బౌలర్‌ను చూసి బ్యాటింగ్‌ ఎండ్‌ మార్చుకున్న వార్నర్‌.. తొలి బంతికే ఔట్‌.. | David Warner changes ends upon seeing Liam Livingstone bowl first over of innings | Sakshi
Sakshi News home page

IPL 2022: బౌలర్‌ను చూసి బ్యాటింగ్‌ ఎండ్‌ మార్చుకున్న వార్నర్‌.. తొలి బంతికే ఔట్‌..

May 16 2022 10:00 PM | Updated on May 17 2022 8:29 AM

David Warner changes ends upon seeing Liam Livingstone bowl first over of innings - Sakshi

Courtesy: IPL Twitter

ఐపీఎల్‌-2022లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ గోల్డన్‌ డక్‌గా వెనుదిరిగాడు. లివింగ్‌స్టోన్‌ వేసిన తొలి ఓవర్‌ తొలి బంతికే వార్నర్‌.. రాహుల్‌ చాహర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అయితే ఆసక్తికర విషయం ఏమిటింటే.. తొలి బంతిని ఎదర్కొనేందుకు సర్ఫరాజ్‌ ఖాన్‌ సిద్దమయ్యాడు.

అయితే మయాంక్‌ అగర్వాల్‌ బంతిని లివింగ్‌స్టోన్‌ చేతికి ఇవ్వడంతో అఖరి నిమిషంలో వార్నర్ ఎండ్‌ను మార్చుకుని మొదటి బంతిని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు. కాగా దురదృష్టవశాత్తూ వార్నర్‌ తొలి బంతికే ఔటయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: IPL 2022: కోల్‌కతా నైట్ రైడర్స్‌కు భారీ షాక్‌.. సీనియర్‌ ఆటగాడు దూరం..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement