
టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్.. మరో మాజీ ప్లేయర్ హేమంగ్ బదానిని బ్యాట్‌తో తీవ్రంగా గాయపరిచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే వీరిద్దరు ఎప్పుడు క్రికెట్ ఆడారనేగా మీ డౌటు. అదేం లేదు లెండి. ఆసియాకప్‌లో భాగంగా అఫ్గనిస్తాన్, శ్రీలంక మ్యాచ్ ప్రారంభానికి ముందు కామెంటరీ బాక్స్‌లో శ్రీకాంత్.. బ్యాట్‌తో ఒక షాట్ గురించి వివరించాడు.
ఈ సమయంలో అతని పక్కనే ఉన్న బదానికి పొరపాటున బ్యాట్ తాకింది. బ్యాట్ బలంగా తాకడంతో బదాని కాసేపు నొప్పితో విలవిల్లాడాడు. అయితే కాసేపయ్యాకా బదాని గట్టిగా తగలడంతో కాసేపు నొప్పి పెట్టింది.. ఇప్పుడు సర్దుకుంది అని పేర్కొన్నాడు. కాగా మ్యాచ్ అనంతరం బదాని ట్విటర్ వేదికగా స్పందించాడు. ''నా గాయం గురించి ఆరా తీసిన ప్రతీ ఒక్కరికి నా కృతజ్ఞతలు. బ్యాట్ తగిలినప్పుడు చాలా నొప్పిగా అనిపించింది. దేవుడి దయవల్ల ఎలాంటి ఫ్రాక్చర్ కాలేదు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకున్నా. తొందరగా కోలుకొని త్వరలోనే మీ ముందుకొస్తా'' అని వివరించాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆఫ్గనిస్తాన్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 106 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి ఆఫ్గనిస్తాన్‌కు ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ 83 పరుగుల భాగస్వామ్యం తొలి వికెట్‌కు నెలకొల్పి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. తద్వారా ఆఫ్గనిస్తాన్ రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని 10.1 ఓవర్లలో చేధించింది.
ఆఫ్గాన్ బ్యాటర్లలో హజ్రతుల్లా జజాయ్(37),గుర్బాజ్(40) పరుగులతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో హసరంగా ఒక్కడే ఒక వికెట్ సాధించాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఆఫ్గాన్ బౌలర్లు చేలరేగడంతో 105 పరుగులకే కుప్పకూలింది. ఆఫ్గానిస్తాన్ బౌలర్లలో ఫజల్హక్ ఫారూఖీ మూడు కీలక వికెట్లు పడగొట్టగా.. నబీ, ముజీబ్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక శ్రీలంక బ్యాటర్లలో భానుక రాజపక్స 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
#HemangBadani #KrisSrikanth#AsiaCup
— Express Cricket (@IExpressCricket) August 28, 2022
I am in terrible pain but luckily no fracture: Hemang Badani 👇 pic.twitter.com/uSx0Wduz1t
చదవండి: Aditya Tare: 17 ఏళ్ల బంధానికి స్వస్తి పలికిన క్రికెటర్
Mickey Arthur: హార్ధిక్ పాండ్యాపై ప్రశంసల వర్షం కురిపించిన పాక్ మాజీ కోచ్