
వివాహిత బలవన్మరణం
నందవరం: క్షణికావేశంతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జోహరాపురం గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ కేశవ తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కురవ శంకర్‌తో కొన్నేళ్ల క్రితం మెరుగుదొడ్డికి చెందిన కురవ మల్లేశ్వరి(34)కి వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. శంకర్ మూడేళ్ల క్రితం గంగవరం గ్రామ సమీపంలో 1.88 ఎకరాల పొలాన్ని కొనుగోలు చేశాడు. అయితే ఆ పొలానికి రస్తా లేకపోవడంతో మల్లేశ్వరి తరచూ భర్తతో గొడవ పడేది. శుక్రవారం ఉదయం కూడా వారి మధ్య ఈ విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. మన స్తాపం చెందిన మల్లేశ్వరి అదే రోజు రాత్రి పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోవడంతో భర్త గమనించి చికిత్స నిమిత్తం వెంటనే ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మల్లేశ్వరి మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతురాలి సోదరుడు రుద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.
వెరిటాస్ సైనిక్ స్కూల్‌కు భారత ప్రభుత్వ అనుమతి
తిరుపతి కల్చరల్: తిరుపతిలో గత 22 ఏళ్లుగా బీఎస్‌ఆర్ విద్యాసంస్థల ద్వారా క్రమశిక్షణతో కూడి విద్యతో పాటు వేలాది మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇటు విద్యార్థుల ఉన్నతికి, దేశ రక్షణకు అందిస్తున్న సేవలను గుర్తించి భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సైనిక్ స్కూల్ అనుమతి పొందడం జరిగిందని వెరిటాస్ సైనిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ బి.శేషారెడ్డి తెలిపారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ విద్యాసంస్థల ద్వారా ఇప్పటికే సుమారు 20 వేల మంది విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంతో పాపటు 6 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. వెరిటాస్ సైనిక్ స్కూల్ స్థాపించినప్పటి నుంచి అనుభజ్ఞులైన వారిచే అత్యుత్తమమైన విద్యాప్రమాణాలతో విద్యార్థులకు విద్యతో పాటు శారీరక మానసిక, మానవీయ విలువలతో కూడిన విద్యను అందస్తూ ఆదరణ పొందామన్నారు. భారత ప్రభుత్వం గుర్తింపుతో మరింత బాద్యతగా దేశ భద్రత కోసం వెరిటాస్ సైనిక్ స్కూల్ ముందడుగు వేస్తోందన్నారు. విద్యాసంస్థలో ప్లస్–1 ఇంటర్ మీడియట్‌తో స్పెషల్ ఎన్‌డీఏను ప్రారంభిస్తున్నామని, ఈ అవకాశాన్ని ఆసక్తి ఉన్నవారి సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సమావేశంలో వైరిటాస్ సైనిక్ స్కూల్ డైరెక్టర్లు బి.శ్రీకర్‌రెడ్డి, బి.సందీప్‌రెడ్డి పాల్గొన్నారు.

వివాహిత బలవన్మరణం