స్టార్‌ రెజర్ల పెళ్లి సందడి : ఫోటోలు

Wrestlers Sangeeta Phogat, Bajrang Punia tie the knot - Sakshi

భారత స్టార్‌ రెజర్లు భజరంగ్‌ పునియా సంగీత ఫొగట్‌ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. నవంబరు 26, గురువారం వీరి వివాహ వేడుక ఘనంగా ముగిసింది. ఈ మేరకు  సంగీత, పునియా సోషల్‌ మీడియాలో ఫోటోలను షేర్‌ చేశారు.  జీవితం పరిపూర్ణం. ఈ జీవితానికి తోడునువ్వు.  ఈ కొత్త అధ్యాయం ప్రేమ, సంతోషంతో నిండాలి అంటూ ఆమె ట్వీట్‌ చేశారు.

మరోవైపు వివాహంలో కూడా అద్భుతమైన వేడుక ఉందంటూ భజరంగ్‌ పునియా తన ఉద్వేగాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ రోజు నా జీవిత భాగస్వామిని నా ఇంటికి తీసుకు వచ్చాను.  జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాను. సంతోషంగా ఉంది ..అలాగే కొంచెం ఆందోళనగా ఉంది. ఈ పరీక్షలో నెగ్గాలి ఫ్రెండ్స్‌.  అత్యంత ప్రేమను. ఆశీర్వాదాలు అందించిన అందరినీ ధన్యవాదాలు అంటూ ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్‌  పెట్టారు. దీంతో ఈ నూతన దంపతులకు అభిమానుల శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.  కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లికి ముందు నిర్వహించే వేడుకల ఫోటోలు సోషల్‌ మీడియాలో క్రీడాభిమానులకు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా  హల్దీ వేడుకల్లో  పసుపు రంగు దుస్తుల్లో  సంగీత మెరిసి పోయిన సంగతి తెలిసిందే

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top