ప్రలోభాలకు గురికావొద్దు | Sakshi
Sakshi News home page

ప్రలోభాలకు గురికావొద్దు

Published Thu, Mar 28 2024 7:05 AM

జెండా ఊపి 5కే రన్‌ను ప్రారంభిస్తున్న కలెక్టర్‌ నారాయణరెడ్డి   - Sakshi

వికారాబాద్‌: ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి సూచించారు. బుధవారం ఓట్‌ ఫర్‌ షూర్‌ పేరుతో వికారాబాద్‌లో 5కే రన్‌ నిర్వహించారు. ఎస్పీ కోటిరెడ్డి, అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మతో కలిసి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణంలోని ఎన్నెపల్లి చౌరస్తా నుంచి ఆలంపల్లి చౌరస్తా వరకు 5కే రన్‌ సాగింది. ఓటరుగా నమోదు, వినియోగంపై విద్యార్థులు, యువతకు అవగాహన కల్పించారు. ఓటు ఎంతో అమూల్యమైనదన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాలన్నారు. ప్రజల ప్రయోజనాలను ఆకాంక్షించే నేతలను ఎన్నుకోవాలని సూచించారు. విద్యార్థులు బాగా చదివి తల్లిదండ్రులకు పేరు తేవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొనాలని అన్నారు. అనంతరం ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. 80శాతానికి మించి ఓటింగ్‌ జరిగేలా చూడాలన్నారు. యువకులు ఓటు హక్కుపై కుటుంబ సభ్యులు, బంధువులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో నోడల్‌ ఆఫీసర్‌ సత్తార్‌, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలి

అనంతగిరి: జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం మిషన్‌ భగీరథ, ఇంట్ర ఈఈ, ఏఈలు, ఎంపీడీఓలు, ఏపీఓ, మున్సిపల్‌ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు సమన్వయంతో పని చేసి నీటి సమస్య రాకుండా చూసుకోవాలన్నారు. చెడిపోయిన బోర్లను వెంటనే బాగు చేయించాలని సూచించారు. అలాగే జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను సత్వరం పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణ దశలో ఉన్న గ్రామ పంచాయతీ భవనా లను పూర్తి చేయాల న్నారు. గ్రామాల్లో సమస్యలు ఉంటే మండల అధికారుల దృష్టికి తేవాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా మండలాల అధికారు లు, సిబ్బంది పాల్గొన్నారు.

ఓటింగ్‌ ప్రశాంతంగా జరగాలి

కొడంగల్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా శాసనమండలి ఓటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా జరగాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. కొడంగల్‌, బొంరాస్‌పేట, దౌల్తాబాద్‌ మండలాలకు చెందిన 56 మంది ప్రజా ప్రతినిధులు గురువారం ఉదయం కొడంగల్‌ ఎంపీడీఓ కార్యాలయంలో ఓట్లు వేస్తారని తెలిపారు. అధికారులు పారదర్శకంగా పనిచేయాలని ఆదేశించారు. పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కేంద్రం వద్ద వసతులు కల్పించాలని ఆదేశించారు. ప్రశాంతంగా ఓటింగ్‌ జరగడానికి అవకాశం కల్పించాలని సూచించారు. ఇందుకు ప్రజాప్రతినిధులు కూడా సహకరించా లన్నారు. బుధవారం కొడంగల్‌ ఎంపీడీఓ కార్యా లయంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాన్ని ఎస్పీ కోటిరెడ్డితో కలిసి పరిశీలించారు. ఓటరు జాబితాలోని పేర్లను సరి చూసుకున్న తరువాతే పో లింగ్‌ కేంద్రంలోకి అనుమతించాలని ఆదేశించారు. కార్యక్రమంలో కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్‌రావ్‌, తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, ఎంపీడీఓ ఉషశ్రీ పాల్గొన్నారు.

తాగునీటి సమస్యలు పరిష్కరించండి

కొడంగల్‌ నియోజకవర్గంలో తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ మిషన్‌ భగీరథ అధికారులకు సూచించారు. తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. బుధవారం కడా కార్యాలయంలో మిషన్‌ భగీరథ అధికారులతో సమీక్ష నిర్వహించారు. చేతిపంపులు, బోర్‌వెల్స్‌ పనితీరుపై ఆరా తీశారు. తాగునీటి సరఫరాలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనివార్య కారణాల వల్ల మిష న్‌ భగీరథ నీరు నిలిచిపోతే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో మిషన్‌భగీరథ ఎస్‌ఈ ఆంజనేయులు, ఈఈలు బాబు శ్రీనివాస్‌, నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.

యువత చేతుల్లోనే దేశ భవిష్యత్‌

ప్రతి ఒక్కరూ ఓటు హక్కునువినియోగించుకోవాలి

కలెక్టర్‌ నారాయణరెడ్డి

ఓట్‌ ఫర్‌ ష్యూర్‌ పేరుతో 5కే రన్‌

ఉత్సాహంగా పాల్గొన్న అధికారులు, విద్యార్థులు

Advertisement
Advertisement