
ఈ ఏడాది టాప్-5 టెస్టు బౌలర్లు వీరే.. షాహిన్ ఆఫ్రిది నెంబర్ 1 అన్న ఆకాశ్ చోప్రా
Aakash Chopra: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఈ ఏడాది బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ముఖ్యంగా 2021 ద్వితీయార్థంలో అశూ తన పేరిట అరుదైన రికార్డులు లిఖించుకున్నాడు. ఈ క్రమంలో భారత మాజీ ఆటగాడు, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. తన టాప్-5 టెస్టు బౌలర్ల లిస్టులో అశ్విన్‌కు పెద్దపీట వేశాడు. కేవలం ఎనిమిది మ్యాచ్‌లు ఆడి 52 వికెట్లు పడగొట్టాడని ప్రశంసించాడు.
కానీ ఈ ఏడాదికి నంబర్ టెస్టు బౌలర్‌గా పాకిస్తాన్ క్రికెటర్ షాహిన్ ఆఫ్రిదిని ఎంచుకున్నాడు. మరోవైపు, సీనియర్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్‌కు మాత్రం తన జాబితాలో చోటివ్వలేదు. ఈ మేరకు యూట్యూబ్ చానెల్ వేదికగా ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ... ‘‘రవిచంద్రన్ అశ్విన్.. ఎనిమిది మ్యాచ్‌లలో 52 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ గడ్డ మీద ఆ జట్టుతో ఒక్క టెస్టు మ్యాచ్ ఆడకపోయినప్పటికీ.. 52 వికెట్లు తీశాడు.
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సిడ్నీ టెస్టులో.. అదే వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌లోనూ మెరుగ్గానే రాణించాడు. ఇక భారత్‌లో తన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది’’ అంటూ న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అశూ రికార్డులను ఉటంకిస్తూ ఆకాశ్ చోప్రా అతడిని ఆకాశానికెత్తేశాడు. ఇక ఇంగ్లండ్ బౌలర్లు జేమ్స్ అండర్సన్, ఓలీ రాబిన్సన్, టీమిండియా యువ సంచలనం మహ్మద్ సిరాజ్, పాక్ బౌలర్ షాహిన్ ఆఫ్రిది తన టాప్-5 లిస్టులో ఉంటారని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.
‘‘జిమ్మీ ఆండర్సన్.. 19 మ్యాచ్‌లలో 32 వికెట్లు పడగొట్టాడు. భారత గడ్డపై టీమిండియాతో మ్యాచ్‌లో అదరగొట్టాడు. శ్రీలంకలోనూ ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఇక ఓలీ రాబిన్సన్... 5 మ్యాచ్‌లలో 28 వికెట్లు తీశాడు. అదే విధంగా మహ్మద్ సిరాజ్... తొమ్మిది మ్యాచ్‌లలో 28 వికెట్లు పడగొట్టాడు.
లార్డ్స్ టెస్టులో తన ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సిడ్నీ, బ్రిస్బేన్‌లోనూ మెరుగ్గా రాణించాడు. నిలకడగా ఆడుతున్నాడు. మరి ఈ ఏడాదికి నా నెంబర్ 1 టెస్టు బౌలర్ ఎవరంటే.. షాహిన్ ఆఫ్రిది.. తొమ్మిది మ్యాచ్‌లలో 17 సగటుతో 47 వికెట్లు పడగొట్టాడు. తనొక సంచలనం... దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ ఐదు వికెట్లు తీసి సత్తా చాటాడు’’అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
చదవండి: Virat Kohli- Vamika: మీడియా కంటపడ్డ వామిక.. పాప ఫొటోలు తీయవద్దంటూ కోహ్లి సీరియస్!
IPL 2022 Mega Auction: లక్నో కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.. అహ్మదాబాద్ కెప్టెన్‌గా శ్రేయాస్!
Career-best for @iShaheenAfridi 6-51 in second #WIvPAK Test at Sabina Park, Kingston, Jamaica#HarHaalMainCricket | #BackTheBoysInGreen pic.twitter.com/YsJDiZvi3V
— Pakistan Cricket (@TheRealPCB) August 23, 2021