
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చలివేంద్రాలు
● మండు వేసవిలో ప్రజల దాహాన్ని తీరుస్తున్న నిర్వాహకులు ● బస్టాండ్‌లు, రోడ్లు, ప్రధాన చౌరస్తాలు, రైతు బజార్లు, తదితర చోట్ల ఏర్పాటు ● స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో చాలా ఏళ్లుగా నిర్వహణ ● కుటుంబీకుల జ్ఞాపకార్థం, ప్రజాసేవకై మరికొందరు ● రూ.లక్షలు ఖర్చు పెట్టి మినరల్ వాటర్ అందజేత
మానవ సేవయే మాధవ సేవ అన్నారు పెద్దలు. మనిషి తన సంపాదనలో కొంతైనా మానవ సేవకు ఖర్చు పెడితే.. ఇంతకంటే గొప్ప సంతృప్తి ఏముంటుంది. అన్నదానం, నేత్రదానం, అవయదానం, నీటిదానం ఇలా అనేక రూపాల్లో ప్రజలకు సేవ చేస్తారు. వేసవి కాలం వచ్చిందంటే చాలు అనేక మంది నీటి దాహం తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు. వివిధ అవసరాల కోసం బయటకు వచ్చే సామాన్య ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఆస్పత్రులు, బస్టాండ్లు, రైతు బజార్లు, మార్కెట్లు, పాఠశాలల, షాపులు తదితర ప్రాంతాల్లో తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తమ కుటుంబీకుల జ్ఞాపకార్థం ఉమ్మడి జిల్లాలో అనేక చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇలా చాలా ఏళ్ల నుంచి ప్రజల దాహార్తిని తీరుస్తున్న
చలివేంద్రాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చలివేంద్రాలు