అర్ధరాత్రి పారిపోయిన కరోనా పేషెంట్‌ | COVID 19 Patient Escape Midnight From Isolation Ward Khammam | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి పారిపోయిన కరోనా పేషెంట్‌

Aug 1 2020 1:29 PM | Updated on Aug 1 2020 1:29 PM

COVID 19 Patient Escape Midnight From Isolation Ward Khammam - Sakshi

కొత్తగూడెంఅర్బన్‌: కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న కరోనా పాజిటివ్‌ వ్యక్తి గురువారం అర్ధరాత్రి పారిపోయాడు. ఆ వ్యక్తి అశ్వారాపుపేట మండలం నాచారం గ్రామానికి చెందిన పిల్లి వెంకటేశ్వర్లుగా గుర్తించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సరళ తెలిపారు. వెంకటేశ్వర్లు పారిపోయిన విషయంను అశ్వారావుపేట పోలీసులు, అక్కడి ఆస్పత్రి వైద్యులకు సమాచారమిచ్చామని తెలిపారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో భయాందోళన చెంది వెంకటేశ్వర్లు వార్డు నుంచి పారిపోయి ఉండవచ్చని అధికారులు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement