
నిషేధిత ఆల్పాజోలం పట్టివేత
జహీరాబాద్ టౌన్: ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి తీసుకొస్తున్న నిషేధిత ఆల్పాజోలాన్ని పోలీసులు పట్టుకున్నారు. టౌన్ ఎస్‌ఐ. కాశీనాథ్ కథనం ప్రకారం... మహారాష్ట్రలోని పూణేకు చెందిన విశ్వనాథ్ ఆర్టీసీ బస్సులో ఆల్పాజోలంను జహీరాబాద్‌కు తీసుకొస్తున్నట్లు వచ్చిన సమాచారంతో బైపాస్ రోడ్డులో ఇంద్రప్రస్థ వద్ద గురువారం తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ బస్సులో అతడు తీసుకొస్తున్న 750 గ్రాముల ఆల్పాజోలం దొరికింది. పోలీసులు అతడిని విచారించగా పట్టణానికి చెందిన మిద్దెస్వామి గౌడ్‌కు అమ్మడానికి తీసుకొస్తున్నట్లు చెప్పాడు. దీంతో మిద్దెస్వామి గౌడ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా ఆల్పాజోలం కొనుగోలు చేస్తున్నట్లు అంగీకరించాడు. అతని వద్ద రూ.7.50 లక్షల నగదు, సెల్‌ఫోన్, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.