దేవుడి దయ వల్ల అమ్మ ఇప్పుడు బాగుంది.. ఈ అవార్డు తనకే! | Avesh Khan dedicates Player of the Match award to hospitalized mother | Sakshi
Sakshi News home page

IPL 2022: దేవుడి దయ వల్ల అమ్మ ఇప్పుడు బాగుంది.. ఈ అవార్డు తనకే!

Apr 5 2022 3:06 PM | Updated on Apr 5 2022 4:33 PM

Avesh Khan dedicates Player of the Match award to hospitalized mother - Sakshi

ఐపీఎల్‌-2022లో భాగంగా సోమవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ పేసర్‌ అవేష్‌ ఖాన్‌ అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో అవేష్‌ ఖాన్‌ నాలుగు వికెట్లు పడగొట్టి లక్నో సూపర్‌ జెయింట్స్‌ విజయంలో కీలక​పాత్ర పోషించాడు. అవేష్‌ ఖాన్‌ తన నాలుగు ఓవర్ల కోటాలో.. 24 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో అవేష్‌  తన ఐపీఎల్‌ కెరీర్‌లో అత్యత్తుమ గణాంకాలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో అద్భత ప్రదర్శన చేసిన అవేష్‌ ఖాన్‌.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డుకు ఎంపికయ్యాడు. అయితే తన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఆసుపత్రిలో తన తల్లికి అవేష్‌ ఖాన్‌ అంకితం చేసాడు.

"నాకు దక్కిన ఈ అవార్డును ఆసుపత్రిలో ఉన్న మా అమ్మకు అంకితం చేయాలనుకుంటున్నాను. ఆమె నాకు చాలా సపోర్ట్‌గా ఉండేది. మ్యాచ్ ముగిసిన తర్వాత, నేను మా అమ్మతో వీడియో కాల్‌లో మాట్లాడాను. ఈ మ్యాచ్‌కు సంబంధించిన విషయాలను ఆమెతో చెప్పాను. ఈ మ్యాచ్‌లో నా ప్రదర్శన పట్ల ఆమె సంతోషించింది. దేవుని దయతో, ఆమె ఇప్పుడు క్షేమంగా ఉంది అని మ్యాచ్ అనంతరం ఇంటరాక్షన్‌లో అవేష్‌ ఖాన్‌ పేర్కొన్నాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే..  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై లక్నో సూపర్‌ జెయింట్స్‌ 12  పరుగుల తేడాతో విజయం సాధించింది.

చదవండి: IPL 2022: ప్లే ఆఫ్స్‌కు లక్నో, గుజరాత్..!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement