
వేసవి క్రీడా శిబిరాలు ఆరంభం
విశాఖ స్పోర్ట్స్: రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో విశాఖలో 27 క్రీడాంశాల్లో వార్షిక వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈనెల 31వ తేదీ వరకు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 3.30 నుంచి 6.30 గంటల వరకు ఈ శిబిరాలు జరగనున్నాయి. అథ్లెటిక్స్, బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ, వాలీబాల్ తదితర క్రీడాంశాల్లో ఎంపిక చేసిన ఆయా ప్రాంతాల్లో శిబిరాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వేసవి క్రీడా శిబిరాల వాల్ పోస్టర్‌ను కలెక్టర్ హరేందిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డీఆర్వో భవాని శంకర్, జీవీఎంసీ అదనపు కమిషనర్ వర్మ విడుదల చేశారు.

వేసవి క్రీడా శిబిరాలు ఆరంభం