
మహేశ్వరంలో ‘మలబార్’ మహేశ్వరం మండల పరిధిలోని కేసీ తండా
8లోu
ఖర్గే సభను
విజయవంతం చేయాలి
జిల్లా నేతలతో పీసీసీ చీఫ్ భేటీ
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎల్బీ స్టేడియం వేదికగా ఈ నెల 4న నిర్వహించ తలపెట్టిన కార్యక్రమంలో ‘గ్రామ, మండల, బ్లాక్, జిల్లా కమిటీ’ సభ్యులతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భేటీ కానున్నారని, ఆ మేరకు జిల్లా కేడర్ సిద్ధంగా ఉండాలని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ సూచించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి మంగళవారం ఆయన జిల్లా ముఖ్య నేతలతో గాంధీభవన్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు. జాతీయ అధ్యక్షుడు పాల్గొనే ఈ బహిరంగ సభను జిల్లా కేడర్ సీరియస్‌గా తీసుకోవాలని, భారీగా జనసమీకరణ చేయాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బూత్ స్థాయి కేడర్‌ను సభకు భారీగా తరలించాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రాజ్య సభ సభ్యుడు అనిల్‌కుమార్, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్, చైర్మన్ ఫహీం ఖురేషి, చేవెళ్ల పార్లమెంటు ఇన్‌చార్జి ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్, చేవెళ్ల పార్టీ ఇన్‌చార్జి భీం భరత్, పీసీసీ ఉపాధ్యక్షుడు వేణు గౌడ్, పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్, తదితరులు పాల్గొన్నారు. కీలకమైన ఈ సమావేశానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ఆయన సోదరుడు మల్‌రెడ్డి రాంరెడ్డి దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది.
ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు
కేశంపేట: తక్కువ నీటి సాంధ్రతతో అధిక దిగుబడులు వచ్చే ఆయిల్‌పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సురేష్ సూచించారు. మండల పరిధిలోని వేములనర్వ శివారులో సాగవుతున్న ఆయిల్‌పామ్‌ను మంగళవారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. ఆయిల్‌పామ్ సాగుకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోందని, రైతులు పండించిన పంటను ధర నిర్ణయించి కొనుగోలు చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం అందించే ప్రోత్సాహంతో ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం మండల పరిధిలోని అల్వాల రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రైతులకు శాస్త్రవేతలు సలహాలు, సూచనలు చేశారు. రైతు గుర్తింపు కార్డుల నమోదుపై ఏఈఓలతో రివ్యూ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఓ శిరీష, హెచ్‌ఓ హిమబిందు, ఎఈఓలు వినయ్, రాజేశ్వరి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు సురేష్‌రెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు.

మహేశ్వరంలో ‘మలబార్’ మహేశ్వరం మండల పరిధిలోని కేసీ తండా