
బస్టాండ్‌కాదు..బురదగుంట
ఉండి: ఆర్టీసీ ప్రయాణం సురక్షితమని ఊదరగొట్టే అధికారులు ఉండి బస్టాండ్ దుస్థితిని ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఉండిలో ఒకరోజు వర్షం కురిస్తే బస్టాండ్‌కు వెళ్ళే ప్రయాణికులకు వారం రోజులు కష్టాలు తప్పవు. బస్టాండ్ ప్రాంతం, రోడ్లు బురదమయంగా మారిపోతాయి. బస్టాండ్‌లో భీమవరం వైపు బస్సులు వెళ్ళాలంటే బురద, గణపవరం, ఆకివీడు వైపుగా వెళ్ళాలంటే బస్సులు తిరగబడిపోతాయేమోనని భయపడేంత పెద్ద పెద్ద గోతులు దర్శనమిస్తాయి. ఉండి బస్టాండ్ ఇక్కట్లపై ఎన్నిసార్లు మొరపెట్టుతున్నా ఫలితం శూన్యం. తాగేందుకు నీరు ఉండదు. బస్టాండ్ చుట్టూ మురుగు నీరే. బస్టాండ్‌లో బస్సు దిగాలంటే బురదలో కాలుపెట్టాల్సిందే. దీనివల్ల మహిళా ప్రయాణికులు, విద్యార్థులు, వృద్దులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బస్సులో నుంచి దిగేటప్పుడు ఒక్కోసారి కాలుజారి పడిపోతున్నారు. బస్సులు బస్టాండ్ నుంచి బయటకు వెళ్ళాలంటే డ్రైవర్‌లు తీవ్రంగా శ్రమించాల్సిందే. ఒకవైపు బురద, మరోవైపు గోతుల వల్ల బస్సులు తిప్పడం ఇబ్బందిగా ఉంది. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు కనీస మౌలిక వసతులపై దృష్టిపెట్టడంతో పాటు.. రోడ్లు వేసేలా తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

బస్టాండ్‌కాదు..బురదగుంట