తెలంగాణ గుండెచప్పుడు సాయిచంద్‌ | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ గుండెచప్పుడు సాయిచంద్‌

Jun 30 2025 3:43 AM | Updated on Jun 30 2025 3:43 AM

తెలంగాణ గుండెచప్పుడు సాయిచంద్‌

తెలంగాణ గుండెచప్పుడు సాయిచంద్‌

అమరచింత: సాయిచంద్‌ పాట తెలంగాణ రాష్ట్రానికే గుండె చప్పుడుగా మారిందని.. బీఆర్‌ఎస్‌ కుటుంబాన్ని విడిచి వెళ్లడం బాధాకరమని మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో గిడ్డంగుల కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ సాయిచంద్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమం సాయి అభిమానుల సమక్షంలో కనులపండువగా సాగింది. విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం పట్టణంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో మాజీమంత్రులతో పాటు మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ గొంతుకగా సాయి ప్రతి ఒక్కరి హృదయాల్లో గూడుకట్టుకున్నారని.. సిద్దిపేటలో చెత్త సేకరణ వాహనాలకు ఎలాంటి పాట బాగుంటుందని ఆలోచించానని, తను రాసి పాడిన పాటే ఇప్పటికీ మార్మోగుతుందని హరీశ్‌రావు అన్నారు. ఉద్యమ సమయంలో తన పాటలతో లక్షలాది మంది ప్రజలను ఉర్రూతలూగించిన వ్యక్తి సాయిచంద్‌ అని కొనియాడారు. భర్త లేకున్నా.. చిన్న పిల్లలతో రజని చేస్తున్న పోరాటం అభినందనీయని.. ఆమె ఆశయాల సాధనకు తామంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాజకీయపరంగా రజనికి కేసీఆర్‌ అభయం ఇచ్చారని.. వారి కుటుంబానికి మనోధైర్యం ఇద్దామన్నారు. సాయికి నివాళి అర్పించాలంటే మళ్లీ బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి రావాలి.. కేసీఆర్‌ సీఎం కావాలని మనందరం సంకల్పించాలని కోరారు.

విగ్రహావిష్కరణలో మాజీ మంత్రులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement