IND Vs NZ: ఔటైన కోపంలో కోహ్లి ఏం చేశాడంటే.. వీడియో వైరల్

IND v NZ 2nd Test: Watch Video Virat Kohli Controversial Dismissal: ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఔటైన తీరు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అజాజ్ పటేల్ బౌలింగ్‌లో ఎల్బీ అయిన కోహ్లి డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. ఇన్నింగ్స్ 30 ఓవర్ వేసిన అజాజ్ పటేల్ బౌలింగ్‌లో.. విరాట్ కోహ్లి ఢిపెన్స్ ఆడడానికి ప్రయత్నించాడు. ఈక్రమంలో బంతి మిస్స్ అయ్యి ప్యాడ్‌కు తాకింది. దీంతో బౌలర్ అప్పీల్ చేయగా ఆన్ ఫీల్డ్ అంపైర్ ఔట్ గా ప్రకటించాడు. అయితే వెంటనే కోహ్లి రివ్యూకు వెళ్లాడు. రీప్లేలో పలుకోణాల్లో విజువల్స్ పరిశీలించిన థర్డ్ అంపైర్‌కు దాన్ని నిర్ధారించడం కష్టంగా మారింది.
రీప్లేలో, ఒక స్పైక్ కనిపించినప్పటికీ, బంతి మొదట బ్యాట్‌కి తగిలిందా లేదా ప్యాడ్‌కు తగిలిందా అనేది స్పష్టంగా తెలియలేదు. బాల్ ట్రాకింగ్‌లో బంతి స్టంప్‌లను తాకడంతో ఆన్-ఫీల్డ్ అంపైర్ నిర్ణయం ఆధారంగా థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. దీంతో థర్డ్ అంపైర్ నిర్ణయంపై కోహ్లి అసంతృప్తి చెందాడు. కోహ్లి నిరాశతో మైదానం వీడాడు. కాగా పెవిలియన్‌కు వెళ్లే క్రమంలో కోహ్లీ బౌండరీ రోప్‌లను తన బ్యాట్‌తో కొట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అదే విధంగా ఈ మ్యాచ్‌లో అజాజ్ పటేల్ బౌలింగ్ పూజారా, కోహ్లి ఇద్దరూ డకౌట్‌లుగా పెవిలియన్‌కు చేరారు.
చదవండి: David Warner: వార్నర్ కు అప్పుడు అండగా నిలిచింది వాళ్లే కదా.. అది గుర్తు లేదా?
Ek do ek do UMPIRE KO FEK DO!
Wankhede has gone wild after Kohli has got out 💔💔💔
Watch the entire reaction here...#INDvsNZ pic.twitter.com/8AfEbnnEcD
— Vinesh Prabhu (@vlp1994) December 3, 2021
మరిన్ని వార్తలు