క్రిస్మస్ వేడుకలను విజయవంతం చేయాలి
సూర్యాపేట: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో డిసెంబర్ 16న జరగనున్న క్రిస్మస్ వేడులకను విజయవంతం చేయాలని పాస్టర్స్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ మామిడి శాంసన్ కోరారు. వేడుకల పోస్టర్‌ను ఆదివారం పాస్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సూర్యాపేటలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వేడుకలకు సినీనటుడు రాజా హాజరు కానున్నారని తెలిపారు. ఇటీవల సికింద్రాబాద్ సెంటినరీ బాప్టిస్టు చర్చి 150వ వార్షికోత్సవంలో సూర్యాపేటకు చెందిన చర్చికాంపౌండ్ బాప్టిస్టు చర్చి పాస్టర్ ప్రభుదాస్‌కు రాష్ట్ర బాప్టిస్టు సంఘాల స్థాయిలో లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు రావడంతో ఆయనను సత్కరించారు. కార్యక్రమంలో పాస్టర్‌లు సాల్మన్‌రాజు, మీసాల ప్రభుదాస్, డి ఫౌల్, జాన్ మార్క్, గాబ్రియల్, సాయిని జాకబ్, సామ్యూల్ కిరణ్, పుల్లూరు డానియల్, బాబురావు, హజార్య, పూర్ణ శశికాంత్ తదితరులు పాల్గొన్నారు.


