నవ విశాఖ | Sakshi
Sakshi News home page

నవ విశాఖ

Published Fri, May 10 2024 5:50 PM

నవ విశాఖ

● ఐదేళ్లలో మారిన మహా నగర రూపు రేఖలు ● రూ.2,490 కోట్ల వ్యయంతో నగరాభివృద్ధి ● బీచ్‌ ఐటీ కారిడార్‌ అభివృద్ధితో దిగ్గజ సంస్థల క్యూ ● ఇన్ఫోసిస్‌ రాక, విప్రో విస్తరణతో ఐటీ రంగం అదరహో ● రూ.21,844 కోట్ల పెట్టుబడితో అదానీ డేటా సెంటర్‌కు శంకుస్థాపన

బక్కన్నపాలెంలో స్పోర్ట్స్‌ థీమ్‌ పార్క్‌

విజన్‌ వైజాగ్‌

రాబోయే దశాబ్దంలో విశాఖపట్నంను మెగాసిటీగా అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్‌ ‘విజన్‌ విశాఖ’ పేరుతో సమగ్ర ప్రణాళికను ఆవిష్కరించారు. అందులో విశాఖను ఇన్నోవేషన్‌, ఫైనాన్షియల్‌, ఫిన్‌టెక్‌ హబ్‌లుగా అభివర్ణించారు. వైజాగ్‌ అత్యంత డిమాండ్‌ ఉన్న పెట్టుబడి గమ్యస్థానంగా గుర్తించి, కనెక్టివిటీ, భౌతిక, సామాజిక మౌలిక సదుపాయాలు, సుస్థిరత వంటివి పెంపొందించే విధంగా.. రాబోయే పదేళ్లలో రూ.1,05,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందించారు.

ప్రతి చోటా పార్కు.. ఆహ్లాదానికి మార్కు

వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్కుల రూపురేఖలను మార్చివేసింది. ఆహ్లాదంతో పాటు వ్యాయామం చేసుకునేందుకు వీలుగా ఓపెన్‌ జిమ్‌లను ఏర్పాటు చేసింది. ఈ విధంగా మొత్తం 103 పనులను చేపట్టి... ఇందుకోసం రూ. 50 కోట్ల మేర వెచ్చింది. సిరిపురం జంక్షన్‌లో ఏర్పాటు చేసిన వైజాగ్‌ స్క్వేర్‌ నగరానికి స్పెషల్‌ అట్రాక్షన్‌గా మారింది.

Advertisement
 
Advertisement