SL Vs PAK 2nd Test: ఒకటీ అరా గెలిచి.. ఏదో పొడిచేసినట్లు విర్రవీగడం! పాక్‌ జట్టుకు..

SL Vs PAK 2nd Test: Kamran Akmal Lashes Out At Pakistan Over Defeat - Sakshi

Sri Lanka Vs Pakistan Test Series: శ్రీలంక చేతిలో ఘోర ఓటమి నేపథ్యంలో పాకిస్తాన్‌ జట్టుపై ఆ దేశ మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కమ్రాన్‌ అక్మల్‌ విమర్శలు చేశాడు. మొదటి టెస్టులో గెలుపుతో సంతృప్తి పడ్డారని.. అందుకే రెండో మ్యాచ్‌లో కనీస పోరాటం కూడా చేయలేక చేతులెత్తేశారని మండిపడ్డాడు. ఒకటీ అర విజయాలతో ఏదో పొడిచేశామని విర్రవీగడం అలవాటులా మారిందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

ఐసీసీ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ 2021-23లో భాగంగా శ్రీలంక టూర్‌కు వెళ్లింది పాకిస్తాన్. గాలే వేదికగా జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పర్యాటక పాక్‌ తొలి టస్టులో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే, రెండో మ్యాచ్‌లో ఆతిథ్య లంక ధీటుగా బదులిచ్చింది. ఏకంగా 246 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది.

ఈ మ్యాచ్‌లో లంక స్పిన్నర్‌ ప్రభాత్‌ జయసూర్య, రమేశ్‌ మెండిస్‌ పాక్‌ ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. వీరి ధాటికి లోయర్‌ ఆర్డర్‌ ఘోరంగా విఫలమైంది. ప్రభాత్‌ మొత్తంగా ఎనిమిది వికెట్లు తీయగా.. రమేశ్‌ 9 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 


కమ్రాన్‌ అక్మల్‌

ఈ నేపథ్యంలో పాక్‌ ఓటమి పాలైంది. సిరీస్‌ 1-1తో సమమైంది. అంతేగాక డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మూడో స్థానం కోల్పోయింది. ఈ నేపథ్యంలో కమ్రాన్‌ అక్మల్‌ మాట్లాడుతూ.. ‘‘ఒక్క టెస్టు మ్యాచ్‌లో విజయంతో పాకిస్తాన్‌ జట్టు సంతృప్తి పడిపోయింది. 

ఇక ఇప్పుడు వీళ్లు నెదర్లాండ్స్‌ వంటి జట్టును ఓడిస్తారు. ఆసియా కప్‌లో ఎలాగోలా నెగ్గుకొస్తారు. ఆలోపు అభిమానులు ఈ టెస్టు సిరీస్‌ గురించి మర్చిపోతారు. ఒకటీ రెండు విజయాలు సాధించి ఏదో సాధించినట్లు ఫీలవుతూ ఉంటారు. మూడు నాలుగేళ్ల పాటు ఈ అరకొర గెలుపు గురించి మాట్లాడుకుంటూ ఉంటారని అనుకుంటారు. శ్రీలంకతో రెండో టెస్టులో భారీ టార్గెట్‌ ఛేదించలేక ఏదో మొక్కుబడిగా ఆడారు. వాళ్ల బాడీ లాంగ్వేజ్‌ చూస్తేనే ఆ విషయం అర్థమవుతోంది’’ అని మండిపడ్డాడు.  

శ్రీలంక వర్సెస్‌ పాకిస్తాన్‌ రెండో టెస్టు స్కోర్లు:
టాస్‌: శ్రీలంక- బ్యాటింగ్‌
శ్రీలంక ఇన్నింగ్స్‌: 378 & 360/8 డిక్లేర్డ్‌
పాక్‌ ఇన్నింగ్స్‌: 231 & 261
విజేత: 246 పరుగులతో శ్రీలంక గెలుపు.. సిరీస్‌ 1-1తో సమం
చదవండి: Sanju Samson In T20I Squad: విండీస్‌తో తొలి టి20.. టీమిండియాకు గుడ్‌న్యూస్‌ 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top