మంత్రి అచ్చెన్నాయుడు తీరు బాధాకరం | - | Sakshi
Sakshi News home page

మంత్రి అచ్చెన్నాయుడు తీరు బాధాకరం

May 28 2025 12:19 AM | Updated on May 28 2025 12:19 AM

మంత్రి అచ్చెన్నాయుడు తీరు బాధాకరం

మంత్రి అచ్చెన్నాయుడు తీరు బాధాకరం

టెక్కలి: మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతదేహాన్ని సొంత గ్రామానికి తీసుకువచ్చే విషయంలో కుటుంబ సభ్యులను బెదిరిస్తూ, అధికార దర్పంతో ఆంక్షలు విధించిన మంత్రి అచ్చెన్నాయుడు తీరు బాధాకరమని వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్‌ మండిపడ్డారు. ప్రజా ఉద్యమాల్లో కేశవరావు అగ్రనేతగా మారినప్పటికీ కుటుంబ సభ్యులకు అభిమానం ఉంటుందన్నారు. సొంత గ్రామంలో అంత్యక్రియలు చేయకూడదనే ఆంక్షలతో కుటుంబ సభ్యులను మంత్రి అచ్చెన్నాయుడు బెదిరించడం కేవలం ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్‌ చేసినట్లుగా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కుటుంబాన్ని మానసిక వేదనకు గురి చేసేలా ప్రవర్తించడం మంచిదికాదన్నారు. బాధితులకు అండగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు ఇలా ఆ కుటుంబాలను మానసికంగా హింసించడమే కాకుండా బెదిరించడం మానవత్వం కాదని పేర్కొన్నారు.

వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి తిలక్‌ మండిపాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement