఫోన్ లాక్కున్నారు. మేం డ్రైవర్లు ఏం చేస్తాం అన్నా వినలేదు.’ -
నెలకు రూ.10–15వేలు బీజేపీ ఎమ్మెల్యే మనుషులకు ఇవ్వాలంట
మేం గుడికంబాలి నుంచి ఇసుక తోలుతున్నాం. బతికేందుకు ఫైనాన్స్‌లో ట్రాక్టర్ తెచ్చుకున్నాం. ఒక ట్రిప్పు తోలితే ఖర్చులు పోనూ రూ.400–500 మిగులుతాది. ఇసుక తోలుతుంటే రాత్రి ఒంటిగంటకు, రెండు గంటలకు ట్రాక్టర్లను ఎమ్మెల్యే మనుషులు బీజేపీ వాళ్లు రమాకాంత్, విజయ్, సాయన్న వచ్చారు. నెలకు రూ.10–15వేలు ఇవ్వాలంటున్నారు. టిప్పర్లు అయితే ట్రిప్పుకు రూ.1500 ఇవ్వాలి. లేదంటే పోలీసులకు ట్రాక్టర్ అప్పగిస్తున్నారు. రాత్రంతా స్టేషన్ వద్దే ఉన్నాం. చంద్రబాబు ఇసుక ఫ్రీ అంటున్నారు. ఎక్కడ ఫ్రీ ఉంది చెప్పండి. ఇప్పుడు దీనికి ఏం చెబుతారు?’ – ఇటీవల చిన్నపెండేకల్ వాసి కృష్ణను వేధిస్తే మీడియాతో పంచుకున్న వేదన ఇది -
అక్రమ కేసులతో టీడీపీకి కొమ్ము కాస్తున్నారు!
● వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు ఎలా నమోదు చేస్తారు? ● పోలీసులపై వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆగ్రహం కల్లూరు: అక్రమ కేసులతో టీడీపీకి పోలీసులు కొమ్ముకాస్తున్నారని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి మండిపడ్డారు.టీడీపీ వారితో ఒక రకంగా.. వైఎస్సార్సీపీ నాయకులతో మరో రకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గురువారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాటసాని మాట్లాడారు. కర్నూలు నగరంలోని నాల్గో పట్టణ సీఐ టీడీపీ నాయకులకు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. కల్లూరు అర్బన్ పరిధిలోని 31, 34 వార్డులో జరిగిన సంఘటనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు ఎవరిపై అన్యాయంగా కేసులు బనాయించలేదని గుర్తు చేశారు. టీడీపీ నాయకులకు ఒక న్యాయం, వైఎస్సార్సీపీకి ఒక న్యాయమా అని ప్రశ్నించారు. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండబోదని గుర్తుపెట్టుకొని పోలీసులు ఉద్యోగాలు చేయాలని హితవు పలికారు. అన్నీ అబద్ధాలే ఎన్నికల ముందు తనపై ప్రతిపక్ష నాయకులు అన్నీ అబద్ధాలు ప్రచారం చేశారని కాటసాని అన్నారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలవుతున్నా నిరూపించలేకపోయారన్నారు. జగన్నాథ గట్టుపై కబ్జా చేశానని నంద్యాల ఎంపీ శబరి అబద్ధపు మాటలు చెప్పారన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు ఎవరూ బియ్యం అక్రమ వ్యాపారాలు చేయడం లేదన్నారు. వైన్ షాపులు బార్లను తలపిస్తున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడుపుకుంటుంటే ఎంపీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రేషన్ బియ్యాన్ని ఏవిధంగా పట్టుకున్నారో అదే విధంగా ఎకై ్సజ్ అధికారులను తీసుకొని పోయి వైన్ షాపులపై దాడులు చేయించాలన్నారు. వైన్ షాపుల దగ్గర రోడ్లపై మహిళలు, ప్రజలు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారన్నారు. మాటమీద నిలబడాలి టీడీపీ నాయకులు మాటమీద నిలబడాలని కాటసాని అన్నారు. టీటీడీ గోశాలలో గోవుల మృతిపై టీడీపీ నాయకులు ఇచ్చిన సవాల్‌ను స్వీకరించి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి వస్తానన్నారని, అయితే పోలీసులు ఆయనను హౌస్ అరెస్టు చేయడం ఏమిటన్నారు. ఆవులు చనిపోలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డు చెబుతున్నారని, టీటీడీ ఈఓ మాత్రం 44, టీటీడీ చైర్మన్ అయితే 22 ఆవులు చనిపోయా యని చెబుతున్నారని, ఎవరిది నిజమో తెలియ డం లేదని, పొంతన లేని సమాధానాలు చెబు తున్నారన్నారు. కార్పొరేటర్లు చిట్టెమ్మ, వెంకటేశ్వ ర్లు, లక్ష్మీకాంతరెడ్డి, సాన శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
నేడు 2 వేల భక్తులతో విష్ణు సహస్రనామ పారాయణం
కర్నూలు కల్చరల్: గోదా గోకులంలో శ్రీరామాయణ మహాయజ్ఙం ముగింపు వేడుకల్లో భాగంగా శుక్రవారం 2 వేల మందితో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహిస్తున్నట్లు త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామి తెలిపారు. గురువారం గోదా గోకులంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో స్వామీజీ మాట్లాడుతూ.. సత్సంప్రదాయ పరిరక్షణ సభ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్రీరంగం నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్య స్వామి శత జయంతి వేడుకల సందర్భంగా నాలుగు రోజులు గా గోదాగోకులంలో శ్రీమద్రామాయణ మహా యజ్ఞం అత్యంత వైభవంగా జరుగుతుందన్నారు. రఘునాఽథాచార్య తిరు నక్షత్ర పవిత్ర తిథి సందర్భంగా రామాయణంలోని అంశాలపై ప్రవచుకులచే ప్రసంగాలు ఇప్పించడం జరిగిందన్నారు. శుక్రవారం పలువురు జీయర్ స్వాములు, మఠాధిపతుల సమక్షంలో 2 వేల మందికి పైగా భక్తులచే విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహిస్తున్నామన్నారు. శ్రీమద్రామాయణ ప్రవచన యజ్ఞ సమన్వకర్త డాక్టర్ తొగట సురేష్‌బాబు, హిందీ అధ్యాపకురాలు పార్వతీ, తెలుగు ఉపాధ్యాయిని పసుపులేటి నీలిమ శ్రీమద్రామాయణం విశిష్టతపై ఉపన్యసించారు. సమావేశంలో ప్రయాగ్‌రాజ్ నుంచి రాఘవ ప్రసన్న జీయర్ స్వామీ, త్రిదండి శఠగోపముని రామానుజ జీయర్ స్వామీజీ, శ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ బృందావన రామానుజ జీయర్ స్వామీజీ, గోదా గోకులం వ్యవస్థాప అధ్యక్షులు మారం నాగరాజు గుప్తు, ట్రస్టీ పల్లెర్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
గడ్డి మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
గోనెగండ్ల: గంజిహళ్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఐ విజయభాస్కర్ తెలిపిన వివరాల మేరకు.. గ్రా మానికి చెందిన బోయ కండ్ల వెంకటేష్(70)కు భార్య లక్ష్మి, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వెంకటేష్‌కు గత ఆరేళ్ల నుంచి రెండు కాళ్ల బొటన వేళ్లకు కష్టు వ్యాధి వచ్చింది. అలాగే షుగర్ కూడా ఉంది. దీంతో కాళ్లనొప్పి ఎక్కువై మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపం చెంది ఈనెల 15వ తేదీన రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో గడ్డి మందు తాగి అస్వస్థతకు గురయ్యాడు. భార్య, కుమారులు గమనించి ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బుధవారం కర్నూలుకు తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక గురువారం తెల్లవారు జామున మృతిచెందినట్లు సీఐ తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
దోపిడీకి ‘టెంకాయ’ కొట్టారు
జూపాడుబంగ్లా: తర్తూరు జాతరలో టెంకాయల విక్రయ దారుడు భక్తులను నిలువునా దోపిడీ చేస్తున్నాడు. వేలం పాటలో నిర్ణయించిన నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు విక్రయిస్తూ భక్తుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఈనెల ఒకటోవ తేదీన ఆలయ తాత్కాలిక కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి అధ్వర్యంలో టెంకాయలు, లడ్డూ, కొబ్బరి చిప్పల వేలం పాటలు నిర్వహించారు. పెద్దసైజు టెంకాయ ఒకటి రూ.30 చొప్పున విక్రయించాలని ముందుగానే వేలం పాటదారులకు టెంకాయసైజు చూపించి వేలం పాటలు నిర్వహించారు. నందికొట్కూరు పట్టణానికి చెందిన రాజేష్ రూ.5.90 లక్షలకు పాట దక్కించుకున్నాడు. ఈనెల 6 నుంచి 20వ తేదీ వరకు టెంకాయలు విక్రయించేలా నిర్ణయించారు. విక్రయాల్లో కుళ్లిన కొబ్బరికాయకు మరో కాయ భక్తులకు ఇవ్వాలని, చిన్నసైజు టెంకాయలు అధిక ధరలకు విక్రయించరాదనే నిబంధనలు విధించారు. నిబంధనలను అతిక్రమిస్తే వేలం పాట రద్దు చేసి చెల్లించిన డబ్బులు వెనక్కి ఇవ్వమని తేల్చి చెప్పారు. అయినా నిబంధనలు పట్టించుకోకుండా చిన్న సైజ్ టెంకాయలను రూ. 35కు విక్రయిస్తున్నాడు. టెంకాయ కుళ్లిపోతే మరో టెంకాయ ఇవ్వకుండా, అధికధరలకు టెంకాయలు విక్రయిస్తూ భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నాడు. భక్తులు ఫిర్యాదు చేసినా ఆలయ అధికారు లు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. తర్తూరులో కొబ్బరి కాయల విక్రయాల్లో నిబంధనలు బేఖాతర్ చిన్న సైజ్ కాయలు అధిక ధరకు విక్రయం -
కర్ణాటక మద్యం స్వాధీనం
ఆదోని రూరల్: బైక్‌పై కర్ణాటక మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ సీఐ ఎస్.కె.జె.సైదుల్ గురువారం తెలిపారు. మండలంలోని పెసలబండ గ్రామానికి చెందిన నర్సారెడ్డి, కపటి గ్రామానికి చెందిన ఈడిగ హరిచంద్ర బైక్‌పై 192 కర్ణాటక టెట్రా ప్యాకెట్లను తరలిస్తుండగా పట్టుకున్నామని చెప్పారు. వారి వద్ద నుంచి బైక్, 192 టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అలాగే మద్యం సరఫరా చేసిన పెసలబండ గ్రామానికి చెందిన గిడ్డయ్యపై కూడా కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన ట్లు చెప్పారు. ఎవరైనా అక్రమంగా కర్ణాటక మద్యా న్ని సరఫరా చేసినా, అమ్మినా కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. -
సాతనూరులో ఉపాధి కూలీల హాజరుపై విచారణ
కోసిగి: సాతనూరు గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రోజు వారి పనిదినాలకు వెళ్లే కూలీల సంఖ్య హాజరు శాతాన్ని అధికారులు నేరుగా గ్రామానికి వెళ్లి నమోదు చేశారు. బుధవారం సాక్షి దినపత్రికలో ‘ఉపాధి సిత్రాలు’ కథనం ప్రచురితమైన విషయం విధితమే. ఇందులో సాతనూరు గ్రామంలో 60 నుంచి 70 మందితో దొంగ పేర్లతో మస్టర్లులో నమోదు చేస్తున్నారని ఫిర్యాదు ఉన్నాయి. ఇందుకు స్పందించిన అధికారులు బుధ, గురువారాల్లో గ్రామానికి చేరుకుని నేరుగా కూలీలతో పనులు చేస్తున్న చోటుకు వెళ్లి మస్టర్లు పేర్లు పరిశీలించి హాజరు శాతం చేశారు. ఈ సందర్భంగా బుధవారం రోజు 260 మంది హాజరైనట్లు ఏపీఓ వెల్లడించారు. ఫీల్డు అసిస్టెంట్స్, మేటీలు అక్రమాలకు పాల్పడుతు దొంగ పేర్లుతో మస్టర్లు నమోదు చేస్తే చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే చింతకుంట గ్రామంలో ఈనెల 13, 14, 15వ తేదీలలో గ్రామం నుంచి 480 నుంచి 680 వరకు కూలీలు పనికి వెళ్లుతున్నట్లు మస్టర్లు పేర్లును ఆన్లైన్లోఎంట్రీ చేశారు. ఓకే ఫొటోతో 8 నుంచి 10 మస్టర్లు వరకు పేర్లు మార్పు చేస్తు హాజరు నమోదు చేశారు. ఈ విషయంపై టెక్నికల్ అసిస్టెంట్ మంజు, ఇన్చార్జ్ ఏపీఓ కాలిక్ను వివరణ కోరగా.. పూర్తి స్థాయిలో విచారణ చేసి తప్పుడు పేర్లుతో మస్టర్లు నమోదు చేసిన వాటిని తొలగించి వాస్తవంగా పని చేసిన వారి మాత్రమే ఆన్లైన్ బిల్లు వచ్చేలా ఎంట్రీ చేస్తామన్నారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
డోన్ టౌన్: చెట్టు కొట్టడానికి వెళ్లిన ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడ్డాడు. మల్యాల గ్రా మానికి చెందిన చంద్రశేఖర్ (45) పట్టణంలో నివాసం ఉంటున్నాడు. గురువారం చంద్రశేఖర్, అతని కుమారుడు రమేష్, మరి కొంత మంది కలిసి పట్టణ సమీ పంలోని యు.కొత్తపల్లె గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పొలంలో చెట్టును కొట్టేందుకు కూలీకి వెళ్లారు. కొమ్మ లు కొడుతుండగా పక్కనే ఉన్న విద్యుత్ తీగ తెగి చంద్రశేఖర్‌ను తాకడంతో విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలో పడిపోయాడు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పొలం యజమాని చంద్ర, కూలీలను పనికి తీసుకెళ్లిన నాగరాజు నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని మృతుడు కుమారుడు పోలీసులు ఫిర్యాదు చేశారు. -
సహజ, కృత్రిమంగా మాగిన పండ్లకు తేడాలు...
రంగు.. ● సహజంగా మాగిన పండు కొంత పసుపు, మరికొంత ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి పండు లోపలి భాగం అంతా పరిపక్వంగా ఉంటుంది. ● కృత్రిమంగా మాగిన వాటిలో పండు మొత్తం ఒకే విధమైన కాంతివంతమైన లేత పసుపు కలిగి ఉంటాయి. పైకి మాగినట్లుగా కనిపించినా లోపల అపరిపక్వంగా ఉండి పుల్లగా ఉంటాయి. వాసన.. ● సహజంగా మాగిన పండు కొంత దూరంలో ఉన్నప్పటికీ కమ్మని మామిడి పండు వాసన వస్తుంది. కృత్రిమంగా మాగిన పండును ముక్కుకు దగ్గరగా ఉంచినప్పుడు మాత్రమే మామిడి పండు వాసన వస్తుంది. రుచి.. ● సహజంగా మాగిన పండులో తగినంత చక్కెర శాతం ఏర్పడుతుంది. కావున తియ్యగా రుచిగా ఉంటుంది. కృత్రిమంగా మాగిన పండులో తగినంత చక్కెర శాతం ఏర్పడక తక్కువ తీపిదనం, రుచి లేకకుండా ఉంటాయి. నిల్వ.. ● సహజంగా మాగిన మామిడి పండ్లు మెత్తగా ఉంటాయి. ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ● కృత్రిమంగా మాగిన వాటిలో పండ్ల తొక్క ముడతలు లేకుండా ఉండి గట్టిగా ఉంటాయి. పండు త్వరగా పాడైపోతుంది. తొక్కపై నల్లని చుక్కలు ఏర్పడతాయి. -
ఈదురుగాలుల బీభత్సం
● ఏడు ఎకరాల్లో నేలకొరిగిన అరటితోట ● రూ. 20 లక్షల నష్టం ప్యాపిలి: మండల పరిధిలోని పీఆర్ పల్లె గ్రామంలో గురువారం సాయంత్రం ఈదురుగాలుల బీభత్సానికి అరటితోట నేలకొరిగింది. గ్రామానికి చెందిన ప్రేమసాగర్ రెడ్డి తనుకున్న 10 ఎకరాల్లో అరటి సాగు చేశాడు. మంచి దిగుబడి రావడంతో మరికొద్ది రోజుల్లో పంటకోసేందుకు సిద్ధమయ్యాడు. అయితే గురువారం సాయంత్రం ఒక్కసారిగా వీచిన ఈదురుగాలులు బీభత్సాన్ని సృష్టించాయి. దీంతో ఏడు ఎకరాల్లో అరటి చెట్లు నేలకొరిగాయి. ఎకరాకు రూ.1.5 లక్షల పెట్టుబడి పెట్టి పంట సాగు చేసినట్లు రైతు వాపోయాడు. ప్రస్తుతం వచ్చిన దిగుబడిని విక్రయిస్తే దాదాపు రూ.20 లక్షల ఆదాయం వచ్చేదని తెలిపాడు. -
కార్బైడ్‌తో మాగిస్తే శిక్ష...
● ఇథిలీన్ వాయువుతో మంచి ఫలితం ● కాల్షియం కార్బైడ్‌తో మాగిస్తే ప్రజల ఆరోగ్యంపై ప్రభావం ● జిల్లా ఉద్యానశాఖ అధికారి రామాంజనేయులుకర్నూలు(అగ్రికల్చర్): ఏటా వేసవిలో అందరినీ ఊరించే పండు మామిడి. జూన్ వరకు మార్కెట్లో మామిడిదే పైచేర ుు. సంపన్నులైనా.. సామాన్యులైనా.. మామిడి రుచిని ఆస్వాదించాల్సిందే. బంగినపల్లి (బేనీసా) రకం మామిడి అంటే దానికి ఉన్న డిమాండే వేరు. మామిడి ఇప్పుడిప్పుడే మార్కెట్లో పసుపుపచ్చగా కనువిందు చేస్తోంది. రంగు బాగా ఉంది కదాని తింటే అనారోగ్యాలను కొని తెచ్చుకోవాల్సిందే. ప్రఽమాదకరమైన కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగించి మాగిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మామిడి ఆరోగ్యకరమైన పద్ధతుల ద్వారా మాగించాల్సిన అవసరం ఉందని కర్నూలు జిల్లా ఉద్యానశాఖ అధికారి పి.రామాంజనేయులు తెలిపారు. ఈ ఏడాది మామిడి దిగుబడులు ఒక మోస్తరుగా ఉన్నాయని వీటిని ఆరోగ్యవంతమైన పద్ధతిలో మాగించుకుంటే మంచి డిమాండ్, ధర లభిస్తుందని తెలిపారు. మార్కెట్లో మామిడి పండ్లు కొనుగోలు చేసే ముందు సూక్ష్మంగా పరిశీలించాలన్నారు. పండ్లు కొనేటప్పుడు, తినేటప్పు డు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కార్బైడ్‌కు ప్రత్యామ్నాయంగా పండ్లు మాగించే పద్ధతులను వివరించారు. పండ్లు ఎలా మాగుతాయి... సాధారణంగా పండ్లు పక్వానికి వచ్చినప్పుడు ప్రకృతి సిద్ధంగా పండ్ల నందు ఉత్పత్తి అయ్యే ఇథలీన్ వల్ల మాగడం జరుగుతుంది. ఇథలీన్ పండు పక్వానికి వచ్చినప్పుడు దాని నిర్మాణ, రంగు, రుచి వంటి మార్పులకు ఉపయోగపడుతుంది. ● తప్పని పరిస్థితుల్లో కాయలు మాగబెట్టుటకు ఎథిలిన్ వాయువు 100 పీపీఎం మాత్రమే ఉపయోగించాలి. 100 పీపీఎం ఎథిలిన్ వాయువు 24 గంటలు తగిలేటట్లుగా ఉంచితే 5 రోజులలో సహజత్వానికి దగ్గరగా ఎలాంటి హాని లేకుండా మాగుతాయి. ● ఇంటిలో అయితే మాగని కాయల్లో కొన్ని మాగిన పండ్లను గాలి చొరవ డబ్బాలో ఉంచాలి. పక్వానికి వచ్చిన కాయలను ఒక రూములో వరిగడ్డి లేదా బోదగడ్డిలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల సహజ సిద్ధంగా మాగుతాయి. కొనేటప్పుడు ఇలా చూడాలి.. సీజన్ రాకముందే అపరిపక్వముగా ఉండి కృత్రిమంగా మాగబెట్టిన రంగు వచ్చేటట్లు చేసిన పండ్లు కొనరాదు. రంగు చూసి మోసపోరాదు. సీజన్లో పండ్లు పరిపక్వత చెంది సహజముగా మాగినపండ్లు కొనడం ఆరోగ్యదాయకం. తినేటప్పుడు ఇలా చేయాలి.. పండ్లను ముందుగా ఉప్పు కలిపిన నీటిలో 15–20 నిముషాలు ఉంచి, తిరిగి వాటిని మంచినీటిలో కడిగి తడి లేకుండా తుడిచిన తర్వాత వాటిని తినాలి. లేదా ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి. సాధ్యమైనంత వరకు పండ్ల తొక్కను తీసి తినడం మంచిది. ఆహార సురక్షణ ప్రమాణాల చట్టం–2006 ప్రకారం కార్బైడ్ వాడి పండ్లు మాగబెట్టిన వారికి, అమ్మే వారికి ఒక ఏడాది జైలు శిక్ష, మూడు లక్షల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. కార్బైడ్ వాడిన పండ్లను తినడం వల్ల అనేక వ్యాధులు, ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఈ విషయంశాసీ్త్రయంగా నిర్ధారణ అయింది. -
దురలవాట్లకు దూరంగా ఉండాలి
కర్నూలు: హోంగార్డులు దురలవాట్లకు దూరంగా ఉండి క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ మహేష్ కుమార్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని హోంగార్డు కార్యాలయంలో బుధవారం రాయలసీమ జిల్లాల (8 జిల్లాలు) హోంగార్డు ఇన్చార్జి పోలీసు అధికారులతో మహేష్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోంగార్డుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టి వారు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అందరికీ ఒకే విధమైన నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. విధి నిర్వహణలో మృతిచెందిన వారి ప్లిలలకు కారుణ్య నియామకాల ఉద్యోగాలు, ఎక్స్‌గ్రేషియా త్వరితగతిన పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. హోంగార్డు ఇన్చార్జిలు, ఆర్ఐలు వారి విధులు సక్రమంగా నిర్వర్తించాలన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ రాఘవేంద్ర, హోంగార్డ్స్ డీఎస్పీలు కేవీవీ ఎస్వీ ప్రసాద్, కేజేఎం చిరంజీవి, భాస్కర్ రావు, ఆర్ఐ జావెద్, హోంగార్డ్స్ ఆర్ఐలు సోమశేఖర్ నాయక్, పోతల రాజు తదితరులు పాల్గొన్నారు. సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ -
మద్యం బాబులకు కిక్కు దిగేలా జరిమానా
కర్నూలు: పోలీసు తనిఖీల్లో పట్టుబడిన మందుబాబులకు కిక్కు దిగేలా న్యాయస్థానం జరిమానా విధిస్తోంది. మద్యం మత్తులో వాహనాలు నడపటం వల్లే ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కవయ్యాయని భావించిన పోలీసులు జిల్లా అంతటా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు విస్తృత్తం చేశారు. నిబంధనలు పాటించకుండా మద్యం సేవించి వాహనం నడిపిన వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నారు. గతంలో ఒక్కొక్కరికి రూ.3 వేలు జరిమానా విధించిన న్యాయస్థానం మందుబాబుల్లో మార్పు రావడం లేదని గుర్తించి రూ.10 వేలు జరిమానా విధించారు. మూడవ పట్టణ పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌లో ఐదుగురు మందు బాబులు పట్టుబడ్డారు. బుధవారం వారిని కోర్టులో హాజరుపర్చగా ఒక్కొక్కరికి రూ.10 వేలు జరిమానా విధిస్తూ కర్నూలు జేఎఫ్‌సీఎం కోర్టు జరిమానా విధించింది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజాశాంతికి భంగం కలిగించిన 18 మందిపై ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేసి కోర్టు ఎదుట హాజరుపర్చగా ఒక్కొక్కరికి రూ.1000 జరిమానా విధించింది. ఒక్కొక్కరికి రూ.10 వేలు విధిస్తూ న్యాయస్థానం తీర్పు -
డీజిల్ దొంగలు దొరికారు
● 11 మంది అరెస్ట్.. మరో ముగ్గురు పరారీ ● రూ.10.35 లక్షల నగదు, 350 లీటర్ల డీజిల్, నాలుగు వాహనాలు స్వాధీనం ● ముఠా సభ్యులంతా తెలంగాణ వాసులే ఆదోని అర్బన్: గత ఎనిమిదేళ్ల నుంచి డీజిల్ చోరీని వృత్తిగా ఎంచుకున్న ముఠా సభ్యులు ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డారు. బుధవారం సిరుగుప్ప చెక్ పోస్టు వద్ద అనుమానాస్పదంగా ఉన్న 11 మంది దొంగలను ఆదోని వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా డీజిల్ దొంగలుగా తేలింది. ఈ మేరకు ఆదోని డీఎస్పీ హేమలత, ఆదోని వన్‌టౌన్ సీఐ శ్రీరామ్ మీడియా ఎదుట నిందితులను హాజరుపరిచారు.. తెలంగాణ రాష్ట్రం నారాయణ పేట ప్రాంతానికి చెందిన రమేష్‌నాయక్ అలియాస్ చోటా నాయక్, పాండు నాయక్, పాపా నాయక్, రవి నాయక్, మహేష్ నాయక్, కిషన్ నాయక్, పాల్తియారవి నాయక్ అలియాస్ బిల్లా రవి, సభావత్ రవి నాయక్, చావన్సురేష్ నాయక్ అలియాస్ దేశముదురు, వర్త కిషన్ నాయక్, రవికుమార్ రాథోడ్‌లు కలిసి డీజిల్ చోరీని వృత్తిగా ఎంచుకున్నారు. దొంగలించిన డీజిల్‌ను ఇతర ప్రాంతాల్లో విక్రయించగా వచ్చిన డబ్బుతో జల్సాలకు పాల్పడేవారు. డీజిల్ చోరీకి నాలుగు వాహనాలను వినియోగిస్తూ ఎక్కడైనా పార్కింగ్‌లో లారీలను ఆపిన చోటుకు వాహనాల్లో వెళ్లి డీజిల్ దొంగతనం చేసి కార్లలో తరలించేవారు. ఇలా మొత్తం డీజిల్ దొంగతనంలో 10,620 లీటర్లు దొంగతనం చేసినట్లు విచారణలో తేలింది. గత నెల మార్చి 11వ తేదీన సర్దార్‌బాషా, ఈనెల 8వ తేదీన మైల రామకృష్ణ, సయ్యద్సమీర్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశామన్నారు. నెల రోజులుగా ఈ ముఠాను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామన్నారు. బుధవారం అందిన సమాచారం మేరకు సీఐ శ్రీరామ్, సిబ్బందితో కలిసి స్థానిక సిరుగుప్ప చెక్‌పోస్టు వద్ద 11 మందిని అరెస్టు చేశారని తెలిపారు. వారి నుంచి రూ.10,30,140 నగదు, 350 లీటర్ల డీజిల్, నాలుగు వాహనాలు (కార్లు), 10 ఖాళీ క్యాన్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు. వీరిపై వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో నాలుగు, టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఒకటి, ఆలూరు పోలీస్‌స్టేషన్‌లో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయన్నారు. కేసును త్వరితగతిన చేధించిన పోలీసులను డీఎస్పీ అభినందించారు. -
మాదక ద్రవ్యాల దుష్ఫలితాలపై విస్తృత ప్రచారం
● పోలీస్ స్టేషన్లు, గ్రామాల్లో క్యూఆర్ కోడ్ స్కానర్ వాల్ పోస్టర్లు కర్నూలు: మాదక ద్రవ్యాల దుష్ఫలితాల గురించి జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాలైన డ్రగ్స్, గంజాయి వంటివి ఆయా ప్రాంతాల్లో అక్రమంగా పండిస్తున్నా, విక్రయిస్తున్నా దుర్వినియోగానికి పాల్పడుతున్నా ఆ సమాచారం తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్‌ను పోలీస్స్టేషన్లు పబ్లిక్ ప్రదేశాల్లో అతికించి ప్రజలు, యువకులు మొబైల్స్ నుంచి క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేయించి సమాచారం సేకరిస్తున్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత ఆయా ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల గురించి సమాచారం తెలిసినట్లయితే క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా తెలియజేయాలని ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు. పిడుగు పడి మహిళ మృతి చిప్పగిరి: పిడుగు పడి ఓ మహిళ మృతి చెందిన సంఘటన ఏరూరు గ్రామంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రజియాబీ (50) గ్రామ సచివాలయం పక్కన ఉన్న పొలాల్లో ఆరబోసిన మిరపకాయలు సంచులకు ఎత్తుతుండగా ఒక్క సారిగా ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షం పడింది. అదే సమయంలో సమీపంలో పిడుగు పడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి ఐదుగురు కుమార్తెలు, కుమారుడు, భర్త ఉన్నారు. తహసీల్దార్ ఇజాజ్ అహ్మద్ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. బియ్యం గోడౌన్ సీజ్ పాణ్యం: మండల కేంద్రం పాణ్యం సమీపంలోని గోరుకల్లు తండాలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచిన లక్ష్మానాయక్‌కు చెందిన గోడౌన్‌ను సీజ్ చేశారు. బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో గోరుకల్లు తండాలోని గోడౌన్‌ను ఎంపీ శబరి ఎస్ఐ నరేంద్రకుమార్‌రెడ్డి, రెవెన్యూ అధికారులతో చేరుకుని తనిఖీ చేశారు. దాదాపు 500 బస్తాల వరకు రేషన్ బియ్యం ఉండటంతో వెంటనే గోడౌన్, బియ్యాన్ని సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారిలో పడుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. క్షేత్ర స్థాయిలో రెవెన్యూ, సివిల్ సప్లయి అధికారుల పర్యవేక్షణ లోపించడంతో బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరులుతుందన్నారు. అనంతరం మేకల బండ వద్ద ఉన్న రేకుల షెడ్డును పరిశీలించారు. అక్కడి నుంచి తమ్మరాజుపల్లె సమీపంలో ఉన్న రైస్‌మిల్లును తనిఖీ చేశారు. ఎంపీ వెంట సివిల్ సప్లయి డైరెక్టర్ మహేష్ నాయుడు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
డ్రోన్ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
కర్నూలు కల్చరల్: యువత డ్రోన్ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని క్లస్టర్ యూనివర్సిటీ ఇన్చార్జ్ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వి. వెంకట బసరావు అన్నారు. హైదరాబాద్ ఐఐటీ, తిహాన్ ఫౌండేషన్, కర్నూలు ఐఐటీ డీఎం ఆధ్వర్యంలో క్లస్టర్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన నైపుణ్యాభివృద్ధిపై శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం వీసీ ప్రారంభించి మాట్లాడారు. నేటి తరం విద్యార్థులు ప్రతి ఒక్కరు డ్రోన్ నైపుణ్యం కలిగి ఉండడం వల్ల మంచి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయన్నారు. వందల ఎకరాల్లో డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన కంపెనీని స్థాపించడం ఇక్కడి విద్యార్థులకు వరమన్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈనెల 20వ తేదీ వరకు జరిగే శిక్షణలో 50 మంది ఎస్సీ విద్యార్థులకు ‘రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్ –డ్రోన్స్’ అనే అంశంపై, ఇతర కులాలకు చెందిన 50 మంది విద్యార్థులకు ‘బూట్ క్యాంప్ డ్రోన్ టెక్నాలజీ’ అనే అంశంపై శిక్షణ ఉంటుందన్నారు. వర్సిటీ సిల్వర్ జూబ్లీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీఎస్ కుమార్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ దేవికా రాణి మాట్లాడారు. డాక్టర్ మొహమ్మద్ వాయిజ్, డాక్టర్ ఎం.పద్మావతి, లక్ష్మణ గుప్త శిక్షణ కన్వీనర్లుగా వ్యవహరించారు. వర్సిటీ డీన్ అక్తర్ బాను, ట్రిపుల్ ఐటీ అధ్యాపకులు డాక్టర్ పి.కిషోర్, తదితరులు పాల్గొన్నారు. -
ఆయకట్టులో పారింది కన్నీళ్లే!
సమావేశాల్లో ఎవరేమన్నారంటే ... ● దివ్యాంగుల పెన్షన్ల వెరిఫికేషన్ వల్ల ప్రజల్లో భయాందోళనలు ఉన్నాయి. గతంలో ఇచ్చిన సదరం సర్టిఫికెట్ ఆధారంగానే పెన్షన్లు మంజూరు చేశారు కదా, ఇప్పుడెందుకు వెరిఫికేషన్ చేస్తున్నారు.మేజర్, మైనర్ మినరల్స్‌కు ఒకే రకమైన నిబంధనలు విధించడం వల్ల మైనర్ మినరల్స్ చాలా ఇబ్బంది పడుతున్నాయి. – జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి ● రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది కావస్తోంది. కొత్త పెన్షన్లు ఎప్పుడిస్తారు. – సుంకన్న, వెల్దుర్తి జెడ్పీటీసీ ● పచ్చ చొక్కాల వారికే మినీ గోకులాలను మంజూరు చేస్తున్నారు. పశువులు ఉన్న రైతులకు మంజూరు చేస్తే బాగుంటుంది. – బి.పులికొండనాయక్, తుగ్గలి జెడ్పీటీసీ ● ముచ్చుమర్రి నుంచి ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్‌కు నీటిని నందికొట్కూరు ఊరుబయట నుంచి తీసుకువెళ్లాలి. ఊర్లో పైప్లైన్లు వేస్తే తాగునీటికి సంబంధించిన సిస్టమ్ డిస్టర్బ్ అయ్యే ప్రమాదం ఉంది. ట్రాఫిక్, వ్యాపారాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. – పి.జగదీశ్వరరెడ్డి, జూపాడుబంగ్లా జెడ్పీటీసీ ● గడివేముల–బూజనూరు రోడ్డును బాగు చేయండి. – గడివేముల జెడ్పీటీసీ ఆర్బీ చంద్రశేఖర్రెడ్డికేసీ, తెలుగుగంగ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో అందని నీరు ● జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాల్లో చైర్మన్ పాపిరెడ్డి ● ఉమ్మడి జిల్లా తాగునీటి అవసరాలకు రూ.1.54 కోట్ల జెడ్పీ నిధులు ● జెడ్పీ ముందున్న హోర్డింగ్స్ తొలగింపుకు ఆమోదం ● కోరం లేక 4, 5, 6 స్థాయీ సంఘాలు వాయిదాకర్నూలు(అర్బన్): ‘‘కేసీ కెనాల్, తెలుగుగంగ నుంచి పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయకపోవడం వల్లే ఆయకట్టు రైతులు నష్టపోయారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కేసీ కెనాల్ కింద లక్ష ఎకరాలకు, తెలుగుగంగ కింద 84 వేల ఎకరాలకు నీరిచ్చామని అధికారులు చెబుతున్నారు. ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరు అందిస్తే రైతులు ఎందుకు ఇబ్బంది పడతారు. రైతుల కష్టాలను పత్రికలు ప్రధానంగా ప్రచురించాయి. ఆ కథనాలు అవాస్తవమా?’’ అని జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేఆర్ఎంబీ నిబంధనల మేరకు కొంత ఒడిదుడుకుల మధ్య నీటిని అందించామని ఇరిగేషన్ అధికారులు చెప్పిన సమాధానం పట్ల చైర్మన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ మినీ సమావేశ భవనంలో జరిగిన స్థాయీ సంఘ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. శ్రీశైలంలో నీటి మట్టం 854 అడుగుల కంటే తక్కువ ఉన్న సందర్భాల్లో తెలంగాణ ప్రభుత్వం పవర్ జనరేట్ చేయరాదనే అంశాన్ని కేఆర్ఎంబీ సమావేశంలో ప్రభుత్వం ద్వారా ఎందుకు చెప్పించలేకపోయారని ప్రశ్నించారు. జూరాల నుంచి 1700, సుంకేసుల నుంచి 300 టీఎంసీలు (మొత్తం 2 వేల టీఎంసీలు) శ్రీశైలానికి వెళ్లినా, మనం ఉన్న రిజర్వాయర్లలో ఎందుకు నీటిని నిల్వ చేసుకోలేకపోయామరు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గడిచిన స్థాయీ సంఘ సమావేశాల్లో చర్చించిన నేపథ్యంలోనే గాజులదిన్నె ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయడం వల్ల కోడుమూరు, తదితర ప్రాంతాల రైతులు, ప్రజలకు ఎంతో ఉపయోకరంగా ఉందన్నారు. తాగునీటి అవసరాలకు జెడ్పీ నిధులు రూ.1.54 కోట్లు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రస్తుత వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు జిల్లా పరిషత్ నుంచి రూ.1.54 కోట్లను మంజూరు చేస్తున్నట్లు జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి 46 పనులను గుర్తించి మంజూరు చేశామన్నారు. ఈ పనులను మే నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లను ఆయన కోరారు. మొత్తం పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్‌కు 352 పనులు కేటాయించామని, ఇందులో ఇప్పటి వరకు 21 పూర్తయ్యాయని, మిగిలిన 331 పనులను జూన్, జూలై నాటికి పూర్తి చేయాలన్నారు. జెడ్పీ ముందున్న హోర్డింగ్స్ తొలగింపునకు ఆమోదం జిల్లా పరిషత్ భవనం ముందు భాగాన ఉన్న హోర్డింగ్స్‌ను తొలగించేందుకు జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాల్లో సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ హోర్డింగ్స్‌కు సంబంధించి ఒక చదరపు అడుగు రూ.212 ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇదే ఏడాది జూన్ 30వ తేదీ వరకు చెల్లించాలని జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాల్లో తీర్మానం చేశారు. అయితే హోర్డింగ్స్ ఏజెన్సీ ఒక చదరపు అడుగుకు రూ.100 మాత్రమే చెల్లించగలమని చెప్పడం వల్ల ఈ నెల 16వ తేది వరకు ఒక చదరపు అడుగుకు రూ.212 ప్రకారం చెల్లించి హోర్డింగ్స్ తీసివేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కోరం లేక 4, 5, 6 స్థాయీ సంఘ సమావేశాలు వాయిదా జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించేందుకు అవసరమైన కోరం (సభ్యులు) లేకపోవడం వల్ల విద్య, వైద్యం, మహిళా శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమం ( 4,5,6 ) శాఖలకు సంబంధించిన స్థాయి సంఘ సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి ప్రకటించారు. మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల గైర్హాజరుజిల్లా పరిషత్ పరిధిలోని ఏడవ స్థాయీ సంఘంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, ఒకటవ స్థాయీ సంఘంలో న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఉన్నారు. మిగిలిన ఐదు స్థాయీ సంఘాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉన్నారు. అయితే బుధవారం జరిగిన జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలకు ప్రజా ప్రతినిధులతో పాటు మెజారిటీ జెడ్పీటీసీ సభ్యులు కూడా హాజరు కాకపోవడం గమనార్హం. -
ఉమ్మడి జిల్లాకు 80 డ్రోన్లు
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాకు 80 డ్రోన్లు మంజూరయ్యాయి. కర్నూలు జిల్లాకు 40, నంద్యాల జిల్లాకు 40 ప్రకారం కేటాయించారు. టీడీపీ కార్యకర్తలతో ఏర్పాటైన ఎఫ్ఎంబి కిసాన్ డ్రోన్ గ్రూపులకు మంజూరు చేస్తోంది. వీటిని సరఫరా చేసేందుకు డ్రోగో, విహంగ కంపెనీలను ఎంపిక చేసింది. డ్రోగో కంపెనీ డ్రోన్ పూర్తి ధర రూ.9.80 లక్షలు, విహంగ కంపెనీ డ్రోన్ ధర రూ.9.81 లక్షలు ఉంటుంది. ఇందులో ప్రభుత్వం 80 శాతం సబ్సిడీ ఇస్తుంది. అయితే 50 శాతం మొత్తానికి బ్యాంకులు రుణాలు ఇస్తాయి. మిగిలిన 50శాతం కిసాన్ డ్రోన్ గ్రూపులు భరిస్తాయి. ఎఫ్ఎంబీ కిసాన్ డ్రోన్ గ్రూపులో 5గురు సభ్యులు ఉంటాయి. గ్రూపు సభ్యులు పైలెట్‌గా ఎంపిక చేసుకొన్న వారికి ప్రభుత్వం ఇప్పటికే శిక్షణ ఇచ్చింది. డ్రోన్ల సామర్థ్యం 25 లీటర్లు ఉంటుందని వ్యవసాయ అధికారులు తెలిపారు. సీయూలో పీజీ పరీక్షలు కర్నూలు కల్చరల్: క్లస్టర్ యూనివర్సిటీ (సీయూ) పరిధిలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ (పీజీ) నాల్గో సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలను బుధవారం వర్సిటీ ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ వి. వెంకట బసరావు పరిశీలించారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. రిజిస్ట్రార్ డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ నాగరాజ్ శెట్టి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ బాల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ పాలక వర్గాల ఏర్పాటుకు ప్రతిపాదనలు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని ఎమ్మిగనూరు, పత్తికొండ వ్యవసాయ మార్కెట్ కమిటీలకు త్వరలో పాలక వర్గాలు ఏర్పాటు కానున్నాయి. జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇది వరకు కూటమి ప్రభుత్వం మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పూర్తి స్థాయి పాలక వర్గాల ఏర్పాటుకు మార్కెటింగ్ శాఖ ప్రతిపాదనలు పంపింది. ఎమ్మిగనూరు మార్కెట్ కమిటీకి కురువ మల్లేష్, పత్తికొండ మార్కెట్ కమిటీకి ఎస్.నబీసాహెబ్ చైర్మన్లుగా నియమితులు కానున్నారు. వైస్ చైర్మన్, పాలక వర్గం సభ్యులతో జీవోల కోసం ప్రతిపాదనలు పంపినట్లు మార్కెటింగ్ శాఖ ఏడీ నారాయణ మూర్తి తెలిపారు. జల్‌జీవన్ పనుల పరిశీలన మద్దికెర: కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1.84 కోట్ల నిధులతో మద్దికెరలో చేపట్టిన జల్‌జీవన్ మిషన్ పనులను కేంద్ర బృందం సభ్యుడు మాదేశ్వరన్ బుధవారం పరిశీలించారు. ట్యాంకు త్వరలో పనులు పూర్తి చేసి నీటిని అందిస్తారని తెలిపారు. గ్రామీణ ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడకుండా జల్‌జీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు మంజూరు చేస్తోందని తెలిపారు. ఈయన వెంట ఆర్డబ్ల్యూఎస్ డీఈ ఎండీ ఖాన్, ఏఈ మయాంక్, ఈఓఆర్డీ మద్దిలేటిస్వామి, సచివాలయ ఏఈలు విష్ణు, చంద్రశేఖర్, బండారి ఆంజనేయులు ఉన్నారు.