Photo Credit: Twitter
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా భారత్, వెస్టిండీస్ రేపు మూడో టీ20 మ్యాచ్‌లో తలపడనున్నాయి. రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా విధించిన 250 పరుగుల లక్ష్యాన్ని విండీస్ 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో మూడో టీ20కి టీమిండియా తుదిజట్టులో రెండు మార్పులు మాత్రం ఖాయంగా కనిపిస్తున్నాయి.
ఆల్‌రౌండర్ శివమ్ దూబేతో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడో టీ20 మ్యాచ్‌కు బెంచ్‌కు పరిమితమయ్యే అవకాశముంది. వీరి స్థానాల్లో నితీశ్ కుమార్ రెడ్డి, ప్రిన్స్ యాదవ్‌లు తుదిజట్టులోకి వచ్చే చాన్స్ ఉంది. రెండో టీ20లో అర్థసెంచరీతో సంజూ శాంసన్ ఫామ్‌లోకి రావడంతో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నాడు.
ఓపెనర్లుగా అభిషేక్, శాంసన్, వన్‌డౌన్‌లో ఇషాన్ కిషన్ రానున్నారు. శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, నితీశ్ రెడ్డిలతో మిడిలార్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. లోయర్ ఆర్డర్‌లో అక్షర్ పటేల్, నమన్ ధీర్‌లు కీలకం కానున్నారు. బౌలింగ్ విభాగంలో కుల్దీప్ యాదవ్ విఫలం కావడంతో అతడి స్థానంలో ప్రిన్స్ యాదవ్ రానున్నాడు. నమన్‌తో కలిసి అక్షర్ పటేల్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నాడు. ఇక అర్షదీప్, మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్‌లు పేస్ బౌలింగ్ బాధ్యతలు తీసుకోనున్నారు.
ఆకట్టుకోని దూబే..
గత 10 ఇన్నింగ్స్‌ల్లో పెద్దగా ఆకట్టుకోని శివమ్ దూబే శుక్రవారం జరిగిన రెండో టీ20లో బ్యాటింగ్‌లో ప్రమోషన్ లభించినప్పటికీ దారుణంగా విఫలమయ్యాడు. 10 బంతుల్లో ఏడు పరుగులు చేసి నిరాశపరిచాడు. అతడి స్లో బ్యాటింగ్ వల్ల టీమిండియా కీలక రన్‌రేట్‌ను కోల్పోవాల్సి వచ్చింది. అదీగాక బౌలింగ్‌లోనూ దూబే పెద్దగా రాణించలేకపోయాడు. మ్యాచ్‌లో 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ వేసిన దూబే 30 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో శివమ్ దూబేపై వేటు వేయాలనే డిమాండ్లు పెరిగాయి. అందుకే మూడో టీ20కి దూబే స్థానంలో నితీశ్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది.
అందుకే కుల్దీప్‌పై వేటు..
ఇండోర్ పిచ్ పేసర్లకు అనుకూలించే అవకాశం ఉండడంతో కుల్దీప్ యాదవ్ మూడో టీ20కి బెంచ్‌కు పరిమితమయ్యే చాన్స్ ఉంది. తొలి టీ20లో రెండు వికెట్లు తీసిన కుల్దీప్.. రెండో టీ20లో ఒక వికెట్ తీసినప్పటికీ 4 ఓవర్లలో 53 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో మూడో టీ20కి ప్రిన్స్ యాదవ్ రాక ఖాయంగా కనబడుతోంది.
ఇప్పటికే రెండో టీ20లో తన ఫాస్ట్ బౌలింగ్‌తో ఆకట్టుకున్న మయాంక్ యాదవ్ మూడు కీలక వికెట్లు తీశాడు. మూడో టీ20లోనూ అతడు మరోసారి కీలకం కానున్నాడు. సీనియర్ల గైర్హాజరీలో బౌలింగ్‌లో పెద్దన్న పాత్ర పోషిస్తున్న అర్షదీప్ విఫలమవ్వడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. కనీసం మూడో టీ20లోనైనా అర్షదీప్ మెరుగైన ప్రదర్శన చేస్తాడని ఆశిద్దాం.
భారత తుదిజట్టు అంచనా
సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధీర్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్.
ఇదీ చదవండి:


