హంపి తొలి గేమ్‌ ‘డ్రా | Hampis first game was Draw | Sakshi
Sakshi News home page

హంపి తొలి గేమ్‌ ‘డ్రా

Apr 6 2024 1:43 AM | Updated on Apr 6 2024 1:43 AM

Hampis first game was Draw - Sakshi

టొరంటో: క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో ఐదుగురు భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, వైశాలి, ప్రజ్ఞానంద, గుకేశ్, విదిత్‌ తమ తొలి రౌండ్‌ గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. మహిళల విభాగంలో తమిళనాడు అమ్మాయి వైశాలితో జరిగిన తొలి గేమ్‌ను ఆంధ్రప్రదేశ్‌ స్టార్‌ హంపి 41 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది.

ఓపెన్‌ విభాగంలో అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్‌)తో జరిగిన గేమ్‌ను ప్రజ్ఞానంద 39 ఎత్తుల్లో... విదిత్‌తో జరిగిన గేమ్‌ను గుకేశ్‌ 21 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నారు. ఓపెన్‌ విభాగంలో ఎనిమిది మంది మధ్య... మహిళల విభాగంలో ఎనిమిది మంది మధ్య డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది. రెండు విభాగాల విజేతలు ప్రస్తుత ప్రపంచ చాంపియన్స్‌తో ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ కోసం తలపడతారు.  

Advertisement
 
Advertisement
Advertisement