IPL 2023: సాల్ట్‌ కేవలం బ్యాటర్‌గా మాత్రమే! జాక్‌పాట్‌పై టాక్సీ డ్రైవర్‌ కొడుకు హర్షం

IPL 2023: Agarkar Says Phil Salt Could Play As Batter Pant Is There - Sakshi

IPL 2023 Mini Auction- Delhi Capitals: ‘‘ఫిల్‌ సాల్ట్‌ మంచి బ్యాటర్‌, వికెట్‌ కీపర్‌ కూడా! అయితే మా కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ రూపంలో మాకు వికెట్‌ కీపర్‌ ఉన్నాడు. కాబట్టి సాల్ట్‌ను కేవలం బ్యాటర్‌గానే ఉపయోగించుకుంటాం’’ అని ఢిల్లీ క్యాపిటల్స్‌ అసిస్టెంట్‌ కోచ్‌ అజిత్‌ అగార్కర్‌ అన్నాడు.

కాగా కొచ్చి వేదికగా శుక్రవారం జరిగిన ఐపీఎల్‌-2023 మినీ వేలంలో ఢిల్లీ ఇంగ్లండ్‌ ఆటగాడు ఫిల్‌ సాల్ట్‌ కోసం 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. టీ20 ప్రపంచకప్‌-2022 గెలిచిన జట్టులో సభ్యుడైన ఈ 26 ఏళ్ల బ్యాటర్‌ను తమ సొంతం చేసుకుంది. 

ఓపెనర్‌గా రాణించగల సాల్ట్‌ టీ20 కెరీర్‌లో ఇప్పటి వరకు 167 మ్యాచ్‌లు ఆడి 3817 పరుగులు చేశాడు. అయితే, ఇంతవరకు అతడికి ఐపీఎల్‌లో ఆడిన అనుభవం లేదు. ఈ నేపథ్యంలో అజిత్‌ అగార్కర్‌ మాట్లాడుతూ.. సాల్ట్‌ గొప్ప బ్యాటర్‌ అంటూ కొనియాడాడు.

అయితే, పంత్‌ ఉన్న కారణంగా సాల్ట్‌ను వికెట్‌ కీపర్‌గా చూసే అవకాశం లేదన్నాడు. ఇక ఇషాంత్‌ శర్మ గురించి చెబుతూ.. ‘‘అనుభవజ్ఞుడైన ఢిల్లీ ప్లేయర్‌ ఇషాంత్‌ శర్మ మాతో ఉన్నాడు. తన కెరీర్‌లో ఎలాంటి అద్భుతాలు చేశాడో అందరికీ తెలుసు. అతడు మా జట్టులో ఉండటం సంతోషకరం’’ అని హర్షం వ్యక్తం చేశాడు.

టాక్సీ డ్రైవర్‌ కొడుకుకు ఐదున్నర కోట్లు!
కాగా.. టీమిండియా వెటరన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ఇషాంత్‌కు 50 లక్షలు వెచ్చించిన ఢిల్లీ యాజమాన్యం.. అన్‌క్యాప్డ్‌ స్పీడ్‌స్టర్‌ ముకేశ్‌ కుమార్‌ కోసం ఏకంగా ఐదున్నర కోట్లు ఖర్చు చేసింది. ఈ విషయంపై ముకేశ్‌ స్పందిస్తూ.. ‘‘నా ఫ్రెండ్‌ ఫోన్‌ చేసి అభినందించే దాకా నేను వేలంలో అమ్ముడుపోయానన్న విషయం నాకు తెలియదు.

అస్సలు నమ్మలేకపోతున్నా. గత సీజన్‌లో నెట్‌బౌలర్‌గా ఉన్నా. ఇప్పుడు జట్టుకు ఆడబోతున్నా’’ అని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఢిల్లీ ఫ్రాంఛైజీకి ధన్యవాదాలు తెలిపాడు. బిహార్‌లో పుట్టి బెంగాల్‌కు ఆడుతున్నాడు ఈ పేసర్‌. ఇక టాక్సీ డ్రైవర్‌ కొడుకైన ముకేశ్‌ తొలిసారి ఇలా జాక్‌పాట్‌ దక్కించుకోవడం విశేషం.

ఢిల్లీ క్యాపిటల్స్‌.. వేలంలో కొన్న ఆటగాళ్లు
ఇషాంత్ శర్మ (50 లక్షలు), ఫిల్ సాల్ట్ (2 కోట్లు), ముఖేష్ కుమార్ (5.5 కోట్లు), మనీష్ పాండే ( 2.4 కోట్లు), రిలీ రోసో (4.60 కోట్లు)

చదవండి: IPL: వేలంలో అమ్ముడుపోయిన ప్లేయర్లు, పదింటిలో ఏ జట్టులో ఎవరు? ఇతర వివరాలు.. అన్నీ ఒకేచోట

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top