
నీటి ఎద్దడిపై అప్రమత్తంగా ఉండాలి
నారాయణఖేడ్: వేసవి తీవ్రత అధికంగా ఉండడానికి తోడు భూగర్భ జలాలు తగ్గుముఖం పడుతుండటంతో అధికారులు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి సూచించారు. ఖేడ్ క్యాంపు కార్యాలయంలో ఎంపీడీవోలు, ఆర్‌డబ్ల్యూఎస్, మున్సిపల్ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...ప్రస్తుతం కొన్నిచోట్ల విద్యుత్ సమస్య ఇతర కారణాలతో నీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలియడంతో మిషన్ భగీరథ పథకం ద్వారా నీటిని సక్రమంగా సరఫరా చేయించడం కోసం ప్రత్యేకంగా రూ.70 లక్షలతో డెడికేటేడ్ విద్యుత్ లైన్ ఏర్పాటు చేయించామన్నారు. ఇందిరమ్మ గృహాల కోసం అర్హులైన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో నారాయణఖేడ్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్, కాంగ్రెస్ జిల్లా నాయకులు వినోద్‌పాటిల్, దిగంబర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ పాల్గొన్నారు.
విద్యుత్ సమస్య నివారణకు రూ.70లక్షలతో డెడికేటెడ్ లైన్
అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష