అప్రమత్తంగా ఉండండి
అధికారులకు కలెక్టర్ హైమావతి ఆదేశం
సమస్యలుంటే సంప్రదించండి
పంచాయతీ ఎన్నికల
పరిశీలకురాలు హరిత
గజ్వేల్: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో ఎలాంటి సమస్యలున్నా ఫోన్ నంబరు 63059 56344ను సంప్రదించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు హరిత కోరారు. గజ్వేల్ మండలం రిమ్మనగూడ క్లస్టర్‌లో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నియామవళికి అనుగుణంగా ముందుకుసాగాలని అధికారులను ఆదేశించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు సహకరించాలన్నారు.
పోలీసుల అనుమతి తప్పనిసరి: సీపీ
సిద్దిపేటకమాన్: ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని సీపీ విజయ్‌కుమార్ తెలిపారు. పంచాయితీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళి అనుసరించాలని చెప్పారు. అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా ర్యాలీ, బహిరంగ సభ నిర్వహణకు తప్పనిసరిగా ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. ప్రచారానికి ఉపయోగించే వాహనాలకు సంబంధిత తహసీల్దార్ నుంచి అనుమతి తీసుకోవాలని చెప్పారు. నామినేషన్ల ఉపసంహరణ, ఏకగ్రీవం కోసం ఎవరైనా బెదిరించినా, ప్రలోభపెట్టినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
గురు శిష్యుల ప్రతిభ
చిన్నకోడూరు(సిద్దిపేట): బాల చెలిమి పత్రిక హైదరాబాద్ నిర్వహించిన జాతీయ స్థాయి బాలల కథల పోటీల్లో మండల పరిధిలోని అనంతసాగర్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు నరేశ్, విద్యార్థి బి.విశ్వతేజ మొదటి స్థానంలో నిలిచారు. ఉపాధ్యాయుడు రాసిన చిన్న విత్తనం–మహావృక్షం కథ, విద్యార్థి రాసిన ఊరు చేసిన తప్పు కథలు మొదటి స్థానంలో నిలిచాయి. డిసెంబర్ 22న హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో వారికి బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం జ్యోతి, ఉపాధ్యాయులు వారిని అభినందించారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆడిట్
జహీరాబాద్ టౌన్: రాష్ట్ర ఉన్నత విద్యా కమిషన్ ఆదేశాల మేరకు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం 2022–23–24 విద్యా సంవత్సరాలకు సంబంధించి అకాడమిక్ ఆడిట్ నిర్వహించారు. సంగారెడ్డి తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.ప్రవీణ, వాణిజ్యవిభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ వీరేంద్ర అకాడమిక్ అడ్వయిజర్లుగా వ్యవహరించారు. కళాశాలలోని 15 విభాగాల పనితీరు, ప్రగతిని సమీక్షించారు. ఆధునిక బోధనకు అనుగుణంగా అధ్యాపకులు తమను అభివృద్ధి చేసుకోవాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ అస్లం ఫారూకి మాట్లాడుతూ.. అకాడమిక్ ఆడిట్ వల్ల కళాశాలలకు ఎంతో మేలు జరుగుతుందని, లోటు పాట్లు తెలుసుకోడానికి దోహదపడుతుందని చెప్పారు.
అప్రమత్తంగా ఉండండి
అప్రమత్తంగా ఉండండి
అప్రమత్తంగా ఉండండి


