రూ.5కోట్లతో ఆయుర్వేద ఫార్మసీ అభివృద్ధి | Sakshi
Sakshi News home page

రూ.5కోట్లతో ఆయుర్వేద ఫార్మసీ అభివృద్ధి

Published Sun, Mar 26 2023 1:32 AM

-

తిరుపతి తుడా : నరసింగాపురంలోని టీటీడీ ఆయుర్వేద ఫార్మసీని రూ.5కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు టీటీడీ జేఈఓ సదాభార్గవి తెలిపారు. శనివారం అధికారులతో కలిసి ఫార్మసీ విస్తరణ పనులను పరిశీలించారు. జేఈఓ మాట్లాడుతూ ఆయుర్వేద ఫార్మసీలో ప్రస్తుతం 30 రకాల ఔషధాలను తయారు చేస్తున్నామని, మరో 314 ఔషధాలను ఉత్పత్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందుకోసం ఆయుష్‌ మంత్రిత్వశాఖ నుంచి అనుమతులు వచ్చినట్లు వెల్లడించారు. ఈక్రమంలో తొలివిడతగా 10 రకాల ఔషధాలను సిద్ధం చేసేలా అత్యాధుని యంత్రాలతో ఏర్పాటు చేసిన షెడ్‌ను ఈ నెల 31వ తేదీన ప్రారంభిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో చీఫ్‌ ఇంజినీర్‌ నాగేశ్వరరావు, ఎస్‌ఈలు సత్యనారాయణ, వెం కటేశ్వర్లు, ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ మురళీకృష్ణ, ఆయుర్వేద ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రేణు దీక్షిత్‌ , ఫార్మసీ సాంకేతిక అధికారి డాక్టర్‌ నారపరెడ్డి, ఈఈ మురళీకృష్ణ, డీఈ సరస్వతి పాల్గొన్నారు.

Advertisement
Advertisement