T20 WC 2023: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్.. ప్రపంచంలో తొలి జట్టుగా!

మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. పొట్టి ప్రపంచకప్‌లో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. టీ20 వరల్డ్‌కప్-2023లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఇంగ్లండ్ 213 పరుగుల భారీ స్కోర్ సాధించింది. తద్వారా ఈ అరుదైన ఘనతను ఇంగ్లీష్ జట్టు తమ ఖాతాలో వేసుకుంది.
ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ నాట్ స్కివర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 40 బంతుల్లో 12 ఫోర్లే, ఓ సిక్సర్ సాయంతో 81 పరుగులు చేసింది. ఆమెతో పాటు అమీ జోన్స్(47) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడింది.
వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్‌లు ఫలితంగా ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 213 పరుగులు చేసింది. ఇక పాకిస్తాన్ బౌలర్లలో ఫాతిమా సానా రెండు, ఇక్భాల్, నిదా ధార్, హసన్ తలా వికెట్ సాధించారు. ఇక 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 99 పరుగులకే కుప్పకూలింది. తద్వారా 114 పరుగుల తేడాతో పాక్‌పై ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది.
చదవండి: IND vs AUS: దినేష్ కార్తీక్ ముందే పసిగట్టాడా? ఆసీస్ కుప్పకూలుతుందని..
A stunning performance with the bat! 💪
We become the first team to pass 200 at a Women's T20 World Cup! 🔥🔥🔥
Scorecard: https://t.co/TeqEjKWEy2#ENGvPAK | #T20WorldCup pic.twitter.com/9iDMegt112
— England Cricket (@englandcricket) February 21, 2023