చెస్‌ క్రీడాకారులకు అంతర్జాతీయ ఫిడే రేటింగ్‌ | - | Sakshi
Sakshi News home page

చెస్‌ క్రీడాకారులకు అంతర్జాతీయ ఫిడే రేటింగ్‌

Jun 4 2025 1:44 AM | Updated on Jun 4 2025 1:44 AM

చెస్‌ క్రీడాకారులకు అంతర్జాతీయ ఫిడే రేటింగ్‌

చెస్‌ క్రీడాకారులకు అంతర్జాతీయ ఫిడే రేటింగ్‌

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్‌ చెస్‌ క్రీడాకారులు అంతర్జాతీయ ఫిడే చెస్‌ రేటింగ్‌లను సాధించడం గర్వకారణమని జిల్లా చెస్‌ సంఘం కార్యదర్శి అనీస్‌ దర్బారి పేర్కొన్నారు. మంగళవారం తన కార్యాలయంలో మాట్లాడుతూ మైదుకూరుకు చెందిన రవి వసంత కుమార్‌ తమిళనాడు రాష్ట్రంలోని తిరుపత్తూర్‌ అలాగే ఢిల్లీలో నిర్వహించిన రెండు ఫిడే క్లాసికల్‌ రేటింగ్‌ టోర్నమెంట్లలో పాల్గొని తన అద్భుతమైన ప్రదర్శనతో 1452 క్లాసికల్‌ ఇంటర్నేషనల్‌ చెస్‌ రేటింగ్‌ను పొందారన్నారు. ప్రస్తుతం ఆయన కాశినాయన మండలం, ఇటుకలపాడు జెడ్పీ హైస్కూల్‌లో ఇంగ్లీష్‌ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారన్నారు.

అలాగే ప్రొద్దుటూరుకు చెందిన నదీమ్‌ సాహెబ్‌ గారి ముజమ్మిల్‌ ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ఫిడే రాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో పాల్గొని 1491 రాపిడ్‌ ఇంటర్నేషనల్‌ చెస్‌ రేటింగ్‌ను పొందారన్నారు.

ఈ ఇద్దరు క్రీడాకారుల ఫిడే రేటింగులను ఫిడే అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ నెల 1వ తేదీన ప్రకటించిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement