
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు సరి కొత్త చరిత్ర సృష్టించింది. ఈ టెస్టు తొలి రోజు ఆటను చూసేందుకు లక్షమంది మంది ప్రేక్షకులు తరలివచ్చారు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక రోజు ఆటను చూసేందుకు ఇంత మొత్తంలో అభిమానులు రావడం ఇదే తొలి సారి. అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ పేరిట ఉండేది.
26 డిసెంబర్ 2013న ఈ మైదానంలో ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరిగిన బాక్సింగ్ డే టెస్టు మొదటి రోజు ఆటను వీక్షంచేందుకు 91,092 మంది ప్రేక్షకులు వచ్చారు. ఇప్పటివరకు ఇదే అత్యధికం. తాజా టెస్టు మ్యాచ్ ఈ రికార్డును బ్రేక్ చేసింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా లంచ్ విరామానికి రెండు వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. క్రీజులో ఉస్మాన్ ఖవాజా(27), స్టీవ్ స్మిత్(2) పరుగులతో ఉన్నారు. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ స్టేడియంకు వచ్చారు.