Ind Vs Nz 2021 T20 Series: టీమిండియా సరికొత్త రికార్డు.. ఏకంగా ఆరు సార్లు..

Ind Vs Nz 2021 T20 Series: Most whitewash in Series Of 3 Plus Match T20Is - Sakshi

Ind Vs Nz 2021 T20 Series: Most whitewash in Series Of 3 Plus Match T20Is: టీ20 ప్రపంచకప్‌-2021లో భాగంగా న్యూజిలాండ్‌ చేతిలో ఓడి సెమీస్‌ చేరకుండానే నిష్క్రమించిన టీమిండియా స్వదేశంలో మాత్రం అద్భుతంగా రాణించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను  3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసి సత్తా చాటింది. కోల్‌కతా వేదికగా ఆఖరి మ్యాచ్‌లో రోహిత్‌ సేన 73 పరుగుల భారీ తేడాతో కివీస్‌ను ఓడించి విజయాన్ని పరిపూర్ణం చేసుకుంది.

ఈ నేపథ్యంలో టీ20 సారథిగా రోహిత్‌ శర్మ, హెడ్‌కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పూర్తిస్థాయిలో బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సిరీస్‌ను ఇలా వైట్‌వాష్‌ చేయడం ఇద్దరికీ మధుర జ్ఞాపకంగా మిగిలిపోనుంది. అంతేకాదు.. పొట్టి ఫార్మాట్‌ చరిత్రలో అంతర్జాతీయ స్థాయిలో మూడు కంటే ఎక్కువ సిరీస్‌లలో ప్రత్యర్థిని వైట్‌వాష్‌ చేసిన జట్టుగా టీమిండియా ఆఖరి మ్యాచ్‌లో సరికొత్త రికార్డును సృష్టించడం విశేషం. ఆరుసార్లు ఈ ఘనత సాధించిన జట్టుగా.. పాకిస్తాన్‌తో కలిసి భారత్‌ సంయుక్తంగా ఈ జాబితాలో ప్రథమ స్థానంలో ఉంది.

మూడు లేదంటే అంతకంటే ఎక్కువ సిరీస్‌లను వైట్‌వాష్‌ చేసిన జట్లు:
టీమిండియా- 6 సార్లు
పాకిస్తాన్‌- 6 సార్లు
అఫ్గనిస్తాన్‌- 5 సార్లు
ఇంగ్లండ్‌- 4 సార్లు
దక్షిణాఫ్రికా- 3 సార్లు

వైట్‌వాష్‌- టీమిండియా ప్రత్యర్థులు
2016లో ఆస్ట్రేలియాను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌
2017లో శ్రీలంకను 3-0 తేడాతో(ఆతిథ్యం)
2018లో వెస్టిండీస్‌ను 3-0 తేడాతో(ఆతిథ్యం)
2019లో వెస్టిండీస్‌ను 3-0 తేడాతో
2020లో న్యూజిలాండ్‌ను 5-0 తేడాతో
2021లో న్యూజిలాండ్‌ను 3-0తేడాతో (ఆతిథ్యం)

ఇక ద్వైపాక్షిక సిరీస్‌లో న్యూజిలాండ్‌పై భారత్‌కు ఇది వరుసగా ఎనిమిదో విజయం కావడం విశేషం.
అదే విధంగా ఇప్పటి వరకు రెండు జట్ల మధ్య ఆరు టి20 సిరీస్‌లు జరుగగా.. కివీస్‌పై భారత్‌కిది మూడో టి20 సిరీస్‌ విజయం.
ఇక కెప్టెన్‌గా స్వదేశంలో రోహిత్‌ కెప్టెన్సీలో భారత్‌ గెలిచిన టి20 మ్యాచ్‌ల సంఖ్య 11.

చదవండి: Lendl Simmons T20 XI: ఒకే జట్టులో ధోని, కోహ్లి.. కెప్టెన్‌గా ఎవరంటే..?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top