
పశ్చిమబెంగాల్ సైబర్ నేరస్తుడు మదనపల్లెలో అరెస్టు
మదనపల్లె రూరల్ : ఉద్యోగాలిప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేయడంతో పాటు సైబర్ నేరాలకు పాల్పడి మదనపల్లెలో తలదాచుకున్న పశ్చిమబెంగాల్‌కు చెందిన సైబర్ నేరస్తుడిని ఆ రాష్ట్రానికి చెందిన పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కలకత్తాకు చెందిన జిజాన్స్(40) స్థానికంగా ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ పలువురికి ఉద్యోగాలిప్పిస్తానని నగదు వసూలు చేసుకున్నాడు. అంతేకాకుండా సైబర్ నేరాలకు పాల్పడ్డాడు. దీంతో అతడిపై ఆరు నెలల క్రితం కలకత్తా పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న జిజాన్స్ మదనపల్లెలో ఉన్నట్లు తెలుసుకుని అరెస్టు చేశారు.