ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు: ఈడీ నోటీసులపై క్లారీటీ.. ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌

MLC Kavitha Responded To Delhi Liquor Scam Notices - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఈడీ దూకుడు పెంచింది. దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో నలభై ప్రాంతాల్లో దర్యాప్తు అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో పలువురు ప్రముఖుల ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి.
చదవండి: అవాక్కయ్యే ఘటన.. ‘జయహో జగదీష్‌రెడ్డి’.. జిల్లా పోలీస్‌ బాస్‌ అత్యుత్సాహం

మరోవైపు ఈడీ నుంచి ఎలాంటి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తనపై దుష్ఫ్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో కూర్చొని కొందరు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. మీడియా వాస్తవాలను మాత్రమే ప్రసారం చేయాలి. తప్పుడు వార్తలు ప్రసారం చేసి ప్రజల విలువైన సమయాన్ని వృథా చేయొద్దు. ఎలాంటి ఈడీ నోటీసులు నాకు అందలేదు’’ అని ఆమె ట్వీట్‌ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top