Shan Masood backs under-fire Pakistan captain Babar Azam - Sakshi
Sakshi News home page

బాబర్‌ ఆజం కోసం ప్రాణత్యాగాలకైనా సిద్దం.. పాక్‌ స్టార్‌ బ్యాటర్‌ సంచలన వాఖ్యలు

Mar 8 2023 10:49 AM | Updated on Mar 8 2023 11:45 AM

Shan Masood backs under-fire Pakistan captain Babar Azam - Sakshi

పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజాంపై గత కొంతకాలంగా విమర్శల వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. బ్యాటర్‌గా అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ సారథిగా మాత్రం జట్టును విజయపథంలో నడిపించడంలో  విఫలవమవుతున్నాడు.  

గతేడాది ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్ జట్లు పాకిస్తాన్ ను సొంతగడ్డమీదే మట్టికరిపించాయి. ఈ క్రమంలో ఆజంను పాకిస్తాన్‌ కెప్టెన్సీ నుంచి తొలిగించాలని ఆ దేశ మాజీ ఆటగాళ్లు పెద్ద ఎత్తున డిమాండ్‌ చేశారు. ఇప్పటికీ బాబర్‌ను పాక్‌ కెప్టెన్సీ నుంచి తప్పించాలని వాదనలు వినిపిస్తున్నాయి.

అయితే  అతడి జట్టు  సహచరులు మాత్రం  బాబర్‌ కు అండగా నిలుస్తున్నారు.  తాజాగా సమా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబర్‌ ఆజంను ఉద్దేశించి పాకిస్తాన్‌ స్టార్‌ బ్యాటర్‌  షాన్ మసూద్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. బాబర్‌ అంటే తమకు ఎంతో ఇష్టమని.. అతడి కోసం ప్రాణాలను త్యాగం చేయడానికి కూడా మా ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారని మసూద్ తెలిపాడు. 

"మేముందరం బాబర్‌కు మద్దతుగా ఉంటాం. సర్ఫరాజ్‌ అహ్మద్‌ కెప్టెన్‌గా ఉన్నప్పుడు అతని కోసం ప్రాణాలివ్వడానికి సిద్ధపడ్డాం. ఇప్పడు బాబర్‌ ఆజం కోసం కూడా అదే పని చేసేందుకు సిద్ధమయ్యాం. దేశం కోసం అత్యుత్తమంగా ఆడటమే మా అందరి లక్ష్యం. మా జట్టుపై చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ఆటలో గెలుపు ఓటములు సహజం. అంత మాత్రాన జట్టును తక్కువగా చేసి మాట్లడకూడదు. మమ్మల్ని వ్యక్తిగతంగా కూడా దూషిస్తున్నారు. కానీ మేము అవి పట్టించుకోం అని" మసూద్ పేర్కొన్నాడు. కాగా వన్డే ఫార్మాట్లో పాకిస్తాన్‌ జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా మసూద్‌ వ్యవహరిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement