పేదల ఆత్మగౌరవానికి ప్రతీక సొంతిళ్లు | - | Sakshi
Sakshi News home page

పేదల ఆత్మగౌరవానికి ప్రతీక సొంతిళ్లు

Jun 3 2025 6:54 AM | Updated on Jun 3 2025 6:54 AM

పేదల ఆత్మగౌరవానికి ప్రతీక సొంతిళ్లు

పేదల ఆత్మగౌరవానికి ప్రతీక సొంతిళ్లు

వర్ధన్నపేట: పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీక సొంతిళ్లు అని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు అన్నారు. సోమవారం వర్ధన్నపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారదతో కలిసి వర్ధన్నపేట మండల, టౌన్‌ పరిధి ఇందిరమ్మ ఇళ్ల అర్హులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. తాము ఇచ్చిన హామీ మేరకు ఇంటి స్థలం, భూమి పత్రాలు ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నామని, నిర్ణీత సమయం, ప్రభుత్వం సూచించిన కొలతల ప్రకారం ఇల్లు నిర్మించుకొని లబ్ధి పొందాలని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు 4 దశల్లో రూ.5 లక్షలు ఆర్థిక సహాయం అందుతుందని, 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగుల్లోపు ఇంటిని నిర్మించుకోవాలని స్పష్టం చేశారు. 4వ దశలో గ్రీన్‌ చానల్‌ ద్వారా ఆర్థిక సహాయం అందుతుందని వెల్లడించారు. నియోజకవర్గంలో ప్రజలకు ఏ సమస్య ఉన్నా.. డయల్‌ యువర్‌ ఎమ్మెల్యే 80961 07107కి ఫోన్‌ చేసి మీ సమస్య తెలియజేస్తే త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు

పత్రాల పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement