
అజిత్‌కుమార్ హత్యను నిరసిస్తూ విద్యార్థుల ధర్నా
వేలూరు: శివగంగై జిల్లాలోని భద్రకాళిఅమ్మన్ ఆలయ సెక్యూరిటీ అజిత్‌కుమార్‌ను హత్యను ఖండిస్తూ వేలూరు జిల్లా కాట్పాడిలోని న్యాయ కళాశాల విద్యార్థులు కళాశాల ఎదుట ధర్నా నిర్వహించి నినాదాలు చేశారు. ముందుగా అజిత్ కుమార్ చిత్ర పటాన్ని ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రస్తుతం డీఎంకే ప్రభుత్వంలో లాకప్‌డెత్‌లు తరచూ జరుగుతున్నాయని వీటిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం అజిత్‌కుమార్ హత్యకు కారణమైన పోలీసులపై కఠిన శిక్ష విధించాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులకు న్యాయస్థానం తగిన గుణపాఠం చెప్పాలని, నిరుపేదలపై పోలీసులు జులం చూపించడం మానుకోవాలని తదితర డిమాండ్‌లు పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు. న్యాయ కళాశాల విద్యార్థులు ఉన్న ఫలంగా కళాశాల ఎదుట ధర్నా నిర్వహించడంతో పోలీసులు అఽధిక సంఖ్యలో చేరుకున్నారు. అనంతరం విద్యార్థులు ధర్నాను విరమించారు.