వైశాలి చేతిలో హంపి ఓటమి | Hampi defeated by Vaishali | Sakshi
Sakshi News home page

వైశాలి చేతిలో హంపి ఓటమి

May 30 2024 4:06 AM | Updated on May 30 2024 4:06 AM

Hampi defeated by Vaishali

స్టావెంజర్‌: నార్వే చెస్‌ మహిళల టోర్నీలో ప్రపంచ ఐదో ర్యాంకర్, భారత స్టార్‌ కోనేరు హంపి తొలి ఓటమిని చవిచూసింది. భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్‌ వైశాలితో జరిగిన రెండో రౌండ్‌ క్లాసికల్‌ గేమ్‌లో హంపి 44 ఎత్తుల్లో ఓడిపోయింది. క్లాసికల్‌ గేమ్‌లో నెగ్గినందుకు వైశాలికి మూడు పాయింట్లు లభించాయి. ఆరుగురు మేటి గ్రాండ్‌మాస్టర్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో రెండో రౌండ్‌ తర్వాత వైశాలి నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. 

ఇదే టోర్నీ పురుషుల విభాగంలో వైశాలి తమ్ముడు ప్రజ్ఞానందకు రెండో రౌండ్‌ అర్మగెడాన్‌ గేమ్‌లో ఓటమి ఎదురైంది. ప్రపంచ చాంపియన్‌ డింగ్‌ లిరెన్‌తో జరిగిన రెండో రౌండ్‌ క్లాసికల్‌ గేమ్‌ను ప్రజ్ఞానంద 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఇద్దరి మధ్య విజేతను నిర్ణయించడానికి అర్మగెడాన్‌ గేమ్‌ నిర్వహించగా తెల్ల పావులతో ఆడిన డింగ్‌ లిరెన్‌ 51 ఎత్తుల్లో ప్రజ్ఞానందను ఓడించాడు.  

Advertisement
 
Advertisement
Advertisement