
వైఎస్సార్సీపీ నేతపై టీడీపీ గూండాల దాడి
యాడికి: మండలంలో టీడీపీ గూండాలు బరితెగించారు. బోయరెడ్డిపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నేత మారుతిపై దాడికి పాల్పడ్డారు. సోమవారం మధ్యాహ్నం బోయరెడ్డిపల్లి నుంచి తన ద్విచక్ర వాహనంపై పెన్నా సిమెంటుకు బయలు దేరిన మారుతిని పరిశ్రమ సమీపంలో ఉన్న వంక వద్ద అదే గ్రామానికి చెందిన టీడీపీ గూండాలు అడ్డుకుని కట్టెలు, పైపులతో దాడి చేశారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన మారుతిని అటుగా వెళుతున్న వారు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ఓ ఆస్పత్రిలో కుటుంబసభ్యులు చేర్పించారు. విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వెంకట్రామిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు భోగాతి బ్రహ్మానందారెడ్డి, మల్లికార్జున, రామకృష్ణ తదితరులు అనంతపురంలోని ఆస్పత్రికి చేరుకుని మారుతిని పరామర్శించారు.