
కాలువలోకి దూసుకెళ్లిన టూరిస్టు బస్సు
చాకచక్యంగా వ్యవహరించిన డ్రైవర్
పెదకాకాని: ప్రయాణికులతో వస్తున్న బస్సు కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదం తృటిలో తప్పింది. తణుకు నుంచి అరుణాచలం తీర్థయాత్రకు 39 మంది ప్రయాణికులతో టూరిస్టు బస్సు బయలు దేరింది. వారు శుక్రవారం రాత్రి గుంటూరు జిల్లా పెదకాకాని శివాలయంలో నిద్ర చేసి ఉదయం బ యలుదేరాలని నిర్ణయించుకోవడం డ్రైవర్ సర్వీసు రోడ్డులో బస్సును నడుపుతున్నాడు. వారు పెద కాకాని మండలం నంబూరు అరబిక్ స్కూల్ స మీపంలోకి చేరుకునే సరికి బస్సు నడుపుతున్న డ్రైవర్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. బస్సు అదుపుతప్పి జాతీయ రహదారి పక్కనే ఉన్న కల్వర్టు వంతెనపైకి ఎక్కి ఆగింది. బస్సులో ప్రయాణిస్తున్న వారంతా భయంతో కేకలు వేశారు. పలువురి స్వల్ప గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు.