Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Ex Minister Gudiwada Amarnath Key Comments Over TDP And Rishikonda
‘ప్రభుత్వ ఆస్తుల్ని జగన్‌కు ఎలా అంటగడతారు?’

సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ ఆస్తుల విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని.. రుషికొండ నిర్మాణాలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి చెందినవిగా చూపించేందుకు టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌. టీడీపీ అనుకూల మీడియాలో జరుగుతున్న విష ప్రచారంపై సోమవారం విశాఖలో అమర్నాథ్‌ మాట్లాడారు.. ‘‘వైఎస్సార్‌సీపీ, వైఎస్‌ జగన్‌ను బద్నాం చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్‌.. ఎవరు వచ్చినా ఉండేలా నిర్మాణాలు చేపట్టింది. రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ విశాఖ వచ్చిన సందర్భంలో రుషికొండ భవనాలను వినియోగించుకోవాలి. రుషికొండపై కట్టిన భవనాల్లో వైఎస్‌ జగన్‌ ఏమీ ఉండరు. ప్రారంభించిన భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేయాలి... నాలుగు నెలలు క్రితమే రుషికొండ భవనాలను ప్రారంభించాం. విశాఖను రాజధానిగా ప్రకటన చేసిన తర్వాత రుషికొండ నిర్మాణంపై ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేశారు. కమిటీ ఒకే అన్న తరువాతే రుషికొండ భవనాలను నిర్మించారు. టీడీపీ నేతలు వైఎస్ జగన్ మీద, వారి కుటుంబం మీద బురద జల్లాలని చూడటం ఎంతవరకు సమంజసం? అని అమర్నాథ్‌ ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: రుషికొండ ప్రభుత్వ భవనాలపై విషం కక్కుతున్న టీడీపీ అండ్‌ కో..ఆక్రమణలు జరిగింది రుషికొండలో కాదు.. గీతం యూనివర్సిటీలో జరిగాయి. గీతం యూనివర్సిటీ భూ ఆక్రమణలను గంటా శ్రీనివాసరావు చూపిస్తే బాగుండేది. అమరావతిలో చంద్రబాబు తాత్కాలిక భవనాలు నిర్మిస్తే, వైఎస్ జగన్ రుషికొండపై శాశ్వత భవనాలు నిర్మించారు. టీడీపీ నేతలకు ధైర్యం ఉంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూపించాలి. రుషికొండ భవనం గురించి మీడియోలు, ఫోటోలు తీసి చూపించారు. అదే సమయంలో మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా చూపించండి. .. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం జరుగుతోంది. మెడికల్‌ కాలేజీలు, ఉద్దానంలో కట్టిన ఆసుపత్రిని చూపించండి. వాటర్‌ ప్రాజెక్ట్‌, నర్సీపట్నం మెడికల్‌ కాలేజీ నిర్మాణం, కురపం కాలేజీ, మూలపేటలో పోర్టు నిర్మాణం, పలు ప్రాజెక్ట్‌ల నిర్మాణాలు జరుగుతున్నాయి అవి చూపించండి. .. అమరావతిలో తాత్కాలిక భవనాల పేరిట వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆనాడు ప్రభుత్వధనం ఏమైంది?. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో అందరికీ తెలుసు. మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు కూడా వాస్తవాలు తెలుసుకోవాలి. టీడీపీ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోంది. అధికార పార్టీ ఇలాంటివి మానుకోవాలని కోరారు. రుషికొండపై ఉన్నవి ప్రభుత్వ భవనాలు అని టీడీపీ నేతలు గుర్తించాలి’ అంటూ గుడివాడ అమర్నాథ్‌ వైఎస్సార్‌సీపీ తరఫున ఎల్లో ముఠాకు కౌంటర్‌ ఇచ్చారు.

West Bengal: Goods train rams into Kanchenjunga Express Updates
Train Accident: బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో సోమవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. న్యూ జల్‌పాయ్‌గురి వద్ద ఓ గూడ్స్‌ రైలు కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను ఢీ కొట్టింది. సహాయక చర్యలు కొనసాగుతున్న వేళ.. మృతుల సంఖ్య పెరుగుతోంది. అస్సాం సిల్చార్‌- కోల్‌కతా సీల్దా మధ్య కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌(13174) నడుస్తుంది. ప్రమాదానికి కారణమైన గూడ్స్‌ అగర్తల నుంచి సీల్దా వస్తోంది. ఈ క్రమంలో.. సోమవారం ఉదయం 9గం. ప్రాంతంలో న్యూ జల్‌పాయ్‌గురి రంగపాని-నిజ్బారి స్టేషన్ల మధ్య గూడ్స్‌, కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను ఢీ కొట్టింది. पश्चिम बंगाल में रेल हादसा, डाउन कंचनजंगा एक्सप्रेस से टकराई मालगाड़ी, फिलहाल 6 घायलों की सूचनाअभी तक किसी जनहानि की खबर नहीं, राहत और बचाव के लिए रेलवे दल रवाना...#WestBengal #TrainAccident @IRCTCofficial @RailMinIndia pic.twitter.com/mhsDQpXHTw— Manraj Meena (@ManrajM7) June 17, 2024ప్రమాదం ధాటికి రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఓ బోగీ గాల్లోకి లేచింది. మూడు బోగీల్లోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. వీళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. Shocked to learn, just now, about a tragic train accident, in Phansidewa area of Darjeeling district. While details are awaited, Kanchenjunga Express has reportedly been hit by a goods train. DM, SP, doctors, ambulances and disaster teams have been rushed to the site for rescue,…— Mamata Banerjee (@MamataOfficial) June 17, 2024మరోవైపు ఘటన గురించి తెలియగానే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసి.. వెంటనే ఘటనా స్థలికి బయల్దేరారు. ప్రమాదం అనంతరం ఆ ప్రాంతమంతా బీతావహ వాతావరణం నెలకొంది. ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు రావడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అయితే గూడ్స్‌ రైలు సిగ్నల్‌ను పట్టించుకోకుండా వేగంగా క్రాస్‌ చేసి వెళ్లిపోయిందని ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే.. ప్రమాదానికి గల కారణంపై రైల్వే శాఖ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ప్రమాదంపై రైల్వే శాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఎక్స్‌ ద్వారా ఈ ప్రమాదం బాధాకరమని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.Unfortunate accident in NFR zone. Rescue operations going on at war footing. Railways, NDRF and SDRF are working in close coordination. Injured are being shifted to the hospital. Senior officials have reached site.— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 17, 2024

Ksr Comments On The Chances Of YSRCP Coming Back To Power In Politics
వైఎస్సార్‌సీపీ బౌన్స్‌ బ్యాక్‌ వెరీ సూన్‌!

వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ తనకు అనూహ్యంగా ఎదురైన చేదు అనుభవం నుంచి కోలుకుంటున్నారు. ఆయన తిరిగి రాజకీయ కార్యకలాపాలను ఆరంభించారు. ఆయా వర్గాల వారిని కలుస్తున్నారు. పార్టీ నేతలతో సంభాషిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో వేర్వేరుగా ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశాలలో పార్టీకి ఎదురైన ఓటమి నుంచి కోలుకుని, మళ్లీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే విషయమై చర్చిస్తున్నారు. తాను కచ్చితంగా ప్రజలలో తిరుగుతానని, ప్రజల పక్షాన పోరాటాలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇది ఒక రకంగా క్యాడర్ కు భరోసా ఇచ్చేది అవుతుంది.టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దాడులపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ వారికి ధైర్యం చెప్పే విధంగా తాను టూర్ చేస్తానని ప్రకటించారు. ఒకసారి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ జనంలో తిరగడం మొదలు పెడితే పరిస్థితి పూర్తిగా మారే అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల హింసాయుత ఘటనలు జరిగాయి. వాటిలో వందల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు. కొద్ది మంది మరణించారు. ఓటమిని భరించలేక కొంతమంది ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. టీడీపీ గూండాలు వైఎస్సార్‌సీపీవారి ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారు. వారి కోసం ఇప్పటికే జిల్లా వారీగా లీగల్ టీమ్ లు ఏర్పాటుచేశారు. నేతలతో కమిటీలు ఏర్పాటు చేసి ఆయా చోట్ల పర్యటించాలని కోరారు. తదుపరి తానే స్వయంగా వెళ్లి పరామర్శించబోతున్నారు.ఏ రాజకీయ పార్టీ నేత అయినా ఇదే పని చేయాలి. గతంలో వ్యక్తిగత కారణాలతో ఎక్కడైనా గొడవ జరిగి, టీడీపీ వ్యక్తి ఎవరైనా గాయపడినా, మరణించినా చంద్రబాబు దానిని రాజకీయం చేసి, అక్కడకు పరామర్శ యాత్ర చేపట్టేవారు. అదంతా టీడీపీ మీడియాలో విస్తారంగా ప్రచారం అవుతుండేది. ఈ రకంగా ఐదేళ్లపాటు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ ప్రభుత్వంపై ఉన్నవి, లేనివి కలిపి దుష్ప్రచారం చేశారు. ఎలాగైతేనేం అధికారం సంపాదించారు. టీడీపీ వారు దానిని సద్వినియోగం పరచుకోవడం మాని వైఎస్సార్‌సీపీ వారిపై కక్ష సాధింపునకు వాడుకుంటున్నారు. టీడీపీ క్యాడర్ యధేచ్చగా హింసాకాండకు పాల్పడడానికి చంద్రబాబు వంటి పెద్ద నేతలు కూడా ప్రోత్సహం ఇవ్వడం దురదృష్టకరం.ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ తన పార్టీవారిలో విశ్వాసం పెంపొందిచడానికి చర్యలు చేపట్టారు. వైఎస్సార్‌సీపీకు భవిష్యత్తు ఉందని ఆయన చెబుతూ ఆత్మ స్థైర్యం కోల్పోవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇది వాస్తవం. రాజకీయాలలో గెలుపు ఓటములు ఉంటాయి. ఆ మాటకు వస్తే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ 1989-94, 2004-2014, 2019-2024 టరమ్ లలో అధికారంలో లేదు. ప్రతిపక్షంగానే ఉంది. అయినా పార్టీ నిలబడింది. తిరిగి పవర్ లోకి వచ్చింది. అబద్ధాలతో వచ్చిందా? లేక కొందరు అనుమానిస్తున్నట్లు ఈవీఎం మోసాలతో వచ్చిందా? అనేది వేరే విషయం. కానీ పార్టీ ఏర్పడిన తర్వాత నాలుగు దశాబ్దాలలో రెండు దశాబ్దాలపాటు అధికారంలో లేదన్న సంగతి గుర్తుంచుకోవాలి.అలాగే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ పార్టీని స్థాపించినప్పుడు దాదాపు ఒంటరిగానే రాజకీయం ఆరంభించారు. ఆ తర్వాత 2014లో అధికారం సాధించలేకపోయినా, నిత్యం ప్రజలతో మమేకమయి 2019లో ప్రభుత్వంలోకి వచ్చారు. కనుక ప్రతిపక్షంలో ఉండడం వైఎస్సార్‌సీపీకి కూడా కొత్త కాదు. కాకపోతే ఒక్కసారిగా ఓటమిని ఊహించని క్యాడర్ కు కాస్త ధైర్యాన్ని ఇచ్చి ప్రజలలో పనిచేసేలా వ్యూహం రచించుకోవాలి. ఏ చిన్న అవకాశం వచ్చినా వదలిపెట్టకుండా ప్రభుత్వాన్ని ఎండగట్టే అవకాశం విపక్షానికి ఉంటుంది. దానిని వినియోగించుకోగలగాలి.ఈ విషయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌కు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆయన ప్రభుత్వం నడుపుతున్నప్పుడు చెప్పిన హామీలను నెరవేర్చి ఒక విశ్వసనీయత కలిగిన నేతగా పేరొందారు. అంతవరకు వాస్తవం. ఓటమికి పలు ఇతర కారణాలు ఉండవచ్చు. కానీ చాలా వరకు మాట మీద నిలబడే వ్యక్తిగా జగన్ నిలబడిపోతారు. దానినే ఆయన ప్రస్తావించి మనపట్ల విశ్వసనీయత బతికే ఉందని అన్నారు. అర్హతే ప్రమాణికంగా కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు చూడకుండా స్కీములు అమలు చేసిన చరిత్ర తమది అయితే, కూటమికి ఓటేయలేదనే ఏకైక కారణంతో టీడీపీ వారు తెగబడి రాష్ట్రాన్ని రావణాకాష్టంగా మార్చారని ఆయన పేర్కొన్నారు. దేశ చరిత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ మాదిరి స్కీముల అమలులో పార్టీ, కులం, మతం వంటివి చూడని నేత మరొకరు లేరంటే అతిశయోక్తికాదు.అయితే అదే విశ్వసనీయత పాయింట్ ఆయనను దెబ్బతీసిందని చెప్పాలి. తన ప్రభుత్వం ఏడాదికి సుమారు డెబ్బైవేల కోట్ల రూపాయల మేర వివిధ స్కీములను అమలు చేస్తున్నందున అదనంగా కొత్త స్కీములు ఇవ్వలేమని, పెన్షన్ లు నాలుగువేల రూపాయలు చేయలేమని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ ఎన్నికల మానిఫెస్టో విడుదల సందర్భంగా పేర్కొన్నారు. దానిని జనం పాజిటివ్ గా తీసుకోలేదని అనుకోవాలి. చంద్రబాబు నాయుడు ఇచ్చిన భారీ హామీల ప్రకటనకు ఆశపడి టీడీపీకి ఓటు వేసినట్లు కనబడుతుంది. దానిని దృష్టిలో ఉంచుకుని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ ఒక మాట అన్నారు. "విశ్వసనీయత లేని మనిషిగా రాజకీయాలు చేద్దామా! లేక కష్టాలు ఎదుర్కుంటూ హూందాగా నిలబడి ముందడుగు వేద్దామా?" అని ప్రశ్నించారు. మాట ప్రకారం నిలబడితేనే మళ్లీ అధికారంలోకి వస్తామని ఆయన నమ్ముతున్నారు.తాత్కాలికంగా ప్రజలు చంద్రబాబు హామీలను నమ్మినా, వాటిని అమలు చేయడం కష్టం కనుక, 2014 టరమ్ లో మాదిరి చంద్రబాబు ప్రభుత్వం ఈసారి కూడా చతికిలపడుతుందని పలువురు భావిస్తున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ ఉద్దేశం కూడా అదే కావచ్చు. అందుకే నిబ్బరంగా ఉండి పార్టీ కోసం పనిచేయాలని ఆయన అన్నారు. శాసనమండలిలో వైఎస్సార్‌సీపీకి అత్యధిక మెజార్టీ ఉన్నందున చంద్రబాబు నాయుడు రకరకాల ప్రలోభాలు పెట్టడమో, లేక తప్పుడు కేసులు పెట్టించడమో చేస్తారని ఆయన అనుమానిస్తున్నారు. దానిని తట్టుకుని నిలబడాలని ఎమ్మెల్సీలను ఆయన కోరారు. దానికి ఎంతమంది కట్టుబడి ఉంటారన్నది కాలమే తేల్చుతుందని చెప్పాలి.ప్రత్యేక హోదా గురించి కూడా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ ప్రస్తావించారు. గతంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ ఒక మాట చెప్పేవారు. తనకు 25 ఎంపీ సీట్లు ఇస్తే, కేంద్రంలో ఏ కూటమికి తక్కువ సీట్లు వస్తే, దానికి మద్దతు ఇవ్వడానికి ప్రత్యేక హోదా డిమాండ్ పెడతానని అనేవారు. అప్పట్లో బీజేపీకి పూర్తి మెజార్టీ వచ్చింది. దాంతో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ ఏమీ చేయలేని పరిస్థితిలో పడ్డారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి రావడం ప్లస్ పాయింట్. అయినా ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించకపోవడం ఆయన బలహీనత. దానిని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ బాగా ఎక్స్ పోజ్ చేశారు. మరో మాట కూడా అన్నారు. ఏపీ శాసనసభలో ప్రతిపక్షంగా ఉన్నది ఒక్క వైఎస్సార్‌సీపీ మాత్రమే. దానికి ప్రతిపక్ష హోదాకు తగినన్ని సీట్లు లేవు. అందువల్ల ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవచ్చు. అంత ఉదారత తెలుగుదేశం పార్టీకి ఉంటుందని ఆశించనవసరం లేదు.1994లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ కు ఉమ్మడి ఏపీలో ఇరవైఆరు సీట్లే వచ్చాయి. దీని ప్రకారం ప్రతిపక్ష హోదా దక్కలేదు. అప్పట్లో కాంగ్రెస్ నేత పి. జనార్ధనరెడ్డి పలుమార్లు డిమాండ్ చేసినా, ఆయనను ప్రతిపక్ష నేతగా గుర్తించడానికి చంద్రబాబు అంగీకరించలేదు. అలాంటిది ఇప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌కు ఆ హోదా ఇస్తారని అనుకోనవసరం లేదు. అయితే శాసనమండలిలో వైఎస్సార్‌సీపీకి బలం ఉన్నంతకాలం ప్రభుత్వంపై గట్టి పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా పార్టీలో పునరుత్తేజానికి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వడానికి ఇంకా కొంత సమయం పడుతుందని చెప్పక తప్పదు. అంతవరకు ఓపిక పడితే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ చెప్పినట్లు వైఎస్సార్‌సీపీకు భవిష్యత్తు ఆశాజనకంగానే ఉంటుంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు

T20 WC: Saurabh Netravalkar Wife Devi Snigdha Muppala: Who Is She High Achiever
సౌరభ్‌ నేత్రావల్కర్‌ భార్య: తెలుగు మూలాలున్న అమ్మాయి.. బ్యాగ్రౌండ్‌?

టీ20 ప్రపంచకప్‌-2024లో ఆతిథ్య జట్టు అమెరికా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆటగాళ్లలో సౌరభ్‌ నేత్రావల్కర్‌ ఒకడు. ముంబైలో పుట్టిపెరిగిన ఈ పేస్‌ బౌలర్‌.. ఉన్నత విద్య ‍కోసం అమెరికాకు వెళ్లి అక్కడే సెటిలయ్యాడు.ప్రముఖ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సౌరభ్‌.. గత కొన్నేళ్లుగా అమెరికా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్నాడు. జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగిన ఈ ముంబైకర్‌.. ఈ ఐసీసీ టోర్నీలో దుమ్ములేపుతున్నాడు.లీగ్‌ దశలో కెనడా, పాకిస్తాన్‌పై విజయాల్లో తన వంతు పాత్ర పోషించిన సౌరభ్‌.. టీమిండియాతో మ్యాచ్‌లో తనదైన ముద్ర వేశాడు. ఈ మ్యాచ్‌లో అమెరికా ఓడినా.. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ వంటి వరల్డ్‌క్లాస్‌ బ్యాటర్ల వికెట్లు తీసి ప్రత్యేకతను చాటుకున్నాడు ఈ లెఫ్టార్మ్‌ ఫాస్ట్‌ మీడియం బౌలర్‌‌.ఇంతకీ ఎవరీమె?ఈ నేపథ్యంలో సౌరభ్ నేత్రావల్కర్‌‌ కెరీర్‌తో పాటు అతడి వ్యక్తిగత జీవితం గురించి కూడా నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. సౌరభ్‌ నేత్రావల్కర్‌ భార్య తెలుగు మూలాలున్న అమ్మాయి కావడం విశేషం.ఒకే హోదాలో దంపతులుసౌరభ్‌ నేత్రావల్కర్‌ భార్య పేరు దేవి స్నిగ్ధ ముప్పాల. సౌరభ్‌ మాదిరే ఆమె కూడా కార్నెల్‌ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశారు.భర్తతో కలిసి ఒరాకిల్‌ సంస్థలో ప్రిన్సిపల్‌ అప్లికేషన్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. కెరీర్‌ పరంగా ఒకే హోదాలో పనిచేస్తున్న సౌరభ్‌- స్నిగ్ధలు తమకు ఇష్టమైన భిన్న రంగాల్లో రాణిస్తున్నారు.కథక్‌ డాన్సర్‌32 ఏళ్ల సౌరభ్‌కు క్రికెట్‌ ఇష్టమైతే.. స్నిగ్ధకు కథక్‌ నృత్యంపై మక్కువ. ప్రొఫెషనల్‌ కథక్‌ డాన్సర్‌ అయిన ఆమె.. దేవీ బాలీఎక్స్‌ డాన్స్‌ ఫిట్‌నెస్‌ ప్రోగ్రాం ద్వారా మరింత పాపులర్‌ అయ్యారు. అమెరికా వ్యాప్తంగా ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు స్నిగ్ధ.స్నిగ్ధ ఆంధ్రప్రదేశ్‌ మూలాలున్న అమ్మాయి. మహారాష్ట్రకు చెందిన సౌరభ్‌తో 2020లో ఆమె వివాహం జరిగింది. ఇరు కుటుంబాల సమక్షంలో దక్షిణ భారత, మహరాష్ట్ర సంప్రదాయ పద్ధతిలో వీరు పెళ్లి చేసుకున్నారు.అన్యోన్య దాంపత్యంప్రొఫెషనల్‌గా ఎంత బిజీగా ఉన్నా.. సౌరభ్‌- స్నిగ్ధ ఒకరి కోసం సమయం కేటాయించుకుంటారు. సౌరభ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు వీక్షించేందుకు స్నిగ్ధ స్వయంగా స్టేడియానికి వచ్చి.. భర్తను చీర్‌ చేస్తారు.అదే విధంగా.. సౌరభ్‌ సైతం భార్య అభిరుచులకు అనుగుణంగా ఆమె నిర్వహిస్తున్న డాన్స్‌- ఫిట్‌నెస్‌ బ్లెండ్‌ ప్రోగ్రామ్స్‌కి మద్దతుగా నిలుస్తున్నాడు. అలా ఒకరికి ఒకరు తోడుగా ముందుకు సాగుతున్న స్నిగ్ధ- సౌరభ్‌ కపుల్‌ గోల్స్‌ సెట్‌ చేస్తున్నారు.చదవండి: T20 WC: కోహ్లి, రోహిత్‌ వికెట్లు తీసిన భారత టెకీ.. దిమ్మతిరిగే బ్యాక్‌గ్రౌండ్‌!

Eid Ul Adha 2024: The History Of An Ancient Dish Biryani
ఈద్ ఉల్ అధా 2024: బిర్యానీ ఎక్కడ పుట్టింది? దీని కథేంటీ..?

బక్రీ ఈద్‌గా పిలిచే ఈద్‌ ఉల్‌ అధా ఈ ఏడాది ఇవాళే(జూన్‌ 17) బంధుమిత్రులతో చాలా ఆనందంగా జరుపుకుంటారు. ఇది త్యాగానికి గుర్తుగా జరుపుకునే విందు. అబ్రహం ప్రవక్త కొడుకు ఇస్మాయిల్‌ని బలి ఇవ్వమని కోరడం..దేవుడు జోక్యం చేసుకుని బలిగా పొట్టేలుని ఇవ్వడం గురించి ఖురాన్‌లో ఒక కథనం ఉంటుంది. అందుకు గుర్తుగా ఈ రోజున పొట్టేలు(మేక) బలి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ..ఒక వ్యక్తి స్థానంలో మరోక జీవిని బలి ఇవ్వడం అనేది.. త్యాగం లేదా ఖుర్బానీ చరిత్రను గౌరవించేందుకు గుర్తుగా ఈ రోజుని ముస్లింలంతా జరుపుకుంటారు. ఈ రోజు మాంసంతో కలిపి వండే బిర్యానీని తయారు చేసి కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో పంచుకుని తింటారు. ఈ పండుగ పురుస్కరించుకుని అసలు ఈ బిర్యానీ ఎక్కడ పుట్టింది..? ఎలా మన భారతదేశానికి పరిచయం అయ్యింది వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!భారతదేశంలో అత్యంత మంది ఎక్కువగా ఆర్డర్‌ చేసే వంటకంగా ప్రసిద్ధ స్థానంలో ఉంది బిర్యానీ. కుల మత భేదాలు లేకుండా ప్రజలంతా ఇష్టంగా తినే వంటకం కూడా బిర్యానీనే. ఇంతలా ప్రజాధరణ కలిగిన ఈ వంటకం చరిత్ర గురించి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం!. బిర్యానీ అన్న పదం 'బిరింజ్ బిరియాన్' (ఫ్రైడ్ రైస్) అనే పర్షియన్ పదం నుంచి పుట్టింది. అందుకే బిర్యానీ ఇరాన్‌లో పుట్టలేదన్న వాదనా వినిపిస్తుంటుంది. కానీ ఇరాన్‌లో ధమ్ బిర్యానీది ఘనమైన చరిత్ర. ఓ కుండలో మాంసాన్ని వేసి సన్నని మంటపైన చాలా సేపు దాన్ని ఉడికించి, ఆ మాంసంలోని సహజసిద్ధ రసాలు నేరుగా అన్నంలోకి ఊరేలా చేసి, ఆ పైన సుగంధ ద్రవ్యాలు జోడించి బిర్యానీ తయారుచేస్తారని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ బిర్యానీ మొఘల్ చక్రవర్తుల ద్వారానే భారత్‌లోకి వచ్చిందన్న ప్రచారం ఉన్నా దానికి సరైన ఆధారాలు లేవు. అంతేగాదు దక్షిణ భారతంలోని దక్కన్ ప్రాంతానికి చెందిన నవాబులూ, యాత్రికుల ద్వారానే ఇరాన్ నుంచి అది దేశంలోకి ప్రవేశించిందన్నది ఎక్కుమంది చెబుతున్న వాదన. ఏదీఏమైనా..నవాబుల కుటుంబాలకే పరిమితమైన బిర్యానీ, నెమ్మదిగా తన రూపం మార్చుకుంది. భిన్నమైన ప్రాంతాల్లోని ప్రజల ఇష్టాలకు అనుగుణంగా విభిన్న సుగంధ ద్రవ్యాలను తనలో కలుపుకుంటూ, ఇప్పుడు ప్రతి ఒక్కరికీ కమ్మని రుచితో చేరువైంది. ఇక చరిత్ర కారుల అభిప్రాయం ప్రకారం..ఈ బిర్యానీ వంటకం మొఘల్ శకం, చక్రవర్తి షాజహాన్ భార్య బేగం ముంతాజ్ మహల్ కాలం నాటిదని ప్రసిద్ధ కథనం. ఆమె ఒకసారి పోషకాహార లోపంతో కనిపించిన సైనిక అధికారులను చూసి, వారి కోసం పోషకమైన, చక్కటి సమతుల్య భోజనాన్ని తయారు చేయమని తన రాజ ఖన్సామాలను (వంటచేసేవాళ్లుకు) ఆదేశించింది. దాని ఫలితంగా సుగంధ ద్రవ్యాలతో కూడిన ఈ బిర్యానీ వంటకం రూపొందిందని చెబుతుంటారు. మరో కథనం ప్రకారం..1398లో టర్క్-మంగోల్ విజేత తైమూర్ భారత సరిహద్దులను చేరుకున్నప్పుడు అతని సైన్యం కోసం ఈ బిర్యానీని వినియోగించారిని చెబుతారు. సైనికులు కోసం బియ్యం, సుగంధద్రవ్యాలు, మాంసంతో నిండిన కుండను వేడి గొయ్యిలో పాతి పెట్టేవారట. కొంత సమయం తర్వాత తీసి చూడగా బిర్యానీ తయారయ్యి ఉండేదట. ఇది యోధులకు మంచి పోషకాహార భోజనంగా ఉండేదట. ఎక్కువ సేపు ఆకలిని తట్టుకుని ఉండేవారట. ఇక పర్షియన్‌ పదంలో బిరియన్‌ అనే పదానికి అర్థం కాల్చడం. బిరింజ్‌ అంటే అన్నం. పూర్వకాలంలో చాలమంది గొప్ప పండితులు పర్షియా దేశం నుంచి భారతదేశానికి రావడం వల్లే ఈ ప్రత్యేకమైన వంటకం మనకు పరిచయమయ్యిందని చెబుతారు. అయితే మన దేశంలో మాత్రం ఈ బిర్యానీ మాంసం, బియ్యం సుగంధ ద్రవ్యాలతో కూడిన బిర్యానీని మాన్సోదన్‌ అని పిలుస్తారు. ప్రస్తుతం భారతదేశం అంతటా అనేక రూపాల్లో బిర్యానీ లభిస్తుంది. మన హైదరాబాద్‌ బిర్యానీ ఉత్తర, దక్షిణ అంశాలను టర్కిష్‌ ప్రభావాన్ని మిళితం చేస్తుంది. ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఢిల్లీ, లక్నోలలో బాస్మతీ వంటి పొడవైన బియ్యంతో తయారు చేయగా, తమిళనాడు, కర్ణాటక, కేరళ సీరగ సాంబ లేదా కైమా బియ్యం వంటి పొట్టి ధాన్యాలతో తయారు చేస్తారు. ప్రతి బిర్యానీ సుగంధ్ర ద్రవ్యాలు, మాంసంతో ఆయా ప్రాంతాలకు అనుగుణమైన శైలిలో రూపొందుతుంది. ఈ బిర్యానీ వంటకం ఎలా ఏర్పడిందన్నది తెలియకపోయిన మన రోజూవారీ ఆహారంలో అందర్భాగం అయ్యింది. ముఖ్యంగా ఇలాంటి ఈద్‌ సమయంలో ప్రతి ముస్లిం ఇంట ఘుమఘమలాడే మటన్‌ బిర్యానీ ఉండాల్సిందే. (చదవండి: Eid Al-Adha 2024: మౌలిక విధులు..)

Ram Charan: I Had Parties When My Films Failed
సినిమా ఫ్లాప్‌ అయితే పార్టీ చేసుకుంటా: రామ్‌ చరణ్‌

మెగాస్టార్‌ చిరంజీవి పేరు నిలబెట్టాల్సిన బాధ్యత రామ్‌చరణ్‌దే! కెరీర్‌ ప్రారంభంలో తడబడ్డప్పటికీ రానూరానూ నటనలో ఆరితేరాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీతో గ్లోబల్‌ స్టార్‌ అయ్యాడు. తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చరణ్‌కు.. తండ్రి వారసత్వాన్ని కొనసాగించే క్రమంలో ఏదైనా ఒత్తిడికి లోనయ్యారా? అన్న ప్రశ్న ఎదురైంది. ఒత్తిడిగా ఫీలవనుఇందుకు చరణ్‌ స్పందిస్తూ.. ఒత్తిడిని ఎలా తీసుకోవాలో నాకు తెలియదు. నా కెరీర్‌ విషయానికే వస్తే సినిమా ఫలితాల గురించి మరీ అంత ఒత్తిడిగా ఫీలవను. చెప్పాలంటే ఏదైనా సినిమా బాగా ఆడలేదంటే రిలాక్స్‌ అయ్యేందుకు పార్టీ చేసుకుంటాను. అలాగే ఆర్‌ఆర్‌ఆర్‌ సక్సెస్‌ అయినప్పుడు వారం రోజుల దాకా ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టలేదు. నా కుటుంబంతో కలిసి ఇంట్లోనే ఎంజాయ్‌ చేశాను. ప్రస్తుతం ఏం చేస్తున్నా..సక్సెస్‌, ఫెయిల్యూర్‌ల గురించి అంతగా ఆలోచించను. ఇప్పుడు ఏం చేస్తున్నాననేదే నమ్ముతాను. రేపటి గురించి ఆందోళన చెందను' అని చెప్పుకొచ్చాడు. కాగా రామ్‌ చరణ్‌ ప్రస్తుతం గేమ్‌ చేంజర్‌ సినిమా చేస్తున్నాడు. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా యాక్ట్‌ చేస్తోంది. అలాగే బుచ్చిబాబు సన దర్శకత్వంలో విలేజ్‌ స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో ఓ చిత్రం చేస్తున్నాడు. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌. ఇందులో చరణ్‌ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు టాక్‌ నడుస్తోంది. దీని తర్వాత సుకుమార్‌ డైరెక్షన్‌లో మరో మూవీ చేయనున్నాడు.చదవండి: బాహుబలి పోస్టర్‌ను రీక్రియేట్‌ చేసిన స్టార్‌..హీరో దర్శన్ అరెస్ట్.. సంబంధం లేదని తేల్చేసిన మరో కన్నడ హీరో

Warning to Late Coming Central Employees
లేటుగా వస్తే.. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం హెచ్చరిక

ఢిల్లీ: కార్యాలయాలకు ఆలస్యంగా వచ్చే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. దీనికి అనుగుణమైన ఆదేశాలు ఇప్పటికే ఉన్నతాధికారులకు అందాయి. కొందరు ఉద్యోగులు బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ (ఏఈబీఏఎస్)లో హాజరు నమోదు చేయకపోవడం, మరికొందరు ఉద్యోగులు నిత్యం ఆఫీసుకు ఆలస్యంగా రావడం జరుగుతోంది. దీనిపై వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని కేంద్రప్రభుత్వ ఈ విధమైన ఆదేశాలు జారీచేసింది.సిబ్బంది మంత్రిత్వ శాఖ తాజాగా మొబైల్ ఫోన్ ఆధారిత ప్రమాణీకరణ వ్యవస్థను ఉపయోగించాలని ఉన్నతాధికారులకు సూచించింది. ఏఈబీఏఎస్ అమలు తీరును సమీక్షించిన ప్రభుత్వానికి దీని అమలులో అలసత్వం కనిపించింది. దీనిని సీరియస్‌గా తీసుకున్న మంత్రిత్వ శాఖ అన్ని ప్రభుత్వ విభాగాల సిబ్బంది హాజరు నివేదికలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని నిర్ణయించింది. కొందరు ఉద్యోగులకు కార్యాలయానికి ఆలస్యంగా రావడం, త్వరగా బయలుదేరడం అలవాటుగా మారిందని, దీనిని నియంత్రించాలని ప్రభుత్వం ఉన్నతాధికారులను కోరింది.ఈ నిబంధనలు పాటించనివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అప్పుడే ఏఈబీఏఎస్‌లో రిజిస్టర్డ్, యాక్టివ్ ఉద్యోగుల మధ్య ఎలాంటి తేడాలు ఉండవని ప్రభుత్వం అన్ని శాఖల కార్యదర్శులకు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. సంబంధిత సీనియర్ అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలను పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని, డిఫాల్టర్లను గుర్తించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కార్యాలయానికి సిబ్బంది ఎవరైనా ఆలస్యంగా వస్తే, దానిని హాఫ్-డే క్యాజువల్ లీవ్‌గా పరిగణించాలని సూచించింది. నెలలో ఒకటి లేదా రెండుసార్లు, న్యాయమైన కారణాలతో ఆలస్యంగా కార్యాలయానికి ఎవరైనా సిబ్బంది వస్తే అధికారులు వారిపై చర్యలు తీసుకోవలసిన అవసరం లేదని ప్రభుత్వం పేర్కొంది.

Phone Tapping Case: Police Speed Up Investigation
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు వేగం పెంచారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఓ ఛానల్ ఓనర్‌ను త్వరలోనే అమెరికా నుంచి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు.. ఈ కేసులో కీలకమైన టెక్నికల్ ఆధారాలను దర్యాప్తు బృందం సేకరించింది. కొండాపూర్‌లో కన్వర్జేన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్‌లో సోదాలు చేశారు. కన్జర్వేషన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్‌లో 3 సర్వర్లు, హార్డ్ డిస్క్‌లతో పాటు 5 మాక్ మినీ డివైజ్‌లు సిట్‌ సీజ్ చేసింది. ఆ సంస్థ డైరెక్టర్ పాల్ రవికుమార్‌కు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నారు. ఫోన్ టాపింగ్‌కు సంబంధించిన టెక్నికల్ ఆధారాలను పాల్ రవికుమార్ నుంచి పోలీసులు సేకరించినట్లు సిట్‌ వెల్లడించింది.. .. అదే సంస్థలో పనిచేసే సీనియర్ మేనేజర్ రాగి అనంత చారి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఓలేటి సీతారాం శ్రీనివాస్‌లను స్టేట్‌మెంట్లను పోలీసులు రికార్డ్ చేశారు. కన్జర్వేషన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్‌ పరికరాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. పాల్ రవికుమార్ 160 సీఆర్పీసీ నోటీస్ జారీ చేసి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది.

YS Jagan Bakrid Wishes To Muslims: Andhra Pradesh
ముస్లింలకు వైఎస్‌ జగన్‌ బక్రీద్‌ శుభాకాంక్షలు

గుంటూరు, సాక్షి: ముస్లిం సోదర, సోద­రీ­­మ­ణు­లకు వైఎస్సా­ర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ బక్రీద్‌ శుభా­కాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉదయం తన ఎక్స్‌ ఖాతాలో ఆయన సందేశం ఉంచారు. కరుణ, త్యాగం, భక్తి విశ్వాసాలకు ప్రతీక బక్రీద్. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ, ఆయన చూపిన మార్గంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు.— YS Jagan Mohan Reddy (@ysjagan) June 17, 2024అంతకు ముందు.. ఓ ప్రకటనలోనూ ఆయన బక్రీద్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగ­నిరతికి, ధర్మ­బద్ధ­తకు, దాతృత్వానికి బక్రీద్‌ ప్రతీకగా నిలుస్తుంద­న్నారు. దైవ ప్రవక్త ఇబ్ర­హీం త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకొంటారన్నా­రు. పేద, ధనిక తారత­మ్యాలు లేకుండా, రాగద్వేషా­లకు అతీతంగా ముస్లింలందరూ ఈ పండు­గను భక్తిశ్రద్ధలతో నిర్వ­హించుకుంటారని చెప్పారు. అల్లాహ్‌ ఆశీ­స్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని అభిలషించారు.

Irregularities of voting machines coming out one by one
ఈవీఎంల గుట్టు విప్పేదెవరు?

సాక్షి, అమరావతి: ఎల్రక్టానిక్‌ ఓటింగ్‌ మెషిన్ల (ఈవీఎంలు) పనితీరుపై ముసురుకుంటున్న అనుమానాలతో ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈవీఎంల హ్యాకింగ్‌ అసాధ్యమేమీ కాదని, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పరిజ్ఞానం సాయంతో వాటిని సులభంగా హ్యాక్‌ చేయవచ్చని టెక్‌ దిగ్గజం, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్‌ మస్క్‌ తాజాగా ట్వీట్‌ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈవీఎంలను మనుషులు కూడా హ్యాక్‌ చేసేందుకు ఆస్కారం ఉందని, అసలు వీటిని రద్దు చేయాలని చాట్‌ జీపీటీ నిపుణుడైన ఆయన గట్టిగా డిమాండ్‌ చేయడం గమనార్హం. మరోవైపు ముంబైలో గెలుపొందిన శివసేన (షిండే) అభ్యర్థి రవీంద్ర వైకర్‌ బంధువు ఒకరు మొబైల్‌ ద్వారా ఈవీఎంను హ్యాక్‌ చేసి ఆపరేట్‌ చేసినట్లు వెలుగులోకి రావడం ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ సైతం ఈవీఎంల పనితీరుపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో పారదర్శకత లేకుంటే భవిష్యత్తు లేదని హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఓటింగ్‌ సరళిపై ఇప్పటికే పలువురు నిపుణులు, పరిశీలకులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా తమ ఓట్లన్నీ ఏమయ్యాయంటూ గ్రామాలకు గ్రామాలే నిలదీస్తుండటం గమనార్హం. గెలుపొందిన అభ్యర్థులు సైతం ఊహించని స్థాయిలో మెజారిటీలు రావటంపై నీలి నీడలు అలుముకుంటున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఈవీఎంల పనితీరుపై సర్వత్రా సందేహాలు తలెత్తుతున్నా... తాము వేసిన ఓట్లు ఏమయ్యాయని ఓటర్లు ప్రశ్నిస్తున్నా.. 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయని యావత్‌ దేశం నిలదీస్తున్నా... ఇవిగో ఈవీఎం మోసాలంటూ ఆధారాలు చూపిస్తున్నా... కేంద్ర ఎన్నికల సంఘం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. ‘తాంబూలాలు ఇచ్చేశాం... ఇక తన్నుకు చావండి’ అనే రీతిలో ఎన్నికల ప్రక్రియ ముగిశాక తమకు సంబంధం లేదనే రీతిలో బాధ్యతల నుంచి ఈసీ పలాయనం చిత్తగించడం ఈ సందేహాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించిన అనంతరం అందులో లొసుగులు గుర్తించడంతో వాటిని నిషేధించిన దేశాల సంఖ్య పెరుగుతోంది. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఇప్పటికీ బ్యాలెట్‌ పేపర్‌ విధానాన్నే అనుసరిస్తున్న నేపథ్యంలో మన దేశంలో ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణ సరికాదని సాధారణ ఓటర్లతోపాటు నిపుణులు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగా పరీక్షిస్తే కానీ ఈ రహస్యం వీడదని టెక్‌ నిపుణులు వాŠయ్‌ఖ్యానిస్తున్నారు. చిప్‌లోనే చిదంబర రహస్యం..! ఈవీఎంలలో ఉపయోగిస్తున్న చిప్‌లపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిజ్ఞానంపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) సూటిగా సమాధానం చెప్పకపోవడం సందేహాలకు బలం చేకూరుస్తోంది. ఈవీఎంలను హ్యాక్‌ చేయవచ్చని పలువురు సవాళ్లు విసురుతున్నా ఈసీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఈసీ చేసిన ప్రకటన మరిన్ని సందేహాలకు తావిచ్చింది. ఈవీఎంలలలో బ్లూటూత్‌ టెక్నా­లజీ లాంటిది ఉండదు కాబట్టి హ్యాక్‌ చేయడం సాధ్యం కాదని ఈసీ ఇటీవల వరకు వాదిస్తూ వచ్చింది. అయితే ఈవీఎంలలో ప్రోగ్రామబుల్‌ చిప్‌లు ఉపయోగిస్తున్నామని, ఫ్లాష్‌ మెమరీ వాడకం కూడా ఉంటుందని ఈసీ ఇటీవల తొలిసారిగా అంగీకరించింది. ప్రోగ్రామబుల్‌ చిప్‌లు, ఫ్లాష్‌ మెమరీని హ్యాక్‌ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఈవీఎంలు భద్రమేనా? అంటే ఈసీ సూటిగా సమాధానం చెప్పడం లేదు. భద్రతా సందేహాస్పదమే ఈవీఎంల భద్రత, నిర్వహణపైనా నీలి నీడలు అలుముకుంటున్నాయి. నిపుణులు వ్యక్తం చేస్తున్న సందేహాలకు ఈసీ సూటిగా సమాధానాలు చెప్పడం లేదు. ఈవీఎంల నిర్వహణ విషయంలో ఎన్నో భద్రత లోపాలు, ఇతర లొసుగులు ఉన్నట్లు ఇప్పటికే చాలా సందర్భాల్లో రుజువైంది. 2017 డిసెంబరు నాటికే ఈవీఎంల చోరీ, ధ్వంసం ఉదంతాలు దాదాపు 70 వరకూ చోటు చేసుకున్నట్లు ‘ద వైర్‌’ ప్రచురించిన కథనం స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్‌కు చెందిన మాజీ మంత్రి సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఈసీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈవీఎంలను తయారు చేసే ఎల్రక్టానిక్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ప్రకటన ప్రకారం.. ఈసీఐ కోరిన దాని కంటే 1,97,368 ఈవీఎంలు, 3,55,747 కంట్రోల్‌ యూనిట్లు ఎక్కువగా తయారయ్యాయి. 2024 ఎన్నికల సందర్భంగా కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఈవీఎంలు ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద లభించాయి. ఇక చోరీకి గురైన ఈవీఎంలపై ఈసీ స్పందన విడ్డూరంగా ఉంది. ప్రతి ఈవీఎంకు ప్రత్యేకమైన ఐడీ ఉంటుందని, యంత్రం చోరీకి గురైనా, కనిపించకుండా పోయినా ఆ ఐడీని బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని పేర్కొంది. తద్వారా ఆ ఈవీఎంలలో నమోదైన ఓట్లు పోలైన ఓట్లలో కలవకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలిపింది. మరి చోరీకి గురైన యంత్రాల్లో పరికరాలను మార్చినా, ఓటింగ్‌ నమోదు చేసేందుకు వాడిన సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి ఇతర ఈవీఎంలతో కలిపేస్తే ఏమవుతుంది? అనే ప్రశ్నలకు ఈసీ మౌనం దాల్చడం గమనార్హం. ఈవీఎంలను భద్రపరుస్తున్న ప్రదేశాలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నాయా? సీసీ కెమెరాలు ఉంటే వాటి ఫుటేజీని అందరికీ ఎందుకు అందుబాటులోకి ఉంచడం లేదు? అందులో ఇబ్బంది ఏమిటి? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. పోలింగ్‌ ముగిసిన తరువాత ఓట్ల లెక్కింపు వరకు స్ట్రాంగ్‌ రూమ్‌లలో ఈవీఎంల భద్రత వ్యవస్థ ఎంతవరకు పటిష్టం? అనే సందేహాలున్నాయి. స్ట్రాంగ్‌ రూమ్‌ల సీసీ కెమెరాల ఫుటేజీలను అన్ని పార్టీలకూ అందుబాటులో ఉంచితే పారదర్శకంగా ఉంటుంది. ఈ డిమాండ్‌పై ఈసీ కనీసం స్పందించలేదు. ఒకవైపు ఈవీఎంలను హ్యాక్‌ చేయడం సాధ్యమేనని నిపుణులు బల్లగుద్ది చెబుతుండగా సందేహాలను నివృత్తి చేయాల్సిన ఈసీ దాగుడుమూతలు ఆడటం అనుమానాలను బలపరుస్తోంది. 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయి? దేశంలో ఏకంగా 20 లక్షల ఈవీఎంలు కనిపించకపోడం మొత్తం ఎన్నికల ప్రక్రియపైనే ప్రశ్నార్థకంగా మార్చేసింది. ఎన్నికల నిర్వహణ కోసం 60 లక్షల ఈవీఎంలను దిగుమతి చేసుకోగా వాటిలో 40 లక్షల ఈవీఎంలను ఎన్నికల ప్రక్రియకు కేటాయించినట్టు ఈసీ వెల్లడించింది. మరి మిగిలిన 20 లక్షల ఈవీఎంలు ఎక్కడున్నాయనే ప్రశ్నకు ఇటు ఈసీగానీ అటు కేంద్ర ప్రభుత్వంగానీ జవాబు చెప్పడం లేదు. ఆ 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయో చెప్పాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ గట్టిగా డిమాండ్‌ చేశారు. దేశంలో ఎంపిక చేసిన రాష్ట్రాలు, నియోజకవర్గాల్లో గుట్టు చప్పుడు కాకుండా ఈవీఎంలను మార్చి అక్రమాలకు పాల్పడినట్లు కమ్యూనిస్టు పార్టీలు ఆరోపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా విభ్రాంతి వ్యక్తమవుతోంది. వైఎస్సార్‌ సీపీ, బిజూ జనతాదళ్‌ పార్టీలు తమకు అత్యంత బలమైన స్థానాల్లో కూడా ఓడిపోవడం విస్మయపరుస్తోంది. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీకి ఏమాత్రం బలం లేని నియోజకవర్గాల్లో సైతం ఆ పార్టీల అభ్యర్థులకు అనూహ్య మెజార్టీలు వచ్చాయి. ఇక ఒడిశాలో బీజేపీ ఉనికి అంతంత మాత్రంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం గమనార్హం. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు పడ్డ పాట్లన్నీ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. బస్సులు, ప్రైవేట్‌ వాహనాల్లో.. కర్ణాటకలో ఓ బీజేపీ ఎంపీ అభ్యర్థి వాహనంలో ఈవీఎంలు తరలిస్తున్న విషయం ఎన్నికల ముందే బయటపడింది. పిఠాపురం నియోజకవర్గంలో ఈవీఎంలను బస్సులో తరలించారు. ఓ ప్రైవేట్‌ వాహనంలో సైతం ఈవీఎంలు తరలించినట్లు బయటపడ్డా ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా పలుచోట్ల ఇదే రీతిలో ఈవీఎంలను ప్రైవేట్‌ వ్యక్తుల పర్యవేక్షణలో తరలించినట్లు తెలుస్తోంది. అవన్నీ కనిపించకుండాపోయిన 20 లక్షల ఈవీఎంలలోనివేనని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. అదృశ్యమైన 20 లక్షల ఈవీఎంలు ఎక్కడున్నాయో వెల్లడించాలని వామపక్షాలతోపాటు ఇతర పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు డిమాండ్‌ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 40 లక్షల ఈవీఎంతోనే ఎన్నికలు నిర్వహించామని, మిగిలిన 20 లక్షల ఈవీఎంల సంగతి తమకు తెలియదంటూ ఈసీ దాటవేత వైఖరి అనుసరిస్తోంది. ఈసీ, కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కై ఈ అంశాన్ని కప్పిపుచ్చేందుకు యత్నిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈవీఎంలను నిషేధించాలి: ప్యూర్టోరికోలో ఎన్నికల అక్రమాలపై ఎక్స్‌లో ఎలాన్‌ మస్క్‌ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలంటే ఈవీఎంలను నిషేధించాలి. ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణ సరికాదు. వాటిని సులభంగా హ్యాక్‌ చేయవచ్చు. ఈ భూమ్మీద హ్యాక్‌ చేయలేనిది ఏదీ లేదు. సంబంధిత వార్త: ఈవీఎంలు హ్యాక్‌ చేయొచ్చు! ఎలాగంటే..ఈవీఎంలు బ్లాక్‌ బాక్స్‌లు: ఎక్స్‌లో రాహుల్‌గాందీఈవీఎంలు బ్లాక్‌ బాక్సులు లాంటివి. వాటిని పరిశీలించేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వరు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం తీవ్ర ఆందోళనకరం. నిషేధిస్తూ విధాన నిర్ణయాలుప్రపంచంలో మెజార్టీ దేశాలు ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా విధాన నిర్ణయం తీసుకున్నాయి. భారత్‌తోపాటు బ్రెజిల్, వెనిజులా తదితర దేశాల్లో మాత్రమే ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అత్యధిక దేశాల్లో ఈవీఎంలను పూర్తిగా నిషేధించగా మరికొన్ని దేశాల్లో ఇతర పద్ధతులను జోడించి ఓటింగ్‌ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. మొబైల్‌తో ఈవీఎం హ్యాకింగ్‌ఈవీఎంలు ఎంత లోపభూయిష్టమో... వాటిని ఎంత సులువుగా హ్యాక్‌ చేయవచ్చో బహిర్గతమైంది. ముంబై నుంచి వెలువడే ప్రముఖ దినపత్రిక ‘మిడ్‌ డే’ కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని వాయువ్య ముంబై నియోజకవర్గం నుంచి ఎంపీగా కేవలం 48 ఓట్లతో విజయం సాధించిన శివసేన (ఏక్‌నాథ్‌ షిండే) అభ్యర్థి రవీంద్ర వైకర్‌ సమీప బంధువు మంగేశ్‌ పండిల్కర్‌ తన మొబైల్‌ ఫోన్‌ ద్వారా ఈవీఎంను అన్‌లాక్‌ చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఈ నెల 4న ముంబైలోని నెస్కో సెంటర్‌లో నిర్వహించారు. ఎంపీ బంధువు మంగేశ్‌ పండిల్కర్‌ ఈ సందర్భంగా తన మొబైల్‌ ఫోన్‌ ద్వారా ఈవీఎంను అన్‌లాక్‌ చేశారు. ఓటీపీ జనరేట్‌ చేయడం ద్వారా ఈవీఎంను అన్‌లాక్‌ చేయడం గమనార్హం. మొదట్లో శివసేన(ఉద్ధవ్‌ ఠాక్రే) అభ్యర్థి అమోల్‌ సంజన కీర్తికర్‌ కంటే వెనుకబడిన రవీంద్ర వైకర్‌ అనూహ్యంగా కేవలం 48 ఓట్లతో విజయం సాధించడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా కౌంటింగ్‌ కేంద్రంలోకి మొబైల్‌ ఫోన్‌ తీసుకువెళ్లడం, అదే ఫోన్‌ ద్వారా శివసేన (ఏక్‌నాథ్‌ షిండే) అభ్యర్థి పలువురితో మంతనాలు జరపడంపై ముంబై పోలీసులు ఈ నెల 14న కేసు నమోదు చేసి నిందితులకు నోటీసులు జారీ చేశారు. మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్‌ పరీక్షకు పంపారు. అయితే మొబైల్‌ ద్వారా ఈవీఎంను హ్యాక్‌ చేశారన్న మిడ్‌ డే పత్రిక కథనాన్ని ఎన్నికల కమిషన్‌ ఖండించింది.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement