
కూలిన టోల్‌గేట్ పైకప్పు
కొండపాక(గజ్వేల్): మండల కేంద్రమైన కొండపాకతో పాటు మర్పడగ, సిర్సనగండ్ల, దమ్మకపల్లి, దుద్దెడ, బందారం గ్రామాల్లో వడగళ్ల వర్షం కురిసింది. దుద్దెడ శివారులో రాజీవ్ రహదారిపై ఉన్న టోల్ గేట్ పైకప్పు రేకులు ఎగిరిపడ్డాయి. టోల్ ప్లాజా పైకప్పు షీట్లు కూలిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బందారంలో బాలవికాస నీటి శుద్ధీకరణ గది పూర్తిగా ధ్వంసం కాగా, పైకప్పు రేకులు ఎగిరిపడ్డాయి. ఇదే క్రమంలో రాజీవ్ రహదారి వెంబడి ఉన్న చెట్లు కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. ఇదిలా ఉంటే వర్షానికి రోడ్లపై ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోగా, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం కుప్పలు తడిసిముద్దయ్యాయి.

కూలిన టోల్‌గేట్ పైకప్పు